JNU campus
-
రణరంగంగా జేఎన్‌యూ వర్సిటీ.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్‌యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్‌యూ వర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీరామనవమి పూజ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్లో నాన్ వెజ్ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్లో ఏదైనా తినవచ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు. ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. -
సిద్ధాంతం కన్నా దేశం మిన్న
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో గురువారం స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘సైద్ధాంతిక విభేదాలుండొచ్చు. అది సహజమే. అవి దేశ ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలి కానీ నష్టపరిచేలా ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. జేఎన్‌యూలో నిరంతరం వామపక్ష, హిందుత్వ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుందన్న విషయం తెలిసిందే. సైద్ధాంతిక విబేధాలున్న పలు వర్గాలు.. తమ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ప్రకటిస్తూనే, ఒక్కటై, ఉమ్మడిగా పోరాటం చేశాయని స్వాతంత్య్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అందువల్ల, దేశ ప్రయోజనాలు, సమగ్రత విషయంలో సైద్ధాంతిక ప్రభావంతో నిర్ణయం తీసుకోవడం హానికరమవుతుందని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రేమను, అంకితభావాన్ని స్వామి వివేకానంద విగ్రహం ప్రజలకు నేర్పిస్తుందన్న విశ్వాసం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద కలలు కన్న దృఢమైన, సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఈ విగ్రహం నీడలోనే వివిధ అంశాలపై విద్యార్థులు చర్చలు జరపవచ్చని సూచించారు. ‘ఆత్మ విశ్వాసంతో పాటు అన్ని రంగాల్లో స్వతంత్రత, స్వావలంబన కలిగిన భారత పౌరులను తీర్చిదిద్దేలా మన విద్యా వ్యవస్థ ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఆ దిశగానే ఉంటుంది’ అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై వర్సిటీ విద్యార్థి సంఘం నిరసన తెలిపింది. విగ్రహావిష్కరణ కన్నా ముందు విద్యార్థులు వర్సిటీ నార్త్ గేట్ వద్ద ‘మోదీ గో బ్యాక్’, ‘వి వాంట్ ఆన్సర్స్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ‘స్కాలర్షిప్స్ రాని విద్యార్థుల గురించి ఆయన ఎందుకు మాట్లాడరు?’ అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఐషె ఘోష్, సాయిబాలాజీ ప్రశ్నించారు. ‘ఆసియాన్’తో బంధమే ముఖ్యం ఇండియా–ఆసియాన్ సదస్సులో మోదీ ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్)తో తమ బంధం నానాటికీ బలపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్–ఆసియాన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గురువారం 17వ భారత్–ఆసియాన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్–ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021–2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్ ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు. -
జేఎన్‌యూలో విగ్రహావిష్కరణ చెయ్యనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని జేఎన్‌యూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద అవిష్కరించనున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) సాయంత్రం 5 గంటలకి నార్త్ గేట్ వద్ద ఆందోళన పిలుపునివ్వడంతో యూనివర్శిటీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను జేఎన్‌యూఎస్‌యూ అవిష్కరించింది. ఇప్పటికే జేఎన్‌యూ విద్యార్థులు విగ్రహ ఏర్పాటు అంశాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థులను దేశ విద్రోహులుగా అభివర్ణించిన బీజేపీ, ఆరెస్సెస్.. ఇప్పుడు వర్సీటీకి ఎందుకు వస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విగ్రహావిష్కరణ అనేది కేవలం నిధుల దుర్వినియోగమేనని ఆరోపించారు. 2016లో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, ఇప్పుడు రైతులు దేశమంతటా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుంటే స్వామి వివేకానందను అవమానించినట్టేనని తెలిపారు. మరో విద్యార్థి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని, కానీ ప్రాధాన్యతలను గుర్తించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌యూని అనగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు. విగ్రహాలకు పెట్టే ఖర్చు విద్యార్థులపై పడే భారాన్ని తగ్గించేందుకు వినియోగిస్తే బాగుంటుదని సూచించారు. చదవండి: (బెయిల్ ఇప్పించి నిరసనలా?) ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జేఎన్‌యూలో జరగబోయే విగ్రహావిష్కరణ సాయంత్రం 6:30గంటలకి జరగనుందని తెలిపారు. దీనిపై మాట్లాడిన జేఎన్‌యూ వీసీ ఎం.జగదీష్ కుమార్ దేశంలో స్వామి వివేకానంద వంటి మేధావి, ఆధ్యాత్మిక నాయకుడు ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, యువతకు ఆయన స్పూర్తి కావాలన్నారు. దేశా నాగరికతను, సంప్రదాయలను గౌరవించాలని కోరారని తెలిపారు. -
సీఏఏ : హింస చల్లారంటే అదొక్కటే మార్గం!
మీరట్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు అన్ని వర్సిటీల్లో 10 శాతం సీట్లు కేటాయించారంటే ఆందోళనలు చల్లారుతాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం మీరట్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా బీజేపీ చేపట్టిన ర్యాలీలో సంజీవ్ బల్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఓ విన్నపం. సీఏఏ ఆందోళనలు సద్దుమణగాలంటే ఒకే ఒక పరిష్కారం. పశ్చిమ యూపీకి చెందిన విద్యార్థులకు అన్ని యూనివర్సిటీల్లో 10 శాతం కోటా కల్పిస్తే చాలు. ముఖ్యంగా జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆందోళనలు సద్దుమణుగుతాయి. అంతకుమించి మరేమీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు కాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నాటినుంచి వేలాది విద్యార్థులు దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అది చట్ట రూపం దాల్చిన అనంతరం సీఏఏ వ్యతిరేక ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై లాఠీ ఝుళిపించగా.. జేఎన్‌యూలో ముసుగు వేసుకున్న కొంతమంది దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగారు. అనంతరం ఈ దాడులపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాగా మంత్రి సంజీవ్ బల్యాన్ 2013 ముజఫర్‌నగర్ దాడుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ దాడుల్లో 60 మంది చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. చదవండి: వెనక్కి తగ్గని ‘షహీన్‌బాగ్’ దళితులపై హింసపట్ల స్పందన ఏది? -
ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం ఎవరంటే..
ముంబై: సీనియర్ నటుడు, దర్శకుడు నసీరుద్దీన్ షా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను ప్రశంసించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్ధీన్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఢిల్లీ విద్యార్థుల నిరసనలు గురించి విపులంగా చర్చించారు. అలాగే దీపికా జేఎన్‌యూను సందర్శించడాన్ని ఆయన అభినందించారు. ఇటీవల ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడి అనంతరం దీపిక అక్కడికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించిన విషయం తెలిసిందే. అదోక సాహోసోపేత చర్యగా నసీర్ అభివర్ణించారు. అదే విధంగా జేఎన్‌యూ సందర్శన తర్వాత దీపిక ఆదరణ తగ్గదని పేర్కొన్నారు. (దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు) అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వలన ఒక సెలబ్రిటీ భవిష్యత్తుకు హాని కలిగించదా అని ప్రశ్నించగా.. ‘నటుడు కేవలం తన గురించే ఆలోచిస్తాడు. అయితే దీపిక జేఎన్‌యూని సందర్శించింనందుకు ఆమె ధైర్యాన్ని ప్రశంసించాలి. ఆమె ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉంది. ఈ చర్య వల్ల తనకు నష్టం జరుగుతుందని తెలిసినా ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసింది. దీపికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు త్వరలోనే ఇవన్నీ మరిచిపోతారు. ఆమె దీనిని ఎలా స్వీకరిస్తుందో, ఈ నిర్ణయం ఆమె పాపులారిటీని తగ్గిస్తుందా.. ఇలాంటి విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం డబ్బు మాత్రమే’ అని నసీరుద్దీన్ తెలిపారు. కాగా నవంబరులో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును సవాలు చేస్తూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని కొంతమంది న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన 100 మంది ముస్లింలలో నసీరుద్దీన్ ఒకరు. వివాదాన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా సమాజానికి హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చదవండి :నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్! ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్! -
జేఎన్‌యూ విద్యార్థిగా ‘కంచ ఐలయ్య’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మనిషి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వెళుతుండగా పోలీసులు ఆపి ‘లోపల గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పేరెంట్స్, సంరక్షకులు లోపలికి పోరాదు’ అని చెప్పారు. ‘కానీ నేను జేఎన్‌యూ విద్యార్థిని’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఆయనకు 47 ఏళ్లు. కేరళకు చెందిన ఆయన పేరు మొహినుద్దీన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా 1989 నుంచి జేఎన్‌యూలో చదువుతున్నారు. అనే పోస్ట్ ఫేస్బుక్లో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. జేఎన్‌యూలో హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండగా, ఫీజుల పెంపును బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు సమర్థిస్తున్న విషయం తెల్సిందే. హాస్టల్ ఫీజులు అతి తక్కువగా ఉండడం వల్లనే 47 ఏళ్లు వచ్చిన వారు కూడా ఇప్పటికీ విద్యార్థులుగా హాస్టల్లో ఉంటున్నారన్న ఉద్దేశంతో జేఎన్‌యూ విద్యార్థుల పేరిట ‘శాస్త్రీ కౌశాల్కిషోర్డ్’ పేరిట ఓ అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వాసుదేవ్ జీ రామ్నాని, సుశీల్ మిశ్రా, హరిదాస్ మీనన్ తదితరులు రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఎంతవరకు నమ్మారో తెలియదు. కేరళకు చెందిన మొహినుద్దీన్ అంటూ పెట్టిన ఫొటోను చూసిన వారు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి ‘కంచ ఐలయ్య’ ఫొటో అది. తెలుగు వారందరికి అతను సుపరికితులే. ‘కంచ ఐలయ్య గొర్రెలకాపరి’ అని గర్వంగా చెప్పుకునే ఆయన ప్రముఖ దళితుల హక్కుల కార్యకర్త. రాజకీయ తత్వవేత్త, రచయిత. ‘వైశ్యాస్: సోషల్ స్మగ్లర్స్’ అంటూ ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో ‘బుద్దిజం’లో పీహెచ్డీ చేసిన ఆయన హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఏఎన్‌యూయూ)లో ‘సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జెఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లలో కూడా 47 ఏళ్ల మొహినుద్దీన్యే కాకుండా అసలు 40 ఏళ్లు దాటిన వారే లేరని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి. చదవండి: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్ జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమె! ఎందుకు అరెస్టు చేయలేదు? ‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’ -
దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను దీపికా పదుకొనేను విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. ఘటన జరిగి పదిరోజులకు పైగా కావస్తున్నా.. ఆమెపై కామెంట్లు ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దీపికపై విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జేఎన్‌యూలో దీపిక పర్యటించడంపై స్పందించారు. ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ ఆమెకు ఉందని, కానీ నేను మాత్రం తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా ప్రధాన పాత్రలో నటించిన పంగా మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్లో భాగంగా శుక్రవారం ఆమె ఓ మీడియాతో ముచ్చటించారు. (నువ్వు ఎవరికి మద్దతిస్తున్నావో తెలుసా!) ఈ సందర్భంగా జేఎన్‌యూలో జరిగిన హింసలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు దీపిక వెళ్లిన అంశంపై ఆమె స్పందించారు. ‘దీపిక ఏం చేసిందో. ఏం చేయబోతుందో. వాటిపై నేనే మాట్లాడలేను. ఏమైనా చేయగల హక్కు ఆమెకు ఉంది. కానీ నేను మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే దేశద్రోహులకు మద్దతు తెలపను. జవాన్లు మరణిస్తే.. సంబరాలు చేసుకునే వారితో చేతులు కలపను. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నే తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చునో’ అని చెప్పుకొచ్చారు. ఛపాక్ సినిమాపై బాయ్ కాట్ ప్రకటించడంపై మాట్లాడుతూ.. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని, ఎవరో బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏమి జరగదని చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాట్లాల్లో దీపిక చర్యను పరోక్షంగా తప్పుపట్టినట్లే అర్థమవుతోంది. -
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. జనవరి 5న జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు, సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమేనా!?) ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన కోమల్ మాట్లాడుతూ.. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేఎన్‌యూ ఘటనపై ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే దాడి చేసినట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియో ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరించాడు. ఆయితే అవాస్థీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏబీవీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
దీపిక.. ముందు వాటి గురించి తెలుసుకో
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశ ద్రోహులకు ఆమె బాసటగా నిలిచారని అనేకమంది, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను నిందించారు. తాజాగా వారి జాబితాలో ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా కూడా చేరారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ప్రసంగిస్తూ.. దీపికకు చురకులు అంటించారు. ‘ఏదైన విషయంపై స్పందించే ముందు దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి తెలుసుకుని ఉండాలి. వాటిపై కనీస అవగాహన పెంచుకోవాలి. తెలియపోతే మంచి సలహాదారుడిని నియమించుకుని, తెలుసుకునే ప్రయత్నం చేయాలి’ అంటూ దీపికకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు కోట్లకు పైగా వలసవాదులు అక్రమంగా నివశిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు ఆందోళనకు దిగుతున్నారని మండిపడ్డారు. జామియా విద్యార్థులు ఇప్పటికీ జిన్హా వాలా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను తప్పుబడుతూ.. ప్రతిపకక్షాలు చేసే ఆందోళనలను ఆయన తిప్పికొట్టారు. ఇది దేశ ఐక్యతను మంచిదికాదన్నారు. -
‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాకాండపై ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అర్బన్ నక్సల్స్ జేఎన్యూకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని బీజేపీ అనుబంధ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి అన్నారు. ప్రతిష్టాత్మక జేఎన్‌యూ విద్యార్ధులుగా తాము గర్విస్తున్నామని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. అథ్యాపకులు సైతం తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్‌యూ విద్యార్ధులపై తమ కార్యకర్తలు ముసుగు దాడులకు పాల్పడ్డారన్న విద్యార్ధుల ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్‌ను మార్ఫింగ్ చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్ధ్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడిపై పోలీసుల దర్యాప్తును జేఎన్‌యూ విద్యార్ధి సంఘం తప్పుపట్టింది. దాడికి గురైన బాధితులపైనే అభియోగాలు మోపుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. దాడి జరిగిన రోజు పోలీసులు, సెక్యూరిటీ గార్డులు బాధితులను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆరోపించింది. -
ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము ఇప్పటికే జేఎన్‌యూలో సంబంధిత అధికారులను కోరగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. కేసుకు సంబంధించిన ఇరు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్‌కు లేఖ రాశామని, స్పందన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. కాగా, జేఎన్‌యూలో చెలరేగిన హింసకు సంబంధించి ‘యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్’ , ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్’ వాట్సాప్ గ్రూపుల డేటాను సెక్యూర్ చేయాలని డిలీట్ అయిన పక్షంలో ఆ డేటాను తిరిగి పొందాలని వాట్సాప్, గూగుల్, యాపిల్‌లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జేఎన్‌యూ ప్రొఫెసర్లు అమిత్ పరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్‌లు ఈనెల 10న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దిశగా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోర్టును కోరారు. -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన విపక్షాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : వరస ఎన్నికల్లో ఓటమితో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు కోలుకోలేని షాకులిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ కీలక భేటీకి హాజరయ్యేంది లేదంటూ దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు తెల్చిబెతున్నాయి. ఈ సమావేశానికి తాము హాజరయ్యేది లేదంటూ తొలుత తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రకటించారు. ఆ తరువాత బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా అదే ప్రకటన చేశారు. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వారి బాటలోనే నడిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన కూడా గైర్హాజరు కావడం గమనార్హం. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదంటూ మొండిచేయి చూపారు. కాగా కాంగ్రెస్ నేతలపై మాయావతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బహిరంగ విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే. నేడు జరిగే ఈ భేటీలో ఎన్ఆర్సీ, సీఏఏతో పాటు ఇటీవల దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జేఎన్‌యూ హింసపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే కీలకమైన సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ మాత్రమే ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తొలినుంచి ప్రచారం సాగిన.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. -
జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమె!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై పోలీసులు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీసీటీవీ పుటేజీలు, వాట్సప్‌లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ముసుగులు ధరించి హాస్టల్లో దాడికి పాల్పడిన ఓ యువతిని ఢిల్లీ క్రైమ్ బ్యాచ్ పోలీసులు కనిపెట్టారు. వీడియోల ద్వారా సేకరించి ఆధారాల్లో గడల చొక్కా, ముఖానికి లైట్‌బ్లూ స్కార్ప్, చేతిలో కర్ర పట్టుకున్న యువతిని ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థినిగా పోలీసులు ధృవీకరించారు. ఈమేరకు వెంటనే తమ ముందుకు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. (ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం!) కాగా అంతకుముందే ఆ యువతికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీకి చెందినదిగా ఆమెను పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు అక్షత్ ఆవాస్థీ అనే ఏబీవీపీకి చెందిన విద్యార్థి కూడా దాడిలో పాల్గొన్నారని, అతన్నికూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదివారమే నోటీసులు పంపారు. అయితే పోలీసుల విచారణలో ఎలాంటి విషాయాలు బయటపడతాయి అనే దానిపై ఆసక్తినెలకొంది. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయిషీ ఘోష్ కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం. ఆమెను ఈరోజు (సోమవారం) పోలీసులు విచారించనున్నారు. (ఎవరీ ఆయిషీ ఘోష్?) -
ఎందుకు అరెస్టు చేయలేదు?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఎంకే ఉదయనిధి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నాన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం ఉదయం ఆయన చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులను కలిశారు. ఈ నెల 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులపై గుర్తు తెలియని దుండగుల దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖానికి ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగిన వారిని ఢిల్లీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని అన్నారు. నిందితులెవరో సీసీటీవీ ఫుటేజీల్లో తేలినప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సంబంధిత వార్తలు ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం! జేఎన్‌యూలో మెరిసింది.. ఎవరీ ఆయిషీ ఘోష్? 10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు... హీరోయిన్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు -
ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో జరిగిన హింసాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వర్సిటీ పరిధిలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే ఈనెల 5న జరిగిన దాడిలో పాల్గొనట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే ఏబీవీపీకి చెందిన విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియా ముందు ఒప్పుకున్నాడు. అంతేకాందు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరిస్తాడు. ఆయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసు విచారణ నిమిత్తం అక్షత్‌ను వెంటనే తమ ముందు విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. ఆయనతో పాటు ఆ రోజు ఘటనలో పాల్గొన్న మరో 37 మందిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. (మిస్టరీగా మిగిలిన ముసుగు దుండుగులు..!) మరోవైపు అక్షత్‌తో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని ఏబీవీపీ ఇది వరకే ప్రకటించింది. అయితే పోలీసుల విచారణ ఏ మేరకు నిజాలను రాబడుతోందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయిషీ ఘోష్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. దీంతో పోలీసుల విచారణ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే తప్పుచేయలేదని, పోలీసులు కుట్రపూరింతంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. (ఎవరీ ఆయిషీ ఘోష్?) -
మిస్టరీగా మిగిలిన ముసుగు దుండుగులు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఇదివరకే బటయకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 5న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దాడి జరిగిన రోజున రాత్రి ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. వారి దాడిలో ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఎవరీ ఆయిషీ ఘోష్?) తాజా విచారణ నేపథ్యంలో ఆ ముసుగు ధరించిన దుండుగులు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ఆధారంగా ముసుగు దుండుగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముసుగు దరించి గుంపులో ఉన్న యువతిని కోమల్ శర్మ అంటూ, ఆమె ఏబీవీపీకి చెందిన సభ్యురాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబందించిన గత ఫోటోలు సైతం నెట్టింట్లో దర్శినమిచ్చాయి. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో పలు వార్తా సంస్థలు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. దాడి గురించి చర్చించుకుంటున్న ఓ వీడియో బయటకువచ్చింది. దీనిలో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవాస్తీ దాడికి నాయకత్వం వహించింది తానేనని చెబుతున్నట్టు అర్థమవుతోంది. (‘జేఎన్‌యూ దాడి మా పనే’) అయితే వీటిపై పోలీసులు మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. వర్సిటీ హాస్టల్ లోపలికి చొరబడి దాడికి దిగింది ఎవరనే అనేది ఇప్పటికీ తేలలేదు. దీంతో నిందితులను గుర్తించడం పోలీసులుకు పెద్ద సవాలుగా మారింది. మరోవైపు ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపిస్తోంది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది. -
ఎవరీ ఆయిషీ ఘోష్?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో జరిగిన హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రధానంగా దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం వర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్. బెంగాల్‌కు చెందిన ఆమె ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో పీహెచ్డీ అభ్యసిస్తూ తాజా ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. కమ్యూనిస్టుల పురిటిగడ్డ బెంగాల్ నుంచి వచ్చింది కాబట్టి వామపక్ష భావజాలాన్ని తన బలంగా మలుచుకున్నారు. హక్కుల సాధన కోసం విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐ తరపున అనేక పోరాటాలు చేశారు. ఆ తెగువే ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ‘జేఎన్‌యూ’ స్టూడెంట్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌ను చేసింది. పదవి చేపట్టి మూడునెలలు కూడా కాకుండానే ఇటీవల ‘జేఎన్‌యూ’లో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. వామపక్ష భావజాలానికి కంచుకోట అయిన పశ్చిమబెంగాల్లోని పారిశ్రామిక ప్రాంతం దుర్గాపూర్ ఆయిషీ సొంతూరు. న్యూఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజీలో రాజనీతిశాస్త్రంలో డిగ్రీ చేసే రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల దిశగా ఆమె తొలి అడుగులు పడ్డాయి. ఆ తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పీజీ అవగానే అంతర్జాతీయ సంబంధాల మీద ఆసక్తితో ఎంఫిల్‌లో అదే సబ్జెక్టు ఎంచుకున్నారు. ఎంఫిల్ అయ్యాక అక్కడే పీహెచ్‌డీలో చేరారు. జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరిన తరువాత విద్యార్థి రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు ఆయిషీ. ఈ క్రమంలోనే లెఫ్ట్‌వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ‘స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. పోరాట స్వభావానికి తోడు విషయపరిజ్ఞానం, తూటాల్లాంటి మాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రసంగాలు తోటి విద్యార్థుల్లో ఆలోచనబీజాలను నాటడమే కాదు... పోరాటస్ఫూర్తిని కూడా నింపేవి. ఈ నాయకత్వ లక్షణాలే ఆమెను దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయానికి విద్యార్థి నాయకురాలిని చేశాయి. 13 ఏళ్ల్ల తరువాత జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎస్ఎఫ్ఐ జయకేతనం ఎగురవేయడంలో ఆయిషీ కీలకంగా వ్యవహరించారు. ప్రెసిడెంట్ అయ్యాక క్యాంపస్ సమస్యల మీద దృష్ట పెట్టారు. హాస్టల్ ఫీజు తగ్గించాలని, ఆ తరువాతే రెండో సెమిస్టర్ రిజిస్ట్రేషన్ నిర్వహించాలని విద్యార్థులకు మద్దతుగా పోరాటానికి దిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉంటున్న జెఎన్‌యూలోని సబర్మతీ హాస్టల్లోకి జనవరి 5న కొందరు ఆగంతుకుల చొరబడి కర్రలతో దాడిచేసి ఆమెతో సహా దాదాపు 36మందిని గాయపరిచారు. అయితే వర్సిటీలో చెలరేగిన హింసకు ఆయిషీతో పాటు మరో తొమ్మిది మంది విద్యార్థులను అనుమానితులుగా భావిస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం రుజువైతే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రకటించారు. ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఘోష్ వివాదంపై ఆమె తల్లీదండ్రులు స్పందించారు. తన కూతురిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్‌కు ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ జేఎన్‌యూ వ్యవహారంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నిరసనపై స్పందించారు. జేఎన్‌యు హింసకు స్పందించిన దీపికాకు మద్దతు తెలపడంతో పాటు, ఆమె చేసిన సైలెంట్ ప్రొటెస్ట్‌పై ఆయన తన అభిమానం చాటారు. అంతేకాదు తన కుటుంబానికి వేధింపులు ఉన్నప్పటికీ నిష్పాక్షికంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో దీపికా పదుకొనేను పోల్చారు. కొంతమంది వ్యక్తులు తమ చర్యల ద్వారా సత్యం, స్వేచ్ఛ ,న్యాయం లాంటివే కాకుండా త్యాగం చేయవలసిన ఆదర్శాలను చూపిస్తారన్నారు భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) లోకి ముసుగు దుండగుల ముఠా ప్రవేశించి, ఆపై గంటల తరబడి వినాశనం సృష్టించి, విద్యార్థులు అధ్యాపకులపై దాడి చేయడంతోపాటు, పోలీసుల నిర్లక్ష్యం అనే వార్త తీవ్ర ఆందోళన కరమైందని లింక్డిన్లోని ఒక బ్లాగులో రాజన్ వ్యాఖ్యానించారు. జేఎన్‌యూ బాధితులను కలవడం ద్వారా అటు పుష్ప గుచ్ఛాలను, ఇటు ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఆమె మనందరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. తన తాజా చిత్రం 'ఛపాక్' ప్రమాదంలో పడుతుందని తెలిసీ కూడా జేఎన్‌యూ బాధితులకు అండగా నిలిచేందుకు ఆమె వెనుకాడలేదన్నారు. అలాగే జేఎన్‌యూ ఆందోళనలో కీలక పాత్ర పోషిస్తున్న యువతను కూడా రాజన్ ప్రశంసించారు. విభిన్న విశ్వాసాలు కలిగిన యువకులు ఒక్కటిగా కలిసి కవాతు చేయడం, హిందూ,ముస్లింలు మన జాతీయ జెండా వెనుక ఐక్యం కావడం సంతోషకరమన్నారు. తమ సొంత లాభం కోసం కృత్రిమ విభజనలను ప్రేరేపించే స్వార్థరాజకీయ పరులను తిరస్కరించడం చాలా ఆనందంగా ఉందని రాజన్ అన్నారు. తద్వారా మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకాశవంతంగా నిలుస్తుందనే విషయాన్ని తేల్చి చెప్పారన్నారు. మహాత్మాగాంధీ ప్రాణత్యాగం చేసిన దేశ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం యువత పోరాడుతోంది. స్వేచ్ఛను కాపాడటం కోసం వీరు కవాతు చేస్తున్నారు. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న స్వేచ్ఛా స్వర్గం కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా అక్షరాలా యుద్ధభూమిగా మారిపోయాయి. ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో వివక్ష, ఉదాసీనత రెండింటి పాత్ర ఉందనీ, నాయకత్వాన్ని నిందించడం చాలా సులభమే అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాధ్యత కూడా ఉందని ఆయన రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటే హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. స్వాత్రంత్యం అంటే ఎన్నికల రోజున మాత్రమే గుర్తుకువచ్చేది కాదు, ప్రతి రోజు రావాలి అని రాజన్ రాశారు. ఈ సందర్భంగా నిజాన్ని చూపించడం కోసం కృషి చేస్తున్న మీడియా సంస్థలను, రాజీనామా చేసిన అధికారులను కూడా ఆయన ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి నిరాకరించిన మాజీ ఎన్నికల సంఘం ఏకైక అధికారి అని లావాసాను పరోక్షంగా గుర్తు చేసుకున్నారు రఘురామ రాజన్. -
జేఎన్‌యూ హింసపై మరో ట్విస్ట్
-
జేఎన్‌యూ హింసపై మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) హింసపై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న (ఆదివారం) వర్సిటీలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే సృష్టించింది. తమపై ఏబీవీపీకి చెందిన వారు దాడి చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించగా.. వారే తమపై దాడికి దిగారని ఏబీవీపీ ప్రతి ఆరోపణలకు దిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం దాడిలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలను విడుదల చేశారు. దీనిలో జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్‌తో పాటు తొమ్మిది మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరా పుటేజీ అధారంగా విచారణ జరుపుతున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. కాగా పోలీసులు విడుదల చేసిన జాబితాపై అయిషీ ఘోష్ స్పందించారు. అది ఇతరులు ఎంపిక చేసిన విద్యార్థులు జాబితా అని కొట్టిపారేశారు. చట్టానికి విరుద్ధంగా తామేమీ తప్పుచేయలేదని ఆమె అన్నారు. ఢిల్లీ పోలీసులు సరైన రీతిలో విచారణ జరపాలని ఆమె కోరారు. అయితే అదే రోజు జరిగిన దాడిలో ముసుగులో వచ్చిన దుండుగులు ఆయిషీ ఘోష్‌తో పాటు పలువురు విద్యార్థిలను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జేఎన్‌యూ దాడి : పోలీసుల కీలక ప్రెస్‌మీట్
