mamata banerjeee
-
బెంగాల్లో తొలి వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద, రైల్వే మంత్రి అశ్విని వైశ్ణవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బెంగాల్‌లోని హౌరా నుంచి న్యూజల్పాయ్ గుడి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 564కిలోమీటర్ల దూరాన్ని ఇకపై 7 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. వందేభారత్ రైలు రాకతో ప్రయాణికులకు మూడు గంటల సమయం ఆదా కానుంది. ఈ మార్గంలో బర్సోయ్, మాల్దా, బోల్పూర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వీటిలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాధారణ ప్రయాణికులతో పాటు పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, ఉత్తర బెంగాల్, సిక్కింలోని హిమాలయాలకు చేరుకునే పర్యాటకులు వందేభారత్ రైలులో ప్రయాణించనున్నారు. ఇందులో మొత్తం 16 బోగీలుంటాయి. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. బెంగాల్లో రెండు ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానిస్తున్నఈ రైలుతో ప్రజల జీవన విధానం మరింత సులభతరం అవుతుందని మోదీ పేర్కొన్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
'ముఖ్యమంత్రిని ఆహ్వానించేది ఇలాగేనా?'.. బీజేపీపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. ప్రారంభానికి ఒక రోజు ముందుగా బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్, మేయర్లకు ఆహ్వానాలు పంపారు. అయితే.. మెట్రో స్టేషన్ ఆహ్వానంపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది. "ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో ఆహ్వానం పడేసి వెళ్లారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇలాగేనా?. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఈ మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. అలాంటి వ్యక్తిని మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్. మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవటంపై కోల్‌కతా రైల్ కార్పోరేషన్లో వివాదం చెలరేగింది. అది జరిగిన రెండో రోజు ఆహ్వానాన్ని సీఎం ఇంటికి పంపించినట్లు తెలిసింది. జులై 11న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తారని కోల్‌కతా రైల్ కార్పోరేషన్ గత శనివారం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మమతా బెనర్జీని ఆహ్వానించకుండా కేంద్రం రాజకీయలు చేస్తోందని ఆరోపించింది టీఎంసీ. సీల్దా మెట్రో స్టేషన్ ఎదుట సోమవారం నిరసనలు చేపట్టాలని ముందుగా నిర్ణయించినా.. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది టీఎంసీ. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
ఆమెను వదిలే ప్రసక్తే లేదు.. దీదీ ఆగ్రహం
కోల్‌కతా: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్‌పూర్‌లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె. ఇదిలా ఉంటే.. మంగళవారం అసన్సోల్లో జరిగిన పార్టీ సమావేశంలో పేరు ప్రస్తావించకుండానే బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై దీదీ మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీది మొత్తం తప్పుడు, ఫేక్ ప్రచారం నడిపిస్తోందంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘నేను సోషల్ నెట్‌వర్క్‌లకు అనుకూలం. నిజాలు మాట్లాడే వారి పక్షాన నేను ఉంటా. కానీ, బీజేపీ సోషల్ నెట్వర్క్ మొత్తం ఫేక్‌మయం. మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ సోషల్ మీడియా దిట్ట. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోనూ అబద్ధాలాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఓ నేతను(నూపుర్‌ను ఉద్దేశించి).. కనీసం అరెస్ట్ కూడా చేయనివ్వడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది. వాళ్లు చంపితే.. ఎవరూ మాట్లాడొద్దు. అదే వేరే ఎవరైనా మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా?. జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? తీస్తా ఏం చేశారు?.. మీ దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం అంటూ మండిపడ్డారు ఆమె. మొహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యలతో నూపుర్ శర్మ.. విమర్శలు, కేసులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి కూడా. జూన్ 20వ తేదీన ఆమె కోల్‌కతా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే దాడులు జరుగుతాయేమోననే భయంతో ఆమె బయటకు రావడం లేదు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా.. కోల్‌కతా పోలీసుల సమన్లకు మెయిల్ ద్వారా స్పందించారు ఆమె. తనకు ప్రాణ భయం ఉందంటూ నాలుగు వారాల గడువు కోరింది నూపుర్ శర్మ. Violence and extremism are UNACCEPTABLE, no matter what! I STRONGLY CONDEMN what happened in Udaipur. As law takes its own course of action, I urge everyone to maintain peace. — Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022 -
సజీవదహనం వెనుక కుట్రకోణం
బీర్భూమ్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక గృహదహనాలు జరిగిన రామ్‌పూర్‌హట్ గ్రామాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆధునిక బెంగాల్లో ఇలాంటి అనాగరిక ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మీ కుటుంబ సభ్యులు మరణిస్తే, నా గుండె పిండేసినట్టుందని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఘటన వెనుకాల భారీ కుట్ర ఉందన్న మమత ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. రామ్‌పూర్‌హట్ మారణకాండకు బాధ్యులైన వారిని విడిచిపెట్టమన్న మమత ఈ ఘటనని అడ్డుకోలేకపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. మరోవైపు మృతుల పోస్టుమార్టమ్ నివేదికలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ఎనిమిది మందిని సజీవంగా దహనం చేయడానికి ముందు వారిని బాగా చితక బాదినట్టుగా పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న పలు ఇళ్లకు నిప్పటించి తగుల బెట్టిన ఘటనలో ఎనిమిది కాలిన మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మమతా బెనర్జీ బాధితుల్ని పరామర్శించిన వెంటనే గృహదహనాల వెనుక హస్తం ఉందని అనుమానిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు అనిరుల్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన వెనుకనున్న వాస్తవాలను వెలికి తీయడానికి బీజేపీకి చెందిన కేంద్ర కమిటీలో గ్రామంలో పర్యటిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. -
పెగసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్: మమతా బెనర్జీ
కోల్‌కతా: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు. ‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు. 2017లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. -
మోదీ బలపడుతున్నారంటే.. కాంగ్రెస్‌దే పాపం
పనాజీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని దుయ్యబట్టారు. మోదీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మీరుంటారా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ ఎల్ఐపీ (లెస్ ఇంపార్టెంట్ పర్సన్)గా , వీధిపోరాటాలు చేసే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోలేదు: కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి టీఆర్పీ రేటింగ్లా ఉంది. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేదు. ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలి’’ అని మమత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు. -
బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో కీలుబొమ్మని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏర్పాటు చేయదలిచే ఉమ్మడి పోరాట వేదికలో మమతకు స్థానం కల్పించకూడదన్నారు. మమత ఒక అవిశ్వసనీయ మిత్రురాలని, కాంగ్రెస్‌ను పణంగా పెట్టి జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘అన్నం పెట్టే చేతులను కరవడం ఆమెకు అలవాటు. ప్రతిపక్షాల ఐక్య వేదికకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమె బీజేపీ పంపిన ట్రోజన్‌హార్స్ (శత్రువును మాయ చేసేందుకు గ్రీకులు వాడిన సాధనం). బీజేపీపై యుద్ధంలో ఆమెను నమ్మకూడదు’’ అని అధిర్ విమర్శించారు. తన కుటుంబసభ్యులను, పార్టీ నేతలను సీబీఐ దాడుల నుంచి రక్షించుకునేందుకు మమత ప్రధాని చెప్పినట్లు నడుచుకుంటారని, ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ లక్ష్య సాధనకు పరోక్షంగా సహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతకు టీఎంసీ వెన్నుపోటుదారన్నారు. తొక్కేసి ఎదుగుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్‌ను పణంగా పెట్టి టీఎంసీ ఎదిగిందని, ఇప్పుడు జాతీయవ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు టీఎంసీలో చేరడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది. దీంతో టీఎంసీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని మమత కలలు కంటున్నారని, వారికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉందని అధిర్ చెప్పారు. కాంగెస్ర్ ఉన్నంతకాలం ఆమెను ప్రతిపక్ష ఉమ్మడి నేత కానీయమని, ఇది తెలిసే ఆమె కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించారు. మోదీకి దీటైన నేత రాహుల్ కాదు, మమత అని టీఎంసీ మీడియాలో రావడంపై ఆయన స్పందించారు. వారివి పిచ్చివాళ్ల ఊహలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాహుల్ గాంధీ సమర్ధవంతమైన ప్రతిజోడి అని అధిర్ చెప్పారు. దేశంలో ఇంకా కాంగ్రెస్‌కు 20 శాతం ఓట్ల వాటా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి తప్ప మరే పార్టీకి ఇంత ఓట్ల వాటా లేదన్నారు. అందువల్ల ప్రతిపక్ష ఉమ్మడి నాయకత్వానికి కాంగ్రెస్ సహజ ఎంపికని అభివర్ణించారు. తమ పార్టీ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏర్పడడం కల్ల అని చెప్పారు. పంజాబ్‌లో సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నేడే భవానీపూర్ ఉప ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. -
‘పెళ్లి కాలేదంటున్నావ్.. గర్భవతివి ఎలా అయ్యావ్?’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్ వ్యవహారంపై బెంగాల్ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్.. నుస్రత్ జహాన్ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న ఆమె.. నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ఎంత మోసం.. టీఎంసీ టికెట్ ఇచ్చింది ఆమెకు.. పార్లమెంట్ సాక్షిగా ఆమె తనకు వివాహం అయ్యిందని ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకు వివాహామే కాలేదంటుంది. అయినప్పటికి ఈమె గతంలో సింధూరం ధరించింది.. రథ యాత్రలో పాల్గొంది.. పూజలు చేసింది... ఎన్నికల్లో గెలిచింది. జనాలను ఎంత మోసం చేసింది’’ అంటూ విమర్శించారు. 2019 లో కోల్‌కతాలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ దంపతులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలీప్ ఘోష్ రథయాత్ర గురించి ప్రస్తావిస్తూ.. నుస్రత్ జహాన్‌ను నిందించడమే కాక, 2019 లో నుస్రత్, నిఖిల్ రిసెప్షన్‌కు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా నిందించారు. "వివాహామే చేసుకోలేదని ప్రకటించిన ఓ వ్యక్తి పెళ్లికి మమతా బెనర్జీ ఎలా హాజరయ్యారు. ఆమె తనకు పెళ్లి కాలేదని అంటుంది.. కానీ నుదుటున సింధూరం ధరిస్తుంది.. జనాలు ఆమె గర్భవతి అయ్యిందంటున్నారు. అసలు ఏంటి ఈ మోసం’’ అని ఆయన ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ బుధవారం వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టబద్ధమైనది కాదని, టర్కీలో జరిగిన వారి వివాహానికి భారత చట్టంలో గుర్తింపు లేనందున లైవ్-ఇన్ రిలేషన్ మాత్రమే అని తెలిపారు. కొంతకాలంగా నుస్రత్ జహాన్ నటుడు యష్ దాస్‌గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. చదవండి: భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు వైరల్: పి. మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం... -
మోదీ వర్సెస్ దీదీ: భారీ హైడ్రామా.. ట్విస్టులు
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య కోల్డ్‌వార్ రసవత్తరం. నిన్న తుపానుపై సమీక్ష సమావేశానికి దీదీ అర గంట ఆలస్యం. పావు గంటలోనే తిరుగుముఖం. దీదీ ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని బీజేపీ ఆరోపణ. గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కూడా గరం. సీఎస్‌ను వెనక్కి పంపించేయాంటూ ఆఘమేఘాల మీద ఆదేశాలతో కేంద్రం రివెంజ్!. న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మమతా.. సీఎస్‌తో సహా ఉన్నతాధికారుల్ని కూడా ఉద్దేశ్యపూర్వకంగానే హాజరుకావొద్దని ఆదేశించినట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. నిజానికి నాలుగు రోజుల క్రితమే బందోపాధ్యాయ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించింది కేంద్రం. అయితే తాజా పరిణామాలతో ఆయన్ని వెనక్కి పిలిపించుకోవడంపై ప్రతీకార చర్యగానే మమత ప్రభుత్వం భావిస్తోంది. దిగజారుడుతనమే! సీఎస్‌ను వెనక్కి రావాలన్న కేంద్రం ఆదేశాలపై తృణముల్ ఎంపీ సుఖేందు తీవ్రంగా మండిపడ్డాడు. ‘స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇలా బలవంతంగా ప్రతీకార దేశాలు ఇవ్వడం ఏమిటి? మోదీ షాలు ఇంకెంత దిగజారుతారు. మమత సర్కార్‌కి ఇలాంటి ఆదేశాలిచ్చి ఈ ఇద్దరూ బెంగాల్ ప్రజలు ఘోరంగా అవమానించారు’ అని సుఖేందు వ్యాఖ్యానించాడు. కాగా, ఉన్నతాధికారులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఇదేం కొత్త కాదు. బెంగాల్ ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే అలపన్ బందోపాధ్యాయను రూల్స్ ప్రకారమే కేంద్రం వెనక్కి తీసుకుంటోందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోన్నెల్ అండ్ ట్రైనింగ్ తెలిపింది. ఐఎఎస్ కాడర్ రూల్స్‌లోని సెక్షన్ 6(1) ప్రకారం.. బందోపాధ్యాయను మే 31లోగా రిపోర్టింగ్ చేయాలని సంబంధిత విభాగంలోని ఓ అధికారి వెల్లడించాడు. ఇలా వచ్చి, అలా.. కాగా, ఏరియల్ సర్వే కలైకుందా ఎయిర్‌బేస్‌లో సమీక్ష సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్‌లో ప్రధాని మోదీతో పాటు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగిన తర్వాత ప్రధాని, మమతా బెనర్జీ మధ్య సమావేశం తొలిసారి కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోగా, దీదీ కోసం అంతా 30 నిమిషాల పాటు వేచి చూశారని తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన మమతా వేరే కార్యక్రమాలు ఉన్నందున ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఆ తర్వాత యాస్ తుపాన్ నష్టంపై రిపోర్టులు సమర్పించి.. దిఘాలో జరిగే మీటింగ్ కోసం వెళ్లాలని చెప్పి పావుగంటలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మమతా ఆ సమావేశానికి హాజరుకాలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గరం.. గరం ప్రధానితో సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు పట్ల బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధనకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగం, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారరు. ఇక మమతా బెనర్జీ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది. నియంతృత్వ స్వభావానికి ఇది పరాకాష్ట అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలిసి పనిచేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Mamata Didi’s conduct today is an unfortunate low. Cyclone Yaas has affected several common citizens and the need of the hour is to assist those affected. Sadly, Didi has put arrogance above public welfare and today’s petty behaviour reflects that. — Amit Shah (@AmitShah) May 28, 2021 -
2024 ఎన్నికల్లో ప్రధాని రేసులో దీదీ?
ఇండోర్: ‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియ దని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు. -
వాళ్లు రెచ్చగొడతారేమో.. మీరు రెచ్చిపోకండి
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఎంసీ దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలు పలువురు మృతి చెందడం, గాయపడటం జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడుల ఘటనలపై నివేదిక అందించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రాంతాల్లో బీజేపీ సహా పలు రాజకీ య పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరిగాయనీ, దీనిపై నివేదిక అడిగినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు ట్విట్టర్లో తెలిపారు. బుర్ద్వాన్‌లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల నడుమ ఆది, సోమవారాల్లో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు తమ కార్యకర్తలేనంటూ టీఎంసీ ప్రకటించింది. కాగా, ప్రత్యర్థుల దాడిలో నందిగ్రామ్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయం తగులబడి పోతుండగా, ప్రజలు పరుగులు తీస్తున్నట్లున్న వీడియోను ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దాడుల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తలు నలుగురితోపాటు దుస్తుల దుకాణాన్ని లూటీ చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. తృణమూల్ శ్రేణుల దాడుల్లో తమ పార్టీ మద్దతుదారులు ఆరుగురు చనిపోగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించింది.అయితే మహిళ మరణంపై ఆయన కుమారుడు, స్థానిక బీజేపీ నాయకుడు ఆశిష్ క్షేత్రపాల్ మాట్లాడుతూ..ఉదయం 11 గంటల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఖేలాహోబ్ (ఆట మొదలైంది) నినాదాలు చేస్తూ దాడులకు తెగబడ్డారు. మేం ప్రతిఘటించడంతో టీఎంసీ మద్దతుదారులు పారిపోయి దొడ్డిదారిన నా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న నా కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో నా తల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి అనంతరం మా ప్రాంతానికి చెందిన 17-18 ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారని చెప్పారు. కాగా, హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలంటూ సీఎం మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ కార్యకర్తలు టీఎంసీ మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో రెండు రోజులపాటు మకాం వేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రానున్నారు. చదవండి: పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్, లేదంటే.. -
మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్
కోలకత : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రాజేసింది. బెంగాల్ టీఎంసీ కోటలో పాగా వేయాలని బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల వ్యూహాన్ని రచించింది. అధాకార టీఎంసీ నుంచి కీలక నాయకులను తనపైపు తిప్పుకుని ఎలాగైనా దీదీని దెబ్బకొట్టాలని పావులు కదిపింది. ఈ క్రమంలో మమతకు కీలకమైన నందీగ్రామ్‌నుంచే టీఎంసీ మాజీ మంత్రి సువేందు అధికారిని బీజేపీ తరపున బరిలో నిలిపి గట్టి సవాల్ విసిరింది. దీంతో తాను కూడా నందీగ్రామ్‌నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన దీదీ బీజేపీకి ప్రతిసవాల్ విసిరారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా హోరెత్తించారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్ ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెంగాల్ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతున్న క్రమంలో మమతపై సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. బెంగాలీలు దుర్గా మాత ఆరాధకులంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. (బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: టీఎంసీ జోరు, మమత ఆధిక్యం) కాగా శనివారం ఉదయం ఆరంభమైన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 292 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా 204 స్థానాల్లో లీడ్ లో ఉండి బీజీపీకి ఊహించని షాక్ ఇస్తోంది. ప్రధానంగా నందీగ్రామ్‌లో సీఎం మమత తొలి రౌండ్‌నుంచి సువేందు అధికారి కంటే వెనకబడతూ వచ్చారు. కానీ నాలుగో రౌండ్‌కి వచ్చేసరికి దీదీ ముందుకు దూసుకువచ్చారు. సువేందు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6 వ రౌండ్‌కు 1427 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. Khela Hobe... The game is on pic.twitter.com/sE3VRE5sLJ — Ravi Nair (@t_d_h_nair) May 2, 2021 इतने प्यार से कोई दीदी ओ दीदी बोलेगा , तो दुर्गा माँ तो इनकी इच्छा पूरी करेंगी ही। pic.twitter.com/3y7mhO5jLK — Abhisar Sharma (@abhisar_sharma) May 2, 2021 -
దీదీ మోసం చేశారు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ప్రజలను మోసం చేశారని, అవమానించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. వామపక్ష పాలన తరువాత రాష్ట్రంలో మంచి మార్పు వస్తుందని ఆశించిన ప్రజలను ఆమె మోసం చేశారన్నారు. అవినీతిని, సిండికేట్ రాజ్‌ను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారాన్ని ఆదివారం కోల్‌కతాలో భారీగా జరిగిన ప్రచార సభతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ‘నిజమైన మార్పు’ పిలుపునివ్వగానే సభికులు ఉత్సాహంతో ఒక్కసారిగా నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని, ఉపాధి కల్పనను సాధిస్తామని మోదీ హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ తమకు ‘దీదీ(సోదరి)’గా నిలుస్తారని రాష్ట్రప్రజలు ఆశిస్తే.. ఆమె మాత్రం తన తన మేనల్లుడికి అత్తగా మాత్రమే వ్యవహరించారని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి సీఎం చేయాలనుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులైన పారిశ్రామికవేత్తల కోసమే మోదీ పని చేస్తున్నారన్న విమర్శలను తిప్పికొడుతూ.. ‘భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలు నాకు సన్నిహితులే. వారికోసమే నేను పనిచేస్తాను. బెంగాల్‌లోని నా స్నేహితులకు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. టీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. బెంగాల్‌లోని తేయాకు కార్మికులు నా స్నేహితులే’ అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా బెంగాల్‌కు పరాయివారన్న మమత ప్రచారాన్ని కూడా ప్రధాని తిప్పికొట్టారు. ‘ఇదే బెంగాల్‌కు చెందిన శ్యామా ప్రసాద ముఖర్జీ స్ఫూర్తి పునాదిగా ఏర్పడిన బీజేపీ పరాయిది ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వస్తే అసలైన మార్పు తీసుకువస్తామని, ప్రజలందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. చొరబాట్లను అడ్డుకుంటామని, బుజ్జగిం పు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన దళిత ‘మతువా’ వర్గం వారికి భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు. ‘విద్యార్థులకు మెరుగైన విద్య, యువతకు ఉద్యోగాలు లభించడం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకపోవడమే మేం తీసుకువచ్చే అసలైన మార్పు’ అని వ్యాఖ్యానించారు. భరతమాత ఆశీస్సులతో రాష్ట్రాన్ని ‘బంగారు బంగ్లా’గా మారుస్తామన్నారు. టీఎంసీ ‘ఖేలా హోబె’(ఆట మొదలైంది)’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘టీఎంసీ ఖేలా ఖతమ్..ఔర్ వికాస్ షురూ’(టీఎంసీ ఆట ముగిసింది.. అభివృద్ధి ప్రారంభమైంది) అని వ్యాఖ్యానించారు. మార్పు తీసుకువస్తారన్న ప్రజల ఆశలను మమత, ఆమె పార్టీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్‌లు ఒకవైపు.. రాష్ట్ర ప్రజలు మరోవైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఓటు బ్యాంకు రాజకీయాలను లెఫ్ట్, టీఎంసీ మరింత ముందుకు తీసుకువెళ్లాయని మండిపడ్డారు. మమత హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనమైందని, అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుకున్నారన్నారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోవడం ఖాయమన్నారు. ‘బెంగాల్లో మీరు చేసిన బురదలో కమలం వికసించనుంది’ అని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నినాదం అమ్మ, మట్టి, మనిషి నినాదాన్ని గుర్తు చేస్తూ.. ఆమె పాలనలో రాష్ట్రంలో తల్లులు, కూతుర్లు ఏడవని రోజు లేదని, బెంగాల్ మట్టిలో దళారులు, గూండాలు పెరిగారని, మనుషులు తోటి మనుషుల రక్తాన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను తరలించారు. -
దీదీ వర్సెస్ సువేందు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా బీజేపీ సువేందు అధికారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శనివారం 57 మంది అ«భ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో చోటు దొరికింది. 57 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో తొలి రెండు విడతల్లో జరిగే 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ జాబితా రూపొందించింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన ప్రదర్శనలతో మమత అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్ ఈ సారి ఎన్నికల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేశారు. -
ఫిరాయింపుల జోరు : దీదీకి వరుస షాక్స్
-
దేశ ప్రధాని ముందే అవమానించారు: మమత
పుర్సురా (పశ్చిమబెంగాల్): ‘మీ ఇంటికి ఎవరినైనా పిలిచి అనంతరం వారిని అవమానిస్తారా ? అలాంటి సంప్రదాయం భారత్‌లోగానీ, బెంగాల్‌లోగానీ ఉందా ? నేతాజీ స్లోగన్లను పలికి ఉంటే నేనే వారికి సెల్యూట్ చేసేదాన్ని. కానీ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేసి నన్ను దేశ ప్రధాని ముందే అవమానానికి గురి చేశారు. ఇలా అవమానించడమే బీజేపీ సంస్కృతి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. బెంగాల్‌లోని పుర్సురాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ప్రధాని ఎదుట మమతా ప్రసంగించే సమయంలో కొందరు వ్యక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా, తాను అవమానానికి గురయ్యానంటూ మమత బెనర్జీ వేదిక నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి మత నినాదాలు చేసిన వారికి బెంగాల్ సంస్కృతి తెలియదని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేయాల్సిందిగా బీజేపీ కోరవచ్చని, వారి నుంచి డబ్బు తీసుకొని, ఓటు మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌కు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని బయట నుంచి వచ్చిన పార్టీగా చెబుతూ, భారత్ జలావో పార్టీగా అభివర్ణించారు. వారంతా కావాలంటే తనను అవమానించవచ్చని, కానీ బెంగాల్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నమస్కార్ అనిగానీ, జైశ్రీరాం అనిగానీ అంటే గౌరవాన్ని చూపుతున్నారని అర్థమని చెప్పారు. ఆ నినాదం చేయాల్సిందిగా తామెవరినీ బలవంతం చేయడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం చేస్తే ఎవరూ నొప్పి పుట్టినట్టు భావించాల్సిన అవసరం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. -
మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మమతాకు ఎంత నష్టం? బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. -
షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!
కోల్‌కతా/చండీఘడ్: పశ్చిమ బెంగాల్ సచివాలయ ముట్టడికై ‘‘ఛలో నబన్నా’’ పేరుతో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిక్కు సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య హౌరాలో జరిగిన గురువారం నాటి ఘర్షణలో బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించి, తమ మనోభావాలు గాయపరిచారంటూ మండిపడుతున్నారు. కాగా ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో బెంగాల్ పోలీసులు టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాటిండాకు చెందిన బల్వీందర్ సింగ్ వద్ద తుపాకీ ఉందన్న అనుమానంతో అతడిని కిందపడేసి కొడుతూ టర్బన్ లాగిపడేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిక్కు సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.( చదవండి: బీజేపీ కార్యకర్తలపై దాడి.. దీదీపై నడ్డా ఫైర్) పంజాబ్ సీఎం దిగ్భ్రాంతి ఈ విషయంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, క్రికెటర్ హర్భజన్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తదితరులు స్పందించారు. ‘‘ఇలా జరగాల్సింది కాదు. సిక్కు వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో అతడి టర్బన్ తొలగించిన అమానుష ఘటన పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు’’అంటూ సీఎం అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అదే విధంగా.. ‘‘దయచేసి ఈ విషయంపై విచారణ జరిపించండి. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు’’అని హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా బెంగాల్ ప్రభుత్వాన్ని కోరాడు. ఇక ఇదొక విద్వేషపూరిత దాడి అంటూ బాదల్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బల్వీందర్ సింగ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడని, అతడి వద్ద గన్ ఉందంటూ ఇలాంటి అమానుష చర్యకు దిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. సిక్కులను అవమానపరిచిన పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును ఖండిస్తున్నామని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకటన విడుదల చేశారు. మా డ్యూటీ మేం చేశాం.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు ట్విటర్ వేదికగా శుక్రవారం తమ స్పందన తెలియజేశారు. ‘‘నిన్నటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సదరు వ్యక్తి(బల్వీందర్ సింగ్) ఆయుధాలు కలిగి ఉన్నారు. అతడిని అడ్డుకునే క్రమంలో పగ్రీ(టర్బన్) కిందపడిందే తప్ప, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. మేం అన్ని మతాలను గౌరవిస్తాం. నిజానికి అరెస్టుకు ముందే టర్బన్ ధరించాల్సిందిగా సూచించాం. మా కర్తవ్యానికి కట్టుబడి, శాంతి భద్రతలు కాపాడేందుకు మా డ్యూటీ మేం చేశాం’’అంటూ బల్వీందర్ సింగ్ టర్బన్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేశారు. -
‘దాదా లేని ఢిల్లీని ఊహించలేం’
కోల్‌కతా : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు. దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి : ‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’ It is with deep sorrow I write this. Bharat Ratna Pranab Mukherjee has left us. An era has ended. For decades he was a father figure. From my first win as MP, to being my senior Cabinet colleague, to his becoming President while I was CM...(1/2) — Mamata Banerjee (@MamataOfficial) August 31, 2020 -
రైతులకు ఆసరా : సీఎంకు గవర్నర్ లేఖ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్ కోరారు. 70 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు దక్కకపోవడం గర్హనీయమని, రైతులకు హక్కుగా దక్కాల్సిన రూ 8400 కోట్లను ఇప్పటికే రాష్ట్రం కోల్పోయిందని సీఎం మమతా బెనర్జీకి రాసిన లేఖలో గవర్నర్ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రతిరైతూ ఇప్పటివరకూ 12,000 రూపాయల నగదు పొందగా, రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద వైఖరితో బెంగాల్ రైతులు వారికి దక్కాల్సిన మొత్తాన్ని పొందలేకపోయారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను మీతో పాటు ప్రభుత్వ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువచ్చానని దీదీకి రాసిన లేఖలో గవర్నర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను చేపట్టడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు రైతుల ప్రయోజనాలకు విఘాతమని, రైతులను నష్టాలకు గురిచేయడమేనని వ్యాఖ్యానించారు. దేశమంతటా రైతులు ఇప్పటివరకూ రూ 92,000 కోట్లు నగదు సాయంగా అందుకోగా, రాష్ట్రానికి ఒక రూపాయి కూడా రాలేదని గుర్తుచేశారు. బెంగాల్ రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గవర్నర్ కోరారు. చదవండి : కోల్‌కతాకు ఆరు ప్రాంతాల నుంచి విమానాలు బ్యాన్ -
‘భిన్నత్వంలో ఏకత్వానికి కట్టుబడాలి’
కోల్‌కతా : భారత్‌లో ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఏకత్వంలో భిన్నత్వాన్ని అదే స్ఫూర్తితో మనం తుదిశ్వాస విడిచేవరకూ కొనసాగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగేందుకు కొన్ని గంటల ముందు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లో మమతా బెనర్జీ ఎక్కడా అయోధ్య, రామమందిరం అంశాలను ప్రస్తావించలేదు. దేశంలో హిందూ, ముస్లిం, సిక్కులు సహా అందరూ సోదరభావంతో మెలుగుతారని, మేరా భారత్ మహాన్..మహాన్ హమారా హిందుస్తాన్ అని దీదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రామ మందిర ఉద్యమంపై మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ తొలినుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్ధలంలో మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపైనా మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న క్రమంలో బెంగాల్ అంతటా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించి వేడుక నిర్వహిస్తామని గవర్నర్ జగ్దీష్ దంకర్ తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. చదవండి : కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత -
‘డ్రాగన్‌కు దీటుగా బదులివ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : చైనా యాప్‌ల నిషేధంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కొన్ని యాప్‌లను నిషేధించడం సరిపోదని.. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు మనం దీటుగా స్పందించాలని దీదీ అన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది కేంద్రం నిర్ణయించాలని అన్నారు. మమతా బెనర్జీ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. చైనాపై నిర్ధిష్ట చర్యలు ఎలా ఉండాలో ప్రభుత్వమే నిర్ణయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చైనాకు దీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని దీదీ వ్యాఖ్యానించారు. విదేశాంగ వ్యవహారాల్లో తలదూర్చరాదన్నది తృణమూల్ కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. చైనాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. చదవండి : రైళ్లు, విమానాల సర్వీసులను ఆపేయండి : మమతా -
వాళ్ల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి
కలకత్తా: కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘కరోనా వైరస్ కారణంగా ప్రజలు అధికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున అసంఘటిత కార్మికులతో సహా వలస కూలీలకు ఒకేసారి రూ .10 వేలు అర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకోసం పీఎం కేర్ ఫండ్‌లోని కొంత భాగాన్ని ఉపయోగించాలి కోరుతున్న’ అంటూ మమతా ట్వీట్లో పేర్కొన్నారు. (మళ్లీ తెరుచుకోనున్న అన్ని ప్రార్థనాలయాలు) ఇప్పటికే మహమ్మారి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున తమ రాష్ట్రంలో అంపన్ భీభత్సం సృష్టించిందని మమతా తెలిపారు. ఇటీవల తమ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ తుఫాన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేసింది. ఈ తుఫాన్ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక నష్టంలోకి నెట్టేసింది. ఇటీవల కాలంలో సంభవించిన తుఫాన్లలో అంపన్ చాలా భయంకరమైనది. ఇంతకు ముందేన్నడు ఇలాంటి తుఫాన్ చూడలేదు’ అంటూ దీదీ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తుఫాను కారణం సమస్తం కొల్పోయిన ప్రజలకు పునరావసం కింద తమ ప్రభుత్వం రూ. 1,444 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23.3 లక్షల మంది రైతులతో పాటు ఇళ్లు కొల్పోయిన 5 లక్షల మంది బాధిత ప్రజలకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించినట్లు మమతా వెల్లడించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను) -
లాక్డౌన్ వేళ దీదీ కీలక నిర్ణయం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో సోమవారం నుంచి నిత్యావసర వస్తువులే కాకుండా అన్ని వస్తు సేవల డోర్ డెలివరీని అనుమతిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. దశల వారీగా నియంత్రణలను సడలించి, మే 21 వరకూ జోన్ల వారీగా సడలింపులు ఇచ్చేందుకు కసరత్తు సాగుతోందని ఆమె తెలిపారు. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నామని.. లాక్డౌన్ సడలింపులు సహా వస్తుసేవల హోం డెలివరీపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కోవిడ్-19 వ్యాప్తని అడ్డుకునేందుకు క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పీఎం సలీమ్ లేజాన్ అధికారిగా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో పార్థ ఛటర్జీ, చంద్రిమ భట్టాచార్య, ఫిర్హాద్ హకీం సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. షాపులు తిరిగి తెరుచుకునేందుకు అనుమతించాలని ఉత్తర్వులు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోందని మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర నిర్ణయం కోసం బుధవారం వరకూ తాము వేచిచూస్తామని చెప్పారు. హోం క్వారంటైన్లో ఉండే ప్రజలు బయటకు రావద్దని మే 21 వరకూ మనం జాగ్రత్తగా ఉండాలని దీదీ పేర్కొన్నారు. చదవండి : ‘దీదీ వైరస్‌తో పోరాడుతున్నాం’ -
‘దీదీ మతిస్ధిమితం కోల్పోయారు’
ఇండోర్ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై ఆందోళనలు కొనసాగించాలని విద్యార్ధులకు సలహా ఇస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె మతిస్ధిమితం కోల్పోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ అన్నారు. పౌరచట్టం అమల్లోకి వస్తే చొరబాటుదారులను గుర్తించే పరిస్థితి నెలకొంటుందని, అప్పుడు ఆమె ఓటుబ్యాంక్ (చొరబాటుదార్లు) దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. చొరబాటుదారులను పంపించివేస్తారని ఆమె ఆందోళన చెందుతున్నారని అందుకే మతిస్ధిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసహనంతో వ్యాఖ్యలు చేస్తున్న మమతా బెనర్జీకి తక్షణమే వైద్య పరీక్షలు జరిపించాలని అన్నారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ పౌర చట్టం, ఎన్ఆర్సీలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కొనసాగించాలని విద్యార్ధులకు సూచించిన సంగతి తెలిసిందే. -
అఖిలపక్ష భేటీకి దీదీ దూరం
-
కీలక భేటీకి దీదీ, ఉద్ధవ్‌లు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : ఏకకాల ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బుధవారం జరగనున్న అఖిలపక్ష భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు. ఒకే దేశం..ఒకే ఎన్నికలు అనే అజెండాపై ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా తక్కువ వ్యవధిలో సమావేశం ఏర్పాటు చేసిందని, దీనిపై సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి రాసిన లేఖలో మమతా బెనర్జీ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపై రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల నిపుణులతో పాటు అన్ని పార్టీల సభ్యులతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, ఇంతటి కీలకమైన అంశంపై హడావిడిగా చర్చలు జరపలేమని ఆమె పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ ప్రతిపాదనపై సూచనలు ఆహ్వానిస్తూ నిర్ధిష్ట కాలపరిమితిలో ఈ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ చర్యలు చేపడితే తాము నిర్ధిష్ట సూచనలు అందించే వెసులుబాటు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో అఖిల పక్ష భేటీకి హాజరు కాలేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సమాచారం అందించినట్టు తెలిసింది. శివసేన బుధవారం 53వ వ్యవస్ధాపక దినం జరుపుకుంటున్న క్రమంలో ఆయా కార్యక్రమాల్లో ఉద్ధవ్ థాకరే నిమగ్నం కానున్నారు. మరోవైపు ఏకకాల ఎన్నికలపై సంప్రదింపులు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ప్రధాని మోదీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇక ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విందు ఇవ్వనున్నారు. -
‘ఈవీఎంల్లో గోల్మాల్ ’
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
బీజేపీకి 300 సీట్లు ఖాయం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఓటమికి భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్ కమిటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళిక మీద ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా మీద జరిగిన దాడిని కోర్ కమిటీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. మమతా బెనర్జీ.. ఒక ప్రధాన మంత్రి మోదీని సైతాన్, రౌడీ అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 300 పైగా సీట్లుతో బీజేపీ గెలుస్తుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా సీట్లు, ఓట్లు పెంచుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం మీద.. పోరాటాలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యార్థుల వ్యవహారం లో.. ఉద్యమం కొనసాగుతుంది. త్వరలోనే హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుస్తామని చెప్పారు. -
మోదీ, అమిత్ షాలపై దీదీ ఫైర్
కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మోదీ సిగ్గులేని ప్రధాని అని, అమిత్ షా గూండా అని విమర్శించారు. త్రిపురలో లెనిన్ నుంచి గుజరాత్‌తో అంబేద్కర్ వరకూ విగ్రహాలను కూల్చిన చరిత్ర బీజేపీదేని దుయ్యబట్టారు. ఎన్నికల హింసలో ధ్వంసమైన సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బెంగాల్ వద్ద నిధులు ఉన్నాయని..మీ డబ్బు అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. మీరు 200 సంవత్సరాల బెంగాల్ ఘన వారసత్వాన్ని తిరిగి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. విద్యాసాగర్ విగ్రహాన్ని తృణమూల్ శ్రేణులు కూలదోశాయని నిరూపించగలరా అని మోదీని సవాల్ చేశారు. విగ్రహాలను కూల్చే అలవాటు బీజేపీకే ఉందని దుయ్యబట్టారు. విద్యాసాగర్ విగ్రహాన్ని కాషాయ మూకలు ఎందుకు నేలమట్టం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మందిర్‌బజార్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హింసను ప్రేరేపించేందుకు బీజేపీ నకిలీ వీడియోలను ప్రచారంలో పెడుతోందని ఆరోపించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా తనను నిలువరించలేరని ఆమె సవాల్ విసిరారు. కేంద్ర బలగాలతో డబ్బు పంచడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
‘యూపీలో బీజేపీకి దక్కే స్ధానాలు ఇవే’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల తో కలిసి బీజేపీకి 150 స్ధానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. 2014లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీకి 73 స్ధానాలు దక్కడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. యూపీలో ఈసారి బీజేపీకి 13 నుంచి 17 స్ధానాలు మాత్రమే లభిస్తాయని, ఎస్పీ-బీఎస్పీకి 55 స్ధానాలు వస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. మమతా బెనర్జీ మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్ధానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు సైగం 125-130 స్ధానాలు లభిస్తాయని, ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్ధానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
‘మీరు బెంగాల్లోనే ఉండాలి’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ వద్ద జై శ్రీరాం అంటూ నినదించిన బీజేపీ కార్యకర్తలపై దీదీ మండిపడ్డారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా పల్లవ్పూర్ గ్రామం వద్ద మమతా బెనర్జీ ప్రచార ర్యాలీ ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జై శ్రీరాం నినాదాలు చేస్తున్న కాషాయ పార్టీ శ్రేణులను చూసి ఆమె వాహనం నుంచి దిగిరాగా, బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పరుగున జారుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. తన కాన్వాయ్ వెంబడి నినాదాలు చేస్తున్న వారిని గమనించిన దీదీ కారును ఆపి వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎందుకు పారిపోతున్నారు..ఇక్కడకు రండి అంటూ ఆమె గద్దించారు. రోడ్డుకు ఇరువైపులా గుమికూడిన కొందరు వ్యక్తులు అసభ్య పదజాలం వాడారని ఆరోపించారు. కాగా, ఈ ఘటన అనంతరం పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ బీజేపీ కార్యకర్తల నినాదాలతో తాను భయపడనని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తాము బెంగాల్లోనే ఉండాలన్న సంగతిని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారు మరువరాదని హితవు పలికారు. -
మోదీకి దీదీ ‘స్వీట్’ వార్నింగ్
కోల్‌కతా : మమతా బెనర్జీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం భగ్గుమంటున్నారు. ఈసారి తాను ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని దీదీ ఘాటుగా హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె అసన్సోల్లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రధాని మోదీకి బెంగాల్ రసగుల్లాలు పంపుతుంటానని, కానీ ఈసారి లడ్డులో జీడిపప్పు, బాదం వాడినట్టుగా ఇసుక, గులకరాళ్లతో చేసిన స్వీట్స్ పంపుతానని..దీంతో ఆయన పళ్లు ఊడటం ఖాయమని అన్నారు. ఇక ఇదే పట్టణంలో గతవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోదీ ప్రధాని పదవి వేలం వేయరని దీదీకి చురకలు వేసిన సంగతి తెలిసిందే. కాగా సినీ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ తనకు ఏటా స్వీట్స్, బహుమతులు పంపుతుంటారని, ఆమె ఇప్పుడు కూడా ఏటా రెండు కుర్తాలు పంపుతుంటారని చెప్పడంతో దీదీ దీటుగా బదులిచ్చారు. స్వీట్లు, బహుమతులతో స్వాగతించడం బెంగాల్ సంస్కృతి అని, బెంగాల్లో మోదీకి రసగుల్లాలు దొరుకుతాయి కానీ ఓట్లు కాదని ఆమె ఎద్దేవా చేశారు. -
దీదీ ధర్నాలో పాల్గొన్న అధికారులపై వేటు?
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్రం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ధర్నాలో పాల్గొన్న డీజీపీ వీరేంద్ర, అడిషనల్ డీజీపీ వినీత్ కుమార్ గోయల్, ఏడీజీ అనుజ్ శర్మ సహా ఐదుగురు ఐపీఎస్ అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాయనుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిభావంతమైన సేవలు అందించినందుకు వారికి ఇచ్చిన పతకాలను వెనక్కి తీసుకోవడం, కేంద్ర సర్వీసుల్లో వారిని పనిచేయకుండా నిర్ధిష్టకాలానికి దూరం పెట్టడం వంటి చర్యలూ చేపట్టవచ్చని బావిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలపై మమతా సర్కార్ గుర్రుగా ఉంది. కాగా మమతా ధర్నాలో తాము పాల్గొనలేదని మరికొందరు ఐపీఎస్ అధికారులు వివరణ ఇస్తున్నారు. -
‘యోగిజీ..ముందు యూపీని చక్కదిద్దండి’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో పార్టీ ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు సంసిద్ధమైన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేసే ముందు ఆయన తన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో యోగి హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ముందుగా యూపీపై దృష్టిపెట్టమని యోగిని కోరండంటూ మండిపడ్డారు. ‘యూపీలో ఎంతో మంది అమాయకులను చంపేశారు, పోలీసులనూ హత్య చేశారు. ఎంతో మందిని ఊచకోత కోశారు. సొంత రాష్ట్రంలో ముఖం చెల్లని యోగి బెంగాల్ చుట్టూ తిరుగుతున్నా’రని ఆమె ధ్వజమెత్తారు. మరోవైపు యోగి ఆదిత్యానాథ్ ర్యాలీలకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మంగళవారం ఆయన టెలిఫోన్ ద్వారానే ఆయా వేదికల వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ బృందం దాడులు చేపట్టడాన్ని నిరసిస్తూ ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు. -
విపక్షాల సమరశంఖం
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు విపక్షాలు కలసికట్టుగా సమరశంఖం పూరించాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనాయి. మోదీ ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ముప్పేట దాడి చేశాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్తకంఠంతో నినదించాయి. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విభేదాల్ని పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ర్యాలీకి టీఎంసీ కార్యకర్తలు లక్షల్లో వచ్చారు. కోల్‌కతా విపక్ష సభ సక్సెస్‌కావడంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిలోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వ గడువు తీరింది: మమతా మోదీ ప్రభుత్వంపై ఈ ర్యాలీకి అధ్యక్షత వహించిన మమత నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు రావాలంటే ఢిల్లీలో ప్రభుత్వం మారాలని ఉద్ఘాటించారు. సమష్టి నాయకత్వం గురించి తరచూ మాట్లాడే మోదీ, అమిత్ షాలు బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్‌నాథ్ తదితరులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ, ఆర్బీఐ, ఇతర విచారణ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మొండి బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయని, రఫేల్ లాంటి కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ఏకమవకుంటే అణచివేత తప్పదు: ఖర్గే కాంగ్రెస్ తరఫున హాజరైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. సోనియా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సోనియా, రాహుల్ గాంధీలు ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ‘మోదీ తాను తినకపోయినా తన కార్పొరేట్ స్నేహితులు అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూరుస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. గమ్యస్థానం చాలా దూరం ఉంది. దారి క్లిష్టంగా ఉంది. కానీ మనం అక్కడికి చేరాలి. మన మనసులు కలిసినా కలవకపోయినా, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకుసాగాలి’ అని ఓ హిందీ వాక్యంతో ఖర్గే ప్రసంగాన్ని ముగించారు. ఎలాగైనా బీజేపీని ఓడించాలి: కేజ్రీవాల్ కేంద్రంలో ప్రమాదకర బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ఒక్క సీటు(వారణాసి)నైనా ఎలా గెలుచుకోవాలో బీజేపీకి అర్థం కావడం లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఓ వైపు అవినీతి గురించి మాట్లాడుతూనే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అది అవకాశవాదుల ర్యాలీ: బీజేపీ సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ర్యాలీ.. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న అవకాశవాదుల సమావేశమని బీజేపీ అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ద్వేషంతో ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని నేతలు ఒక చోట చేరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రశ్నించారు. ‘వారు మాట్లాడుతున్న కొత్త ఫ్రంట్ రెండోదా? మూడోదా? తెలియదు. ఈ పార్టీల్లో ఒకరినొకరు తిరస్కరించిన వారున్నారు. యూపీలో కాంగ్రెస్‌ను వద్దనుకున్న ఎస్పీ–బీఎస్పీ ఈ ర్యాలీలో పాల్గొనడం వారి అవకాశవాదాన్ని సూచిస్తోంది’ అని అన్నారు. హాజరైన పార్టీలు, నాయకులు.. తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఎన్సీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఆప్, లోక్తాంత్రిక్ జనతాదళ్, జీజేఎం, ఏఐడీయూఎఫ్, జోరం నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ మిజోరం, జేఎంఎం, పటీదార్ ఆందోళన్ సమితి, శత్రుఘ్న సిన్హా(బీజేపీ), జిగ్నేశ్ మేవానీ(దళిత ఎమ్మెల్యే), అరుణాచల్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్(ఇటీవలే బీజేపీ నుంచి బయటికి వచ్చారు). ఈవీఎం ట్యాంపరింగ్‌పై నలుగురితో కమిటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల పనితీరు, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడంపై సూచనలు చేసేందుకు నలుగురు విపక్ష నాయకులతో కమిటీ ఏర్పాటైంది. దీనిలో అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), అఖిలేశ్(ఎస్పీ), సతీశ్ మిశ్రా(బీఎస్పీ), కేజ్రీవాల్(ఆప్) ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయబోయే ఈ కమిటీ ఎన్నికల సంస్కరణలపై ఈసీకి నివేదిక సమర్పిస్తుందని మమతా చెప్పారు. ఎన్నికలకు వ్యవధి తక్కువ ఉందని, సంస్కరణల్ని ఈసీ వెంటనే చేపట్టాలని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఉన్నపళంగా మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని తాము కోరడం లేదని, కానీ ఓట్ల లెక్కింపునకు వీవీప్యాట్ పద్దతిని విస్తృతం చేయాలని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు దెబ్బేనా? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలను ఒకతాటిపైకి తేవడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం సఫలమైంది. ఇదే స్ఫూర్తితో మహాకూటమి ఏర్పాటు యత్నాలు మరింత ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండానే ప్రాంతీయ పార్టీలు కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చి ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు తమంతట తాము ఏకమవడం కాంగ్రెస్ బలం తగ్గిపోయిందనే సంకేతాన్నిస్తోంది. ఈ కోణంలో చూస్తే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలకు చుక్కాని లేదని, వాటికి ఓ దిశానిర్దేశం లేదని ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల తరువాత ఒప్పందం కుదుర్చోవడానికి గట్టిగానే బేరమాడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా తామెన్ని సీట్లు గెలుస్తామోనని లెక్కలేసుకుంటున్నాయి. కోల్‌కతా ర్యాలీతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రెండు ఫ్రంట్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో కాగా, మరొకటి కాంగ్రెస్ రహిత ఫెడరల్ ఫ్రంట్(వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలసి ఏర్పాటుచేయబోయేది) అని భావిస్తున్నారు. ఇక కోల్‌కతా ర్యాలీ విషయానికి వస్తే..ఇతర నాయకులు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడగా, ఆతిథ్యమిచ్చిన మమతా బెనర్జీ మాత్రం బెంగాలీలో సుమారు అరగంట సేపు ప్రసంగించారు. దీనిని బట్టి రాబోయే మహాకూటమి ర్యాలీల్లో స్థానిక పార్టీనే ఎక్కువ ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగితే ఆప్, చెన్నైలో డీఎంకే ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. శనివారం కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ర్యాలీకి వచ్చిన ముఖ్యనేతలకు భోజనం వడ్డిస్తున్న మమతా బెనర్జీ -
మమత మెగా ర్యాలీ; తమిళనాడులో జీరో అయినట్టే...
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలపగా.. వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), డీఎంకే చీఫ్ స్టాలిన్, బీజేపీ మాజీ మంత్రి అరుణ్ శౌరి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా, బీజేపీ రెబల్ నేత శతృఙ్ఞ సిన్హా, లోక్తంత్ర్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీలో భాగస్వాములయ్యారు. వీరితో పాటుగా పటేల్ హక్కుల నేత హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ వంటి యువ నేతలు కూడా సభ వేదికపై చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే : యశ్వంత్ సిన్హా ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ప్రసంగిస్తూ.. ‘ కేవలం నరేంద్ర మోదీని గద్దె దించేందుకు మేమంతా ఒక్కటి కాలేదు. మోదీ సిద్ధాంతాలకు మాత్రమే మేం వ్యతిరేకం. ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే మేమంతా ఏకతాటిపైకి వచ్చాం’ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రజలను మోసం చేసింది : అరుణ్ శౌరీ ‘బీజేపీలాగా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. కర్ణాటకలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాగే జరగవచ్చు. కాబట్టి నాయకులంతా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, భ్రష్టు పట్టించింది. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి’ అని బీజేపీ మాజీ మంత్రి అరుణ్ శౌరీ పేర్కొన్నారు. మోదీ పాలనలో కశ్మీర్ తగులబడిపోతోంది : ఫరూఖ్ అబ్దుల్లా ‘ఎంతో మంది ప్రాణ త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ రూపంలో దేశానికి మరో పెద్ద ఆపద వచ్చి పడింది. మోదీ పాలనలో కశ్మీర్ తగులబడిపోతోంది. మతం పేరుతో దేశాన్ని విభజిస్తున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు నేతలు బలిదానాలకు సిద్ధం కావాలి. ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు గెలవాలంటే ఈవీఎంలను నిషేధించాలి. మళ్లీ పేపర్ బ్యాలెట్ నమూనా ప్రవేశపెట్టాలి. ప్రధాని ఎవరు కావాలన్నది ప్రస్తుతానికి వదిలేద్దాం. ముందు బీజేపీని గద్దె దించుదాం’ అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మోదీని ఇంటికి సాగనంపాలి : స్టాలిన్ డీఎంకే చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ.. ‘స్వాత్రంత్యం కోసం ఇది మరో పోరాటం. బీజేపీని గద్దె దింపాలి. మోదీని ఇంటికి సాగనంపాలి. మనమంతా ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది’ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారు : జిగ్నేష్ మేవానీ ‘బీజేపీ పాలనలో యువత, రైతులు, దళితులు, ఆదివాసీలు, పేదలు ఇలా అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారు. దళితులపై అకృత్యాలు పెరిగాయి. బీజేపీ- ఆరెస్సెస్ అరాచక సిద్ధాంతాలను అంతమొందించేందుకు మమతా దీదీ బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మహా కూటమి అధికారంలోకి రాగానే సెక్యులర్ భావజాలాన్ని పెంచి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. అందుకోసం మనమంతా కలిసి ఒకటిగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ వ్యాఖ్యానించారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : అఖిలేశ్ యాదవ్ ‘బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది. ప్రతిపక్షాలను భయపట్టేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలతో దోస్తీ కడితే.. మేం ప్రజలతో కలిసి కూటమిగా ఏర్పడుతున్నాం. తమిళనాడులో బీజేపీ జీరో అయినట్టే మిగతా రాష్ట్రాల్లో కూడా కావాలి’ అని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ అన్నారు. మోదీ ఐదేళ్లలోనే చేసి చూపించారు: కేజ్రీవాల్ భారతదేశాన్ని విడగొట్టాలని పాకిస్తాన్ 70 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ ప్రధాని మోదీ కేవలం ఐదేళ్లలోనే దేశాన్ని విడగొట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టి కుల, మత ప్రాతిపదికన ప్రజలను విడదీశారు. మోదీ- అమిత్ షాలను తరిమికొట్టేందుకే సమూహంగా ఏర్పడ్డాం. -
స్త్రీలోక సంచారం
2014 మే 5 – 2016 సెప్టెంబర్ 23 మధ్య కాలంలో తనపై అనేకసార్లు అత్యాచారం జరిపినట్లు కేరళ నన్ ఒకరు జలంధర్‌లోని క్యాథలిక్ చర్చి బిషప్ జేమ్స్ ఫ్రాంకో ములక్కల్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, ఇంతవరకు ఆయనను అరెస్టు చెయ్యకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా.. కేరళలోని పూంజర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే పి.సి.జార్జి ఒక ప్రెస్మీట్లో.. బాధితురాలైన ఆ నన్ను ‘వ్యభిచారి’ అని అంటూ.. ‘‘తనపై బిషప్ 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని చెబుతున్న ఆ మనిషి.. పన్నెండుసార్లలో ఒక్కసారైనా ఫిర్యాదు చేయకుండా, పదమూడోసారి మాత్రమే పెదవి విప్పడాన్ని బట్టి చూస్తే ఆమె గుణం లేని మనిషి అని స్పష్టం అవుతోందని’’ అనడంపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 20లోగా కమిషన్ ముందు హాజరుకావాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా స్పందించిన పి.సి.జార్జి, ‘ఎన్నికైన ప్రజా ప్రతినిధినైన నాకు ఎవరి ఎదుటా హాజరు కావలసిన అవసరం లేదు’ అని అనడం మరో వివాదం అయింది. ఢిల్లీలోని తన ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియోలో చాట్ చేస్తూ, ఆ తర్వాత ‘రష్యన్ రౌలత్’ ఆడుతూ, తన టర్న్ వచ్చినప్పుడు తుపాకీని కణతలకు గురిపెట్టుకుని కాల్చుకోవడంతో కుప్పకూలిపోయిన కరిష్మా యాదవ్ అనే గ్వాలియర్ యువతి, ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది. రివాల్వర్‌లోని ఆరు చాంబర్స్‌లో ఐదింటిని ఖాళీగా ఉంచి, ఒక దాంట్లో బులెట్ పెట్టి, చాంబర్‌ని గిర్రున తిప్పి కణతల దగ్గర పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కే అతి ప్రమాదకరమైన ‘రష్యన్ రౌల™Œ ’ ఆటను ఆడుతుండగా, కర్మిషా తన వంతు రాగానే.. ‘‘దేఖ్తే హై కిస్మత్ మే క్యా లిఖా హై’’ (చూద్దాం ఏం రాసిపెట్టి ఉందో) అని తన ఫ్రెండ్‌తో అంటూ ట్రిగ్గర్ నొక్కడంతో కణతల్లోకి బులెట్ దిగి మరణించిందని పోలీసులు వెల్లడించారు. 1975లో ఒక స్థల వివాదంలో తన ఆస్తిని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ జప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, సివిల్ కోర్టులో రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి, కేసు గెలిచిన గంగా దేవి అనే 27 ఏళ్ల మహిళ.. విచారణ సమయంలో కోర్టు ఫీజుగా చెల్లించిన 312 రూపాయల రసీదును కోర్టువారు పోగొట్టిన కారణంగా, రెండోసారి చెల్లించడానికి ఆమె నిరాకరించినందుకు వల్ల.. నిబంధనల ప్రకారం గెలుపు ఉత్తర్వుల జారీకి ఫీజు రసీదును జత చేసే పరిస్థితి లేకపోవడంతో.. తీర్పు అలా 41 ఏళ్ల పాటు గాలిలో ఉండి, చివరికి ఈ ఏడాది ఆగస్టు 31న మీర్జాపూర్ సివిల్ జడ్జి లవ్లీ జైస్వాల్ చొరవతో విముక్తి పొంది, గంగాదేవి ‘గెలుపు తీర్పు’ కాపీ బయటికి వచ్చింది! అయితే.. ఇన్నేళ్లలోనూ 11 మంది జడ్జీ్జల చేతులు మారిన ఈ ‘తీర్పు’ ప్రతిని అందుకోడానికి లేకుండా, 2005లోనే గంగాదేవి మరణించిన విషయం ఆలస్యంగా కోర్టు దృష్టికి వచ్చింది. కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతుల వల్ల కళాకారులు మారిపోరని, వారి చుట్టూ ఉన్న ప్రపంచమే వారిని చూసే విధానాన్ని మార్చుకుంటుందని 32 ఏళ్ల అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా అన్నారు. అక్టోబర్ 5న విడుదల అవుతున్న హాలీవుడ్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’తో నటిగా పరిచయం అవుతున్న లేడీ గాగా.. చిత్రం ప్రివ్యూ సందర్భంగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పేరుప్రతిష్టల వంటి అసహజమైన విషయాలకు దూరంగా ఉండే క్రమంలో.. నిత్య జీవితంలో కళాకారులు చేసే పోరాటాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ‘వారు కూడా మనలా సాధారణమైన వ్యక్తులే’ అన్న విధంగా ఈ ప్రపంచం తనను అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేయడం విశేష ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ మూవీ మొఘల్.. హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను సుప్రసిద్ధులైన కొందరు సీనియర్ నటీమణులు ధైర్యంగా బయటపెట్టడంతో ఏడాది క్రితం ఊపిరి పోసుకున్న ‘మీ టూ’ ఉద్యమం తాజాగా మరో ప్రముఖుడి లైంగిక అకృత్యాలను బట్టబయలు చేసింది. అమెరికన్ టెలివిజన్ దిగ్గజం ‘సి.బి.ఎస్. కార్పొరేషన్’ చైర్మన్ లెస్లీ మూన్వెస్ మొత్తం 12 మందితో మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని.. ముఖరతికి బలవంత పెట్టడం, దేహంలో గోప్యమైన ప్రదేశాలను తాకడం, నిరాకరించినవారిపై కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవడం వంటì ఆరోపణలు ఆయనపై ఉన్నాయని ‘న్యూయార్క్‌ర్’ మ్యాగజీన్ ఆదివారం నాడు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన వెంటనే లెస్లీ మూన్వెస్ను చైర్మన్ పదవి నుంచి సి.బి.ఎస్. తొలగించింది. ఈజిప్టు నుంచి వలస వచ్చిన ఒక హోటల్ ఉద్యోగి.. మక్కాలోని గుర్తు తెలియని ఒక హోటల్లో తన సహోద్యోగి అయిన సౌదీ మహిళతో ఒకే టేబుల్‌పై కలిసి కూర్చొని ఉదయం అల్పాహారం తీసుకుంటున్న దృశ్యాన్ని.. వైరల్ అవుతున్న ఒక వీడియోలో చూసిన సౌదీ అరేబియా అధికారులు అతడు ఎక్కడున్నదీ కనిపెట్టి అరెస్టు చేశారు. వీడియోలో ఒక చోట ఆ మహిళ అతడికి తినిపించడం, కెమెరా వైపు చూస్తూ చేయి ఊపడం వంటి వాటిని కూడా తీవ్రంగా పరిగణించిన సౌదీ అధికారులు.. వారిపై తామేమి చర్యలు తీసుకుంటున్నదీ మీడియాకు బహిర్గతం చేయలేదు. మిస్ అమెరికా’ నిర్వాహకులు.. స్విమ్ సూట్ రౌండ్‌ను రద్దు చేశాక తొలిసారి జరిగిన అందాల పోటీలలో.. ‘మిస్ అమెరికా 2019 టైటిల్’ను మిస్ న్యూయార్క్ నియా ఫ్రాంక్లిన్ గెలుచుకున్నారు. నిరుటి అందాల రాణి క్యారా మండ్ తన శిరస్సుకు కిరీటాన్ని తొడుగుతున్నప్పుడు ఉద్వేగానికి లోనైన నియా ఫ్రాంక్లిన్.. ‘స్విమ్‌సూట్ రౌండ్లో పాల్గొనకుండా తొలిసారి టైటిల్ గెలుచుకున్న సంతోషం తనను నిలవనివ్వడం లేదనీ, ఆ రౌండ్ లేకపోవడం వల్ల తను మరికాస్త ఎక్కువగా ఆహారాన్ని తీసుకునేందుకు వీలుకలిగిందని’ గలగలా నవ్వుతూ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది కూడా దుర్గామాత ఉత్సవాల కోసం ఒక థీమ్ సాంగ్ రాశారు. మంత్రివర్గ సహచరుడైన అరూప్ బిస్వాస్ అభ్యర్థన మేరకు, ఆయన నేతృత్వంలో యేటా ఉత్సవాలను నిర్వహిస్తుండే ‘సురుచి సంఘ్’ కోసం ‘జ దేవి సర్వభూతేశు’ అంటూ మమత రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అయిన ఇంద్రనీల్ సేన్ ఆలపించారు. -
దమ్ముంటే అరెస్టు చేసుకోండి!
న్యూఢిల్లీ/కోల్‌కతా: బీజేపీ చీఫ్ అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు. భారత్–బంగ్లా స్నేహానికి ఇబ్బంది! సరైన ఓటర్లను ఎన్నార్సీలో కలపకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయం చేస్తోందని మమత విమర్శించారు. రేపు తననూ చొరబాటుదారు అంటారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టారనే జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. అదృష్టవశాత్తూ నా వద్ద ఆ పత్రాలున్నాయి. కానీ నా తల్లిదండ్రులకు లేవని నన్ను చొరబాటుదారు అంటారేమో?’ అని మమత ఎద్దేవా చేశారు. ‘2019లో విపక్షాలు ఏకమవుతాయి. బీజేపీ పని అయిపోయినట్లే’ అని ఆమె అన్నారు. ‘నన్ను బీజేపీ ఆపలేదు. నేను వారి పనిమనిషిని కాను’ అని∙ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కున్న సత్సంబంధాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని.. విపక్షాలన్నీ కలిసే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటాయన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా వైఎస్సార్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ సహా పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీ నేత అడ్వాణీ, బీజేపీ నుంచి సస్పెండైన కీర్తీ ఆజాద్‌లను కలిశారు. ఎన్నార్సీపై రచ్చ అస్సాం ఎన్నార్సీ విషయంలో పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సహా పలువురు ఎంపీలు ఈ డిమాండ్‌తో సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే రికార్డులను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఎంపీలకు భరోసా ఇచ్చారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గకపోవడంలో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ తృణమూల్ ఎంపీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
మోదీ, అమిత్ షాలకు టీఎంసీ కౌంటర్
కోల్‌కతా : బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మమత సర్కారును విమర్శిస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా గురువారం పురూలియాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘శుభ్రమైన తాగునీరు, విద్యుత్, రేషన్ వంటి మౌలిక వసతులు కల్పించడంలో మమత సర్కారు విఫలమైంది. బెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరని’ విమర్శిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. అయితే గ్రామాల విద్యుదీకరణలో సాధించిన పురోగతిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ... ‘ ఏప్రిల్28, 2018 చరిత్రలో నిలిచిపోయే రోజు. భారత్‌లోని ప్రతీ గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ భారతీయుడు ఆనందంగా జీవించేందుకు నిబద్దతతో మేము చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, మోదీ ట్వీట్లను ఉటంకిస్తూ.. ‘ రెండు ట్వీట్లు. ఒకటేమో భారత ప్రధాని, మరొకటి బీజేపీ అధ్యక్షుడు చేశారు. విద్యుదీకరణ అంశంపై వీరిద్దరిలో ఒకరు అబద్దం చెబుతున్నట్లు అర్థమవుతోంది కదా’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో పోస్ట్ చేసింది. Addressed a huge public meeting in Purulia (WB). Mamata govt has failed on all fronts & people don’t have access to even basic facilities like clean drinking water, electricity & ration. No development has taken place for the common people but only goons of TMC have flourished. pic.twitter.com/xSLRdcZcJs — Amit Shah (@AmitShah) June 28, 2018 28th April 2018 will be remembered as a historic day in the development journey of India. Yesterday, we fulfilled a commitment due to which the lives of several Indians will be transformed forever! I am delighted that every single village of India now has access to electricity. — Narendra Modi (@narendramodi) April 29, 2018 -
మమత చైనా పర్యటన రద్దు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో తన చైనా పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉన్నతస్థాయి నేతలతో రాజకీయ సమావేశాలకుచైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే ఈ భేటీ రద్దు చేసుకున్నట్లు మమత వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మమత తన బృందంతో కలిసి ఎనిమిదిరోజులపాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వీరంతా బీజింగ్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్, చైనా ప్రభుత్వాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనను నిర్ధారించారు. అయితే.. చైనా విదేశాంగ మంత్రి సాంగ్ తావో మినహా ఇతర సీనియర్ రాజకీయ నాయకులతో మమత భేటీకి చైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. -
మమత, అహ్మద్ పటేల్ భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. చాణక్యపురిలోని బంగ్లా భవన్‌కు చేరుకున్న పటేల్.. మమతతో విపక్ష పార్టీల ఏకీకరణపై చర్చించారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సోనియా గాంధీ సూచనల మేరకే పటేల్, మమత భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేయడంలో మమత కీలకపాత్ర వహిస్తున్నారు. ఇందులో భాగం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ భేటీలో చర్చించారు’ అని తృణమూల్ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నప్పటికీ.. వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీశ్ వస్తే మళ్లీ చేర్చుకుంటాం: కాంగ్రెస్ బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఆయనను మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ అన్నారు. 2013లో నరేంద్రమోదీని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక జేడీయూ తన 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. 2015 బిహార్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమి ఏర్పాటు చేసి గెలిచి, మళ్లీ 2017లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేతో చేతులు కలిపింది. 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, జేడీయూల మధ్య సయోధ్య లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గోహిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్‌తో విభేదాలు లేవు : మమత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో తనకెలాంటి విభేదాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆమె భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మమత మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నాకెలాంటి సమస్యలు లేవు. ఆయన్ని త్వరలోనే కలుస్తా. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుపడగానే వెళ్లి వాళ్లతో మాట్లాడ్తా’ అని మమతా పేర్కొన్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్ ఫ్రంట్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీలో అఖిలేశ్-మాయావతిలు ఏకం కావాలని ఆమె కోరారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని మమత జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆమె నేడు శరద్ పవార్, శివసేన, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. రేపు కూడా ఆమె పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హాలను కూడా ఆమె కలవబోతుండటం విశేషం. -
ఆమె సూపర్ ఫాస్ట్ గురూ!
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలు ప్రకటించి మినీ సార్వత్రిక సంగ్రామానికి తెరతీశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. ఆయన అలా తేదీలు ప్రకటించారో.. లేదో, అదేరోజు సాయంత్రం తమ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు కూడా పశ్చిమబెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి తేదీలను ప్రకటించారు. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లో టీఎంసీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా అసలు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మమతమ్మ మాత్రం పెద్ద ఫైలు పట్టుకుని సాయంత్రం మీడియాను పిలిచి మొత్తం అన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. దాంతో ప్రత్యర్థులు సహా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇంత ప్రిపరేషన్ ఉండటం అసాధ్యమని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత కేవలం మమతకే దక్కుతుందని అంటున్నారు. వరుసగా రెండోసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయకేతనం ఎగరేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా దీదీ ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉంటే.. ఇక ప్రత్యర్థి పార్టీలు కోలుకోవడం కష్టంలాగే కనిపిస్తోంది. కమ్యూనిస్టులు సహా మరే ఇతర పార్టీ ఇంకా అసలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తులు మొదలుపెట్టక ముందే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటే.. వాళ్లకు చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో విజయావకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ మహా ఫాస్ట్ అని చెబుతారు. మరీ ఇంత ఫాస్టా అని మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట.