
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ను ఏ దేశంలోనైనా అరెస్ట్ చేసేలా రెడ్ కార్నర్ నోటీస్ జారీచేయాలన్న భారత విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ శనివారం తిరస్కరించింది. అస్పష్ట ప్రకటనలు, ఆరోపణలతో జకీర్‌పై అభియోగాలు మోపడంతో పాటు ఆయనపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఇంటర్‌పోల్ భారత విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జకీర్‌కు సంబంధించి తమతో పాటు భారత్ పంపిన వివరాలను అన్ని దేశాలు తమ డేటాబేస్‌ల నుంచి తొలగించాలని ఇంటర్‌పోల్ ఆదేశించింది.