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంప్రాంగణంలో జనవరి 5, ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేయనున్నారు. నేడు( శుక్రవారం)నాలుగు గంటలకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముసుగులేసుకుని మరీ క్యాంపస్‌లో ప్రవేశించి, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విరుచుకుపడిన దుండగుల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయనున్నామని అలాగే వాట్సాప్ మిస్టరీని కూడా ఛేదించామని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌యు క్యాంపస్‌లో అక్కడ ఉన్న వారి మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింస జరిగిన దాదాపు ఐదు రోజులకు సంఘటనను దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు రెండు వాట్సాప్ గ్రూపులకు కనీసం 70 మంది నిర్వాహకులను గుర్తించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పిటిఐ నివేదిక పేర్కొంది. కాగా ముసుగులేసుకున్న సుమారు 50 మంది జేఎన్‌యు క్యాంపస్‌లోకి కర్రలు, ఇనుప రాడ్లతో హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోషేతోపాటు, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటివరకు మొత్తం 14 ఫిర్యాదులను పోలీసులు నమోదు చేశారు. వీటన్నింటినీ క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రకటనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 5 దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఐషే ఘోషే పై కేసు నమోదు చేసిన తీరుగానే, పోలీసుల ప్రకటన వుండే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. -
10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు...
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థినాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను ఆదివారం తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ తల పగిలి తీవ్ర రక్తస్రామమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ... జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్ సహా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.(ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది) ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ...‘ మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. కనిపించకుండా పోయిన వాళ్లను కనిపెట్టడం పోలీసులకు కుదరడంలేదు గానీ... జేఎన్‌యూ చెత్తడబ్బాల్లో 3 వేల కండోమ్‌లు దొరికాయట. అసలు వాళ్లు అంత కచ్చితంగా ఎలా లెక్కపెట్టగలిగారో’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తుక్డేగ్యాంగ్ అంటూ తమను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి... జేఎన్‌యూలో ప్రవేశం అంత సులభంగా ఏమీ లభించదని గుర్తు పెట్టుకోండని హితవు పలికారు. కాగా 2016లో బీజేపీ నేత ఙ్ఞాన్‌దేవ్ అహుజా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘ అక్కడ రోజూ 3 వేల బీరు క్యాన్లు దొరుకుతాయి. 2 వేల మద్యం బాటిళ్లు ఉంటాయి. పదివేల కాల్చేసిన సిగరెట్ పీకలు... 4 వేల బీడీలు, 50 వేల మాంసపు ఎముకలు, 2 వేల చిప్స్ కవర్లు, 3 వేల కండోమ్‌లు, 5 వందల అబార్షన్ ఇంజక్షన్లు ఉంటాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ కోసం రెండేళ్లపాటు వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును విచారించిర సీబీఐ దానిని క్లోజ్ చేసింది. -
జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ రోడ్డు మార్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వర్సిటీ వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తొలుత జేఎన్‌యూ విద్యార్థులు హెఆర్డీ అధికారులను కలిసేందుకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. వీరికి మద్దతుగా విపక్ష నేతలు, సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, శరద్ యాదవ్‌లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్కడ హెఆర్డీ అధికారులను కలిసిన అనంతరం.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలని విద్యార్థులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీగా వెళ్తున్న వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత
-
దీపికాకు ఊరట.. ఛపాక్‌కు కాంగ్రెస్ బంపరాఫర్
భోపాల్ : యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రంలో దీపికా పదుకొనే నటించిన ఛపాక్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆమె జేఎన్‌యూకి వెళ్లిన మరుక్షణం నుంచి సోషల్ మీడియా వేదికపైగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఛపాక్ సినిమాకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అండగా నిలిచాయి. ఈ సినిమాకు పన్ను పసూలు నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఈ మేరకు మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే ఛత్తీస్‌గఢ్ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ఆమె అభిమానులు రెండు రాష్ట్రాల సీఎంలకు అభినందనలు తెలుపుతున్నాయి. (దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి) అయితే పన్ను మినహాయింపు నిర్ణయం మరో కొత్త చర్చకు దారి తీసింది. దీపికా జేఎన్‌యూ వెళ్లడంతో బీజేపీ, ఏబీవీపీకి చెందిన కొందరు ఆమెను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఛపాక్ చిత్రాన్ని బహిష్కరించాలంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రానికి పన్ను మినహాయింపు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆమెకు అండగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో విడుదలకు ముందు ఈ చిత్రం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఛపాక్ శుక్రవారం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలపై పలు ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. సినియాలోని రాజేష్ పాత్రపై కోర్టుకు వెళతామంటూ బీజేపీ ఎంపీల నుంచి బీజేపీ యువజన కార్యకర్తలు, సానుభూతిపరుల వరకు ట్వీట్ల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. -
పబ్లిసిటీ స్టంట్ అయితే ఏంటి?
