PM CARES Fund
-
పీఎం కేర్.. చిల్డ్రన్ వెల్ఫేర్
కలెక్టర్ల నుంచి సేకరించి.. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల వివరాలను రాష్ట్రాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పీఎం కేర్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసినట్టు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం కేర్ పోర్టల్‌లో కోవిడ్–19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 4,532 మంది నమోదైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 855 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. పీఎం కేర్ పోర్టల్‌లో నమోదైన 4,532 మంది పిల్లలకు 18 సంవత్సరాలు నిండాక ప్రతి బిడ్డకు రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్‌లో కార్పస్ ఫండ్ కింద జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 10 లక్షల కార్పస్‌ను పెట్టుబడి పెట్టడం ద్వారా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య పిల్లలలకు నెలవారీ స్టైఫండ్‌ను ఇస్తారని, 23 సంవత్సరాల నిండిన తరువాత రూ.10 లక్షలు మంజూరు చేస్తారని వెల్లడించారు. బందువుల దగ్గర ఉంటున్న 18 ఏళ్లలోపు పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ, ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కలి్పస్తుందని మంత్రి తెలిపారు. ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు ఇచి్చనట్టు పేర్కొన్నారు. పూర్తి ఫీజు మినహాయింపుతో.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా 10 మంది చొప్పున చేర్చు కుంటున్నారు. ఆ పిల్లలకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఉంది. స్కూల్‌కు వెళ్లే పిల్లలందరికీ స్కాలర్íÙప్ కింద రూ.20 వేల చొప్పున ఇస్తారు. వీరంతా ఆయుష్మాన్ భారత్–ప్ర«దానమంత్రి జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో నమోదయ్యారు. వారికి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను బాలస్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ కేటగిరీలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,82,2671 మంది పిల్లలు నమోదయ్యారు. వీరి సంరక్షణ, విద్య, ఆరోగ్య బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మిషన్ వాత్సల్య పథకం కింద, పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా వారి సంరక్షణ చర్యలను చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా ఒడిశాలో 34,160 మంది, మహారాష్ట్రలో 27,302 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19,437 మంది, తమిళనాడులో 15,395 మంది, గుజరాత్లో 13,802 మంది, మధ్యప్రదేశ్‌లో 11,413 మంది ఉన్నారు. -
‘పీఎం కేర్స్’ ట్రస్టీలుగా రతన్ టాటా, సుప్రీం మాజీ జడ్జి
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురు ప్రముఖల పేర్లను నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా పలువురు ఉన్నారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది కేంద్రం. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన మరుసటి రోజునే ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ‘పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్గతంగా భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.’ అని ఓ ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ఇతర ట్రస్టీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలు ఉన్నారు. మరోవైపు.. పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షాలను నామినేట్ చేసింది కేంద్రం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన క్రమంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని ఎక్స్ అఫీసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన వారందరికీ పన్ను మినహాయింపు వర్తింపుజేశారు. అలాగే.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు గత ఏడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4వేలకుపైగా చిన్నారుకు ఈ నిధి ద్వారా సాయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదీ చదవండి: పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక -
కోవిడ్ బాధిత బాలలకు ప్రభుత్వం అండ
సాక్షి,శ్రీకాకుళం: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయులుగా మారిన బాలలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. కోవిడ్ బాధిత చిన్నారుల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వా రా అందించే సంక్షేమాల గురించి ఆయన సోమ వారం వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ వివరించారు. జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వర తుడు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, శాసన మండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సమగ్ర సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ఏర్పాటు చేశారని తెలిపారు. కలెక్టరేట్లో వర్చువల్ విధానంలో పీఎం ప్రసంగం వి న్న అనంతరం ఆయన మాట్లాడారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం ఈ పథకం లక్ష్యమని తెలిపా రు. ఇలాంటి పిల్లలను గుర్తించాక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీబ్ల్యూసీ) ముందు హాజరు పరిచామని, వారు వివరాలను ధ్రువీకరించాక పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పోర్టల్‌లో పిల్లల వివరాలతో పాటు డీఎం పరిశీలన కోసం అప్లోడ్ చేస్తారన్నారు. జిల్లాలో ఇలాంటి చిన్నారులు తొమ్మిది మంది ఉన్నారని, వారి గురించి ఒక్కొక్కరికి ఒక్కో ఫోల్డర్ కేటాయించామని తెలిపారు. అందులో పోస్టాఫీసు పాస్ బుక్, ముఖ్య మంత్రి సందేశ పత్రం, ధ్రువీకరణ పత్రం ఉంటాయన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య ను అందించడంతోపాటు పుస్తకాలు, దుస్తులు కూ డా అందిస్తామన్నారు. నెలవారీ స్టై ఫండ్ రూపంలో రూ.4000లు వరకు అందజేస్తామన్నారు. ఈ పథకాలు పొందేందుకు పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ అందరికీ బాధ్యత తీసుకుంటారని పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ ఇలాంటి చిన్నారులు ఏ సమస్య వచ్చి నా తనను సంప్రదించాలన్నారు. సమస్యలు గ్రీవెన్స్‌కు తెలియజేస్తే 15 రోజులు లేదా నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా సమస్యలు తెలియజేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చె ప్పారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ పథకం మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి విశ్వేశ్వర తుడుని కలెక్టర్, ఎస్పీ దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
కోవిడ్ అనాథ పిల్లలను ఆదుకుంటున్నఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఏపీ మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.సిరి తెలిపారు. పీఎం కేర్స్‌లో కేంద్రం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల సంక్షేమం, సహాయం విషయమై సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం కేర్స్‌కు అర్హులైన పిల్లలను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ పలు సూచనలు చేశారని సిరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధిత పిల్లలకు 23 సంవత్సరాల వయసు వచ్చేవరకు వారి సంరక్షణ, ప్రయోజనాలు కాపాడటం జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ఎక్స్‌గ్రేషియా అందుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 351 మంది పిల్లలను అర్హులుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. వారిలో ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 56 మంది, తూర్పుగోదావరి 45, అనంతపురం 40, విశాఖపట్నంలో 39, కృష్ణా 28, వైఎస్సార్ 25, గుంటూరు 24, నెల్లూరు 24, చిత్తూరు 21, కర్నూలు 16, ప్రకాశం 16, శ్రీకాకుళం 9, విజయనగరం జిల్లాలో 8 మంది అర్హులు ఉన్నారని వివరించారు. పీఎం కేర్స్‌లో ఆర్థిక సహాయంతోపాటు పిల్లల ఉన్నతవిద్యకు ఏడాదికి రూ.50 వేలు స్కాలర్షిప్ ఇస్తారని తెలిపారు. పాఠశాల విద్య కోసం కేజీబీవీ, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 12వ తరగతి వరకు పాఠశాలకు వెళ్లే పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేల ప్రత్యేక స్కాలర్షిప్ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి ఇస్తారని తెలిపారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జాయ్)లో ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుందని తెలిపారు. వారిలో 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం డిపాజిట్ చేసిన రూ.10 లక్షల మొత్తాన్ని పిల్లలు 23 సంవత్సరాల వయసు నిండాకే అందుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు ఉంటే వెబ్సైట్: https://pmcaresforchildren. in/.లో తెలపాలని సూచించారు. వాటిని జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. 15 రోజుల కంటే ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంటే ఉన్నతస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. -
వేగవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్: మోదీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని తట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత సహకారంతో ఈ మహమ్మారిని భారత్ ఎదుర్కొంది. భారత్ ప్రపంచానికి సమస్యగా మారకుండా, కరోనా సమస్యకు సొంతంగా పరిష్కారం చూపిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు కోవిడ్ నివారణ ఔషధాలు, టీకాలను అందజేసిందని తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం ప్రయోజనాలను మోదీ సోమవారం విడుదల చేశారు. పథకం పాస్ బుక్కులను, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఊహించనంతటి అభివృద్ధిని ఎనిమిదేళ్లలోనే భారత్ సాధించింది. ప్రపంచ వేదికలపై మన ప్రభావం, పలుకుబడి పెరిగాయి’అన్నారు. చిన్నారుల రోజువారీ అవసరాల నిమిత్తం నెలనెలా రూ.4 వేల అందజేస్తామని చెప్పారు. వారికి 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలు అందించడంతోపాటు ఆయుష్మాన్ కార్డు, సైకలాజికల్ కౌన్సెలింగ్ సదుపాయాలున్నట్టు చెప్పారు. వృత్తివిద్యా కోర్సులకు, ఉన్నత విద్యకు విద్యారుణాలూ అందజేస్తామని ప్రకటించారు. పీఎం కేర్స్ పథకం కింద విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి పూర్తయ్యేదాకా వారి ఖాతాల్లో నేరుగా స్కాలర్షిప్ జమవుతుంది. 2022–23కు దేశవ్యాప్తంగా 3,945 మంది చిన్నారులకు రూ.7.89 కోట్లు కేటాయించారు. Prime Minister Narendra Modi releases benefits under PM CARES for Children Scheme. This will support those who lost their parents during the Covid-19 pandemic. pic.twitter.com/7DEM7qGM1Y — ANI (@ANI) May 30, 2022 -
కరోనా: తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు పరిహారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 9మంది పిల్లలకు కేంద్రం ప్రభుత్వం పీఎం కేర్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేసింది. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఆధ్వర్యంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికార అధికారి అనంతలక్ష్మి, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణలకు వీరి పాసు పుస్తకాలు హెల్త్ ఇన్సూ్యరెన్స్ కార్డులు అందజేశారు. పిల్లలకు 23 ఏళ్లు వచ్చాక వారి అవసరాలకు వినియోగించుకునే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వీరికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 18 ఏళ్ల నిండాక వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. మరో ఘటనలో.. వేసవిలో జాగ్రత్తలు అవసరం శ్రీకాకుళం పాతబస్టాండ్: వేసవి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడప్రతికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికట్టవచ్చన్నారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి (104.9డిగ్రీలు) మెదడుపై ప్రభావం చూపుతుందని తద్వారా వడదెబ్బకు గురవుతారన్నారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి వంటి లక్షణాలు కనిపించినట్లయితే సమీపంలోని వైద్యులను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలని సూచించారు. గొడుగు వాడడం, తెలుపు రంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపీ ధరించడం లేదా రుమాలు వాడడం మంచిదన్నారు. ఎండగా ఉండే సమయాల్లో ఆ రుబయట శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండడం మేలన్నారు. ఇంటి నుంచి బయటకెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగడం ఉత్తమమన్నారు. మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయసునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా వైద్యారోగ్య అధికారి అనూరాధ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమలరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు పి.రత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఆ పిల్లలకు రూ.10 లక్షలు! గడువు తేదీని పెంచిన కేంద్రం..అర్హులు ఎవరంటే?
కరోనా మహమ్మారి నుంచి బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు అండగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గడువు తేదీని ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించినట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఇంతకుముందు ఈ పథకం కింద ప్రయోజనం పొందే లబ్ధిదారులు అప్లయ్ చేసేందుకు గడువు తేదీని డిసెంబర్ 31, 2021 వరకు విధించింది. ఇప్పుడు ఈ గడువు తేదీని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు గతేడాది మే 29న ప్రధాని నరేంద్ర మోదీ సహాయాన్ని ప్రకటించారు. కరోనాతో తల్లిదండ్రులు, లేదంటే వారి ఇతర కుటుంబసభ్యుల్ని కోల్పోయి అనాదలైన పిల్లలకు అండగా నిలించేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్‌లో భాగంగా తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లలకు 18 ఏళ్లు నిండని పిల్లల చదువు, ఆరోగ్యం ఇతరాత్ర అన్నీ ప్రయోజనాల్ని అందించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత నెలవారీ స్టైఫండ్ చొప్పున 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రూ.10 లక్షల మొత్తాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని ఆన్లైన్ పోర్టల్ https://pmcaresforchildren.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఫిబ్రవరి 28, 2022 వరకు పోర్టల్‌లో అర్హులైన పిల్లలను గుర్తించి, నమోదు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు/యూటీలకు చెందిన లబ్ధి దారుల్ని కేంద్రం కోరింది. -
పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విరాళాల వరదతో నిండుతున్న పీఎం కేర్స్ ఫండ్.. రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కార్యకలాపాలు నిర్వహించదని పీఎం కేర్స్ ఫండ్ ఉన్నతాధికారి స్పష్టంచేశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం(పీఎంవో)లో ఉప కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ గౌరవ హోదాలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు అత్యున్నత నిర్ణయక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో సమ్యక్ గంగ్వాల్ ఒక పిటిషన్ వేశారు. ట్రస్టును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగేలా ఆదేశాలు జారీచేయాలంటూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఉమ్మడి విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టింది. దీనిపై స్పందనగా ప్రదీప్ శ్రీవాస్తవ కోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించారు. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టు లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్యానెల్ నేతృత్వంలో ఎంపిక చేసిన చార్టెడ్ అకౌంటెంట్‌తో ట్రస్టు ఆడిటింగ్ పూర్తయిందని అఫిడవిట్లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ‘థర్డ్‌పార్టీ’ వివరాలు ఇవ్వలేమన్నారు. తర్వాత పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. ట్రస్టు కేంద్ర ప్రభుత్వానిది కానపుడు ట్రస్టు వెబ్సైట్ చిరునామాలో జౌఠి అనే ప్రభుత్వ డొమైన్‌ను, ప్రధాని మోదీ అధికారిక ఫొటోను, జాతీయ చిహ్నాన్ని వాడకుండా నిరోధించాలని కోర్టును కోరారు. -
కోవిడ్ ఎందరి జీవితాలనో ఛిద్రం చేసింది
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి దేశంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తును తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించింది. ఆ చిన్నారుల సంరక్షణ, చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమంపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పేర్కొంది. ‘కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఇటువంటి చిన్నారుల గుర్తించి, వారి తక్షణ అవసరాలు తీర్చేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది’అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘లక్ష మందికిపైగా చిన్నారులకు ప్రభుత్వాల రక్షణ అవసరం ఉన్నట్లు బాలల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ)లు తెలిపాయి. మైనర్లకు అవసరమైన పథకాల ప్రయోజనాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలి’అని వివరించింది. పీఎం కేర్స్ కింద రిజిస్టరైన బాలల ఫీజులు, ఇతర ఖర్చుల బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని పేర్కొంది. గత ఏడాది మార్చి తర్వాత తల్లిదండ్రులిద్దరినీ లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారి ఫీజులను మాఫీ అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా, ప్రభుత్వాల సాయం అవసరం లేని బాధిత బాలల వివరాలను కూడా సేకరించాలని సీడబ్ల్యూసీలకు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
‘థర్డ్’ను దీటుగా ఎదుర్కొందాం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏర్పాటుకానున్న 1,500 లకు పైగా పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సోర్ప్సన్) ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కూడా సూచిం చారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు పీఎం కేర్స్ ఫండ్, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నిర్మితమవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పీఎం కేర్స్ ఫండ్ సహకారం అందించే పీఎఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తు న్నాయని, ఇవి పనిచేయడం ప్రారంభించాక 4 లక్షలకు పైగా ఆక్సిజన్ లభ్యత ఉన్న పడకలు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలోనూ.. ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. నిపుణులు తయారుచేసిన శిక్షణా మాడ్యూల్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మందికి శిక్షణ ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రధానికి అధికారులు తెలియజేశారు. స్థానిక, జాతీయ స్థాయిలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, పనితీరు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)æ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రధానమంత్రి సూచించారు. పలు దేశాల్లో ల్యామ్డా ప్రభావం ల్యా్డమ్డా పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిం చడం ప్రారంభమైందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. అయితే ఇలాంటి వేరియంట్లతో మనం జాగ్రత్తగా ఉండాలని వీకే పాల్ సూచించారు. గర్భిణీ స్త్రీలలో కోవిడ్ తీవ్రత పెరుగుతుందని, అందువల్ల గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్లు వేయడం అవసరం అని వీకే పాల్ అన్నారు. గర్భిణీలకు కరోనా ఉంటే, అకాల డెలివరీ ప్రమాదం పెరుగుతుందని సూచించారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌కు తూట్లు.. మరోవైపు సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్‌లాక్ ప్రక్రియలను మొదలుపెట్టాయి. దీంతో కరోనా విషయంలో ప్రజల్లో ఒకరకమైన అలసత్వం ఆవహించింది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు మార్కెట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒకరికొకరు కనీస దూరం పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందేనన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అదే సమయంలో మాస్క్ ధరించడంతో పాటు, సామాజిక దూరాన్ని పాటించడం అనేది కేవలం నియమం మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని నిపుణులు సైతం స్పష్టంచేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ పర్యాటక ప్రదేశాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరోసారి హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ‘ల్యామ్డా’ జాడల్లేవు దేశంలో కోవిడ్ వేరియంట్ ల్యామ్డాకు సంబంధించిన కేసులు ఇప్పటి వరకు బయటపడలేదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సార్స్‌కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఈ వేరియంట్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో జూన్ 14వ తేదీన పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించిన 7వ వేరియంట్ ల్యామ్డా అని ఆయన చెప్పారు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. దీని జాడలు దాదాపు 25 దేశాల్లో బయటపడ్డాయి. పెరూలో 80% కేసులు ఈ వేరియంట్‌వే. ల్యామ్డా వేరియంట్‌కు సంబంధించి 27 కేసులను గుర్తించినట్లు కెనడా అధికారులు తెలిపారు. థర్డ్ వేవ్‌ని మనమే ఆహ్వానిస్తున్నామా...? దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవ దృశ్యాలు ఇంకా చెరిగిపోక ముందే థర్డ్ వేవ్ రూపంలో మరో ఉపద్రవాన్ని ఆహ్వానించేందుకు దేశవాసులు సిద్ధమౌతున్నారు. గతేడాది కరోనా సంక్రమణ ప్రారంభమైన తర్వాత రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయిన మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను మరోసారి తుంగలో తొక్కడం ప్రారంభమైంది. దేశంలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు, సంక్రమణ వ్యాప్తికి కళ్ళెం వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారిలో కరోనా విషయంలో భయం తగ్గడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్స్ విషయంలో నిర్లక్ష్య జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కప్పా వేరియంట్ కనిపిస్తోంది... కోవిడ్–19 కప్పా వేరియంట్ జాడలు దేశంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వెలుగులోకి వచ్చినట్లు వీకే పాల్ తెలిపారు. తక్కువ తీవ్రత ఉండే ఈ వేరియంట్ దాదాపు డెల్టా వేరియంట్ లక్షణాలనే కలిగి ఉంటుందన్నారు. దేశంలో సెకం డ్ వేవ్‌కు కారణమైన డెల్టా వ్యాప్తి త్వరితంగా జరగడంతో కప్పా ఉనికి కనుమరుగైందన్నారు. ఈ వేరియంట్ కూడా డబ్ల్యూహెచ్‌వో పరిశీలనలో ఉందన్నారు. యూపీలో కప్పావేరియంట్ సంబంధిత 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. -
State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం
కోవిడ్-19 మహమ్మారి ఇంకా కొనసాగుతున్న తరుణంలో దానిని అరికట్టడం కోసం దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన సుమారు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఎస్బీఐ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు సహకారం అందించడం ఇది రెండవసారి. "మా ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో కూడా మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గర్వకారణం. వారు సేవలు అందించడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారు. అదనంగా, మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సమయంలో వారు స్వచ్ఛందంగా ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. Today, on #StateBankDay, we celebrate the incredible journey undertaken so far. Proud to move together with our nation in its march towards progress. We are happy to serve you with the latest digital banking products and services. #TheBankerToEveryIndian pic.twitter.com/qgve8jKQJ6 — State Bank of India (@TheOfficialSBI) June 30, 2021 ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా, ఈ మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎస్బీఐ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరంలో ఎస్బీఐ తన వార్షిక లాభంలో 0.25% కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా అవసరమైన వారికి మాస్క్ లు, శానిటీసర్ల సరఫరా రూపంలో గణనీయమైన విరాళాలు కూడా ఇచ్చింది. అలాగే అదనంగా, ఎస్బీఐ ఉద్యోగులు ప్రధాని-కేర్స్ ఫండ్ కు రూ.107 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే! -
అబ్బో... ! ఎంత గొప్ప సాయమో కదా ?
న్యూఢిల్లీ : కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సాయంపై పెదవి విరిచారు పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్. ఎంత గొప్ప సాయం ప్రకటించారో అంటూ సెటైర్లు కూడా సంధించారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు ప్రశాంత్ కిశోర్. ఇప్పటి నుంచే పాజిటివ్‌గా ఫీల్.. కొవిడ్ సంక్షోభంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలపై సానుభూతి ప్రదర్శించడం ద్వారా మరోసారి తనదైన శైలిలో టిపికల్ మాస్ట్రర్ స్ట్రోక్ కొట్టారు నరేంద్ర మోదీ అంటూ ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత స్టైపండ్ ఇస్తామని ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని ఇచ్చిన హామీకి ఇప్పటి నుంచే ఆ పిల్లలు చాలా పాజిటివ్‌గా ఫీల్ కావాలనుకుంటా అంటూ మోదీపై మరో వ్యంగ్యాస్త్రాన్ని ప్రశాంత్ కిశోర్ సంధించారు. అటుఇటు తిప్పి ఇప్పటికే అమల్లో ఉన్న విద్యాహక్కు చట్టం, ఆయుష్మాన్ భారత్ పథకాలనే అటు ఇటు తిప్పి కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ ప్రధాని కలరింగ్ ఇచ్చారని ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో యాభై కోట్ల మందికి లబ్ది జరుగుతుందని ప్రధాని హామీ ఇచ్చారని, కొవిడ్ సెకండ్ వేవ్‌లో రోగులకు కనీసం బెడ్డు, ఆక్సిజన్ అందివ్వలేక పోయారంటూ కేంద్రంపై ప్రశాంత్ కిశోర్ నిప్పులు చెరిగారు. మాస్ట్రర్ స్ట్రోక్ నోట్ల రద్దు, సర్జికల్స్ స్ట్రైక్స్ నిర్ణయాలు ప్రధాని ప్రకటించినప్పుడు బీజేపీ శ్రేణులు వాటిని నరేంద్ర మోదీ మాస్ట్రర్ స్ట్రోక్స్‌గా అభివర్ణించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో శత్రువులు కుదేలైపోయారంటూ భారీగా ప్రచారం చేశారు. ఒకప్పటి బీజేపీ ప్రచార అస్త్రమైన మాస్టర్ స్ట్రోక్‌ను ఈరోజు సెటైరిక్‌గా ప్రశాంత్ కిశోర్ ఉపయోగించారు. Another typical #MasterStroke by #ModiSarkar this time redefining EMPATHY and CARE for children ravaged by #Covid and its catastrophic mishandling - Instead of receiving much needed support NOW, the children should feel POSITIVE about a PROMISE of stipend when they turn 18 (1/2) https://t.co/6m4uu16YWM — Prashant Kishor (@PrashantKishor) May 30, 2021 -
అనాథ పిల్లలకు ఉచిత విద్య
న్యూఢిల్లీ: కోవిడ్‌తో తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడంతో అనాథలైన చిన్నారుల సంక్షేమంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. అనాథలైన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు 23ఏళ్లు నిండేనాటికి వారికి రూ.10లక్షలు అందేలా చూస్తామని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ‘చిన్నారులే భారత భవిష్యత్తు. వారికి పూర్తి తోడ్పాటునందించడంతోపాటు వారి సంరక్షణ, సంక్షేమ బాధ్యత మొత్తం మా ప్రభుత్వానిదే. కోవిడ్‌తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులను, జీవించి ఉన్న ఏకైక పేరెంట్ను కోల్పోయిన చిన్నారులను, చట్టబద్ధంగా తమ ఆలనాపాలనా చూసే సంరక్షకుడు(గార్డియన్)/పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ‘పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ఆదుకుంటాం. కోవిడ్‌లాంటి కష్టకాలంలో వారిలో మంచి భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వారిని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సర్కార్ రెండోసారి కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. అనాథలైన చిన్నారులను ‘పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ఆదుకోవాలని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదలచేసింది. ఈ సంక్షేమ చర్యలను చిన్నారులకు పూర్తి సమర్థవంతంగా అమలుచేయాలంటే పీఎం–కేర్స్ ఫండ్‌కు విరాళాలను మరింతగా అందివ్వాలని భారత పౌరులను మోదీ కోరారు. ఏప్రిల్1 నుంచి మే 25 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 577 మంది చిన్నారులు అనాథలయ్యారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల చెప్పారు. చిన్నారుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ►అనాథలైన చిన్నారుల పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తెరుస్తారు. ►అనాథ అయిన ఆ అమ్మాయి/అబ్బాయికి 23 ఏళ్లు వచ్చేనాటికి డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలకు చేరేలా పీఎం–కేర్ ఫండ్ నుంచి నిధులను బ్యాంకుల్లో జమచేస్తారు. ►వారికి 18 ఏళ్లు పూర్తయి 23 ఏళ్లు వచ్చే దాకా.. ఐదేళ్లపాటు ప్రతీ నెలా వారికి సొంత అవసరాల కోసం స్టైపెండ్ ఇస్తారు. ►కార్పస్ ఫండ్ నుంచి వచ్చే వడ్డీని వారికి 23 ఏళ్లు వచ్చే వరకు వ్యక్తిగత/ వృత్తిపరమైన అవసరాల కోసం అందివ్వనున్నారు. ►23 ఏళ్లు నిండాక మొత్తంగా ఒకేసారి డిపాజిట్ మొత్తాన్ని అందిస్తారు. చిన్నారుల విద్య కోసం.. ►10 ఏళ్లలోపు వయసు చిన్నారులకు దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ ప్రైవేట్ పాఠశాలలో డే స్కాలర్‌గా అడ్మిట్ చేస్తారు. ►11–18 ఏళ్ల వయసు పిల్లలను సైనిక్ స్కూల్/ నవోదయ విద్యాలయ ఇలా ఏదైనా కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తారు. ►గార్డియన్/సమీప బంధువుల దగ్గర ఉండదలచుకున్న చిన్నారులను దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు. ►ప్రైవేట్ స్కూల్లో చేరితే విద్యాహక్కు చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను పీఎం–కేర్స్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. యూనిఫాం, టెక్ట్స్/నోట్ పుస్తకాల ఖర్చులూ ఇస్తారు. ఉన్నత విద్య కోసం.. ►ఉన్నత విద్య అవసరాల కోసం స్టైపెండ్ అందివ్వనున్నారు. ►వృత్తి విద్య, ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే వారు విద్యా రుణం పొందేలా కేంద్రం సాయపడనుంది. ఈ రుణంపై చెల్లించాల్సిన వడ్డీని పీఎం–కేర్స్ ఫండ్ చెల్లించనుంది. ►రుణాలు తీసుకోని వారికి.. అండర్గ్రాడ్యుయేట్/ఒకేషనల్ కోర్సుల్లో చేరితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద వారి ట్యూషన్/కోర్సు ఫీజుకు సరిసమానమైన స్కాలర్‌షిప్‌నూ అందిస్తారు. ►ప్రస్తుత స్కాలర్షిప్ పథకాలకు అనర్హులైన చిన్నారులకూ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. ఆరోగ్య బీమా ►చిన్నారులందరికీ ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని వర్తింపచేస్తారు. ►దీంతో వీరందరికీ రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది. ►ఈ చిన్నారులకు 18ఏళ్లు నిండేవరకూ ఈ పథకాలకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను పీఎం– కేర్స్ ఫండ్ నుంచి అందిస్తారు. -
పీఎం కేర్స్‌కి విరాళం.. అయినా తల్లికి బెడ్డు దొరకలేదు..
న్యూఢిల్లీ : మీరు అడిగినంత విరాళం పీఎం కేర్స్‌కి పంపిస్తాను... దయచేసి థర్డ్ వేవ్ సమయానికి ఆస్పత్రిలో ఓ బెడ్ నా కుటుంబానికి రిజర్వ్ చేసి పెడతారా ? అంటూ ప్రధాన మంత్రి కార్యాలయానికి రిక్వెస్ట్ పంపాడో వ్యక్తి. కరోనా సెకండ్ వేవ్‌లో తన తల్లికి కరోనా సోకిందని.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఒక్క బెడ్ సంపాదించలేకపోయానంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. తన కుటుంబంలో ఇంకో వ్యక్తిని కోల్పోయేందుకు సిద్ధంగా లేనని... అందుకే థర్డ్ వేవ్ నాటికి తనకు ఓ బెడ్ కావాలంటూ రిక్వెస్ట్ పంపాడు. విజయ్‌పారిఖ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా పీఎంవోను రిక్వెస్ట్ చేశాడు రూ.2.51 లక్షల విరాళం గతంలో పీఎంకేర్ ఫండ్‌కి రూ.2.51 లక్షల రూపాయలను విజయ్ పారిఖ్ విరాళంగా అందించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభనంలో ఆయనకు వైద్య రంగం నుంచి భరోసా లభించలేదు. కనీసం బెడ్ కూడా దొరక్క తల్లిని కోల్పోయాడు. దీంతో పీఎంకేర్స్‌కి తన ఆవేదన ఇలా వ్యక్తం చేశాడు -
Suo Moto Case: పీఎంకేర్స్‌ను చేర్చండి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19పై సుమోటోగా విచారిస్తున్న కేసులో పీఎం కేర్స్‌ను ప్రతివాదిగా చేర్చాలంటూ సామాజిక కార్యకర్త సాకేత్‌గోఖలే ఇంటర్వెన్షన్ కోరుతూ సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. కోవిడ్–19కు అవసరమైన సామగ్రి సేకరణ, సేవలు, నిధుల విషయంలో పీఎం కేర్స్ ముఖ్య భాగస్వామి అని అప్లికేషన్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి ఏ రకమైన సహాయమైనా చేయడం, మద్దతు ఇవ్వడం, ఔషధ సదుపాయాల కల్పన, ఆర్థిక సహాయం చేయడం ఈ నిధి లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘పీఎంకేర్స్ నిధి ప్రభుత్వేతర వాటాదారు. నిత్యావసరాల పంపిణీ, సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు, ప్రాజెక్టులతో సంబంధం ఉంది. కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడానికి చేసే వివిధ కేటాయింపులు, ద్రవ్య కేటాయింపులు, ప్రాజెక్టు పురోగతి ఎలా పర్యవేక్షణ చేస్తోందనే అంశాలపై అత్యున్నత న్యాయస్ధానానికి సమాచారం అందజేయడం చాలా ముఖ్యం. గతేడాది మేలో పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటైంది. కోవిడ్ –19 కోసం రూ. 3,000 కోట్లు కేటాయించినట్లు అందులో.. రూ. 2,000 కోట్లు వెంటిలేటర్లకు వినియోగించినట్లు , వలస కార్మికుల సంరక్షణ కోసం రూ. 1,000 కోట్లు, టీకా అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. టీకా అభివృద్ధి కోసం అదనపు నిధులు కేటాయించారా లేదా అనే సమాచారం పబ్లిక్‌డొమైన్‌లో లేదు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే నిరాకరిస్తున్నారు’’ అని అప్లికేషన్లో పేర్కొన్నారు. చదవండి: Covid Strain: కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ అభ్యంతరం -
మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడా కంటికి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు మానవతావాదులు కరోనా బాధితులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పీఎం కేర్స్ ఫండ్ కింద అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న వెంటిలేటర్ల గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ మధ్య పోలికలు ఉన్నాయన్నారు. ఆ వెంటిలేటర్లు, మోదీ బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు, ప్రధాని మోదీ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. -
సోనూసూద్.. హైదరాబాద్‌లో కలుద్దామన్నారు: నాగలక్ష్మి
ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్‌ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది. ‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు. ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది. ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్‌ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి. ఇటీవలే అంటే సెకండ్ వేవ్‌లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్‌గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్‌గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్‌ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్‌కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి. నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్‌లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి. – కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా -
పనిచేయని పీఎం కేర్ వెంటిలేటర్లు: ఆస్పత్రుల్లో వృథాగా
చండీఘడ్: కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లు వృథాగా పడి ఉన్నాయి. అవి సక్రమంగా పని చేయడం లేదని మూలకు పడేశారు. దీంతో పీఎం కేర్ నిధుల నుంచి తీసుకొచ్చిన వెంటిలేటర్లపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకం వెంటిలేటర్లు ఇస్తే ఏం ప్రయోజనమని మండిపడ్డారు. పీఎం కేర్ నిధుల నుంచి అగ్వా హెల్త్ కేర్ కార్యక్రమంలో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి గతేడాది 250 వెంటిలేటర్స్ పంపించారు. వాటిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే పంపించిన వాటిలో చాలా వరకు పని చేయడం లేదని పక్కకు పడేశారు. గురు గోబింద్ సింగ్ వైద్య కళాశాల, ఆస్పత్రికి 80 వెంటిలేటర్స్ పంపించాల్సి ఉండగా 71 పంపారు. ఆ పంపిన వాటిలో ఒక్కటీ కూడా పని చేయడం లేదని ఆ కళాశాల వీసీ ఆరోపించారు. గంటా రెండు గంటలు పని చేయగానే మొరాయిస్తాయని తెలిపారు. దీంతో వాటిని పక్కన పడేసినట్లు తెలిపారు. పంపిన వెంటిలేటర్లు నాసిరకమైనవని.. అవి కొంత సేపు పని చేసి ఆగిపోతున్నాయని పలు ఆస్పత్రులు ఫిర్యాదు చేశాయి. నాణ్యమైన వెంటిలేటర్లు పంపలేదని అనస్థిషియా వైద్యులు చెబుతున్నారు. తరచూ మొరాయిస్తున్నాయని అని బాబా ఫరీద్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రాజ్ బహదూర్ వాపోయారు. ‘82 వెంటిలేటర్లు ఇవ్వగా వాటిలో 62 పని చేయడం లేదని ఫొటోతో సహా తెలిపారు. అవి తీసుకు వచ్చినప్పటి నుంచి పని చేయడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 42 వెంటిలేటర్లతో రోగులకు సేవలు అందిస్తున్నాం. రోగులకు వాటిని అందుబాటులో ఉంచలేం’ అని పేర్కొన్నారు. These r the ventilators fm #PMCaresFund lying unused in GGSMC Faridkot. @CMOPb pls make them work for the needy #COVID19 patients....I shall be Obliged..and Appreciate....@ChitleenKSethi @ANI @AAPPunjab @CsPunjab pic.twitter.com/GV9lUZBlox — Kultar Singh Sandhwan (@Sandhwan) May 11, 2021 ఇదే విషయాన్ని పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంద్వాన్ ట్వీట్ చేశారు. ఆ వెంటిలేటర్ల దుస్థితిని ఫొటో పంచుకున్నారు. ఫరీద్‌కోట్‌లోని ఆస్పత్రిలో నిరుపయోగంగా వెంటిలేటర్లు పడి ఉన్నాయి. కరోనా రోగుల కోసం వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోండి.’ అని కుల్తార్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రికి ట్యాగ్ చేశారు. ఈ విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్లను మరమ్మతు చేసేందుకు మెకానిక్‌లను పంపించింది. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ప్రస్తుతం ఎంతో అవసరం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వాటిని బాగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇవి పని చేస్తాయో.. లేదా మళ్లీ కొన్నాళ్లకు మొరాయిస్తాయోనని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడిలో పూర్తిగా నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వానికి పీఎం కేర్స్ ఫండ్ సాయపడనుంది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను వినియోగించుకుని లక్షల పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరించడంతోపాటు 500కుపైగా ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ ఆక్సిజన్ (పీఎస్ఏ) ప్లాంట్లను నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు. ఇలా అదనపు ఆక్సిజన్ అందుబాటులోకి రావడంతో జిల్లా కేంద్రాలు, టైర్–2 నగరాల్లో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరాలు కొంతమేర తీరతాయని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న క్లస్టర్ల వద్ద ఆక్సిజన్ సరఫరాను మెరుగైన స్థాయిలో పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘డిమాండ్ ఉన్న క్లస్టర్ల వద్దే ప్లాంట్లను ఏర్పాటుచేయడం ద్వారా.. ప్రస్తుత ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా సమస్యలను అధిగమించ వచ్చు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన దేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీఓ, సీఎస్ఐఆర్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ టెక్నాలజీని స్థానిక సంస్థలకు అందివ్వనున్నాయి’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కోవిడ్–19 నిర్వహణ వ్యవస్థలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా తీరుతెన్నులపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత తొందరగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలుచేసి విపరీతమైన పాజిటివ కేసులతో సతమతమవుతున్న రాష్ట్రాలకు పంపించాలని మోదీ ఆదేశించారు. నిరంతర సాయానికి వాయుసేన సిద్ధం కోవిడ్ సంబంధ కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యల్లో నిరంతరాయంగా సాయపడేందుకు భారత వాయుసేన సిద్దంగా ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా చెప్పారు. ప్రభుత్వానికి తోడ్పాటుపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాని మోదీకి భదౌరియా వివరాలు వెల్లడించారు. భారీ స్థాయిలో యుద్ధ సరకులను తరలించే వాయుసేన రవాణా విమానాలను కేంద్రప్రభుత్వానికి అందుబాటులో ఉంచుతామని భదౌరియా స్పష్టంచేశారు. -
కరోనా సునామీ : దలైలామా సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విలయంతో అల్లాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలుముందుకొస్తున్నాయి. కరోనా నిర్యూలనకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతుగా నిలిచారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను దలైలామా ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీ ఆఫర్లు) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వరుస సవాళ్లను ఆందోళనతో గమనిస్తూనే ఉన్నానంటూ దలైలామా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భయంకరమైన కరోనా సునామిలో తోటి భారతీయ సోదర, సోదరీ మణులకు తన సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వమని దలైలామా ట్రస్ట్‌ను కోరానని ఆయన చెప్పారు. ఈ మహమ్మారి ముప్పు త్వరలోనే ముగిసిపోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు దేశంలో రోజుకు 3లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్న క్రమంలో మంగళవారం నాటికి 3,23,144 మంది కొత్తగా క రోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. అయితే జాతీయ రికవరీ రేటు 82.54 శాతంగాఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు) -
కరోనా: పాట్ కమిన్స్ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలన్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు. అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీల్ కొనసాగించడం సరియైనదా కాదా అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీల్ మ్యాచ్‌లు కాస్త సంతోషానిస్తాయన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు. ఈ మేరకు కమిన్స్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా, 2021 ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేసి కొత్త చరిత్రను రాశాడు. ఇలా ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవాడుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం -
పీఎం కేర్స్ నిధి : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్‌కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు. పీఎం-కేర్స్ ఫండ్ నుండి 893.93 కోట్ల రూపాయలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందినట్టు లోక్‌సభలో ప్రకటించారు. 50 వేల వెంటిలేటర్ల తయారీకి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆదివారం కరోనాపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. కరోనా కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది వలస కార్మికుల పునరావాసం కోసం పీఎం కేర్స్ నిధులు కేటాయించాలని కూడా రంజన్ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రణాళికను అమలు చేసి ఉండి ఉంటే, ప్రజలు కష్టాలను, మహమ్మారి తీవ్రతను నివారించ గలిగేవారమన్నారు. అంతేకాదు దేశంలో కోవిడ్-19 మరణాలపై సరైన సమాచారం లేదని కూడా రంజన్ చౌదరి విమర్శించారు. కాగా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫండ్‌ను మార్చి 27న ప్రకటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ .3,076 కోట్లు వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉండగా, మరో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు అవసరంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఆడిట్‌ను డిమాండ్ చేస్తోంది. -
పీఎం కేర్స్‌కు తొలి విరాళం మోదీనే
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25 లక్షలతో ఈ నిధి ప్రారంభమైందని, అయితే మొట్టమొదటగా ఈ విరాళమిచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని అధికారులు వెల్లడించారు. తొలి కార్పస్ ఫండ్‌గా రూ.2.25 లక్షలు ఆయన తన స్వంత జేబులో నుంచి సమకూర్చినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) ఉండగా మళ్లీ కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. పైగా పీఎం కేర్స్ పద్దులను కాగ్ కాకుండా ప్రైవేట్ ఆడిటర్లు పర్యవేక్షించడంపైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్రం బదులిస్తూ ఇది కేవలం 'స్వచ్ఛంద నిధి' అని స్పష్టం చేసింది. (చదవండి: పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం ) మోదీ ఇచ్చిన విరాళాలివే... ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి నరేంద్ర మోదీ గతేడాది రూ.21 లక్షల విరాళం అందించారు. 2018లో సియోల్ శాంతి పురస్కారం అందుకున్న మోదీ.. దాని ద్వారా వచ్చిన రూ.1.3 కోట్ల నగదును తనవంతుగా గంగా ప్రక్షాళన కోసం అందజేశారు. దీనితోపాటు ఆయన తను పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి రూ.3.40 కోట్లను, గిఫ్టుల ద్వారా వచ్చిన రూ.8.5 కోట్లను కూడా నమామి గంగా మిషన్‌కు అందజేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిన తర్వాత ఆ రాష్ట్ర సిబ్బంది కుమార్తెల విద్య కోసం రూ.21 లక్షలు విరాళమిచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.89.96కోట్లను కన్యా కేలవాణి ఫండ్(ఆడపిల్లల విద్యను ప్రోత్సహించే నిధి) విరాళంగా ఇచ్చారు. (చదవండి: రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా) -
కోవిడ్ విపత్తువేళ డ్యూక్స్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 విపత్తు వేళ బిస్కెట్స్, వేఫర్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ డ్యూక్స్ ఇండియా ఔదార్యం చూపింది. పీఎం కేర్స్ ఫండ్‌కు ఉద్యోగులు ఇప్పటికే ఒకరోజు వేతనం అందించారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బిస్కెట్లను సరఫరా చేశారు. వలస కార్మికులకు ఆహారం అందించడం, రక్తదానం వంటి కార్యక్రమాలను చేపట్టారు. (చదవండి: ఏజీఆర్ తీర్పు- ఎయిర్టెల్ జోరు) అలాగే విపత్తు నుంచి బయటపడతామన్న సందేశంతో విభిన్న భాషల మేళవింపుతో 14 మంది కళాకారులచే రూపొందిన ‘వాయిసెస్ యునైటెడ్’ పాటకు కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ పాట ద్వారా నిధులు సమీకరించి.. కోవిడ్–19 సంక్షోభానికి గురైన 2,00,000 కుటుంబాలకు సాయం చేస్తారు. తద్వారా 3,00,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరం కాకుండా ఉంటారన్నది సంస్థ భావన అని డ్యూక్స్ ఇండియా ఎండీ రవీందర్ అగర్వాల్ తెలిపారు. (చదవండి: పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం) -
పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం
న్యూఢిల్లీ: కోవిడ్–19 విపత్తును ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్ఎఫ్)కి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్ ఫండ్, ఎన్డీఆర్ఎఫ్లు పూర్తిగా భిన్నమైనవని, వేర్వేరు ఉద్దేశాలతో ఏర్పాటైనవని పేర్కొంది. కోవిడ్ విపత్తును ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం వాడుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్కు స్వచ్ఛందంగా ఎప్పుడైనా విరాళాలు ఇవ్వవచ్చునని, అలాగే కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక ఏదీ అవసరం లేదని, విపత్తు నిర్వహణ చట్టంలోని జాతీయ ప్రణాళిక సరిపోతోందని జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. కరోనా కట్టిడికి కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలకు సహాయం చేస్తున్నపుడు... నిధులు ఎందులోనుంచి ఇవ్వాలనేది పిటిషనర్ చెప్పజాలడని పేర్కొంది. పీఎం కేర్స్ నిధిపై కాగ్ ఆడిట్ అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం ఆర్థిక నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పింది. కేంద్రప్రభుత్వం మార్చి 28న ప్రైమ్ మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్... క్లుప్తంగా పీఎంకేర్స్ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసి కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉపయోగించాలని తీర్మానించింది. ప్రధాని ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించే ఈ నిధి నిర్వహణకు రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులను ఎక్స్అఫీషియో ట్రస్టీలుగా నియమించారు. అయితే విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఒకటి ఇప్పటికే అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్తగా పీఎంకేర్స్ ఏర్పాటు ఆవశ్యకతను సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ సంస్థ సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. కేంద్రం జూలై 27న ఒక ప్రకటన చేస్తూ పీఎంకేర్స్ అనేది స్వచ్ఛంద విరాళాలపై పనిచేసే పబ్లిక్ ట్రస్ట్ అని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ల బడ్జెట్ కేటాయింపుల్లోని నిధులను పీఎంకేర్స్ కోసం వాడటం లేదని స్పష్టం చేసింది. ఈ నిధి సమాచార హక్కు చట్టం కిందకు రాదని తెలిపింది. స్వచ్ఛంద నిధి: సుప్రీంకోర్టులో కేంద ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లకు బడ్జెట్ ద్వారా నిధులు సంక్రమిస్తాయని, పీఎంకేర్స్ స్వచ్ఛంద విరాళాల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. అయితే ఈ రకమైన నిధి ఏర్పాటు విపత్తు నిర్వహణ చట్టానికి విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ఎన్డీఆర్ఎఫ్ పద్దులను కాగ్ ఆడిట్ చేస్తారని, పీఎంకేర్స్‌కు మాత్రం ప్రైవేట్ ఆడిటర్లు నిర్వహిస్తారని ప్రభుత్వం చెబుతోందని దుష్యంత్ దవే ఆరోపించారు. కుట్రలకు చెంపపెట్టు: బీజేపీ పీఎంకేర్స్ నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న వారికి చెంపపెట్టులాంటిదని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పును స్వాగతించిన ఆయన రాహుల్‌గాంధీ, యాక్టివిస్టులకు ఈ తీర్పు పెద్ద దెబ్బ అని అన్నారు. రాహుల్ ‘వాగుడు’ను పీఎంకేర్స్ నిధికి భారీగా సాయమందించిన సామాన్య ప్రజలు పదేపదే తిరస్కరించారని, ఇకనైనా రాహుల్, అతడి అనుచరణ గణం పద్ధతులు మార్చుకోవాలన్నారు. పారదర్శకతకు దెబ్బ: కాంగ్రెస్ పీఎం కేర్స్‌పై సుప్రీంకోర్టు తీర్పు పారదర్శకతకు, జవాబుదారీతనానికి గొడ్డలిపెట్టు లాంటిదని కాంగ్రెస్ అభివర్ణించింది. ప్రజాధనాన్ని స్వీకరిస్తూ ఎవరికీ జవాబుదారీ కాదనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని..సరిదిద్దాల్సిన న్యాయస్థానం అది చేయలేదని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. పీఎం కేర్స్‌పై సమాధానాలు రాబట్టే అవకాశాన్ని కోర్టు జారవిడుచుకుందని పేర్కొన్నారు. -
‘పీఎం కేర్స్ ఫండ్‌ను ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేయలేం’
సాక్షి. న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్ ఫండ్'కు వచ్చిన కోవిడ్-19 విరాళాలను ప్రకృతి వైపరీత్యాల సహాయక నిధి (ఎన్డీఆర్ఎఫ్)కి బదిలీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పీఎం కేర్స్‌కు నిధులు విరాళాల రూపంలో వచ్చాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్డీఆర్ఎఫ్) లేదా స్టేట్ ఫండ్ లకు బదిలీ చేయాలని కోరుతూ ఓ స్వఛ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాది దుశ్యంత్ దేవ్ వాదనలు వినిపిస్తూ.. కొత్త ఫండ్‌ను క్రియేట్ చేయడం వల్ల అది ఎన్డీఆర్ఎఫ్కు అవరోధంగా మారినట్లు తెలిపారు. పీఎం కేర్స్ అనేది పబ్లిక్ చారిటీ ట్రస్ట్ లాంటిదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇది కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి స్వఛ్చందంగా అందే విరాళాల సేకరణ కోసం ఉద్దేశించినదని తెలిపింది. అంతే తప్ప.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లకు కేటాయించిన నిధులకు, దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. (చదవండి : జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!) ఇక పిటిషనర్ తరపున దుశ్యంత్ దేవ్ వాదిస్తూ.. ఎన్డీఆర్ఎఫ్ను కాగ్ ఆడిట్ చేయగా పీఎం కేర్స్‌ను ఓ ప్రైవేటు సంస్థ ఆడిట్ చేస్తున్నట్లు ధర్మాసనానికి వివరించారు. పీఎం కేర్స్‌ను కూడా కాగ్ ఆడిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. కోవిడ్ -19 ను పరిష్కరించడానికి 2019 నవంబర్‌లో రూపొందించిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక సరిపోతుందని, కొత్త డిజాస్టర్ రిలీఫ్ ప్లాన్ అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉండగా రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. -
చైనా విరాళాలు మన పార్టీలకు ఎందుకు?!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా ఇప్పుడు ప్రపంచానికే పెద్ద ఫాక్టరీగా మారింది. దాంతో చైనా, తనకు ఏ దేశం ఎదురు తిరిగినా దానిపై ఆర్థిక ప్రతిష్టంబన దాడిని కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ఆవిర్భవించిన చైనాపై ఆస్ట్రేలియా కన్నెర్ర చేయడంతో కోపం వచ్చిన చైనా, వెంటనే ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన కబేళాల నుంచి గోమాంసం దిగుమతిని నిలిపివేసింది. బార్లీ గింజల దిగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇదే తరహాలో ఇప్పుడు భారత్‌పై ఆర్థిక దాడి చేసేందుకు చైనా సిద్ధం అవుతోంది. (‘యాప్‌ల బ్యాన్ అభినందనీయం’) భారత్ సరిహద్దు సైన్యంతో చైనా సైన్యం సంఘర్షణకు దిగడంతో ఆగ్రహించిన భారత్ చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించింది. ‘చైనా, భారత్ సరిహద్దులో ఎటు వైపు నుంచి ఎవరి సైన్యం దురాక్రమణకు పాల్పడలేదు’ అంటూ ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శల దాడి తీవ్రమై సరికొత్త విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. చైనాతో మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించడంతో సోనియా నాయకత్వంలోని ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ చైనా నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిందని, అందుకు ప్రతిఫలంగా 2005–06 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుందని బీజేపీ విమర్శించింది. (పాక్‌తో చేతులు కలిపిన చైనా?) ‘పీఎం కేర్స్’నిధి చైనాకు చెందిన ‘హ్వావీ, టిక్‌టాక్’ కంపెనీల నుంచి విరాళాలు తీసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. కోవిడ్–19 అత్యవసర నిధి కోసం గత మార్చి నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, తాను చైర్మన్‌గా ‘పీఎం కేర్స్’ను ఏర్పాటు చేశారు. ఆయన నిషేధించిన యాప్స్‌లో టిక్‌టాక్ కూడా ఉన్న విషయం తెల్సిందే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచి చైనా సహా పలు దేశాల నుంచి విరాళాలు తీసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు విదేశీ విరాళాల నియంత్రణా చట్టాన్ని ఉల్లంఘించి విరాళాలు తీసుకున్నాయంటూ 2014లో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మందలించింది. (మరో రెండు చైనా కంపెనీలు బ్యాన్..) దాంతో 2016లో విదేశీ విరాళాల నియంత్రణా చట్టంలో మోదీ ప్రభుత్వం, రాజకీయ పార్టీల విరాళాలకు అనుకూలంగా సవరణ తీసుకొచ్చింది. ’భారతీయ చట్టాల పరిధిలో పరిమితికి లోబడి విదేశీ పెట్టుబడులున్న కంపెనీలను ఇక నుంచి దేశీయ కంపెనీలుగానే పరిగణించాలి’ అంటూ సవరణ తీసుకొచ్చారు. పార్టీల విరాళాల కోసం బాండుల విధానాన్ని మోదీ ప్రవేశపెట్టిన నాటి నుంచి బీజేపీకీ చైనా పెట్టుబడులుగల భారతీయ కంపెనీల నుంచి ఎక్కువ మొత్తాల్లో విరాళాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. చైనా కంపెనీలు భారత ఆర్థిక వ్యవహారాల్లో తమ ప్రాబల్యం కోసమే విరాళాల రూపంలో లంచాలిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చైనాపై ఇతర చర్యలకు ఉపక్రమించడానికి ముందు ఏ రూపంలోనైనా చైనా కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు రాకుండా నిషేధం విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా విరాళాలు
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ మన్ కీ బాత్‌లో చెప్పిన కాసేపటికే సింఘ్వీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18సార్లు సమావేశమైన మోదీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుడుగా మోదీ అంగీకరించి తీరాలన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. పీఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్ రూ. 30 కోట్లు, పేటీఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ ఆరోపించారు. సీపీసీతోనూ బీజేపీకి అనుబంధం ! కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)తో బీజేపీకి ఎప్పట్నుంచో సత్సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. 2007 నుంచి బీజేపీ ఈ బంధాలను కొనసాగిస్తోందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా చైనాతో మంచి సంబంధాలు ఉన్నావారేనని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో 13 ఏళ్లుగా సత్సంబంధాలున్న రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదని నిందించారు. -
వాళ్ల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి
కలకత్తా: కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘కరోనా వైరస్ కారణంగా ప్రజలు అధికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున అసంఘటిత కార్మికులతో సహా వలస కూలీలకు ఒకేసారి రూ .10 వేలు అర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకోసం పీఎం కేర్ ఫండ్‌లోని కొంత భాగాన్ని ఉపయోగించాలి కోరుతున్న’ అంటూ మమతా ట్వీట్లో పేర్కొన్నారు. (మళ్లీ తెరుచుకోనున్న అన్ని ప్రార్థనాలయాలు) ఇప్పటికే మహమ్మారి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున తమ రాష్ట్రంలో అంపన్ భీభత్సం సృష్టించిందని మమతా తెలిపారు. ఇటీవల తమ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ తుఫాన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేసింది. ఈ తుఫాన్ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక నష్టంలోకి నెట్టేసింది. ఇటీవల కాలంలో సంభవించిన తుఫాన్లలో అంపన్ చాలా భయంకరమైనది. ఇంతకు ముందేన్నడు ఇలాంటి తుఫాన్ చూడలేదు’ అంటూ దీదీ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తుఫాను కారణం సమస్తం కొల్పోయిన ప్రజలకు పునరావసం కింద తమ ప్రభుత్వం రూ. 1,444 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23.3 లక్షల మంది రైతులతో పాటు ఇళ్లు కొల్పోయిన 5 లక్షల మంది బాధిత ప్రజలకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించినట్లు మమతా వెల్లడించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను) -
సోనియా గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు
శివమొగ్గ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. శివమొగ్గలో సోనియాపై కేసు రిజిస్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. పీఎం కేర్స్ ఫండ్‌పై మే 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్లు సోనియా గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లు తేలింది. దీంతో సోనియాపై కర్నాటకలో ఐపీసీ 153, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను అడ్వకేట్ ప్రవీణ్ కేవీ రిజిస్టర్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ఫ్రాడ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రజలకు వినియోగించడం లేదని, ఆ సొమ్ముతో ప్రధాని మోదీ విదేశీ టూర్లకు వెళ్లనున్నట్లు ఆరోపించారన్నారు. అంతేగాక కోవిడ్-19 కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దురుద్ధేశమైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పుకార్లు పుట్టించిందన్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ప్రవీణ్ తెలిపారు. కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ -
రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. కాగా కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు స్వచ్ఛందంగా విరాళం ఇస్తున్నారు. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు) అంతేకాకుండా ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా’ ఉద్యమానికి రాష్ట్రపతి భవన్ మద్దతు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంతవరకూ రాష్ట్రపతి భవన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ పర్యటనలు తగ్గించుకోనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరాన్ని విధిగా పాటించేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ద్వారా ప్రజలకు చేరువ కానుంది. ఈ చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్లో దాదాపు 20 శాతం ఆదా అవుతాయని అంచనా. (వినూత్న పద్దతిలో భౌతిక దూరం) -
రూ.1000 కోట్లలో వారికి చేరేది సున్నా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దీపన ప్యాకేజీలు, కేటాయింపులపై పెదవి విరుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం మరోసారి కేంద్రంపై తన దాడిని ఎక్కు పెట్టారు. వలస కార్మికులకు పీఎం-కేర్స్ కేటాయించిన రూ.1000 కోట్ల వినియోగంపై సందేహాలు లేవనెత్తారు. కరోనా వైరస్ సంక్షోభం లాక్డౌన్ వల్ల ప్రభావితమైన వలస కార్మికుల కోసం కేటాయించిన రూ.1000 కోట్లలో వారికి చేరేది శూన్యమని విమర్శించారు. ‘దయచేసి సాధారణ తప్పు చేయవద్దు. ఈ డబ్బు వలస కార్మికులకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది. కార్మికుల ప్రయాణ ఖర్చులు, వసతి, మందులు, ఆహారం ఇతర ఖర్చులను భరించటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది తప్ప వలస కార్మికుల చేతుల్లోకి ఏమీ వెళ్ళద’ని చిదంబరం గురువారం ట్వీట్ చేశారు. అలాగే అన్ని ఆదాయ వనరులు మూసుకుపోయిన తరువాత వలస కార్మికుడి జీవనం ఎలా అని ఆయన ప్రశ్నించారు. అన్ని అడ్డంకులను దాటి తన గ్రామానికి తిరిగి వచ్చిన వలస కార్మికుడికి గ్రామంలో ఉపాధి, ఉద్యోగాలు లేవు. ఆదాయం లేదు. ఈ పరిస్థితుల్లో సదరు కార్మికుడు తన కుటుంబాన్ని ఎలా ఆదుకుంటాడని చిదంబరం ప్రశ్నించారు. (కరోనా ప్యాకేజీ: మాల్యా స్పందన) కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించిన చిదంబరం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. సొంతగ్రామాలకు వెళ్లేందుకు ఆకలి కడుపులతో వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికులను ప్రస్తావించక పోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అని విమర్శించిన సంగతి విదితమే. కాగా, కోవిడ్-19పై పోరాటానికి గాను పీఎం కేర్స్ ఫండ్ బుధవారం 3,100 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిలో వెంటిలేటర్లను కొనడానికి రూ. 2,000 కోట్లు, వలస కూలీలకు సహాయం చేయడానికి రూ. 1,000 కోట్లు, కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతవూరికి పయనమవుతున్న వలస జీవులు అనేకమంది మధ్యలోనే ప్రమాదాల కారణంగాప్రాణాలు విడుస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. గురువారం నాటికి భారతదేశం కరోనా వైరస్ కేసులు గురువారం నాటికి 78,003 కు పెరిగాయి, 2,549 మరణాలు సంభవించాయి. The money will not be given to the migrant workers but to the State governments to meet the expenses of travel, accommodation, medicine and food for the migrant workers. But nothing will go to the hands of the migrant workers. — P. Chidambaram (@PChidambaram_IN) May 14, 2020 -
ప్రధానమంత్రి సహాయనిధికి ఎస్టీవీ విరాళం
బెర్లిన్ : కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను తట్టుకోడానికి మాతృభూమికి తమ వంతు సహాయం చేయడానికి జర్మనీలో స్టూట్గర్ట్ పరిధిలోని ఎన్ఆర్ఐలు ముందుకొచ్చారు. సమైక్య తెలుగు వేదిక(ఎస్టీవీ) ఆధ్వర్యంలో 1111 యూరోలు(దాదాపు 90వేల రూపాయలు) ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. తమ వంతు సహాయంగా విరాళాలు అందించిన ప్రతి సభ్యునికి ఎస్‌టీవీకి ధన్యవాదాలు తెలిపింది. -
అంతుచిక్కని ఆశ్చర్యం...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ సహాయ నిధి ‘పీఎం కేర్స్’కు కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు, మధ్య తరగతి ప్రజలు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేయడం విశేషం. కార్మికులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన కంపెనీలు కూడా ‘పీఎం కేర్స్’కు ఆర్థిక సహాయం అందజేయడం అంతుచిక్కని ఆశ్చర్యం. (ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి) ఫిట్నెస్ స్టార్టప్ కంపెనీ ‘క్యూర్ ఫిట్’ మే 4వ తేదీన జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవంటూ 800 మంది ఉద్యోగులను తీసివేసింది. పలు చోట్ల తన ఫిట్నెస్ సెంటర్లను మూసివేసింది. తీసివేసిన ఉద్యోగుల సహాయార్థం కేవలం రెండు కోట్ల రూపాయలను కేటాయించింది. అదే ‘పీఏం కేర్స్’కు ఐదు కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది. ప్రధాని మోదీకి సన్నిహితులు, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఫేస్బుక్, సిల్వర్ లేక్ కంపెనీ భారీ ఎత్తున ముకేశ్ జియో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఉత్సాహంతో ఆయన అతిగా స్పందించారనుకుందాం. ఆయన తన కంపెనీల్లో ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధించారు. తన హైడ్రోకార్బన్ వ్యాపారంలో ఉద్యోగులకు పనితీరు ఆధారంగా జరిపే చెల్లింపులను ఈసారి వాయిదా వేశారు. (కార్చిచ్చులా కరోనా) కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకారం ‘పీఎం కేర్స్’కు వచ్చే నిధులన్నీ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కిందకు వస్తాయట. పార్లమెంట్ చట్టం ప్రకారంగానీ, మరే ఇతర చట్టం కిందగానీ ‘పీఏం కేర్స్’ ఏర్పడలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణలు చెబుతున్నారు. కార్మికుల కడుపుకొట్టి సహాయ నిధికి సహాయం చేయడంలో అర్థమేముందీ!? (వైట్‌హౌస్‌కి కరోనా దడ) -
‘శ్రామిక్’ చార్జీలపై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పీఎం–కేర్స్ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్ చేసింది. విపక్షం వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడింది. స్వస్థలాలకు తరలివెళ్లే వలస కార్మికుల టికెట్ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని బీజేపీ తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ మహాపాత్ర, పార్టీ ఐటీ విభాగం బాధ్యుడు అమిత్ మాల్వీయ ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. ఏ రైల్వేస్టేషన్‌లోనూ టికెట్లు విక్రయించడం లేదు. టికెట్ రుసుములో రైల్వేలు 85 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. మిగతా 15 శాతం రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తమ వంతు చెల్లించేలా ఆ పార్టీ చీఫ్ సోనియా సూచించాలి’అని వారు కోరారు. విపక్షం మండిపాటు వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నందున, ఇకపై తమ పార్టీయే ఆ మొత్తాన్ని భరిస్తుందంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సోమవారం ప్రకటించారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న కార్మికులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంలో సాయం కోసం ఎదురుచూస్తున్న వలస కార్మికులకు పార్టీ రాష్ట్రాల విభాగాలు సాయం అందిస్తాయని తెలిపారు. ఈ అంశంపై సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, లోక్తాంత్రిక్ జనతాదళ్ కూడా స్పందించాయి. ‘పేరులో ఉన్నట్లే పీఎం–కేర్స్ నిధి కేవలం ప్రధాని సంబంధీకులదిగా మారింది. వలస కార్మికులను ఎన్నారైలు(నాన్ రిక్వైర్డ్ ఇండియన్స్)’అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల విరాళం 11.90 కోట్లు...
న్యూఢిల్లీ: కరోనాపై పోరు బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.11.90 కోట్ల విరాళం ఇవ్వనున్నారు. దాదాపు 29,600 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సింఫనీ సహాయం..: కాగా కోవిడ్–19పై పోరాటంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 ఎయిర్ కూలర్లను సరఫరా చేయాలని ప్రముఖ ఎయిర్ కూలింగ్ కంపెనీ సింఫనీ నిర్ణయించింది. ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, ఇతర హెల్త్‌కేర్ సెంటర్లలో ఈ ఎయిర్ కూలర్లను గుజరాత్ ఆరోగ్యశాఖ వినియోగించనుంది. -
కరోనా: సుప్రీం తీర్పును ఉదహరించిన పీఎంఓ
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్‌కు వస్తున్న విరాళాల వివరాలు ఇవ్వాలని దాఖలైన ఆర్టీఐ దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనను ఉదహరిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ వివరాలు నేరుగా బహిరంగపర్చలేమని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంఓ తెలిపింది. దాంతోపాటు, కోవిడ్ కట్టడికి జరిగిన అత్యున్నస్థాయి సమావేశ వివరాలు బహిరంగం చేయలేమని స్పష్టం చేసింది. సమాచారం హక్కు చట్టం కింద నొయిడాకు చెందిన పర్యావరణ వేత్త విక్రాంత్ తోగాడ్ ఏప్రిల్ 21న పీఎంఓ నుంచి 12 అంశాలతో నివేదిక కోరతూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతను సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తు సరిగా లేదని, ఒకే దరఖాస్తులో ఇన్ని వివరాలు ఇవ్వలేమని దేనికదే విడిగా అప్లై చేయాలని సూచించింది. కాగా, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ఈ విరాళాలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. ఇక విచక్షణారహిత, అసాధ్యమైన డిమాండ్ల మేరకు సమాచారం ఇవ్వాలని చూస్తే.. అది ఆ సంస్థ పనితీరుపైనా, ఫలితంగా సమాచారం సేకరించి, సమకూర్చే ఎగ్జిక్యూటివ్‌పైనా పడుతుందని, అలాంటి సందర్భంలో దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం ధర్మాసనం వివాదాస్పద ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విత్తన పరిశ్రమ విరాళం రూ.9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్ఎం క్లాస్, ఐఅండ్‌బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్‌వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. -
పీఎం కేర్స్‌కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
రూ.100 కోట్ల సాయం.. మోదీ ప్రశంస!
న్యూఢిల్లీ: కలిసి కట్టుగా పోరాడి భారత్ మహమ్మారి కరోనాను తరిమికొడుతుందని ప్రధానమంత్రి మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కరోనాపై పోరును మరింత బలోపేతం చేసే విధానం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున రూ.100 కోట్లు విరాళం అందించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దామనిని ప్రధాని ప్రశంసించారు. కాగా, బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ పీఎం కేర్స్‌తోపాటు రూ.55 కోట్లను ఆయా రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా అతన్ని బిలియనీర్ చేసింది) మహారాష్ట్ర, గుజరాత్‌కు రూ.10 కోట్లు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్గర్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రెండున్నర కోట్ల చొప్పున సాయం చేసింది. కోవిడ్ కట్టడికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతునిస్తున్నామని ప్రకటించింది. కాగా, లాక్డౌన్ భయాల్లో జనం భారీగా కొనుగోళ్లు సాగించడంతో బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థల్లో ఒకటైన డీమార్ట్‌కు అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 206 డీమార్ట్ సూపర్మార్కెట్లు ఉన్నాయి. (చదవండి: కరోనాతో ఫైట్‌కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం) Together, India will certainly overcome the COVID-19 menace. The manner in which people from all walks of life are making the fight stronger is commendable. The contribution to PM-CARES by Bright Star Investments is appreciable. https://t.co/BIfCCT9Zup — Narendra Modi (@narendramodi) April 14, 2020 -
పీఎం కేర్స్‌పై పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయవాది ఎంఎల్.శర్మ దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దురుద్దేశంతో కూడుకున్నదని, అందుకే దీన్ని తిరస్కరిస్తున్నట్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. -
పీఎం కేర్స్ ఫండ్‌పై పిల్.. రేపు విచారణ
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కరోనాపై పోరులో భాగంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్ ఫండ్ భారీగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. అయితే పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ‘మార్చి 28వ తేదీన కోవిడ్-19 పోరాటంలో భాగంగా ప్రజలు విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. ఇందు కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు సాయం అందించడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్టికల్ 267 ప్రకారం దీనిని పార్లమెంట్ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ రూపొందించలేదు. అలాగే దీనికి పార్లమెంట్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదం లేదు’ అని పిల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బదిలీ చేయాలని కోరారు. కాగా, ఈ పిల్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శాంతనగౌదర్‌లతో కూడిన ధర్మాసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. -
ఆ పోటీకి ఎంట్రీ ఫీజు లేదు..
సాక్షి, సిటీబ్యూరో: ఆ పోటీకి ఎంట్రీ ఫీజు లేదు. అలాగని అందరూ పాల్గొనేద్దాం అంటే కుదరదు. ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి గాను నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటైన పీఎం కేర్స్‌కు తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళమే పోటీలో పాల్గొనేందుకు అర్హతగా పలువురు టీనేజీ ఔత్సాహిక చదరంగం క్రీడాకారులను ఆకట్టుకున్న ఈ ఆన్లైన్ టోర్నమెంట్లో 80 మంది పాల్గొనగా కేపీహెచ్‌బీ నివాసి రవితేజ గెలుపొందారు. కొంత కాలంగా చెస్ పోటీల్లో రాణిస్తున్న రైల్వే ఉద్యోగి రవితేజ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... ఎన్ని పోటీల్లో గెలిచినా...లాక్ డౌన్ టైమ్‌లో గెలవడం, అది కూడా ఒక మంచి పనిలో భాగం కావడం ఆనందంగా ఉంది నాకు ఈ పోటీలో వచ్చిన ప్రైజ్ మనీ కూడా నేను పీఎంకేర్స్ ఫండ్కే అందజేశా. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం ఏర్పాటైన పిఎమ్ కేర్స్ ఫండ్‌కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించిన యువ చెస్ క్రీడాకారులు ముంబయికి చెందిన అండర్ 17 చెస్ ఛాంపియన్ వేదాంత్ పనేశర్ , అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. ఆదర్శ్ త్రిపాఠి (14), యష్ శ్రీవాస్తవ (17)లు గత 7వ తేదీన ఈ ఆన్లైన్ టోర్నమెంట్‌ను దాదాపు 2గంటల పాటు నిర్వహించారు. వీరు ఏర్పాటు చేసిన ది చెస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజూ వసూలు చేయకుండా వారిని నేరుగా పీఎమ్ కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వమన్నారు. అలా అందించిన తర్వాత దానిని స్క్రీన్ షాట్ తీసి పోటీ నిర్వాహకులకు పంపిన తర్వాతే పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ముంబయ్, నాగ్‌పూర్, నోయిడా నగరాలతో పాటు మన హైదరాబాద్ నుంచి కూడా ఇందులో పలువురు పాల్గొన్నారు. క్రీడాకారులు ఫీజు రూపంలో రూ.1.05లక్షలు నేరుగా పిఎం కేర్స్ ఫండ్‌లో జమచేశారు. ఈ టోర్నమెంట్లో కేటగిరీల వారీగా గెలుపొందిన 20 మందికి బహుమతులు కూడా నిర్వాహకులు సొంత ఖర్చులతో అందించారు. -
పీఎం కేర్స్ ఫండ్ : ఓలా భారీ విరాళం
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వాలకు సాయంగా పలు సంస్ధలు, వ్యక్తులు తమకు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు తమ వంతు సాయంగా ఓలా గ్రూప్ గురువారం పీఎం కేర్స్ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందచేసింది. పలు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు సైతం కంపెనీ రూ 3 కోట్ల విరాళం ప్రకటించింది. కరోనా మహమ్మారిపై నిరంతర పోరాటానికి ప్రభుత్వం చేస్తున్న సేవలు కొనియాడదగినవని, ఈ క్రమంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ 5 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ 3 కోట్లు విరాళం అందచేస్తున్నామని ఓలా గ్రూప్ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి : కరోనా కష్టాలు : ఓలా ఏం చేసిందంటే... -
యూట్యూబ్ ఛానల్ ఆదాయమంతా దానికే: రకుల్
సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ ఆక్టివ్‌గా ఉంటారు నటి రకుల్ ప్రీత్ సింగ్. యోగా, వర్కౌట్లకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే రకుల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో వంటలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా(మంగళవారం) ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనాపై పోరాటానికి పీఎం కేర్ ఫండ్స్‌కు అందించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా సోమవారమే హీరోయిన్ హన్సిక కూడా ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. (‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాద్షా’ ) ఈ మేరకు రకుల్ ‘ప్రస్తుతం నాకు చాలా సమయం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని అనుకున్నాను, దీనిలో అన్ని సరదా విషయాలను మీతో పంచుకుంటాను. దీని ద్వారా వచ్చే ఆదాయం పీఎం కేర్ ఫండ్‌కు వెళుతుంది. ప్రతి ఒక్కరం ఆనందాన్ని పంచుదాం. మార్పు కోసం ఇప్పుడే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేయండి’ అని కోరారు. ఇక తొలి వీడియోగా చాకొలెట్ పాన్‌కేక్‌ను ఎలా తయారు చేయాలో వీడియో చేసి అప్లోడ్ చేశారు. కాగా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 200 కుటుంబాలకు రకుల్ ఆహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారికి ఈ సహాయం చేస్తున్నారు. రకుల్ ప్రస్తుతం ఇండియన్-2లో నటిస్తున్నారు. (కరోనాతో 14 నెలల చిన్నారి మృతి ) మీ అమ్మ అలానే చేసిందా..రకుల్ ఫైర్ View this post on Instagram A lot of time on hand so I thought of launching my YouTube channel which will have all things fun !! The revenue generated will go to @pmoindia fund ! Let’s spread joy and happiness in whatever way we can. Subscribe now to make a difference !! 😀😀🙏🏻 anddddd because it’s world health day we kickstart with... umm check out the video 😝 link in bio 😊 A post shared by Rakul Singh (@rakulpreet) on Apr 7, 2020 at 7:37am PDT -
గావస్కర్ విరాళం రూ. 59 లక్షలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత క్రీడారంగం ప్రముఖులు తమవంతుగా విరాళాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మొత్తం రూ. 59 లక్షలు వితరణ చేశారు. 70 ఏళ్ల గావస్కర్ అందించిన విరాళం మొత్తానికి ఓ విశేషం ఉంది. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో34 సెంచరీలు టెస్టు ఫార్మాట్లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్లో చేశారు. దాంతో ఆయన సెంచరీ సంఖ్యకు గుర్తుగా రూ. 35 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన ఆయన 24 సెంచరీలు సాధించారు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు తరఫున చేసిన 24 సెంచరీల సంఖ్యకు గుర్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి గావస్కర్ రూ. 24 లక్షలు అందించారు. ఈ ఆసక్తికర విషయాన్ని సునీల్ గావస్కర్ తనయుడు రోహన్ గావస్కర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా గుజరాత్ సీఎం ఫండ్‌కు విరాళం ఇచ్చినట్టు ప్రకటించాడు. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. కశ్యప్ విరాళం రూ. 3 లక్షలు మరోవైపు భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు, హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ కరోనాపై పోరాటానికి మద్దతుగా తెలంగాణ సీఎం సహాయనిధికి తనవంతుగా రూ. 3 లక్షలు విరాళం ఇచ్చాడు. -
102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...
న్యూఢిల్లీ: వయోభేదం లేకుండా... సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా... జాతీయ, అంతర్జాతీయస్థాయి హోదా పట్టించుకోకుండా... కరోనా మహమ్మారిని ఓడించడానికి... ఈ పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా భారత క్రీడాకారులందరూ చేయూతనిస్తున్నారు. ఇటీవల తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్ ఇషాసింగ్ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేయగా... గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల భారత జూనియర్ గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించాడు. జూనియర్‌స్థాయిలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ భాటి క్రీడాకారుడిగా గత ఎనిమిదేళ్లలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 150 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను గెల్చుకున్న 102 ట్రోఫీలను 102 వ్యక్తులకు విక్రయించాడు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 4 లక్షల 30 వేలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు అర్జున్ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం విశేషం. -
కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచమంతా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నటులు రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా కృష్ణంరాజు కుటుంబం పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించడానికి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ మందున్నారు. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు. -
కరోనా టైమ్స్: ఆనంద్‌తో చెస్ ఆడే ఛాన్స్!
అబుదాబి: కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఆరుగురు అగ్రశ్రేణి భారత చెస్ ఆటగాళ్లు ముందుకొచ్చారు. ఆన్లైన్లో చెస్ ఆడటం ద్వారా వచ్చిన సొమ్మును పీఎం కేర్స్ అందిస్తామని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా చెప్పారు. ఆనంద్‌తో పాటు మొత్తం ఐదుగురు ఆటగాళ్లు యూఏఈ వేదికగా ఏప్రిల్ 11 న (శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో చెస్ ఆడనున్నారు. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, పి.హరికృష్ణ, ద్రోణవల్లి హారికతో పాటు.. విశ్వనాథన్ ఆనంద్, బి.అధిబన్, విదిత్ గుజరాతి ఆన్లైన్ గేమ్‌లో భాగమవుతారు. chess.com పోర్టల్ ద్వారా ఈ గేమ్ నిర్వహిస్తారు. కాగా, భారత టాప్ చెస్ ప్లేయర్లతో ఆడాలనుకు వారు 25 డాలర్లతో పేరు నమోదు చేసుకోవాలి. కనీసం 150 అమెరికన్ డాలర్లు చెల్లించినవారు కచ్చితంగా ఆనంద్‌తో ఆడే అవకాశం దక్కించుకుంటారు. లేదంటే ఎవరైనా ఇద్దరు భారత ఆటగాళ్లతో (ఆనంద్ సహా) తలపడే వీలుంది. ‘నూతన ప్రయత్నాలు చేసేందుకు ఇవే మంచి సమయాలు. ఇంటి వద్ద ఉన్నప్పుడు సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. చెస్ ఫ్యామిలీ బాండ్ ఉన్న ఆట. దీనిని బోర్డుపైనా, ఆన్లైన్లో కూడా ఆడొచ్చు’అని ఆనంద్ పేర్కొన్నారు. కాగా, గతవారం ఆనంద్‌తోపాటు మరో 48 మంది క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించాలని ప్రధాని వారికి విజ్ఞప్తి చేశారు. ఇక భారత్ వ్యాప్తంగా 4 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. ఇదిలాఉండగా.. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆనంద్ జర్మనీలో చిక్కుకు పోయారు. -
కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.155 కోట్లను విరాళంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు, కరోనా ప్రభావిత రాష్ట్రాలకు రూ.55 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. (ఆందోళన వద్దు) దీని గురించి డీమార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణన్ డామని మాట్లాడుతూ.. "భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఇంతకుముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలను సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. మన సమాజాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమవంతు కృషి చేయాల"ని పిలుపునిచ్చారు. కాగా డీమార్ట్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు ప్రకటించగా.. మహారాష్ట్ర, గుజరాత్‌లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) -
ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా సహాయక చర్యల కోసం ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన సహాయ నిధి తరహాలో సైబర్ నేరగాళ్లు నకిలీది రూపొందించి విరాళాలు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని గమనించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం భారత ప్రభుత్వం ఎస్బీఐ బ్యాంకు ద్వారా యూపీఐ ఐడీని క్రియేట్ చేసింది. pmcares@sbi పేరుతో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. దీనికి విరాళాల వెల్లువెత్తుతుండటంతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కరోనా సహాయ చర్య కోసం నిధులు అందించే దాతల్ని బురిడీ కొట్టించడానికి ఆరు బోగస్ యూపీఐ ఐడీలను సృష్టించారు. pmcares@pnb,pmcares@hdfcbank, pmcare@yes bank, pmcare@ybl, pmcare@upi, pmcare@sbi, pmcares@icici' పేర్లతో ఇవి చెలామణి అవుతున్నాయి. ఈ యూపీఐ ఐడీలను పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు ప్రతి నిత్యం వేల మందికి ఎస్సెమ్మెస్‌లు పంపుతూ.. కాల్ సెంటర్ల పేరుతో ఫోన్లు చేసి విరాళాలను కాజేస్తున్నారు. ఈ నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేసిన డబ్బు నేరగాళ్లకు చేరుతుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచిస్తున్నారు. పీఎం కేర్స్‌కు విరాళం ఇవ్వాలని భావించిన వారు pmindia.gov.in వెబ్‌సైట్‌ను వీక్షించాలని పేర్కొన్నారు. -
పీఎం కేర్స్ ఫండ్ : నిర్మలా సీతారామన్ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపునకు కార్పొరేట్ దిగ్గజాలతో పాటు, పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన వంతుగా పీఎం నిధికి విరాళ మిస్తున్నట్టుగా ప్రకటించారు. తన జీతం నుండి లక్ష రూపాయలు విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందించినట్టు శుక్రవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ్ భవన్ శాఖకు తన ఖాతా నుండి లక్ష రూపాయలు డెబిట్ చేసి, పిఎం కేర్స్ ఫండ్‌కు క్రెడిట్ చేయాలంటూ ఒక లేఖ రాశారు. కరోనావైరస్ నివారణ, బాధితులకు సాయం తదితర అవసరాల నిమిత్తం ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ తో ఒక నిధిని ప్రారంభించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ ముందుకు వచ్చి ఎంత చిన్న మొత్తంగానైనా విరివిగా సాయం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పలు కంపెనీలు, సీఈఓలు, సెలబ్రిటీలు ఈ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. ముఖ్యంగా ఆర్ఐఎల్, పేటీఎంలు రూ .500 కోట్లు, కోల్ ఇండియా రూ .220 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ రూ .150 కోట్లు, ఉదయ్ కోటక్ రూ .50 కోట్లు ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, లతా మంగేష్కర్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు కూడాఈ పీఎం నిధికి అండగా నిలిచారు. అలాగే 51 కోట్ల రూపాయల విరాళాన్ని బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పిల్లలతో కలిసి విరాళమిచ్చిన బాలీవుడ్ నటి
కరోనాతో పోరాడుతున్న వారికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ముందుకు వచ్చింది. తన ఇద్దరు పిల్లలు సమీరా కపూర్, కియాన్ కపూర్‌తో కలిసి విరాళం ఇచ్చినట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విరాళానికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. "ప్రతీ ప్రాణం అవసరమైనదే.. అందుకే నా పిల్లలతో పాటు పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు నా వంతు సాయం చేశాను. చిన్న సాయం ఎంతమంది ప్రాణాలనైనా కాపాడవచ్చు. అందుకే మీరు కూడా కదలండి. మన దేశం కోసం, మానవత్వం కోసం మీ వంతు సాయం చేయండి" అని అభిమానులకు పిలుపునిచ్చింది. అయితే ఎంత డబ్బు విరాళంగా ఇచ్చిందన్న విషయాన్ని వెల్లడించలేదు. ఆమె సోదరి కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్ సైతం పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌తోపాటు యునిసెఫ్, ఐఏహెచ్‌వీ సంస్థలకు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరిష్మా హ్యాండ్ బ్యాగ్ ధర వింటే షాక్’) -
రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్
ఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారీ విరాళం ప్రకటించారు. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ దేశం కోసం మనం ఏం చేశామన్నది అసలు ప్రశ్న. నేను నా రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందిస్తున్నాను. మీరు కూడా తోచినంత సహాయం చేయండి’అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. (రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ!) కరోనా మహమ్మారీని ఎదుర్కొనేందుకు గౌతమ్ గంభీర్ చేసిన రెండో సహాయం ఇది. ఇప్పటికే సోమవారం లోక్‌సభలో ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు కావాల్సిన పరికరాల కోసం తన ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ (ఎంపీఎల్‌ఎడీ) నుంచి రూ .50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. (అయ్యో.. వారి పెళ్లి పెటాకులేనా?! ) కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి దాతలు చేయూతనివ్వాలని శనివారం ప్రధాని నరేంద్రమోదీ కోరిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు దేశంలో 1965 మంది కరోనా బారినా పడగా.. 50 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 151 మంది డిశ్చార్జి అయినట్లు అలాగే బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 437 కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. (మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. హైకోర్టు స్టే ) -
హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం
సాక్షి, ముంబై: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ కరోనాపై పోరుకు సాయం చేసేందుకు నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రూ .150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్స్ ఫండ్)కి ఈ సాయాన్ని అందించనునున్నామని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ వంతు సాయంగా బాధితుల ఉపశమన, పునరావాస చర్యలకు మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది మనందరికీ అనిశ్చితమైన, కష్టమైన సమయం. కరోనాని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా సాయుధ పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఎనలేని సేవలందిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలన్నారు. చదవండి : కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
కరోనా: విదేశీ విరాళాలు కోరనున్న కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో ఉద్భవించిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. దీని దెబ్బకు ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాంతకమైన కరోనాను ఎదుర్కొవడంలో భాగంగా లాక్డౌన్ విధించాయి. ఇక కరోనాను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రాముఖుల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన విరాళాలు అందించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందులో భాగంగానే ‘ పీఎం కేర్స్’ అనే అకౌంట్‌ను రూపొందించారు. (కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’) దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి భూరి విరాళాలను అందించి తమ ఔదర్యాన్ని చాటుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్వదేశంలో ఉన్న ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన వారిని కూడా విరాళాలు అందిచాలని కోరనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక సహాయక కేంద్రాన్ని మార్చి 16న ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సెల్‌కు 3300 ఫోన్ కాల్స్, 2200 ఈ-మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారిన పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. -
హాకీ ఇండియా, ఏఐఎఫ్ఎఫ్ విరాళం రూ. 25 లక్షలు
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ), అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేరాయి. పీఎం కేర్స్ సహాయ నిధి కోసం హెచ్ఐ, ఏఐఎఫ్ఎఫ్ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి. గంగూలీ ఉదారత కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్ హెడ్‌కార్టర్స్ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. -
కరోనా.. విరాళం ప్రకటించిన కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19పై(కరోనా వైరస్) వ్యతిరేక పోరాటానికి తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటితోపాటు ఒక నెల జీతాన్ని పీఎం కేర్స్ ప్రత్యేక నిధికి విరాళంగా ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికిగానూ ఎంపీల్యాండ్స్ నిధుల నుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (‘కరోనా కంటే దాని వల్లే ఎక్కువ మరణాలు’) దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలను, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో కరోనా సహాయ కార్యక్రమాలకోసం మరో రూ.50లక్షలను ఇస్తున్నట్లు తెలిపారు. విరాళాలకు సంబంధించిన లేఖలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, ఎంపీ ల్యాడ్స్ కమిటీ చైర్మన్లకు పంపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి విరాళాల రూపంలో అందజేయాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. (కరోనా: న్యూయార్క్ గవర్నర్ భావోద్వేగం) -
బడా పారిశ్రామికవేత్త వంద కోట్ల విరాళం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకుగానూ పీఎం కేర్స్‌కు రూ.100 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. తమ సంస్థలు ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా, హెచ్ఎంఈఎల్ తరపున ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కరోనాను ఎదుర్కోవడంలో భారతీయులు ఎంతో తెగువ చూపుతున్నారని కొనియాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం అత్యంత అవసరమన్నారు. అందులో భాగంగా కరోనా ప్రభావితులను రక్షించేందుకు, వైరస్‌తో పోరాడుతున్న దేశానికి మద్దతు తెలిపేందుకు ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. అంతేకాక తమ కంపెనీలు ప్రతిరోజూ 35 వేలమందికి ఆహారం అందజేస్తున్నాయని తెలిపారు. కాగా టాటా గ్రూప్స్ రూ.1500 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను, సినిమా ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారు. (కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు) -
రోహిత్ విరాళం రూ. 80 లక్షలు
ముంబై: మహమ్మారి ‘కోవిడ్–19’పై పోరు కోసం క్రీడా లోకం తరలివస్తోంది. విరాళాల రూపంలో క్రీడాకారులు కరోనా కట్టడికి తమకు సాధ్యమైనంత సహాయ సహకారాల్ని అందజేస్తున్నారు. భారత క్రికెట్ వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం రూ. 80 లక్షల విరాళం ప్రకటించాడు. పీఎం–కేర్స్ నిధికి రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, ‘జొమాటో ఫీడింగ్ ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 5 లక్షలు, వీధి శునకాల సంక్షేమం కోసం రూ. 5 లక్షలు కేటా యించినట్లు రోహిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారత మాజీ కెప్టెన్, కోచ్, దిగ్గజ లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా ప్రధానమంత్రి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళమిచ్చాడు. అయితే ఇచ్చిన మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా రూ.3 లక్షలు కేంద్రం, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాల కోసం కేటాయించాడు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 5 లక్షలు ప్రకటించింది. -
పీఏం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ భారీ విరాళం
ముంబై : కరోనా వైరస్‌పై దేశం జరిపే పోరులో సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ 500 కోట్ల విరాళం ప్రకటించింది. పీఎం సహాయ నిధికి అందించే మొత్తానికి అదనంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ 5 కోట్ల చొప్పున విరాళాలను అందచేస్తామని ఆర్ఐఎల్ తెలిపింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు 100 పడకలతో కోవిడ్-19 హాస్పిటల్ రెండు వారాల్లోనే సిద్ధమైందని, వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ ప్రొటెక్టివ్స్ గేర్స్‌ను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పది రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదలకు భోజనం సరఫరా చేయడంతో పాటు ప్రతిరోజూ లక్ష మాస్క్‌లను వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షకులకు సరఫరా చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తామని పేర్కొంది. చదవండి : కరోనాపై పోరుకు రిలయన్స్ సిద్ధం.. -
‘పీఎం కేర్స్’కు విరాళాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్ ఫండ్)కు ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఏదైనా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం, బాధితులకు ఉపశమనం అందించడం లాంటి ప్రాథమిక లక్ష్యంతో కూడిన జాతీయ నిధిని ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్) ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ కు ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ ఫండ్ చిన్న చిన్న విరాళాలను కూడా అనుమతిస్తుంది. ఈ ఫండ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలంతా చిన్న విరాళాన్ని అయినా అందించవచ్చు. పౌరులు లేదా సంస్థలు పీఎం ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా పై వివరాలను ఉపయోగించి పి.ఎం. కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించవచ్చు. ఈ చెల్లింపు పద్ధతులు సైతం పీఎం ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (భీమ్, ఫోన్‌పే, అమెజాన్ పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్, మొదలైనవి),ఆర్.టి.జి.ఎస్./ఎన్.ఇ.ఎఫ్.టి.(నెఫ్ట్), ఈ నిధికి అందించే విరాళాలకు సెక్షన్ 80(జి) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. -
కరోనాపై పోరాటానికి ‘పీఎం-కేర్స్’
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూత ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు సేకరణ కోసం.. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర పరిస్థితుల నిధి(పీఎం-కేర్స్)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కోవిడ్-19పై పోరాటానికి అండగా నిలబడాలనుకునే వారు పీఎం-కేర్స్‌కు విరాళాలు అందించాలని కోరారు. ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. తక్కువ విరాళాలను కూడా తీసుకుంటామని వెల్లడించారు. విపత్తు నివారణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఆరోగ్యకరమైన, శ్రేయస్కరమైన దేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. (కరోనాపై పోరు: టాటా ట్రస్ట్ కీలక ప్రకటన!) పీఎం-కేర్స్ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర సమాచార వెల్లడించింది. ట్రస్ట్ సభ్యుల్లో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా ఉంటారని తెలిపింది. విరాళాలు అందించే వారి కోసం వివరాలు వెల్లడించింది. ఈ కింద ఉన్న వివరాలు ఆధారంగా దాతలు విరాళాలు ఇవ్వొచ్చు.