Interpol Red Corner
-
వస్తారా ? వాదిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, మీడియా చానల్ అధినేత శ్రవణ్‌రావులు ఇండియాకు వస్తారా? లేకపోతే వారు ఉంటున్న దేశాల్లోని కోర్టులను ఆశ్రయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ ఇద్దరూ ఆయా దేశాల్లోని కోర్టులను ఆశ్రయించే అవకాశముందని భావిస్తున్నారు. అదే జరిగితే అంతర్జాతీయ వేదికపై కూడా న్యాయపోరాటం చేయడానికి నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఓ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో (ఎంఈఏ) సమావేశమవుతారు. గత ఏడాది మార్చిలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అక్రమ ఫోన్‌ట్యాపింగ్‌పై కేసు నమోదైంది. ఆ వెంటనే ప్రభాకర్‌రావు, ఆపై శ్రవణ్‌రావు విదేశాలకు పారిపోయారు. ప్రభాకర్‌రావు మెడికల్ గ్రౌండ్స్‌పై అమెరికాలో, శ్రవణ్‌రావు కెనడాలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని వెనక్కి రప్పించడానికి చేసిన అన్ని ప్రయత్నాలను తమ న్యాయవాదుల ద్వారా అడ్డుకుంటూనే వచ్చారు. అరెస్టు వారెంట్లకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వద్దంటూ కౌంటర్లు వేశారు. ఇద్దరి పాస్పోర్టుల్నీ నగర పోలీసులు తొలుత తాత్కాలిక రద్దు (ఇంపౌండ్) చేయించారు. ఆపై శాశ్వత రద్దు (క్యాన్సిల్) చేయాలని కోరుతూ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. అయితే అప్పటికే ఈ ద్వయం తమ లాయర్ల ద్వారా పాస్‌పోర్టులు ఇంపౌండ్ చేయడాన్ని ఢిల్లీలో ఉన్న చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ వద్ద సవాల్ చేశారు. ఈ పిటిషన్ ఓ కొలిక్కి వస్తే తప్ప.. పాస్‌పోర్టుల రద్దు వ్యవహారం తేలదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించారు. వీటిని జారీ చేసినట్టు ఆ విభాగం సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం ఇచ్చింది. అయితే తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు సభ్య దేశాలకు పంపిస్తూ పబ్లిష్ చేయాల్సి ఉంది. ఈలోపు ప్రభాకర్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. రెడ్‌కార్నర్ నోటీసులను ఎంఈఏ ఆయా దేశాల్లో ఉన్న ఏజెన్సీలకు అధికారికంగా పంపించాలి. ఈ రెడ్‌కార్నర్ జారీ అయిన వెంటనే ఇంటర్‌పోల్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల ఆచూకీ కనిపెట్టి, తక్షణం డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి ఆస్కారం లేదు. అక్కడి కోర్టులను ఆశ్రయిస్తే... నిందితులు తాము ఉంటున్న దేశాల్లోనే ఉన్నత న్యాయస్థానాల్లో రెడ్‌కార్నర్ నోటీసులను చాలెంజ్ చేసే అవకాశం ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని, అనారోగ్య కారణాలు చెబుతూ తమ డిపోర్టేషన్‌ను ఆపాలని నిందితులు కోరతారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆయా కోర్టుల్లో అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానాలు తీసుకునే తుది నిర్ణయంపైనే డిపోర్టేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను, నిందితుల వ్యవహారశైలిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు సమగ్ర విధానం రూపొందిస్తున్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలైన నాటి నుంచి ఇక్కడ ఉన్న ఆయా కోర్టుల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటికి పోలీసులు ఇచ్చిన కౌంటర్లను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఎంఈఏ ద్వారా ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలకు పంపనున్నారు. ఫలితంగా అక్కడి కోర్టుల్లో వాదనలు బలంగా వినిపించడమే కాకుండా డిపోర్టేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లనుంది. అక్కడి ఎంఈఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది. -
19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ఇంటర్‌పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్‌పోల్‌తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్‌పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్‌షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్‌క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్‌పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. మనీలాండరింగ్ ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. (చదవండి: నీరవ్ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ) న్యూయార్క్ నగరంలో 30 మిలియన్ డాలర్ల విలువైన రెండు అపార్టుమెంట్ల కొనుగోలుకు సంబంధించి మోడీ అక్రమ లావాదేవీలకుపయోగించిన పలు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్న అమీ పేరును తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుబంధ చార్జిషీట్లో జత చేసింది. తాజాగా అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌గా భావించే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ కుంభకోణంలో ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించక ముందే, 2018 జనవరి మొదటి వారంలో అమీ, భర్త నీరవ్ మోడీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కు పారిపోయారు. కాగా అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ, ఈడీ పలు చార్జ్ షీట్లను మోదు చేయడంతోపాటు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన సాధారణ రిమాండ్ విచారణ అనంతరం లండన్ కోర్టు మోడీని ఆగస్టు 27 వరకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
నీరవ్‌కు రెడ్ కార్నర్ నోటీసులు?
సాక్షి, ముంబై : సంచలనం సృష్టించిన పీఎన్బీ కుంభకోణంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నేరస్తుడు నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో దీని గురించి చర్చించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సీబీఐ అధికారులు, విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో భేటీ అవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటిలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలను ఇండియాకు రప్పించే అంశం గురించే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలు ఏ దేశంలో ఉన్నారనే సమాచారం తెలుసుకోవడం కోసం ‘రెడ్ కార్నర్ నోటీస్’(ఆర్సీఎన్) జారీ చేయాల్సిందిగా సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరిన నేపధ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విషయం గురించి ఒక ఉన్నతాధికారి ‘ఆర్సీఎన్ నోటీస్‌ను జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్‌ను కోరాము. ఇది జులై నెల రెండోవారం లోపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఆర్సీఎన్ అంశం పూర్తైతే ఇక నేరస్తులు ఏ దేశంలో ఉన్న వారి గురించి సమాచారం తెలుసుకోవడం, వారిని తిరిగి భారత్ రప్పించడం సులువవుతుంది. అప్పుడు నీరవ్ మోదీ లాంటి వారిని అధికారికంగా ఇండియా రప్పించే ప్రక్రియ ప్రారంభమవుతుం’దన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి ఇండియా రప్పించాలంటే పలు న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అందువల్లే సీబీఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీ చేయించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నీరవ్ మోదీ ఆచూకీపై భారత్‌కు బ్రిటన్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నీరవ్ మోదీ కేసును విచారిస్తున్న సీబీఐకి ఈమెయిల్ ద్వారా నీరవ్ మోదీ లండన్‌లోనే ఉన్నట్లు యూకే ప్రభుత్వం సమాధానం పంపినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడో ఆచూకీ తెలియని పక్షంలో అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. -
జకీర్‌పై రెడ్‌కార్నర్ నోటీస్‌కు ఇంటర్‌పోల్ నో
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ను ఏ దేశంలోనైనా అరెస్ట్ చేసేలా రెడ్ కార్నర్ నోటీస్ జారీచేయాలన్న భారత విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ శనివారం తిరస్కరించింది. అస్పష్ట ప్రకటనలు, ఆరోపణలతో జకీర్‌పై అభియోగాలు మోపడంతో పాటు ఆయనపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఇంటర్‌పోల్ భారత విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జకీర్‌కు సంబంధించి తమతో పాటు భారత్ పంపిన వివరాలను అన్ని దేశాలు తమ డేటాబేస్‌ల నుంచి తొలగించాలని ఇంటర్‌పోల్ ఆదేశించింది. -
గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ఇతడిపై ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌తో అదే నెల 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
రెడ్‌కార్నర్ నోటీసు రాజ్యాంగ విరుద్ధం
దాన్ని పరిగణనలోకి తీసుకోలేం: జస్టిస్ నూతి రామ్మోహన్రావు - కేవీపీకి హైకోర్టులో ఊరట - ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తదుపరి చర్యలేవీ వద్దు - సీఐడీ అదనపు డీజీకి హైకోర్టు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులు జారీ - పతివాదులకు నోటీసులు,తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా సాక్షి, హైదరాబాద్: టైటానియం ఖనిజ తవ్వకాల వ్యవహా రంలో అమెరికాలో నమోదైన కేసుకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు కేవీపీరామచంద్రరావుపై ఇంటర్ జారీచేసిన పోల్ రెడ్ కార్నర్ నోటీసు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టు ఆక్షేపించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించేందుకు కల్పించిన హక్కును కాల రాసేలా ఈ నోటీసు ఉందని స్పష్టంచేసింది. దీని ఆధారంగా తదుపరి ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీ అదనపు డీజీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సోమవారం మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎప్పుడూ మనదేశ రాజ్యాంగ నిబంధనలకు, స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని భవేజ్ జయంతి లఖాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాక రెడ్ కార్నర్ నోటీసు అరెస్ట్ వారెంట్ కాదని, ఆ నోటీసుపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొందన్నారు. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ, ప్రస్తుత కేసులో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు మన దేశ చట్టాలకు లోబడి లేదని, రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ రామ్మోహనరావు తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. నోటీసు పంపే సమయంలో పాటించాల్సిన విధివిధానాలను కూడా పాటించలేదని, నోటీసుతో పాటు ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్ల ను జత చేయాల్సి ఉండగా, ఆ పని చేయలేదని, అందువల్ల ఆ నోటీసును ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోలేమని తేల్చి చెప్పారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. వీరితో పాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు. కేసులో కేవీపీ తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణప్రసాద్, హోంశాఖ తరఫున జానకి రామిరెడ్డి వాదనలు వినిపించారు.