ఢిల్లీ : మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదికగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా దురాక్రమణకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. మన భూభాగాన్ని చైనాకు ప్రధాని మోదీ అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనాదే అయితే, మరి మన సైనికుల్ని ఎందుకు చంపారని ఆయన అడిగారు. అలా అయితే భారతీయ సైనికుల్ని ఏ ప్రాంతంలో చంపారో చెప్పాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. (మన సరిహద్దు క్షేమం)
జూన్ 15న లద్ధాఖ్‌లో గాల్వన్ లోయలో సరిహద్దు వివాదంలో తలెత్తిన ఘర్షణలో భారత్‌కు చెందిన కల్నల్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం అఖిలపక్ష భేటీలో మోదీ మాట్లాడుతూ.. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు.
PM has surrendered Indian territory to Chinese aggression.
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD
Comments
Please login to add a commentAdd a comment