ఎన్డీ దళ నేత గణేష్ అరెస్టు చూపుతున్న డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు
- ఆయుధాలతో సంచరిస్తే చర్యలు తప్పవు
- పిస్టల్, 7 తూటాలు స్వాధీనం
ఇల్లెందు : ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆయుధాలు మినహా ఇతరులెవరూ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే చర్యలు తప్పవని డీఎస్పీ ఆర్.వీరేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఇల్లెందు పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూడెమోక్రసీ టే కులపల్లి ఏరియా దళ నేత కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేష్ అరెస్టును ప్రకటించారు. గుండాల మండలం భాటన్ననగర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న ట్లు సమాచారం అందుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. గణేష్ నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టల్, ఏడు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెం మండలం అంజనాపురం గ్రామానికి చెందిన గణేష్ కొత్తగూడెం రామచంద్ర కళాశాలలో డిగ్రీ చదువుతూ 2004పీడీఎస్‌యూలో చేరాడు. అదే క్ర మంలో 2004లో సీపీయూఎస్ ఖమ్మం–వరంగల్ ఏరియా కమిటీ కార్యదర్శి యాదన్న, స్వరూపక్క దళంలో సభ్యుడిగా చేరాడు. 2004 హైదరాబాద్‌లో యాదన్న ఎ¯ŒSకౌంటర్‌లో మృతి చెందటంతో జనశక్తి ఏరియా కమిటీ సభ్యుడు నాగన్న దళంలో చేరా డు. జనశక్తి విస్తరణలో భాగంగా గణేష్‌ను తూర్పుగోదావరి జిల్లాకు పంపారు. ఈ క్రమంలో పోలవరం సమీపంలోని గడ్డపల్లి సమీపంలో జరిగిన ఎ¯ŒSకౌంటర్‌లో కిరణ్, వినోద్ అనే దళ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే కుక్కునూరు మండలం నాయ కులగూడెం వద్ద జరిగిన ఎ¯ŒSకౌంటర్‌లో ముగ్గురు దళ సభ్యులు మృతి చెందారు. జనశక్తి తుడిచి పెట్టుకుని పోవటంతో న్యూడెమోక్రసీలో చేరాడు. గుండాల మం డలం ఆళ్లపల్లి ఏరియా దళనేతగా పని చే శాడు. ఈ క్రమంలో రాయిగూడెం వద్ద 2006లో పోలీసులతో జరిగిన ఎదురు కా ల్పుల్లో తప్పించుకున్నాడు. 2013–14లో జరిగిన ఎన్డీ చీలికలో రాయల వర్గం వైపు పని చేశాడు. ఆరు నెలల కిందట ఆనారోగ్యానికి గురి కాగా బయటకు వచ్చాడు. నాటి నుంచి పార్టీకి దూరంగా రహస్యంగా కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలో గుండాల మండలంలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గణేష్ మీద ఎదురు కాల్పుల ఘటన కేసులు, పలువురిని బెదిరించి చందాలు వసూలు చేసిన కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందజేసే పరిహారం పొంది సుఖశాంతులతో జీవించాలని కోరారు. సమావేశంలో ఇల్లెందు, గుండాల సీఐలు అల్లం నరేందర్, టి.రవికుమార్, కాచనపల్లి ఎస్సై ప్రవీణ్‌కుమార్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థ మార్పుకోసమే అజ్ఞాతం: గణేష్
పీడిత తాడిత ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే వ్యవస్థ మారాలని అప్పుడే ప్రజల కష్టాలు కడతేరుతాయని భావిం చి అందుకు అజ్ఞాతవాసమే మార్గమని ఆయుధం పట్టినట్లు గణేష్ తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన నాడే ప్రజల కష్టాలు కళ్లారా చూశానన్నారు. అయితే ప్రజలను చైతన్యం చేసేందుకు అజ్ఞాతంలోకి వెళ్లగా అనతి కాలంలోనే నాటి సీపీయూఎస్‌ఐ అంతమైందన్నారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తాను లొంగిపోవాలని నిర్ణయించుకుని బయటకు వచ్చినట్లు గణేష్ వెల్లడించారు.