Amrita Rai
-
మాజీ సీఎం భార్యను ‘ఐటెం’ అంటూ...
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భార్య అమృత రాయ్‌పై బీజేపీ నేత ఒకరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమృతను ఐటెం అని సంభోదిస్తూ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గురువారం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలో బీజేపీ ఎంపీ మనోహర్ ఉన్‌త్వల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. కానీ, ఢిల్లీ నుంచి ఓ ఐటెంను మాత్రం తీసుకొచ్చారు. ఈ మధ్య ఆయనగారు నర్మద యాత్ర అంటూ ఏదో హడావుడి చేశారు. ఆయనకు ఇప్పుడు సాధువులతో కూడా సమస్యలు వస్తున్నాయంట. వారికి ఎర్రబుగ్గ కారులు ఎందుకిచ్చారంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహారాలేంటో అస్సలు అర్థం కావట్లేదు’ అంటూ ఉన్‌త్వల్ ప్రసంగించారు. అయితే నేరుగా అమృత పేరును ప్రస్తావించకపోయినా.. ఐటెం వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించి చేసినంటూ కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉన్‌త్వల్ మళ్లీ స్పందించారు. ‘దిగ్విజయ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నర్మద యాత్రను ఉద్దేశించి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని వ్యాఖ్యలు చేశా. అంతేగానీ.. ఆయన భార్యను నేనేం అనలేదు’ అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పోలీసు ఫిర్యాదు చేసేందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సిద్ధమైపోతున్నారు. కొంత కాలం రిలేషన్లో దిగ్విజయ్ సింగ్(71)-టీవీ యాంకర్ అమృతా రాయ్(46)ల ప్రైవేట్ ఫోటోలు లీక్ కావటం.. అవి దిగ్విజయ్‌పై విమర్శలకు దారితీయటం.. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో దిగ్విజయ్. అమృతను వివాహం చేసుకోవటం తెలిసిందే. -
ఆ పాదయాత్ర వెనక పరమార్థం ఏమిటో?
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన రెండో భార్య అమృత రాయ్‌తో కలిసి రాష్ట్రంలో చేపట్టిన 3,300 నర్మదా పరిక్రమ యాత్ర ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. రోజుకు పది, పన్నెండు కిలోమీటర్ల చొప్పున గ్రామీణ ప్రాంతాల గుండా ఆయన సాగిస్తున్న ఆయన యాత్ర ఇప్పటికీ దాదాపు రెండు నెలలు పూర్తి చేసుకొంది. మరో నాలుగు నెలలపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో ముచ్చటిస్తున్నారు. 110 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కొనసాగనున్న ఆయన యాత్ర పట్ల పార్టీ సహచర నాయకులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఆయన ఇంత రిస్కు తీసుకొని ఎందుకు పాదయాత్ర జరుపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఆయనకు పార్టీలో పోటీదారులైన కమల్‌నాథ్, జోతిరాధిత్య సింధియాలు కూడా ఆయన యాత్రలో పాల్గొనాల్సి వచ్చింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిగ్విజయ్ యాత్రకు ప్రాధాన్యత చేకూరింది. 2003 నుంచి అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో 228 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కేవలం 38 సీట్లు రావడంతో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో అన్ని పదవులకు దూరంగా ఉంటానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. పదేళ్లు ఎప్పుడో పూర్తయినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి పదవులు స్వీకరించేందుకు ఆయన అవకాశం రాలేదు. పైగా పార్టీ కేంద్ర స్థాయిలో ఉన్న పదవులు ఊడిపోయాయి. ముందుగా గోవా పార్టీ ఇన్చార్జి పదవిని పోగొట్టుకున్న ఆయన ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణలలో కూడా పదవులను కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో పదవులకు దూరంగా ఉన్నప్పటికీ పార్టీలో తన పట్టును కోల్పోకుండా పావులు కదుపుతూ వస్తున్నారు. తన విధేయులకు పదవులు లభించేలా చూసుకుంటున్నారు. తన మాటను పార్టీ సీనియర్ నేతలు ఖాతర చేయకపోతే తన మాటను పట్టించుకోకపోతే ముందుముందు పశ్చాత్తాప పడాల్సి వస్తుందంటూ ఆయన తనదైన శైలిలో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు యువజన నేతగా, భవిష్యత్ కాంగ్రెస్ సీఎంగా పార్టీలో జ్యోతిరాధిత్య నీరాజనాలు అందుకుంటున్న నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ సుదీర్ఘ యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నా ముందుగా తనను పార్టీ అధిష్టానం సంప్రదించే పరిస్థితి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అన్నింటికి సమాధానం తిరిగి ప్రజల మన్ననలను కూడగట్టుకోవడమేనని ఆయన భావించారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాష్ట్ర ప్రజలకు దూరమైన ఆయన తనకంటే ఎంతో చిన్నదైన జర్నలిస్ట్‌ను రెండో భార్యగా చేసుకొని మరింత దూరమయ్యారు. తన కుమారుడైన ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్‌తోపాటు మాజీ ఎంపీ, తన సోదరుడు లక్ష్మణ్ సింగ్‌లు కూడా ఇదే అంశంపై దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత వారు ఇప్పుడు దిగ్విజయ్‌ను పాదయాత్రలో వారు కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత పెళ్లేమిటని ఈసడించుకున్న ప్రజలే ఇప్పుడు ఆయన వెంట నడుస్తున్న అమృతరాయ్‌ను కూడా ఆదరిస్తున్నారు. -
డిగ్గీని పెళ్లాడేశా: అమృత
-
డిగ్గీని పెళ్లాడేశా: అమృత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(68).. టీవీ యాంకర్ అమృతారాయ్(44)ని గత నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా అమృత ఆదివారం స్వయంగా తెలిపారు. పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని, రిజిస్టర్ కూడా చేసుకున్నామని చెప్పారు. అమెరికాలో ఉన్న డిగ్గీ కూడా ఈ సంగతిని ధ్రువీకరించారు. భారత్ వచ్చాక పూర్తి వివరాలు చెబుతానన్నారు. గత ఏడాది డిగ్గీ అమృతతో తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం తెలిసిందే. 'ప్రేమ పొందడానికే డిగ్గీని పెళ్లాను. అందుకే ఆస్తులను ఆయన కొడుకు, కూతురి పేర రాయాలని కోరా. నా యాంకర్ వృత్తిని కొనసాగిస్తా. మా వయసుల్లో ఎంతో వ్యత్యాసం ఉందనే ప్రశ్న తలెత్తుందని నాకు తెలుసు. అన్నీ తెలిసే నేను ఈ వివాహం చేసుకున్నాను. దిగ్విజయ్ తో కొత్త జీవితం ప్రారంభించాలని అకుంటున్నా' అని అమృత అన్నారు. -
అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే!
కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయండి.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఇరకాటంలో పెట్టింది. ఏడు పదుల వయసుకు దగ్గరలో పడిన డిగ్గీరాజా.. ఇటీవలే నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సరిగ్గా వాటినే చూసిన అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తప్పులో కాలేసింది. ఆమెను మన డిగ్గీ రాజాకు కూతురు అనుకుని, వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలోకి చేర్చేసింది. ఈ విషయాన్ని ఒకరు కనిపెట్టేసి.. దాన్ని ట్వీట్ చేశారు. డిగ్గీరాజా ఈ కాన్సెప్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, సెల్ఫీ విత్ డాటర్ అన్నారు తప్ప కూతురి వయసున్న గర్ల్‌ఫ్రెండ్‌తో సెల్ఫీ కాదని అన్నారు. చాలామంది తండ్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఇలా తమ కూతుళ్లతో సెల్ఫీలు తీసుకున్నారనే కథనంలో మరికొన్ని ఇతర ఫొటోలతో కలిపి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిగ్గీ రాజా ఫొటోను కూడా ప్రచురించేసింది. అయితే దీనిపై అటు దిగ్విజయ్ సింగ్ నుంచి గానీ, అమృతా రాయ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. -
మోడీలా నేను దాచలేదు
* ఆయన తన పెళ్లి బంధాన్ని 30 ఏళ్లు దాచాడు * నేను మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్ * విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది * అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతారాయ్‌తో తనకున్న సంబంధాన్ని ఏనాడూ దాచలేదని, ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తానేమీ దాచలేదన్నారు. ‘నేను మోడీలా పిరికివాడిని కాదు. పెళ్లి సంబంధాన్ని 30 ఏళ్లపాటు దాచలేదు. పెళ్లి అంశం ప్రైవేటు వ్యవహారం. అయినప్పటికీ బహిర్గతపరిచేందుకు వెనుకాడలేదు. దీనిపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున మోడీ తన పార్టీ గుర్తును చూపడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం ఆయనకు అలవాటేనని ధ్వజమెత్తారు. అంతకుముందు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లోనూ దిగ్విజయ్ మాట్లాడారు. కార్మికులంటే కాంగ్రెస్‌కు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ 5 శాతానికిపైగా వృద్ధిరేటును సాధించిన ఘనత యూపీఏ సర్కార్‌దేనన్నారు. అయితే దీనివల్ల కార్పొరేట్లు ఎక్కువగా లబ్ధి పొందిందన్నారు. పేదల కోసం యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చే సమయంలో కార్పొరేట్ శక్తులు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. ప్రస్తుతం ఆ శక్తులే ఎన్నికల్లో మోడీకి మద్దతిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ, సీమాంధ్రలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వైఎస్ గొప్ప నాయకుడని, కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం పలువురు కార్మిక నాయకులను టీపీసీసీ తరఫున సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఐఎన్టీయూసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు దిగ్విజయ్ పెళ్లి ఆయన వ్యక్తిగత విషయమంటూ ఏఐసీసీ నేతలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇక దిగ్విజయ్ కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ మాత్రం తన తండ్రికి మద్దతు తెలిపారు. ఆయన వ్యక్తిగత నిర్ణయంలో తాను జోక్యం చేసుకోబోనన్నారు. -
నాన్న పెళ్లి నాకు ఓకే! : జైవర్దన్ సింగ్
భోపాల్: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ ప్రేమాయణాన్ని ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే జైవర్దన్‌సింగ్ సమర్ధించారు. తన తండ్రి పునర్వివాహం అంశం పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తండ్రికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంతకుమించి దీని గురించి తాను ఏమీ మాట్లాడబోనన్నారు. రాజ్యసభ టీవీ యాంకర్ అమృతారాయ్‌ను తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు దిగ్విజయ్ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అమృతారాయ్‌తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని, ధైర్యంగా బహిరంగ పరిచినట్లు కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్‌కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. -
విడాకులు మంజూరు కాగానే అమృతతో పెళ్లి: దిగ్విజయ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాగా తాను పిరికివాడిని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అందుకే టీవీ జర్నలిస్టు అమృతారాయ్‌తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని... ధైర్యంగా బహిరంగ పరిచినట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్‌కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నరేంద్ర మోడీ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తిగా దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా అభివర్ణించారు. అందుకు పోలింగ్ రోజున ఎన్నికల కోడ్‌ను మోడీ ఉల్లంఘించారని దిగ్విజయ్ సోదాహరణగా వివరించారు. పార్లమెంట్లో ఫుడ్ సెక్యూరిటీ బిల్లును కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకించాయని.... అయితే అవే కార్పొరేట్ సంస్థలు మోడీని సమర్థిస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ... 10 ఏళ్లలో తమ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధిరేటు సాధ్యమైందని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. మేడే సందర్భంగా గురువారం హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఐఎన్ టీయుసీ జెండా ఎగరవేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా అమృతారాయ్ తో వివాహం ఎప్పుడు అంటూ విలేకర్ల అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ పై విధంగా సమాధానం చెప్పారు. -
దిగ్విజయ్ కి రెండో పెళ్లి!
ఎన్నికల వేళ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇమేజిని దెబ్బతీసే చిత్రాలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేయడం కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. టీవీ యాంకర్ అమృతారాయ్ తో ఆయనకున్న 'సాన్నిహిత్యాన్ని' ఎత్తి చూపే ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే దిగ్విజయ్ సింగ్ 'అవును ... నిజమే... నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అంగీకరించేసి పెద్ద కాంట్రవర్సీకి చిన్న ఫుల్ స్టాప్ పెట్టి సరిపుచ్చారు. నాకు అమృతారాయ్ కి సాన్నిహిత్యం ఉంది. ఆమె ప్రస్తుతం భర్తతో విడాకులు తీసుకోబోతుంది. అది జరిగాక నేను ఆమెను వివాహం చేసుకుంటాను' అని దిగ్విజయ్ ట్విట్టర్ లో ప్రకటించారు. అమృతారాయ్ కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పుట్టిన కాంట్రవర్సీకి దిగ్విజయ్ సోషల్ మీడియాలోనే ఫుల్ స్టాప్ పలికారు. తమాషా ఏమిటంటే ఇటీవలే నరేంద్ర మోదీ వైవాహిక స్థాయి విషయంలో దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తన భార్యకు న్యాయమైన హక్కును కల్పించలేని మోడీకి వోటేయకండి. ఆయన్ని మహిళలు ఎలా నమ్మగలరు?' అని ఆయన విమర్శించారు. దిగ్విజయ్ భార్య ఆశాసింగ్ గతేడాది క్యాన్సర్ తో మరణించారు.