కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో తన చైనా పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉన్నతస్థాయి నేతలతో రాజకీయ సమావేశాలకుచైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే ఈ భేటీ రద్దు చేసుకున్నట్లు మమత వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మమత తన బృందంతో కలిసి ఎనిమిదిరోజులపాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వీరంతా బీజింగ్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్, చైనా ప్రభుత్వాల ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనను నిర్ధారించారు. అయితే.. చైనా విదేశాంగ మంత్రి సాంగ్ తావో మినహా ఇతర సీనియర్ రాజకీయ నాయకులతో మమత భేటీకి చైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment