న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేసియాను సంప్రదిస్తామని విదేశాంగశాఖ తెలిపింది. జకీర్ ఐదేళ్ల క్రితమే శాశ్వత నివాస హోదా పొందారనీ, ఆయన అప్పగింతపై భారత్‌నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని మలేసియా ఉపప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రకటించిన కొద్ది రోజులకే భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయమై విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించాలని మలేసియాను కోరేముందు చేపట్టాల్సిన న్యాయప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అతి త్వరలోనే ఆయన్ను భారత్‌కు అప్పగించాల్సిందిగా మలేసియాను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment