మోదీ, అమిత్‌ షాలకు టీఎంసీ కౌంటర్‌ | TMC Questions PM Modi And Amit Shah Contradictory Tweets On Village Electrification | Sakshi
Sakshi News home page

‘వీరిలో ఒకరు అబద్ధం చెబుతున్నట్లే కదా..’

Published Sat, Jun 30 2018 10:41 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

TMC Questions PM Modi And Amit Shah Contradictory Tweets On Village Electrification - Sakshi

కోల్‌కతా : బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మమత సర్కారును విమర్శిస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ ద్వారా సమాధానమిచ్చింది.

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా గురువారం పురూలియాలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘శుభ్రమైన తాగునీరు, విద్యుత్‌, రేషన్‌ వంటి మౌలిక వసతులు కల్పించడంలో మమత సర్కారు విఫలమైంది. బెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరని’ విమర్శిస్తూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

అయితే గ్రామాల విద్యుదీకరణలో సాధించిన పురోగతిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ... ‘ ఏప్రిల్‌28, 2018 చరిత్రలో నిలిచిపోయే రోజు. భారత్‌లోని ప్రతీ గ్రామంలో విద్యుత్‌ వెలుగులు నింపడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ భారతీయుడు ఆనందంగా జీవించేందుకు నిబద్దతతో మేము చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా అమిత్‌ షా, మోదీ ట్వీట్లను ఉటంకిస్తూ.. ‘ రెండు ట్వీట్లు. ఒకటేమో భారత ప్రధాని, మరొకటి బీజేపీ అధ్యక్షుడు చేశారు. విద్యుదీకరణ అంశంపై వీరిద్దరిలో ఒకరు అబద్దం చెబుతున్నట్లు అర్థమవుతోంది కదా’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement