జకీర్ ఖల్ నాయక్(విలన్), కాఫీర్ అని తన బోధనలతో ఇస్లాం ప్రవక్త ను అవమాన పరుస్తున్నాడని అందుకే అతనిపై రివార్డు ప్రకటించామని ఆ సంస్థ ప్రతినిధి సయిద్ కబ్లే హుస్సేన్ నఖ్వి తెలిపారు.
జులై 1 న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంటులో జరిగిన ఉగ్రదాడిలో 22 మందిని అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనికి చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం జకీర్ పై విచారణకు ఆదేశించింది.