డిగ్గీని పెళ్లాడేశా: అమృత | Amrita Rai confirms marriage with Congress leader Digvijaya Singh | Sakshi
Sakshi News home page

డిగ్గీని పెళ్లాడేశా: అమృత

Published Mon, Sep 7 2015 10:27 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

డిగ్గీని పెళ్లాడేశా: అమృత

డిగ్గీని పెళ్లాడేశా: అమృత

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(68).. టీవీ యాంకర్ అమృతారాయ్‌(44)ని గత నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా అమృత ఆదివారం స్వయంగా తెలిపారు. పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని, రిజిస్టర్ కూడా చేసుకున్నామని చెప్పారు. అమెరికాలో ఉన్న డిగ్గీ కూడా ఈ సంగతిని ధ్రువీకరించారు. భారత్ వచ్చాక పూర్తి వివరాలు చెబుతానన్నారు.

గత ఏడాది డిగ్గీ అమృతతో తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం తెలిసిందే. 'ప్రేమ పొందడానికే డిగ్గీని పెళ్లాను. అందుకే ఆస్తులను ఆయన కొడుకు, కూతురి పేర రాయాలని కోరా.  నా యాంకర్ వృత్తిని కొనసాగిస్తా.  మా వయసుల్లో ఎంతో వ్యత్యాసం ఉందనే ప్రశ్న తలెత్తుందని నాకు తెలుసు. అన్నీ తెలిసే నేను ఈ వివాహం చేసుకున్నాను. దిగ్విజయ్ తో కొత్త జీవితం ప్రారంభించాలని అకుంటున్నా' అని అమృత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement