సాక్షి, హైదరాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలూ, గోదావరి నది పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణాపురం వద్ద 163వ జాతీయ రహదారిపై చేరిన వరద నీరు చేరింది. చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. పేరూరు వద్ద వరద నీటి మట్టం 15 మీటర్లకు చేడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు వరదలతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మద్యలో ఉన్న జీడి వాగు ఉప్పొంగుతోంది.
(జల దిగ్బంధంలో మేడారం)
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క జీడి వాగు ఉదృతిని వీక్షించారు. వాగు పొంగుపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లా పాలంపేట గ్రామం రామప్ప తూర్పు ముఖద్వారం రోడ్డు పై నుంచి వరద నీరు భారీగా కిందకు ప్రవహిస్తోంది. మరి కొద్ది గంటలల్లో గణపురం, ములుగు, వెంకటపూర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
(జలదిగ్బంధంలో ఓరుగల్లు)
Comments
Please login to add a commentAdd a comment