సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. కాగా కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు స్వచ్ఛందంగా విరాళం ఇస్తున్నారు. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు)
అంతేకాకుండా ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా’ ఉద్యమానికి రాష్ట్రపతి భవన్ మద్దతు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంతవరకూ రాష్ట్రపతి భవన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ పర్యటనలు తగ్గించుకోనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరాన్ని విధిగా పాటించేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ద్వారా ప్రజలకు చేరువ కానుంది. ఈ చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్‌లో దాదాపు 20 శాతం ఆదా అవుతాయని అంచనా. (వినూత్న పద్దతిలో భౌతిక దూరం)
Comments
Please login to add a commentAdd a comment