తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మొట్టమొదటి సారి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను ఆస్పత్రులకు , ఏజెన్సీ ప్రాంతాలకు సరఫరా చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. గత నెల పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు డ్రోన్లను సరఫరా చేశారు. ఇది సక్సెస్ కావడంతో ఈ రోజు వికారాబాద్ ఏరియా ఆస్పత్రి నుంచి బొమ్రాస్‌పేట పీహెచ్‌సీకి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది.
వికారాబాద్ నుంచి బొమ్రాస్‌పేట వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 నిమిషాల్లో డ్రోన్ చేరుకుంది. 300 డోసుల రేవాక్ బీ, 15 డోసుల టుబెర్‌వాక్ వ్యాక్సిన్లను డ్రోన్ చేరవేసింది. 4.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా గమ్యస్థానికి వ్యాక్సిన్లు డ్రోన్ ద్వారా అందాయి. రోడ్డు మార్గంలో అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 46 కిలోమీటర్లు ఉండగా ప్రయాణ సమయం గంటకు పైగానే పడుతుంది.
India's first organized trials for drones in healthcare, i.e. Medicine from the Sky has achieved a new record today by travelling a distance of 26 Km fully autonomous and without any manual interventions during the flight. @JM_Scindia @MinisterKTR @jayesh_ranjan @ramadevi_lanka pic.twitter.com/Lzbc3I149P
— Emerging Technologies Govt. of Telangana (@EmergingTechTS) October 9, 2021
Comments
Please login to add a commentAdd a comment