కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్ | telangana cm kcr met Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

కుటుంబసభ్యులతో రాష్ట్రపతిని కలిసిన కేసీఆర్

Published Mon, Dec 28 2015 7:55 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

telangana cm kcr met  Pranab Mukherjee

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్తో కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. వేములవాడ నుంచి కేసీఆర్ నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. 

 

కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగంలో నిన్న రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అయితే అగ్నిప్రమాదం కారణంగా యాగంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్...రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా శీతాకాలం విడిది నిమిత్తం  రాష్ట్రపతి ప్రణబ్  ఈనెల 18న హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 31వరకు హైదరాబాద్లోనే  బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement