కలకత్తా: కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘కరోనా వైరస్ కారణంగా ప్రజలు అధికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున అసంఘటిత కార్మికులతో సహా వలస కూలీలకు ఒకేసారి రూ .10 వేలు అర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకోసం పీఎం కేర్ ఫండ్‌లోని కొంత భాగాన్ని ఉపయోగించాలి కోరుతున్న’ అంటూ మమతా ట్వీట్‌లో పేర్కొన్నారు. (మళ్లీ తెరుచుకోనున్న అన్ని ప్రార్థనాలయాలు)
ఇప్పటికే మహమ్మారి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున తమ రాష్ట్రంలో అంపన్ భీభత్సం సృష్టించిందని మమతా తెలిపారు. ఇటీవల తమ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ తుఫాన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేసింది. ఈ తుఫాన్ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక నష్టంలోకి నెట్టేసింది. ఇటీవల కాలంలో సంభవించిన తుఫాన్‌లలో అంపన్ చాలా భయంకరమైనది. ఇంతకు ముందేన్నడు ఇలాంటి తుఫాన్ చూడలేదు’ అంటూ దీదీ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తుఫాను కారణం సమస్తం కొల్పోయిన ప్రజలకు పునరావసం కింద తమ ప్రభుత్వం రూ. 1,444 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప‍్తంగా 23.3 లక్షల మంది రైతులతో పాటు ఇళ్లు కొల్పోయిన 5 లక్షల మంది బాధిత ప్రజలకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించినట్లు మమతా వెల్లడించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను)
Comments
Please login to add a commentAdd a comment