Telangna state
-
విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది : స్వామి గౌడ్
-
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరా... ఎలానో చూస్తారా?
తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మొట్టమొదటి సారి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను ఆస్పత్రులకు , ఏజెన్సీ ప్రాంతాలకు సరఫరా చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. గత నెల పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు డ్రోన్లను సరఫరా చేశారు. ఇది సక్సెస్ కావడంతో ఈ రోజు వికారాబాద్ ఏరియా ఆస్పత్రి నుంచి బొమ్రాస్పేట పీహెచ్‌సీకి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. వికారాబాద్ నుంచి బొమ్రాస్పేట వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 నిమిషాల్లో డ్రోన్ చేరుకుంది. 300 డోసుల రేవాక్ బీ, 15 డోసుల టుబెర్వాక్ వ్యాక్సిన్లను డ్రోన్ చేరవేసింది. 4.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా గమ్యస్థానికి వ్యాక్సిన్లు డ్రోన్ ద్వారా అందాయి. రోడ్డు మార్గంలో అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 46 కిలోమీటర్లు ఉండగా ప్రయాణ సమయం గంటకు పైగానే పడుతుంది. India's first organized trials for drones in healthcare, i.e. Medicine from the Sky has achieved a new record today by travelling a distance of 26 Km fully autonomous and without any manual interventions during the flight. @JM_Scindia @MinisterKTR @jayesh_ranjan @ramadevi_lanka pic.twitter.com/Lzbc3I149P — Emerging Technologies Govt. of Telangana (@EmergingTechTS) October 9, 2021 చదవండి :డ్రోన్ ద్వారా ఆయుధాల తరలింపు యత్నం భగ్నం -
‘అక్కడ వంగి వంగి దండాలు పెట్టుడు.. ఇక్కడికి రాంగనే తిట్ల పురాణం’
సాక్షి, మెదక్: బీజేపీ పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నాడని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఇంటిలిజెన్స్ సర్వేలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుసుకున్న సీఎం కేసీఆర్.. బీజేపీని తొక్కేయాలని పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధానమంత్రికి వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్.. రాష్టానికి రాగానే మోదీని, తనను తిట్టడం తప్ప వేరే పని చేయడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం చెప్పాక 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్ తెలిపారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సీఎం మాటలు తట్టుకోలేక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నాయని, ఆ పంటలను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు కేసీఆర్ ఎందుకు అందించడం లేదని, ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీతాలివ్వడానికే డబ్బుల్లేని ప్రభుత్వం దళిత బంధు ఇస్తానని ఆశ చూపుతూ మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం తన కేబినెట్లో 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను, 12 మంది మహిళలను, 6గురు మైనారిటీలను మంత్రులుగా చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ. హైదరాబాద్, వరంగల్‌లో వరదలొస్తే ఈ సీఎం రాలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రాలేదు. ఆర్టీసీ కార్మికులు చచ్చినా వెళ్లడు. పేద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకేలు పెట్టి సంతాపం చెబుతాడు. కానీ బాధితులను, పేదల వద్దకు వెళ్లి భరోసానిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఈ మూర్ఖుడి పాలనలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. కొన ఊపిరితో కొట్లాడుతూ సిరిసిల్ల ఇంటర్ విద్యార్థిని నాకు బతకాలని ఉంది. కాపాడండీ...అంటూ ఏడుస్తుంటే చూడలేని సన్నివేశం. చివరకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలా? వద్దా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బరాబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి మాట తప్పిన నీచుడు కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరేసిన చరిత్ర నిజాం పాలనది. ఆ రోజు స్మరించుకోవాలా? వద్దా? కేసీఆర్. ఎంఐఎం నేతలకు భయపడి నిజాం సమాధి వద్ద మోకరిల్లిన మూర్ఖుడు కేసీఆర్. వాళ్లకు భయపడి, నిజాం ఆస్తుల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. అందుకే కేసీఆర్ మోసాలను ఎండగట్టేందుకు, తెలంగాణ విమోచన దినోత్సవ గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేందుకే నిర్మల్ లో ఈనెల 17న జరిగే సభకు అమిత్ షా వస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
వరికంకుల కొత్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి యాసంగి పంట కొనుగోళ్లు సవాల్‌గా మారనున్నాయి. 137 శాతం అధికంగా వరిసాగు గత యాసంగి, ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్‌లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్‌నగర్ 29,415కుగాను 1,21,004, కరీంనగర్లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గోదాములే సమస్య రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్(ఫ్యాక్స్), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌కు కూడా కామన్ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చెల్లిం చనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్‌గా ఉన్నాయి. వల్బాపూర్‌లో యంత్రంతో వరికోసిన తర్వాత ఆరబోసిన ధాన్యం ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు. ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. – రాఘవేందర్, డీఎం, జయశంకర్ భూపాలపల్లి ఈసారి కొంత ఎక్కువ దిగుబడి పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు 26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. – ఎండపెల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్. – డొంగరి రాజయ్య, రైతు, కాటారం, జేఎస్ భూపాలపల్లి జిల్లా 2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో) యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఈ ఏడాది యాసంగి సాగు 68,14,555 మొత్తంగా సాగు శాతం 187.02 గతేడాది యాసంగి సాగు 52,22,377 అత్యధికంగా పంటలు సాగైన జిల్లా వరంగల్ రూరల్ (299.10 శాతం) అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా ఆసిఫాబాద్ కొమురం భీం (128.95 శాతం) రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో) 22,19,326 ఈ యాసంగి సాగు 52,78,636 మొత్తంగా వరిసాగు శాతం 237.85 దిగుబడి అంచనా 1,47,80,181(దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు + టన్నులు సన్నాలు 28.80 లక్షల టన్నులు) గతేడాది సాగు 38,62,510 యాసంగి కొనుగోళ్లు ఇలా మొత్తం కొనుగోలు కేంద్రాలు 6,408 ఐకేపీ కేంద్రాలు 2,131 పీఏసీఎస్ (ఫ్యాక్స్) కేంద్రాలు 3,964 ఏఎంసీ, ఇతర కేంద్రాలు 313 కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ‘ఏ’గ్రేడ్ (క్వింటాకు) రూ.1,888 కామన్ రకం (క్వింటాకు) రూ.1,868 చదవండి:త్వరలో రంగారెడ్డి జిల్లాలోని అసైన్డ్ భూముల వేలం -
50 ఏళ్లు దాటిన వారికే తొలి టీకా
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలా పంపిణీ చేయాలనే దానిపై వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం నుంచి కార్యాచరణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కరోనా టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఇచ్చే అవకాశముందని అంచనా. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం కరోనా వ్యాక్సిన్‌పై రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరెవరికి తొలుత టీకా ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. అలాగే టీకా నిల్వ, పంపిణీ అంశాలపైనా చర్చించారు. టీకా అందరికీ ఉచితంగానే వేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకాను అందుబాటులో ఉంచుతారని, వాటిల్లో టీకాకు ధర ఉండదని, వేసినందుకు చార్జి వసూలు చేస్తారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. వీరికి టీకా లేదు! 75 ఏళ్లు పైబడినవారికి, ఏడాదిలోపు పిల్లలకు మాత్రం కరోనా టీకా ఇచ్చే అవకాశం లేదు. వీరికి టీకా ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న భావనతో ఇవ్వకూడదని భావిస్తున్నారు. దీనిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీకా వేసేది వీరే.. కరోనా టీకా వేసే బాధ్యత పూర్తిగా నర్సులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలదేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపా యి. వారికి టీకాలు వేయడంపై అవగాహన ఉన్నందున ఇబ్బందులుండవని అంటున్నారు. అయినా, వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. టీకా వేశాక ఎక్కడైనా ఎవరికైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకునేందుకు వీలుగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తారు. అందుకోసం ప్రత్యేక వైద్యదళాన్ని ఏర్పాటుచేస్తారు. నిల్వ, పంపిణీ, రవాణా ఇలా.. టీకాను తయారుచేసే కంపెనీల నుంచి దాన్ని తెచ్చి నిల్వ ఉంచాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని కంపెనీలు తయారుచేస్తున్న టీకా మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంటే, కొన్ని టీకాలు మైనస్ 20 డిగ్రీల వద్ద నిల్వ ఉంచవచ్చు. అయి తే, ఏ కంపెనీల టీకాలు మన వద్దకు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే టీకాల నిల్వకు కోల్డ్‌చైన్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని వైద్య,ఆరోగ్యశాఖ టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించింది. తొలి విడతలో వీరికే.. తొలి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని తెలంగాణ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా పారిశుద్ధ్య కార్మికులకూ ఇవ్వనుంది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, జర్నలిస్టులు, మున్సిపల్ సిబ్బంది సహా పలు శాఖల్లోని వారికీ తొలి విడతలోనే ఇవ్వనున్నారు. ఇంకా, వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న యాభై ఏళ్లలోపు వారికీ తొలి విడతలోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో విడతలో అందరికీ.. మొదటి విడతలో టీకా ఇచ్చిన తర్వాత మిగిలిన వారందరికీ రెండో విడతలో ఇస్తారు. మరోవైపు మొదటి విడతలో మనకంటే ముందు టీకాను తీసుకునే దేశాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా మొదటి విడతలో 30 కోట్ల మందికి టీకా వేస్తారు. తెలంగాణలో దాదాపు 70 నుంచి 75 లక్షల మందికి మొదటి విడతలో వేసే అవకాశాలున్నాయి. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా వేస్తారు. ఒకసారి వేసిన తర్వాత సరిగ్గా నాలుగు వారాలకు అంటే నెలకు మరో డోస్ వేస్తారు. దీన్ని ఇంజక్షన్ రూపంలోనే ఇస్తారు. ఆ వయసు వారికి ఇవ్వకపోవడమే మంచిది.. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం ట్రయల్స్‌లో ఉన్న పలు కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం ఎక్కువే అయినా.. ప్రతి వ్యాక్సిన్‌కు ఉండే ప్రాణాంతక రియాక్షన్లు దీనికీ ఉండొచ్చు. కాబట్టి వివిధ శారీరక సామర్థ్యాలు తక్కువుండే ఏడాదిలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వకపోవడం ఉత్తమం. అందులోనూ వీరిలో చాలామంది ఇంటికే పరిమితమై ఉంటారు కనుక వైరస్ సోకే అవకాశమూ తక్కువే. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల టీకా ఏ కంపెనీదో తెలిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఏ కంపెనీది వస్తుందనే స్పష్టత ఉంటే అప్పుడు ఎలాంటి కోల్డ్‌చైన్ వ్యవస్థ అవసరమో అర్థమవుతుంది. కొన్ని వ్యాక్సిన్లను తక్కువ శీతలీకరణలో భద్రపరచవచ్చు. కొన్నింటిని ఎక్కువ శీతలీకరణలో భద్రపరచాలి. ఆ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే వివిధ రకాల టీకాలను భద్రపరిచే శీతలీకరణ వ్యవస్థ మన వద్ద ఉంది. వాటిలో కూడా కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచడానికి అవకాశం ఉండొచ్చు. వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు సంబంధించి ఏం చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. వీటికి సంబంధించి మాకు ఆదేశాలొచ్చాయి. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్‌పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది. సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్ బుకింగ్ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌ను రూపొందించింది. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్‌కు వెళ్లేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దింది. ఆన్లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్ రైటర్లనో, ఈ–సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్ సమయంలో పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్ సమరి్పంచాల్సి వుంటుంది. హైదరాబాద్ మినహా 570 తహసీళ్లలో ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది. ప్రమాణపత్రం తప్పనిసరి క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది. క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది ► ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌బుక్ చేసుకోవాలి. ► రైతుల మొబైల్ నంబర్‌కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి. ► రిజి్రస్టేషన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ► రైతు పాస్బుక్కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్‌లోనే దరఖాస్తులో నమోదు చేయాలి. ► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్‌కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి. ► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ–చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజి్రస్టేషన్ ఫీజులను చెల్లించాలి. ► సాక్షుల వివరాలు నమోదు చేయాలి. ► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్‌బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది. రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే.. ⇒ రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది. ⇒ డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్లైన్లో తీసుకుంటారు. ⇒ ఆ తర్వాత తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి్రస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజి్రస్టేషన్‌కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్‌కు అనుమతి ఇస్తారు. ⇒ తహసీల్దార్ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది. ⇒ మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్‌ను డీఈవో ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ⇒ మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజి్రస్టార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు. ⇒ ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్‌కు సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. -
ములుగు వద్ద గోదావరి ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలూ, గోదావరి నది పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణాపురం వద్ద 163వ జాతీయ రహదారిపై చేరిన వరద నీరు చేరింది. చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. పేరూరు వద్ద వరద నీటి మట్టం 15 మీటర్లకు చేడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు వరదలతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మద్యలో ఉన్న జీడి వాగు ఉప్పొంగుతోంది. (జల దిగ్బంధంలో మేడారం) కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క జీడి వాగు ఉదృతిని వీక్షించారు. వాగు పొంగుపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లా పాలంపేట గ్రామం రామప్ప తూర్పు ముఖద్వారం రోడ్డు పై నుంచి వరద నీరు భారీగా కిందకు ప్రవహిస్తోంది. మరి కొద్ది గంటలల్లో గణపురం, ములుగు, వెంకటపూర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. (జలదిగ్బంధంలో ఓరుగల్లు) -
వసతులు లేనిదే ఎలా పనిచేస్తాం?
సాక్షి, హైదరాబాద్: కౌన్సెలింగ్ లేకుండా తమకు ఏకపక్షంగా పోస్టింగులు ఇవ్వడంపై పీజీ వైద్యులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను విస్తృతం చేసేందుకు 1,200 మంది పీజీ వైద్యులకు వివిధ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం 800 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. సోమవారం నాటికి వారు ఆయాచోట్ల రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే, చాలా మంది రిపోర్ట్ చేయలేదని సమాచారం. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేవని, ఈ అంశాన్ని పరిగణించకుండా ఏకపక్షంగా పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వసతులు లేనిచోట ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. (చదవండి: సర్కారు తీరుపై హైకోర్టు అసహనం) మరోవైపు పీజీ వైద్యుల పోస్టింగ్‌ల విషయంలో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని వైద్య విద్య సంచాలక కార్యాలయం(డీఎంఈ) స్పçష్టం చేస్తోంది. పీజీ వైద్యులు కచ్చితంగా ఏడాది పాటు వారికి కేటాయించిన చోట వైద్య సేవలు అందించాల్సిందేనని, ఈ సమయంలో ప్రతి నెలా వారికి రూ.70వేల వేతనంతో పాటు అదనంగా మరో పది శాతం ఇన్సెంటివ్ ఇస్తున్నామని, క్వారంటైన్ కూడా అమలు చేస్తున్నామని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. ఇక పీజీ వైద్యుల పోస్టింగ్స్, ఇతర డిమాండ్లకు సంబంధించి సోమవారం హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్.. డీఎంఈకి లేఖ రాసింది. పీజీ వైద్యులకు మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని, ప్రెగ్నెన్సీ డాక్టర్లకు మినహాయింపులు ఇవ్వాలని కోరింది. (ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం) -
చిల్లరబొల్లరగా మాట్లాడుతున్నారు: ఈటల
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంటే బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు చిల్లరబొల్లరగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇది విమర్శలు చేసే సమయం కాదని హితవు పలికారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోన విజృంభిస్తోందని గుర్తు చేశారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిల్లర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కరోన కట్టడి లో తెలంగాణ విఫలం అయ్యిందని నడ్డా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఈటల విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోన కట్టడి ఎలా ఉందో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. (చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ) ‘మార్చి 2 నుంచి రాష్ట్రంలో కరోనా జాడ బయట పడింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారానే కరోన సంక్రమిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారు. దీనిపై స్పందించిన మొట్టమొదటి వ్యక్తి సీఎం కేసీఆరే. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ చేసి చూపెట్టారు. బీజేపీ నేతలకు కంటైన్మెంట్ అన్న పదానికి అర్థం తెలియదు. మర్కజ్ విషయంలో కూడా ముందు హెచ్చరించింది సీఎం కేసీఆరే. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పుడు విమర్శలు అనవసరం అని ప్రధానికి సీఎం సూచనలు చేశారు. ఇప్పుడేమో బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయి నేతలు మాట్లాడే మాటలు కాదు ఇవి. గల్లీ స్థాయి లీడర్లు మాట్లాడే మాటలివి. లాక్డౌన్ సమయంలో చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అన్నప్పుడు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నా మా సీఎం మాత్రం అన్నింటికీ సహకరించారు. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లతో వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాం. దానిని మీ కేంద్రమే మెచ్చుకుంది. దీన్ని కూడా తప్పు అంటున్నారు. మీది నీచ సంస్కృతి, మీది శవాల మీద పేలాలు ఏరుకునే స్వభావం. ఇలాంటి చిల్లర రాజకీయాలు తగదు’ అని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. (చదవండి: గాంధీలో మరో శవ పంచాయితీ) -
రేవంత్‌రెడ్డికి పోసాని హితవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సాగుతున్న రాజీకీయ విమర్శలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. లంచం కేసులో పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేటీఆర్ మంచి నాయకుడని, ఆయనపై బురదజల్లడం తగదని హితవు పలికారు. ఆదివారం సాయంత్రం పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు మూడు రోజులుగా కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశిచారు కదా.. మంత్రి పదవికి రాజీనామా చేయమనడమేంటీ. ఇదెక్కడి లాజిక్కో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తి కేటీఆర్‌ను రాజీనామా చేయమనడమేంటీ. కేటీఆర్, హరీష్ రావు నిజాయితీగల పొలిటీషియన్స్. వీళ్లే భవిష్యత్ తెలంగాణకు రెండు కళ్లు. కేటీఆర్ అవినీతిని ప్రతిపక్ష నాయకులు ప్రూవ్ చేస్తే. రేపటి నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతా. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 2 శాతం నేలలు సస్యశ్యామలం అవుతాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే.. కమీషన్ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడమేంటీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి వారు విమర్శించే ముందు ఆలోచించాలి. నాగార్జున సాగర్‌ను కాంగ్రెస్ ప్రజలకోసమే కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రజల కోసమే కట్టారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారన్నది మనకు అనవసరం. ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది. సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షం అసత్యాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. పోతిరెడ్డిపాడు అంశాన్ని కూడా రెండు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకుంటారు’అని పోసాని వ్యాఖ్యానించారు. మనోజ్ కుటుంబానికి పోసాని సాయం కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి పోసాని కృష్ణమురళి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ‘జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నా. నా తరపున రూ. 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా. సినిమా షూటింగ్ ప్రారంభమైతే మరో 25 వేలు సహాయం చేస్తా. మీడియా అంటే ప్రజలకు సేవ చేసే రంగం. సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలి’అని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణలో కొత్తగా 127 పాజిటివ్ కేసులు
-
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
-
రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోమోరిన్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతోపాటు ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో శనివా రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు పేర్కొన్నారు. తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో నిజామాబాద్‌లో 7.3 డిగ్రీలు అధికంగా 21.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 6.2 డిగ్రీలు అధికంగా 20.6 డిగ్రీలు, నల్లగొండలో 1.2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈశాన్యం నుంచి వచ్చే చలి గాలుల తీవ్రత భూమిని తాకే పరిస్థితి లేకపోవడంతో చలి అంతగా లేదని వివరించింది. -
29వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
-
ఐక్యతతో ముందుకు సాగుదాం..
నిజామాబాద్ సిటీ,న్యూస్‌లైన్ : అందరం ఐకమత్యంతో ఉంటూ ముందుకుసాగితే దేశంలో అన్ని రాష్ట్రాలలోకెల్లా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రత్యేక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల న్నా రు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పదకొండో డివిజన్లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీవల్లే తెలంగాణ వచ్చిందన్నారు. దీనికి కృషి చేసిన ఆమెకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపేందుకు జెండా పండుగ చేస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారు ఏ పార్టీ కోసమో,ఏ కులం కోసమో ప్రాణాలు అర్పించలేదన్నారు. కేవలం తెలంగాణ కోసమే ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 1969 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దీనికి సోనియాగాంధీ ఎంతో బాధపడ్డారన్నారు. ఎన్డీఏ హయాంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ప్రకటించి తెలంగాణను ఏర్పాటు చేయలేదని, దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారకుడని ఆరోపిం చారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చామని, అలాగే కరీంనగర్ సభలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాను ఏ హోదాలో ఉన్నా సోనియాను కలిసిన ప్రతి సందర్భంలో తెలంగాణపై మాట్లాడుతూ వచ్చానన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగులు,కార్మికులు,విద్యార్థులు అందరూ పోరాడారన్నారు. అన్ని డివిజన్లలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు రత్నాకర్,సురేందర్,సహాయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్అక్రం, డీసీసీ ప్రధా న కార్యదర్శి రాజేశ్వర్,యువజన కాంగ్రెస్ జిల్లా,అర్బ న్ అధ్యక్షులు గన్‌రాజ్,బంటు రాము,ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
పాతపాట కొత్త బాణీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ప్రకటనను నిరసిస్తూ... సమైక్యరాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక వాదంతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ప్రత్యేక రాయలసీమ సాధనే లక్ష్యంగా గురువారం ఆయన ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పార్టీని తిరుపతిలో ప్రారంభించారు. సీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ‘గ్రేటర్ రాయలసీమ’ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ‘రాయలసీమ హక్కుల ఐక్య వేదిక’ పేరుతో గతంలో ఉద్యమాలు చేసిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి టి.జి. వెంకటేశ్ కూడా ఇప్పుడు తన రూటు మార్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో... బెరైడ్డి అదే వాదంతో కొత్త పార్టీ ఏర్పాటు చేయ డం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత అక్టోబర్‌లో టీడీపీని వీడారు. అయితే ఆయన వెంట చెప్పుకోదగ్గ నాయకులెవ్వరూ కలిసిరాలేదు. అయినా రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసిన బెరైడ్డి అక్టోబర్ 2 నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ‘వస్తున్నా... మీకోసం ’ యాత్రకు పోటీగా నాలు గు జిల్లాల్లో పాదయాత్ర చేపట్టారు. దానికి అంతంత మా త్రంగానే స్పందన రావడంతో కొద్దికాలం మౌనంగా ఉన్న ఆయన ట్రాక్టర్ యాత్ర పేరుతో మరోసారి జనం ముం దుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే రాయలసీమ పరిరక్షణ సమితి సంస్థను రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే గురువారం తిరుపతి వేదికగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నందికొట్కూరు నియోజకవర్గానికే పరిమితమా..?: 1993లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి 1994, 1999లలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరు చరిత చే తిలో ఓడిపోయిన బెరైడ్డి 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో పాణ్యం నుంచి పోటీ చేసి కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన ప్రత్యేక రాయలసీమ హక్కులపై గళం విప్పడం ఆరంభించారు. చివరికి గత ఏడాది అక్టోబర్‌లో టీడీపీని వీడి చివరికి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అయితే పార్టీ ఏర్పాటు చేయకముందు జరిగిన సహకార , పంచాయితీరాజ్ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో పోటీ చేసి, నామమాత్రపు ఫలితాలే సాధించారు. ప్రస్తుతం బెరైడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో ఆయన మినహా పేరున్న నాయకులు ఎవరూ లేరు. నినాదంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి, ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అదీగాక... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే దిశలో వేగం పెంచినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సమైక్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. మన జిల్లాతో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో వాడవాడల్లో, మారుమూల పల్లెల్లో సైతం ప్రజలు ముక్తకంఠంతో సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టారు. ఈ పరిస్థితుల్లో అరిగిపోయిన ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని భుజాన వేసుకొని ఎన్నికల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడం ఎంత మేర ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.