rastrapati bhavan
-
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనం దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1912లో ప్రారంభమై, 1929లో పూర్తయింది. ప్రముఖ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ ఈ భవనానికి రూపకల్పన చేశారు.రాష్ట్రపతి భవనంలో 340 గదులు ఉన్నాయి. ఈ గదులలో హిమాలయ బెడ్రూమ్ అద్భుతమైన లగ్జరీ బెడ్రూమ్గా గుర్తింపు పొందింది. లోపల ఒక పాఠశాల కూడా ఉంది. దీనిని తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ అని పిలిచేవారు. ఇది 1946లో నిర్మితమయ్యింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది.2019లో ఢిల్లీ ప్రభుత్వం దీనిని కేంద్రీయ విద్యాలయంగా మార్చింది. నాటి నుండి దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం అని పిలుస్తున్నారు. మిగిలిన కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రపతి భవనంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇక, శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. అలాగే, ఈనెల 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించనున్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. కాగా కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు స్వచ్ఛందంగా విరాళం ఇస్తున్నారు. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు) అంతేకాకుండా ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా’ ఉద్యమానికి రాష్ట్రపతి భవన్ మద్దతు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంతవరకూ రాష్ట్రపతి భవన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ పర్యటనలు తగ్గించుకోనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరాన్ని విధిగా పాటించేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ద్వారా ప్రజలకు చేరువ కానుంది. ఈ చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్లో దాదాపు 20 శాతం ఆదా అవుతాయని అంచనా. (వినూత్న పద్దతిలో భౌతిక దూరం) -
రాష్ట్రపతి భవన్ కార్మికుడికి కరోనా పాజిటివ్!
-
రాష్ట్రపతి భవన్లో కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్ తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్ కారణంగా మృతి చెందారు. తాజాగా అతని కూడా వైరస్ సోకడంతో పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. మొత్తం 125 కుటుంబాల్లో 500 మందిని స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు ఢిల్లీ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్రపతి భవన్లో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలోని కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం అర్థరాత్రి నాటికి కరోనా కేసుల సంఖ్య 2,003కి చేరింది. మరోవైపు వైరస్ కారణంగా 45 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్డౌన్ ఆంక్షలు సడలించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. -
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
-
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ట్రంప్ దంపతులతో పాటు ఈ విందులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ కేంద్ర మంత్రులు, తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రపతి భవన్ విశేషాలను స్వయంగా వివరించారు. విందుకు విచ్చేసిన అతిథులను వారికి పరిచయం చేశారు. ఆపై విందులో ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించారు. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్ సర్వ్ చేసిన తర్వాత.. సాలమన్ ఫిష్ టిక్కాతో ఈ గ్రాండ్ డిన్నర్ ప్రారంభమైంది. వెజిటేరియన్ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను వడ్డించారు. రాష్ట్రపతి భవన్ సిగ్నేచర్ డిష్ దాల్ రైసీనాతో పాటు.. మటన్ బిర్యానీ, మటన్ ర్యాన్, గుచ్చీ మటార్(మష్రూమ్ డిష్) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో భాగమైంది. డిన్నర్ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్ రాబ్డీలను అతిధులు ఆరగించారు. చదవండి : ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్ -
జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ రోడ్డు మార్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వర్సిటీ వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తొలుత జేఎన్‌యూ విద్యార్థులు హెఆర్డీ అధికారులను కలిసేందుకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. వీరికి మద్దతుగా విపక్ష నేతలు, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, శరద్ యాదవ్‌లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్కడ హెఆర్డీ అధికారులను కలిసిన అనంతరం.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలని విద్యార్థులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీగా వెళ్తున్న వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత
-
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
అలకబూనిన జేడీయూ, కేబినెట్లోకి నో..
సాక్షి, న్యూఢిల్లీ: రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ మంత్రివర్గ కూర్పుపై అలకబూనింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడనున్న మంత్రివర్గంలో తమకు ఒకటే మంత్రి పదవి కేటాయించడంపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ఇవాళ రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 8వేల మంది అతిథులు పాల్గొంటున్నారు. మోదీ కేబినెట్లో మొత్తం 60 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 46 మందికి కేబినెట్లో బెర్త్‌లు ఖరారు అయ్యాయి. -
మోదీ రెండోసారి..
న్యూఢిల్లీ: దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథుల మధ్య కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఆయనతో పాటు 50–60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ వీరితో ప్రమాణంచేయిస్తారు. బిమ్స్టెక్ దేశాధినేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పలువురు స్వపక్ష, విపక్ష నేతలు, సీఎంలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరుకానున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి అశోక్ మాలిక్ చెప్పారు. తరలిరానున్న బిమ్స్టెక్ దేశాల అధినేతలు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ వంటి బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్) నేతలు తమ హాజరును ఇప్పటికే ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కూడా తాము హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మోదీ ఆహ్వానాన్ని వారు అంగీకరించినట్లు తెలిపాయి. వీరితో పాటు విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా హాజరుకానున్నారు. కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద కేజ్రీవాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, షారుక్ ఖాన్, కంగన రనౌత్, ద్రవిడ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, బిల్‌గేట్స్ తదితరులకు ఆహ్వానం అందింది. 8 వేల మంది ఇదే మొదటిసారి 2014లో కూడా మోదీ రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు 3,500 మందికి పైగా అతిథులు అప్పుడు హాజరయ్యారు. సాధారణంగా విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు వారి సత్కార కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అయితే 1990లో చంద్రశేఖర్, 1999లో వాజ్‌పేయిలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 8 వేల మంది అతిథులు హాజరుకావడం మాత్రం ఇదే మొదటిసారి. విదేశీ అతిథుల కోసం ‘దాల్ రైసీనా’ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్య అథిథులు అందరికీ ‘పన్నీర్ టిక్కా’ వంటి ఉపాహారం అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు విదేశీ అతిథుల కోసం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బిమ్స్టెక్ దేశాల అధినేతలు తదితర 40 మంది అతిథులు విందులో పాల్గొంటారు. ఇతర ముఖ్య వంటకాలతో పాటు రాష్ట్రపతి భవన్ వంటశాలలో ప్రత్యేక వంటకమైన ‘దాల్ రైసీనా’ను అతిథులకు వడ్డించనున్నారు. దీని తయారీకి సుమారు 48 గంటల సమయం పడుతుందని, అందువల్ల మంగళవారమే ఇది ప్రారంభమైనట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిపి దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఓ అధికారి చెప్పారు. నేను కేబినెట్లో చేరలేను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని తాను కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరమైతే సలహాలు ఇస్తానని తెలిపారు. మోదీకి రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఐదేళ్ల పాటు మోదీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో నేర్చుకున్నా. గత 18 నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని జైట్లీ తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిగానే మోదీకి జైట్లీ తన మనసులోని మాటను మౌఖికంగా వెల్లడించారు. 66 ఏళ్ల జైట్లీ బయటకు వెల్లడించని వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స కోసం గత వారం ఎయిమ్స్‌లో చేరారు. జనవరిలో అమెరికాలో సర్జరీ చేయించుకున్న జైట్లీ, గత నెలలో అధికార పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు చికిత్స పొందారు. అంతకుముందు పలు సర్జరీలు జరిగాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ 47 ఏళ్ల వయస్సులో పార్లమెంటులో అడుగుపెట్టారు. జైట్లీ నివాసానికి మోదీ మంత్రివర్గంలో చేరలేనని లేఖ ద్వారా జైట్లీ తెలిపిన వెంటనే వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని జైట్లీ అధికార నివాసానికి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జైట్లీ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లేఖ అందినట్టుగా తెలియజేసిన మోదీ.. ఆర్థిక వ్యవస్థకు, జీఎస్టీ అమలుకు జైట్లీ చేసిన కృషిని అభినందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ విజ్ఞప్తిని మోదీ అంగీకరించారా? లేదా? అన్నది తెలియలేదు. -
30న ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం
-
30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి గద్దెనెక్కనున్నారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్...మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో నువ్వా నేనా అన్నట్టు సాగిన సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అసాధారణ రీతిలో 303 స్థానాలను కైవసం చేసుకుంది. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
రాష్ట్రపతిని ఆశీర్వదించిన పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క
-
‘మోదీ’ సినిమా చూసిన కోవింద్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చిన్న నాటి సంగతుల స్ఫూర్తితో తెరకెక్కించిన ‘చలో జీతె హై’ చిత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిలకించారు. 32 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని రాష్ట్రపతిభవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. తన చిన్న ప్రపంచంలో ఇతరుల కోసం ఏం చేయగలనని అన్వేషించే బాలుడి చుట్టూ కథ తిరుగుతుంది. ఒకసారి వివేకానందుడి పుస్తకం చదువుతుండగా ‘ఇతరుల కోసం జీవించేవారిదే నిజమైన జీవితం’ అన్న సూక్తి అతడిని ఆకర్షిస్తుంది. ఈ చిత్ర సందేశం అందరినీ కదిలిస్తుందని నిర్మాత భూషణ్ కుమార్ అన్నారు. ఈనెల 29న స్టార్నెట్వర్క్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుంది. -
ఉగ్రవాదంపై పోరు ఏ మతానికి వ్యతిరేకం కాదు
-
కోవింద్ అధికారులుగా మోదీ వీర విధేయులు
న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు భరత్ లాల్, సంజయ్ కొఠారి, అశోక్ మాలిక్‌లను సీనియర్ అధికారులుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ నియమించింది. ఈ ముగ్గురు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయులు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన భరత్లాల్ను రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా నియమించారు. గుజరాత్‌కు చెందిన ఆయన మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. ఆయన గుజరాత్ రెసిడెంట్ కమిషనర్‌గా 2010 నుంచి 2014 వరకు పనిచేశారు. మోదీ ప్రధాన మంత్రికాగానే ఆయన్ని ఢిల్లీకి రప్పించుకున్నారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖలో కార్యదర్శిగా పనిచేసి రిటైరైనా ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కొఠారిని ఇప్పుడు రాష్ట్రపతికి కార్యదర్శిగా నియమించారు. ప్రధాని మోదీ వద్ద అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న పీకే మిశ్రాకు కొఠారి అత్యంత సన్నిహితుడు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మాలిక్ కూడా మోదీకి విశ్వాసపాత్రుడనే విషయం మీడియా వర్గాల్లో అందరికి తెల్సిందే. ఆయన్ని కోవింద్ ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయం సిఫార్సుల మేరకే ఈ ముగ్గురి నియామకం జరిగినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన అధికారులను ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని ఇంతకాలం ప్రణబ్ ముఖర్జీ వద్ద పనిచేసిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తనకు ఫలానా వ్యక్తులు కావాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను కోరితే ఆ మేరకు నియామకాలు జరుపుతూ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, రాష్ట్రపతి కోరుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగానికి అత్యవసరం అనుకున్న సందర్భాల్లో మినహా అన్ని సందర్భాల్లో రాష్ట్రపతి సిఫార్సులనే ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పరిగణలోకి తీసుకుంటుందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం మధ్య ప్రభుత్వ వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఈ విధేయులైన వ్యక్తులు పనికిరావచ్చుగానీ, ప్రణబ్ ముఖర్జీ తన వీడ్కోలు సభలో హెచ్చరించినట్లుగా ప్రభుత్వ ఆర్డినెన్స్‌లను రాష్ట్రపతి ఆమోదిస్తూ పోతుంటేనే ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన చెప్పారు. -
అగ్రిగోల్డ్ అక్రమాలపై రాష్ట్రపతి భవన్ సీరియస్!
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ అక్రమాలపై రాష్ట్రపతి భవన్ సీరియస్‌గా స్పందించింది. గత ఏడాది డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అండాల్ రమేష్ బాబు రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లేఖపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పిటిషనర్‌కు చెప్పాలని ఆర్థికశాఖ, సెబీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. దీంతో పిటిషనర్ రమేష్ బాబు ఆయా శాఖల నుంచి సమాచారాన్ని లెటర్ ద్వారా అందుకున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ కేసు విచారణలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మొదటి దశ ద్వారా రూ. 7.53 కోట్లు వచ్చినట్లు వేలం పర్యవేక్షణ కమిటీ నిన్న ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే మొదటి దశలో రూ. 40 కోట్లు వస్తాయని ఆశించామని కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ తెలిపారు. రెండవ దశ వేలం ప్రక్రియ వచ్చే నెల 11, 12 తేదీల్లో మొదలవుతుందని, మూడో దశ వేలానికి రూ. 1,100 కోట్ల విలువ చేసే పలు ఆస్తులను గుర్తించామని ఆయన తెలిపారు. -
కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌తో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. వేములవాడ నుంచి కేసీఆర్ నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగంలో నిన్న రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అయితే అగ్నిప్రమాదం కారణంగా యాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్...రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా శీతాకాలం విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ఈనెల 18న హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31వరకు హైదరాబాద్‌లోనే బస చేస్తారు. -
సచిన్, సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రదానం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్లో ప్రణబ్ ముఖర్జీ మంగళవారం వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 41 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. సచిన్ గత ఏడాది రిటైర్మెంట్ అయిన రోజునే ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన సచిన్...ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన 'పద్మ విభూషణ్' అందుకున్నారు. భారత రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సచిన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
సచిన్‌కు నేడు ‘భారతరత్న’ ప్రదానం
-
సచిన్‌కు నేడు ‘భారతరత్న’ ప్రదానం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘భారతరత్న’ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ వేడుక జరుగనుంది. సచిన్ గతేడాది రిటైర్మెంట్ అయిన రోజునే భారత ప్రభుత్వం అతనితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కెరీర్ అరంగేట్రంతోనే రికార్డుల్లోకెక్కిన (పిన్న వయస్కుడిగా) ఈ ముంబైకర్ నిష్ర్కమణతోనూ ఈ అవార్డు అందుకుంటున్న తొలి క్రీడాకారుడుగా రికార్డులకెక్కాడు. సచిన్, రావులిద్దరూ ఇదివరకే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అందుకున్నారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషితో పద్మ పురస్కారాలకు ఎంపికైన 41 మందికి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులను అందజేస్తారు. ‘క్రీడా ప్రపంచంలోనే సచిన్ టెండూల్కర్ గొప్ప దిగ్గజం. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులు నిరుపమానం. అతనికి అతనే సాటి. కెరీర్ అసాంతం సమున్నతమైన క్రీడాస్ఫూర్తిని చాటిన మహోన్నత వ్యక్తిత్వం సచిన్‌ది. అందువల్లే కెరీర్లో రికార్డులు... తన కీర్తికిరీటంలో అవార్డులు సాధించగలిగాడు’ అని కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొనియాడింది. -
సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధూ బాధ్యతలు చేపట్టారు. ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సంధూతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారి. ఆమె గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్‌గా పని చేస్తున్నారు.