మాజీ సీఎం భార్యను ‘ఐటెం’ అంటూ... | BJP MP Manohar Untwal Item Comments on Digvijay Wife | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 13 2018 2:26 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

BJP MP Manohar Untwal Item Comments on Digvijay Wife - Sakshi

భార్య అమృతా రాయ్‌తో దిగ్విజయ్‌ సింగ్‌ (పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ భార్య అమృత రాయ్‌పై బీజేపీ నేత ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమృతను ఐటెం అని సంభోదిస్తూ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గురువారం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలో బీజేపీ ఎంపీ మనోహర్‌ ఉన్‌త్వల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దిగ్విజయ్‌ సింగ్‌ మధ్య ప్రదేశ్‌ రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. కానీ, ఢిల్లీ నుంచి ఓ ఐటెంను మాత్రం తీసుకొచ్చారు. ఈ మధ్య ఆయనగారు నర్మద యాత్ర అంటూ ఏదో హడావుడి చేశారు. ఆయనకు ఇప్పుడు సాధువులతో కూడా సమస్యలు వస్తున్నాయంట. వారికి ఎర్రబుగ్గ కారులు ఎందుకిచ్చారంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహారాలేంటో అస్సలు అర్థం కావట్లేదు’ అంటూ ఉన్‌త్వల్‌ ప్రసంగించారు. 

అయితే నేరుగా అమృత పేరును ప్రస్తావించకపోయినా.. ఐటెం వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించి చేసినంటూ కాంగ్రెస్‌ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉన్‌త్వల్‌ మళ్లీ స్పందించారు. ‘దిగ్విజయ్‌ అంటే నాకు చాలా గౌరవం. ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నర్మద యాత్రను ఉద్దేశించి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని వ్యాఖ్యలు చేశా. అంతేగానీ.. ఆయన భార్యను నేనేం అనలేదు’ అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పోలీసు ఫిర్యాదు చేసేందుకు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు సిద్ధమైపోతున్నారు. కొంత కాలం రిలేషన్‌లో దిగ్విజయ్‌ సింగ్(71)‌-టీవీ యాంకర్‌ అమృతా రాయ్‌(46)ల ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌ కావటం.. అవి దిగ్విజయ్‌పై విమర్శలకు దారితీయటం.. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో దిగ్విజయ్‌. అమృతను వివాహం చేసుకోవటం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement