ప్రజ్ఞతో రాజ్‌నాథ్ సమావేశంపై బీజేపీకి ప్రశ్న
న్యూఢిల్లీ : వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్‌తో కలసి 2012లో కార్యక్రమంలో పాల్గొనడంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దీంతో డిగ్గీ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలుగా ఉన్న ప్రజ్ఞ ఠాకూర్‌తో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్ జైల్లో సమావేశమవడంపై బీజేపీని ప్రశ్నించారు. ‘వారి విమర్శలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పండిట్ రవిశంకర్ గురూజీ కూడా జకీర్ నాయక్‌తో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
దానిపై ఏమంటారు? మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞపై కేసు నమోదైంది. కాని జకీర్ నాయక్‌పై ఇప్పటివరకూ ఎలాంటి కేసన్నా నమోదయిందా?’ అంటూ ట్విటర్లో బీజేపీపై వరుస ప్రశ్నలను సంధించారు. ఒక వేళ ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. జకీర్ ప్రసంగంతోనే ప్రేరేపితులై ఢాకా పేలుళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే.
బీజేపీపై దిగ్విజయ్ ఎదురుదాడి
Published Sat, Jul 9 2016 1:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement