నిజామాబాద్ సిటీ,న్యూస్‌లైన్ : అందరం ఐకమత్యంతో ఉంటూ ముందుకుసాగితే దేశంలో అన్ని రాష్ట్రాలలోకెల్లా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రత్యేక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల న్నా రు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పదకొండో డివిజన్‌లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీవల్లే తెలంగాణ వచ్చిందన్నారు. దీనికి కృషి చేసిన ఆమెకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపేందుకు జెండా పండుగ చేస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారు ఏ పార్టీ కోసమో,ఏ కులం కోసమో ప్రాణాలు అర్పించలేదన్నారు.
కేవలం తెలంగాణ కోసమే ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 1969 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దీనికి సోనియాగాంధీ ఎంతో బాధపడ్డారన్నారు. ఎన్డీఏ హయాంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ప్రకటించి తెలంగాణను ఏర్పాటు చేయలేదని, దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారకుడని ఆరోపిం చారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చామని, అలాగే కరీంనగర్ సభలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాను ఏ హోదాలో ఉన్నా సోనియాను కలిసిన ప్రతి సందర్భంలో తెలంగాణపై మాట్లాడుతూ వచ్చానన్నారు.
తెలంగాణ కోసం ఉద్యోగులు,కార్మికులు,విద్యార్థులు అందరూ పోరాడారన్నారు. అన్ని డివిజన్లలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు రత్నాకర్,సురేందర్,సహాయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్‌అక్రం, డీసీసీ ప్రధా న కార్యదర్శి రాజేశ్వర్,యువజన కాంగ్రెస్ జిల్లా,అర్బ న్ అధ్యక్షులు గన్‌రాజ్,బంటు రాము,ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతతో ముందుకు సాగుదాం..
Published Wed, Nov 13 2013 6:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement