islamic research foundation
-
జకీర్‌కు ఝలక్.. కోట్ల ఆస్తులు ఆటాచ్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధానికి గురైన ఆయన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్), ఇతరులకు చెందిన రూ.18.37కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 కింద ఈ మొత్తం ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలిపింది. స్వచ్ఛంద సంస్థ పేరిట ఏర్పడిన ఐఆర్ఎఫ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టి అక్రమ మార్గాల్లో డబ్బును ఆర్జించిందని, ఆ డబ్బుతో దేశ వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే కుట్రలు చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు పలువురుని ప్రోత్సహించడంతోపాటు, స్కాలర్‌షిప్పుల పేరిట అక్రమ కార్యకలాపాలకు పాల్పడేందుకు డబ్బు సాయం చేసేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అల్లర్లు చోటుచేసుకునేలాగా జకీర్‌నాయక్ ప్రసంగాలు చేశారని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
జకీర్‌నాయక్ డబ్బంతా దావూద్ ఇబ్రహీందేనా?
ముంబై: ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎన్జీవోలోకి వచ్చిన నిధులన్నీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు చెందినవేనా? కరాచీ నుంచి హవాలా రూపంలో వందల కోట్లు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) అకౌంట్లకు తరలివచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఆర్ఎఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమీర్ గజ్దర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. విచారణలో గజ్దర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దావూద్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఐఆర్ఎఫ్ నుంచి హవాలా ద్వారా సౌదీ అరేబియా, యూకే, చిన్న ఆఫ్రికా దేశాలకు డబ్బును పంపినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయితే దేశంలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు బయటపడుతుందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే వ్యక్తి ఐఆర్ఎఫ్, దావూద్‌ల మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిపారు. 2012లో దుబాయ్‌లో సుల్తాన్ జకీర్‌ను కలిసినట్లు చెప్పారు. అప్పటినుంచి యూకే, ఆఫ్రికా దేశాల నుంచి డబ్బు ఐఆర్ఎఫ్కు వస్తున్నట్లు వెల్లడించారు. -
కేంద్రాన్ని సవాల్ చేసిన జకీర్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ కేంద్రాన్ని సవాల్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థను నిషేధించడంపై ఆ సంస్థ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నాయక్ కోర్టుకు వెళ్లడంతో వెంటనే వివరాలు అందించాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు పూర్వపరాలు పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 15న కేంద్రం ప్రభుత్వం జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థను నిషేధించిన సంగతి తెలిసిందే. -
షాకింగ్.. ఉగ్రవాదికి జకీర్ స్కాలర్షిప్
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయ్యింది. వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆయన స్వచ్ఛంద సంస్థలపై దాడుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. జకీర్ నాయక్ కు ఇస్లామిక్ రీసెర్చ్ పౌండేషన్(ఐఆర్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం తెలిసిందే. దీనినుంచి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన అబూ అనాస్ అనే వ్యక్తికి రూ.80,000 స్కాలర్ షిప్పుగా అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అనాస్ సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సమయంలో అతడికి రాజస్థాన్ లోని టోంక్ లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం రూపంలో జమ చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అనాస్ తొలుత తనకు స్కాలర్ షిప్పు ఇవ్వాలంటూ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసు అతడిని ముంబయికి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ డబ్బు మంజూరు చేశారు. ప్రస్తుతం ఐసిస్‌లో చేర్పించేందుకు భారత్‌లోని యువకులను ప్రోత్సహించే పనులు చేస్తున్న అనాస్‌ను ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమాచారం ఆధారంగానే తాజాగా ఐఆర్ఎఫ్పై దాడులు చేయగా అసలు విషయం బయటపడింది. తాజా సమాచారంతో జకీర్ నాయక్ పై మరింత లోతుగా విచారణ చేసేందుకు ఎన్ఐఏకు అవకాశం చిక్కినట్లయింది. -
జకీర్‌కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ
-
జకీర్‌కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మతాల మధ్య ఆయన విద్వేషాలు ప్రోత్సహిస్తున్నాడంటూ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్రలోని ఆయన నిషేధిత సంస్థతో సంబంధం కలిగి ఉన్న పది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, ఆ సంస్థలకు జకీర్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపైనా ఆరా తీస్తుంది. పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత జకీర్ ను ఎన్ఐఏ భారత్ రప్పించే అవకాశం ఉంది. ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడైన జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది. కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం. గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది. -
జకీర్ నాయక్ కు కేంద్రం షాక్
-
జకీర్ నాయక్ కు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడు జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది. కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం. గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది. -
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
-
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
భోపాల్: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు రూ. 50 లక్షల నిధులు 2011లో అందినట్టు తేలింది. ఈ మేరకు విరాళాలు అందినమాట వాస్తవమేనని, అయితే ఇవి నేరుగా ఆర్జీఎఫ్కు కాకుండా దాని అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)కి అందినట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. అయితే, కొన్ని నెలల కిందట ఈ సొమ్మును వాపస్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉగ్రవాదులను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జకీర్ సంస్థ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందినట్టు తేలడం కలకలం రేపుతోంది. అయితే, ఈ విషయమై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో స్పందించిన ఆర్జీఎఫ్ తాను ఐఆర్ఎఫ్ నుంచి విరాళాలు పొందలేదని చెప్పుకొచ్చింది. జకీర్‌కు చెందిన ఐఆర్ఎఫ్ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2011లో నేరుగా రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు తాము రూ. 50 లక్షలు ఇచ్చామని వారు స్పష్టం చేశారు. ఆ నిధులను ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఒకవేళ తిరిగి ఇవ్వాలని వారు అనుకుంటూ ఉండవచ్చునని ఐఆర్ఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్థాపక సభ్యులుగా ఉండగా, ఆర్జీఎఫ్కు వారితోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సైతం స్థాపక సభ్యుడిగా ఉన్నారు.