ఢిల్లీలోని జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య స్వల్ప ఘర్ణణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. మరికొంతమందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ రోడ్డు మార్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.