
జకీర్ నాయిక్ వస్తున్నాడు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ముస్లిం మత పెద్ద జకీర్ నాయక్ను నేడు ముంబయి పోలీసులు విచారించే అవకాశం ఉంది. సౌదీ అరేబియా నుంచి నేడు ముంబయికి వస్తున్న ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఓ టీవీ చానెల్ ద్వారా మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఢాకా పేలుళ్ల నేపథ్యంలో ఆయన ఈ ప్రసంగం చేసి దేశం నివ్వెర పోయేలా చేశాడు.
దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. మరోపక్క, జకీర్ ఆస్తులు, ఆయన చేస్తున్న కార్యకలాపాలు, కొనసాగిస్తున్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా మొదలు పెట్టినట్లు సమాచారం.