బీఈ టీకాకు డీసీజీఐ అనుమతులు | Dcgi Approves Biological E 14 Valent Pneumococcal Conjugate Vaccine | Sakshi
Sakshi News home page

బీఈ టీకాకు డీసీజీఐ అనుమతులు

Published Sat, Dec 17 2022 10:28 AM | Last Updated on Sat, Dec 17 2022 10:33 AM

Dcgi Approves Biological E 14 Valent Pneumococcal Conjugate Vaccine - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 14–వాలెంట్‌ పీడియాట్రిక్‌ న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ టీకా తయారీ, విక్రయాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించినట్లు బయోలాజికల్‌ వెల్లడించింది. స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియాకు సంబంధించిన ఈ టీకాను 6, 10, 14 వారాల పిల్లలకు 3 డోసులు కింద ఇవ్వొచ్చని పేర్కొంది.

భారత్‌లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అయిదేళ్ల లోపు పిల్లల మరణాలకు ఎక్కువగా ఎస్‌ న్యూమోనియా కారణమవుతోందని తెలిపింది. పీసీవీ14తో కోట్ల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలమని కంపెనీ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement