న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చిన్న నాటి సంగతుల స్ఫూర్తితో తెరకెక్కించిన ‘చలో జీతె హై’ చిత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిలకించారు. 32 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని రాష్ట్రపతిభవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. తన చిన్న ప్రపంచంలో ఇతరుల కోసం ఏం చేయగలనని అన్వేషించే బాలుడి చుట్టూ కథ తిరుగుతుంది. ఒకసారి వివేకానందుడి పుస్తకం చదువుతుండగా ‘ఇతరుల కోసం జీవించేవారిదే నిజమైన జీవితం’ అన్న సూక్తి అతడిని ఆకర్షిస్తుంది. ఈ చిత్ర సందేశం అందరినీ కదిలిస్తుందని నిర్మాత భూషణ్ కుమార్ అన్నారు. ఈనెల 29న స్టార్‌నెట్‌వర్క్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment