కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్‌లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు.
మార్పునకు సంకేతం: కాంగ్రెస్
బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment