సాక్షి, న్యూఢిల్లీ : భారత భూభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న వేళ రాహుల్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవుపలికారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌పై ట్విటర్ వేదికగా అమిత్ షా ఫైర్ అయ్యారు. (చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు)
కాగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర చేసిన ప్రకటనపై రాహుల్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చైనా దురాక్రమణకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ ధ్వజమెత్తారు. తాజా అంశంపై ఇరు నేతల మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. దీనికి తోడు ఇరు పార్టీల అభిమానులు, కార్యకర్తలు సైతం కామెంట్లు చేస్తూ ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment