West Bengal Chief Minister
-
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేద్దామనుకుంటున్నారు
కోల్‌కతా: వైద్యురాలి రేప్, హత్యపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సీపీఎం, బీజేపీలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అవరణలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. ‘వైద్యురాలి కుటుంబానికి అండగా నిలువాల్సిందిపోయి సీపీఎం, బీజేపీలు చవకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేనొకటే చెప్పదలచుకున్నాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. మేము ఏం చేయలేదో చెప్పండి? ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి? అని విపక్షాలపై మండిపడ్డారు. ‘డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజిని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం.. ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్టు చేశాం’ అని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆదివారం లోగా కేసును చేధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీసులు 90 శాతం దర్యాప్తును పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వయంగా తాను శుక్రవారం కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం: రాహుల్ వైద్యురాలి రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరగడం ఆసుపత్రిపై, అధికార యంత్రాంగంపై పలు సందేహాలకు తావిస్తోందన్నారు. డాక్టర్లలో, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ‘‘మెడికల్ కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా పంపిస్తారు? నిర్భయ వంటి కఠినచట్టాలు కూడా ఇలాంటి నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు. -
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
సంగీత మమకారం
క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది. దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు. అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్‌ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్ వీధుల్లో అకార్డియన్పై ‘హమ్ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. -
బీజేపీ భారత్ వీడిపో
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
రైల్వే నా బిడ్డలాంటిది.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని సూచించారు. రైల్వే తన బిడ్డలాంటిదని, దానిలోని లోటుపాట్లను సరిదిద్ధేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు రైల్వేశాఖ ప్రకటించిందని, బెంగాల్‌కు చెందిన వారికి తమ ప్రభుత్వం రూ 5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణచర్యలు పూర్తయ్యే వరకు రైల్వేకు, ఒడిశా ప్రభుత్వానికి పూర్తి సహాకారం అందిస్తామని వెల్లడించారు. అయితే కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాంటీ కొలిజిన్ డివైజ్(anti-collusion device) లేదని.. దీనిని అమర్చినట్లయితే.. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. చదవండి: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ ‘నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి నివేదిక ఇస్తారు. నేను రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో యాంటీ కొలిజిన్ డివైజ్‌ను తీసుకొచ్చాను. ఇది ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో రైళ్లను నిర్ణిత దూరంలోనే ఆపేందుకు ఉపయోగపడుతుంది. కోరమాండల్ రైలులో అలాంటి పరికరం లేదు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా ఈ సంఘటనను నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎదుటే మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంలో చేరారు. 1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్ కేబినెట్లో మొదటిసారి రైల్వేమంత్రిగా పనిచేశారు. 2000లో తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పశ్చిమబెంగాల్‌కు అనేక కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకొచ్చారు. 2009 మేలో యూపీఏ-2 ప్రభుత్వంలో మరోసారి రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు సీఎంగా ఎన్నికవ్వడంతో 2013లో కేంద్ర మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. కాగా శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే. షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. కొన్ని బోగీలు గాల్లోకి లేచి పట్టాలపై పడ్డాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందగా.. 900 మంది గాయపడ్డారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే #WATCH | West Bengal CM Mamata Banerjee reaches Odisha's #Balasore where a collision between three trains left 261 dead pic.twitter.com/2q4KSNksum — ANI (@ANI) June 3, 2023 -
‘బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’
కోల్‌కతా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ‘జీరో’గా మారిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కేవలం మీడియా మద్దతు, అబద్ధాలతోనే బీజేపీ ‘పెద్ద హీరో’గా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీని కనుమరుగు చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సోమవారం బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సమావేశమయ్యారు. ఈ భేటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. 2024 జరిగే లోక్‌సభలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారు చర్చించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైనా కూటమిని ఎలా నిర్మించాలన్న దానిపై వారు చర్చించుకున్నట్లు తెలిసింది. విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా.. విపక్షాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని, ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవాలని నితీశ్ కుమార్ సూచించారు. మమతా బెనర్జీతో తమ సమావేశం సానుకూలంగా జరిగిందని అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. సొంత ప్రచారం కోసమే అధికార పక్షం పాకులాడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉన్నాయనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పోరాటం బిహార్ నుంచే మొదలైందని, బిహార్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తే బాగుంటుందని నితీశ్‌కుమార్‌తో చెప్పానని వివరించారు. విపక్ష కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా చేరుతుందా? అని ప్రశ్నించగా.. అన్ని పార్టీలూ భాగస్వామిగా ఉంటాయని మమత బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం మమతా బెనర్జీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. నితీశ్ కుమార్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాçహుల్ గాంధీని కలిసి, కూటమి ఏర్పాటుపై చర్చించారు. వృథా ప్రయాస: బీజేపీ మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ భేటీతో ఒరిగేదేమీ ఉండదని, అదొక వృథా ప్రయాస అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తేల్చిచెప్పారు. 2014చ 2019లో కూడా విపక్షాల ఐక్యత పేరిట ప్రయత్నాలు జరిగాయని, చివరకు ఏం జరిగిందో మనకు తెలిసిందేనని పేర్కొన్నారు. దేశ ప్రజలు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. అస్థిరమైన, అవకాశవాద కూటమికి ప్రజలు ఓటు వేయబోరని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో మనుగడను కాపాడుకొనేందుకు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ వెల్లడించారు. బీజేపీ విమర్శలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శాంతను సేన్ తిప్పికొట్టారు. 2024లో మళ్లీ అధికారం చేపట్టాలన్న బీజేపీ కలలు నెరవేరే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాలు ఒక్కటవుతుండడంతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. అఖిలేశ్‌తో నితీశ్ భేటీ లక్నో: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ సోమవారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి కూలదోయడానికి సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారని అఖిలేశ్‌యాదవ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల అనంతరం విపక్షాల కీలక భేటీ! న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక కూటమిపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్పష్టత రానుంది. ఆ ఎన్నికల తర్వాత 19 విపక్ష పార్టీల అగ్రనేతలు సమావేశం కానున్నారని, కూటమి ఏర్పాటుపై చర్చిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపాయి. కూటమి విషయంలో ఆయన ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఖర్గే అతి త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం. -
దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్నారు
కోల్‌కతా: కొందరు నేతలు విద్వేష రాజకీయాలతో దేశాన్ని విభజించే కుట్రలకు తెరతీశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వారి కుట్రలను సాగనివ్వను. ఈ పోరాటంలో ప్రాణాలనైనా అర్పిస్తా’’ అని శనివారం కోల్‌కతాలో ఈద్ నమాజ్ సందర్భంగా ఆమె అన్నారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అయినా తలవంచే ప్రసక్తే లేదు’ అన్నారు. ‘‘ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం. ఒక్కటిగా ఓటేసి బీజేపీని గద్దె దింపుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం విఫలమైతే అంతా అయిపోయినట్లే’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలపై ఈ సందర్భంగా మమత విమర్శలు గుప్పించారు. -
బీజేపీది రెండు నాల్కల వైఖరి: మమత
షిల్లాంగ్: రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, ఇతరత్రా హామీలను ఎన్నికల వేళ ప్రధానంగా ప్రస్తావించే బీజేపీ ఆ తర్వాత మరోలా మాట్లాడుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మేఘాలయలోని ఉత్తర గారో హిల్స్ జిల్లాలో బుధవారం ఆమె భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘బీజేపీకి రెండు ముఖాలుంటాయి. ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తూ ఒక ముఖం మాట్లాడుతుంది. ఆ తర్వాత మరో ముఖం మరోలా మాట్లాడుతుంది. కాషాయ పార్టీ ఏలుబడిలోని రాష్ట్రాలకే కేంద్ర నిధులు దక్కుతాయి. ఇలాంటి పార్టీకి ఓటేయకండి’’ అని పిలుపునిచ్చారు. అస్సాం, త్రిపురలతోపాటు మేఘాలయలోనూ పార్టీని పటిష్టంచేయడంపై మమత దృష్టిసారించారు. మేఘాలయలో 2021 నవంబర్‌లో కాంగ్రెస్‌లోని 17 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరడం విశేషం! గత డిసెంబర్లో రాష్ట్రంలో పర్యటించిన మమత.. స్థానిక మహిళలకు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఈ కొద్దిరోజుల్లోనే 3.14 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు! -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి’.. బీజేపీకి దీదీ సవాల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని పశ్చిమ బంగాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ క్రమంలో మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశువులు స్మగ్లింగ్, స్కూల్ జాబ్స్ స్కామ్ కేసుల్లో టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, అనుబాత్రా మోండల్ అరెస్టుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యల చేశారు. కోల్‌కతాలో టీఎంసీ విద్యార్థి విభాగం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. కోల్‌కతా మేయర్, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకిమ్, పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీలు సహా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ‘ప్రతి ఒక్కరు దొంగలేనని బీజేపీ ముద్ర వేస్తోంది. టీఎంసీలోని వారంతా దొంగలు, కేవలం బీజేపీ, తమ నేతలు మంచి వారుగా కాషాయ పార్టీ ప్రచారం చేస్తోంది. నేను రాజకీయంలో లేకపోయుంటే.. వారి నాలుకలను తెగ్గోసే దానిని. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది. అలాగే, అక్రమంగా సాధించిన డబ్బుతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఉపయోగిస్తోంది. హకిమ్ త్వరలోనే అరెస్ట్ కానున్నారు. కేవలం వేధించేందుకే ఆయనపై తప్పుడు కేసులు పెడుతున్నారు.’ అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. మహారాష్ట్ర విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు మమత. 2024లో జరిగే సాదారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. స్కూల్ జాబ్స్ కేసులో పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసినప్పటికీ ఎలాంటి నేరాన్ని నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్ -
మోదీ బలపడుతున్నారంటే.. కాంగ్రెస్‌దే పాపం
పనాజీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని దుయ్యబట్టారు. మోదీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మీరుంటారా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ ఎల్ఐపీ (లెస్ ఇంపార్టెంట్ పర్సన్)గా , వీధిపోరాటాలు చేసే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోలేదు: కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి టీఆర్పీ రేటింగ్లా ఉంది. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేదు. ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలి’’ అని మమత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు. -
బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో కీలుబొమ్మని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏర్పాటు చేయదలిచే ఉమ్మడి పోరాట వేదికలో మమతకు స్థానం కల్పించకూడదన్నారు. మమత ఒక అవిశ్వసనీయ మిత్రురాలని, కాంగ్రెస్‌ను పణంగా పెట్టి జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘అన్నం పెట్టే చేతులను కరవడం ఆమెకు అలవాటు. ప్రతిపక్షాల ఐక్య వేదికకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమె బీజేపీ పంపిన ట్రోజన్‌హార్స్ (శత్రువును మాయ చేసేందుకు గ్రీకులు వాడిన సాధనం). బీజేపీపై యుద్ధంలో ఆమెను నమ్మకూడదు’’ అని అధిర్ విమర్శించారు. తన కుటుంబసభ్యులను, పార్టీ నేతలను సీబీఐ దాడుల నుంచి రక్షించుకునేందుకు మమత ప్రధాని చెప్పినట్లు నడుచుకుంటారని, ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ లక్ష్య సాధనకు పరోక్షంగా సహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతకు టీఎంసీ వెన్నుపోటుదారన్నారు. తొక్కేసి ఎదుగుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్‌ను పణంగా పెట్టి టీఎంసీ ఎదిగిందని, ఇప్పుడు జాతీయవ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు టీఎంసీలో చేరడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. దీంతో టీఎంసీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని మమత కలలు కంటున్నారని, వారికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉందని అధిర్ చెప్పారు. కాంగెస్ర్ ఉన్నంతకాలం ఆమెను ప్రతిపక్ష ఉమ్మడి నేత కానీయమని, ఇది తెలిసే ఆమె కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించారు. మోదీకి దీటైన నేత రాహుల్ కాదు, మమత అని టీఎంసీ మీడియాలో రావడంపై ఆయన స్పందించారు. వారివి పిచ్చివాళ్ల ఊహలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాహుల్ గాంధీ సమర్ధవంతమైన ప్రతిజోడి అని అధిర్ చెప్పారు. దేశంలో ఇంకా కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ల వాటా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి తప్ప మరే పార్టీకి ఇంత ఓట్ల వాటా లేదన్నారు. అందువల్ల ప్రతిపక్ష ఉమ్మడి నాయకత్వానికి కాంగ్రెస్ సహజ ఎంపికని అభివర్ణించారు. తమ పార్టీ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏర్పడడం కల్ల అని చెప్పారు. పంజాబ్‌లో సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మే 5న మమత ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. ప్రాణభయంతోనే రిటర్నింగ్ ఆఫీసర్ రీకౌంటింగ్ పెట్టలేదు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్ఎంఎస్ను మీడియాకు చూపించారు. రిటర్నింగ్ అధికారి ఆ ఎస్ఎంఎస్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. -
మమత చైనా పర్యటన రద్దు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో తన చైనా పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉన్నతస్థాయి నేతలతో రాజకీయ సమావేశాలకుచైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే ఈ భేటీ రద్దు చేసుకున్నట్లు మమత వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మమత తన బృందంతో కలిసి ఎనిమిదిరోజులపాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వీరంతా బీజింగ్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్, చైనా ప్రభుత్వాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనను నిర్ధారించారు. అయితే.. చైనా విదేశాంగ మంత్రి సాంగ్ తావో మినహా ఇతర సీనియర్ రాజకీయ నాయకులతో మమత భేటీకి చైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. -
బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భాజాపాను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు. ‘మా పార్టీ(టీఎంసీ పార్టీ) బీజేపీలా కాదు. క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా వాళ్లు(బీజేపీ) చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారు’ అంటూ మమతా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బెంగాల్లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కార్యకర్తల అనుమానాదాస్పద మృతులతో ఇరు పార్టీలు ‘రాజకీయ హత్యలు’గా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ టీఎంసీ పార్టీ నేతలను, కార్యకర్తలను బెదిరించారు. గతవారం జల్పైగురిలో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సందర్భంగా ‘రౌడీయిజానికి పాల్పడితే టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తానని, ఎన్కౌంటర్ చేయిస్తానని’ దిలీప్ బహిరంగంగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా ఇలా తీవ్రంగా స్పందించారు. మరోపక్క తీవ్ర వ్యాఖ్యలకుగానూ దిలీప్ క్షమాపణలు చెప్పినప్పటికీ, టీఎంసీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మమతా బెనర్జీ.. దిలీప్ ఘోష్ -
నితీష్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మమత
కొల్కత్తా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నితీష్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని... అందుకు తాను సమ్మతం తెలిపినట్లు తెలిపారు. మరోమారు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు మమతా దీదీ ట్విట్ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గురువారం బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. బీహార్‌లో ప్రస్తుత సీఎం మాంఝీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆదివారం నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. -
సీఎం గొంతు అనుకరించి మోసానికి యత్నించిన మహిళ
బరాసత్: ఫోన్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొంతును అనుకరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ 24-పర్గనాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా.. ఖర్దాకు చెందిన అనన్య బిశ్వా అనే మహిళ ఇద్దరు తృణమాల్ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి తనను మమత బెనర్జీగా చెప్పి, ఆమెలా గొంతు అనుకరించి డబ్బులు అడిగారు. టిటాగఢ్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత చౌదరికి తొలుత ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఖర్దాకు చెందిన మరో సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆ ఫోన్ నెంబర్ అనన్యా బిశ్వాస్‌గా గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.