ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ కేంద్రాన్ని సవాల్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థను నిషేధించడంపై ఆ సంస్థ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ కేంద్రాన్ని సవాల్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థను నిషేధించడంపై ఆ సంస్థ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
నాయక్ కోర్టుకు వెళ్లడంతో వెంటనే వివరాలు అందించాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు పూర్వపరాలు పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 15న కేంద్రం ప్రభుత్వం జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థను నిషేధించిన సంగతి తెలిసిందే.