న్యూఢిల్లీ: ‘ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా మరొకటి అయితే ఏంటి? ఈ వ్యాపారంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యంగా నువ్వు ఈ సినిమాకు ఓ నిర్మాతకు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా పర్లేదు’ అంటూ బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెకు అండగా నిలిచాడు. దీపిక చూపించిన ధైర్యానికి ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసించాలని పేర్కొన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీని సందర్శించినందుకు నెటిజన్లు దీపికపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. అక్కడికి వెళ్లడాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు. తన తాజా సినిమా ఛపాక్ ప్రమోషన్ కోసమే దీపిక చవకబారు చర్యలకు దిగిందని ట్రోల్ చేస్తూ.. సినిమాకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. (‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’ ) ఈ విషయం గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ... ‘ఆయిషీ ఘోష్ ముందు చేతులు జోడించి నిల్చున్న దీపిక ఫొటో ప్రతీ ఒక్కరికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అది కేవలం దీపిక ప్రకటించిన సంఘీభావం మాత్రమే కాదు.. ‘నీ బాధను నేను కూడా అనుభవిస్తున్నాను’ అని చెప్పడం. తన చర్య ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీపిక.. జేఎన్యూకు వెళ్లడం ద్వారా ఆ భయాన్ని జయించింది. అందుకే తన పేరు మారుమ్రోగిపోతుంది’ అని దీపికపై ప్రశంసలు కురిపించాడు. తను ఇచ్చిన స్పూర్తితో భయంతో విసుగెత్తిపోయిన ప్రజలు... దానిని దాటుకుని ముందుకు సాగుతారని అభిప్రాయపడ్డాడు. (ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు: దీపికకు కేంద్రం అండ) ఇక అనురాగ్ కశ్యప్ సైతం ట్రోలింగ్ బాధితుడన్న సంగతి తెలిసిందే. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ.. మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాల ఫోటోను ట్విటర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో దీపిక ఫొటో పెట్టి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. కాగా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దీపిక ఓ నిర్మాతగా వ్యవహరించాన్న సంగతి తెలిసిందే.(ప్రొఫైల్ పిక్ మార్చిన డైరెక్టర్.. ట్రోలింగ్!) -
దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్యూకు వెళ్లిన కనిమొళి యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తప్పుబట్టారు. తను చాలా వరకు హిందీ సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్ సినిమాను చూస్తానని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రం జేఎన్యూకు వెళ్లిన దీపిక.. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
పోలీసుల సమక్షంలోనే ఆ ‘దాడి’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినప్పటికీ దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను చూస్తే స్పష్టం అవుతోంది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడం ఆశ్చర్యం. ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ‘గుర్తుతెలియని వ్యక్తుల’ పేరిట హిందీలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం ‘పెరియార్ హాస్టల్ వద్ద కొంతమంది విద్యార్థులు గుమిగూడారని, వారు ఇతరులు కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద పోలీసు సబ్ ఇనిస్పెక్టర్‌కు సమాచారం అందింది. ఎఫ్ఐఆర్ కోసం ఫిర్యాదు చేసిన వసంత్‌కుంజ్ నార్త్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మరి కొంతమంది పోలీసులు పెరియార్ హాస్టల్ వద్దకు వెళ్లగా అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. అదే సమయంలో క్యాంపస్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలను పోలీసులు పిలిపించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు’ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత కొంతకాలంగా క్యాంపస్ ఆవరణలో పోలీసు పికెట్ ఉంటోంది. ఆ రోజు 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను వారు చూసినప్పుడు వారు ఎందుకు స్పందించలేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్‌లో ఎంత మంది పోలీసులు ఉన్నారు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కొత్తగా దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులైన కనుక్కుంటారేమో చూడాలి! చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది జేఎన్‌యూలో దీపిక జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..! ‘జేఎన్‌యూ దాడి మా పనే’ అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె నటించిన తాజా సినిమా ఛపాక్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ అధిక సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో #boycottchhapak అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీని దీపిక మంగళవారం సందర్శించిన విషయం తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. విద్యార్థులతో భేటీ అయ్యారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తన సినిమా ప్రచారం కోసం దీపిక నీచానికి దిగజారిందని.. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. (వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: దీపిక ) ‘కన్హయ్య కుమార్, ఆయిషీ ఘోష్ వంటి వారికి దీపిక మద్దతు తెలిపింది. మరి దాడిలో గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతేంటి. నకిలీ ఫెమినిజంతో దీపిక ఎన్నాళ్లు నెట్టుకువస్తావు. ఛీ.. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముంది. దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదువుకోవాలని తపిస్తున్నారు. వాళ్ల కోసం నీ విలువైన సమయాన్ని కేటాయించవచ్చు కదా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక దీపిక అభిమానులు సైతం.. ‘నాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే నా ఫేవరెట్ హీరోయిన్ అయినా.. మరెవరైనా. అయితే దీపిక లాంటి సినిమా హీరోయిన్ కోసం కాకపోయినా.. నిజమైన హీరో లక్ష్మీ అగర్వాల్ కోసం ఈ సినిమా చూడాలి’ అని ఆమె తీరును తప్పుబడుతున్నారు.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు) ఇంకొంత మంది మాత్రం...‘ దీపికా సినిమాలను అడ్డుకోవాలని చూసిన ప్రతీసారి... ఆమె రేంజ్ అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సినిమాల వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు ఛపాక్ కూడా అదే స్థాయిలో రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఆమె నిజమైన హీరో’ అంటూ దీపికకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #boycottchhapak ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఛపాక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీపిక తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. #boycottchhapaak#boycottChhapaak Cheap Publicity Stunt. #boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapaak#boycottchhapak pic.twitter.com/CAOCm5yZ68 — Neeraj kumar (@KumarNe31356548) January 8, 2020 1. Make a film based on a social issue 2. Try 2 market it by showing concern towards d issue 3. If it dsn't work, find a problem in d country 4. Take a stand (w/o uttering a word), 2 gain (negative) publicity 5. Increase ur viewership n make money 6. Go to step 1 #boycottChhapaak pic.twitter.com/OCNZE4WSHG — Vinita Hindustani🇮🇳 (@Being_Vinita) January 8, 2020 Cancelled booking. .#boycottChhapaak @deepikapadukone #BoycottChhapaak pic.twitter.com/gl3snHWNrn — Me (@Manjuna76120410) January 8, 2020 #DeepikaPadukone I applaud your commitment...and your courage! You are a HERO!! 👍👏😇🙏🇮🇳 — Simi Garewal (@Simi_Garewal) January 7, 2020 -
వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక
న్యూఢిల్లీ: తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం కోసం ప్రజలు వీధుల్లోకి రావడం బాగుందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అన్నారు. దేశం గురించి.. దేశ భవిష్యత్తు గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించడం మంచి విషయమని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రజలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వారికి సంఘీభావం తెలుపుతున్నారు. అదే విధంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులపై ముసుగు దుండగుల దాడిని బీ-టౌన్ తీవ్రంగా ఖండించింది.(జేఎన్‌యూలో దీపిక) ఈ నేపథ్యంలో దీపిక ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఒక్కొరు భావాలను నిర్భయంగా పంచుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. తాము నమ్మిన సిద్ధాంతానికి నేటి యువత కట్టుబడి ఉండటం ముచ్చట గొలుపుతుందన్నారు. తమ గళం వినిపించడం కోసం ప్రజలు బయటికి రావడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఇక దీపిక పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. దాదాపు 10 నిమిషాల పాటు క్యాంపస్‌లో ఉన్నారు. దాదాపు 7.40 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన ఆమె.. అక్కడ జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, విద్యార్థులనుద్దేశించి దీపిక ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. కాగా దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛపాక్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక.. ‘ఛపాక్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ.. దీపిక విద్యార్థుల కోసం తన సమయాన్ని కేటాయించడం విశేషం.(ఆ చూపులు మారాలి: హీరోయిన్) -
ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది
కోల్‌కత/న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై దాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తుండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమా... లేక పెయింటా..? అని చవకబారుగా మాట్లాడారు. కాగా, ముసుగులు ధరించిన దుండుగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులు, టీచర్లపై ఆదివారం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జేఎన్‌యూ కాంగ్రెస్ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ (జేఎన్‌యూఎస్‌యూ) ఆయిషీ ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో వర్సిటీ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. (చదవండి : జేఎన్‌యూలో దీపిక) ‘చదువులను గాలికొదిలేసి విద్యార్థులంతా రోజూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. ఇంతకూ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమేనా.. లేక ఎరుపు రంగా..? ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉంది’అని దిలీప్ ఘోష్ మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కాగా, ఆయిషీ తల్లి షర్మిష్ఠా ఘోష్ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేత దిలీప్ వ్యాఖ్యలపై స్పందించాలంటేనే కంపరంగా ఉంది. జేఎన్‌యూలో పరిస్థితులు మెరుగు పడకుంటే.. ప్రస్తుతం ఉన్న వీసీనే ఇంకా కొనసాగితే.. అక్కడ చదువుకోవడానికి పిల్లల్ని అనుమతించం’ అన్నారు. దిలీప్ కాస్త మనిషిగా ఆలోచిస్తే మంచిదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ హితవు పలికారు. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) జేఎన్‌యూ దాడిలో కొత్త విషయాలు జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూ దాడి..కీలక పరిణామం
-
జేఎన్‌యూలో దీపికా పదుకోన్
-
జేఎన్‌యూలో దీపికా పదుకోన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ జేఎన్‌యూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం జేఎన్యూకు వెళ్లిన దీపికా వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే ఈ దాడిలో గాయపడినవారికి సంఘీభావం తెలిపారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నారు. చదవండి : జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన -
జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందనడానికి అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 మీటర్ల దూరంలో ఉన్న పెరియార్, సబర్మతి హాస్టళ్లపై దుండగులు దాడులు జరిపారు. సబర్మతి హాస్టల్లోనే ఎక్కువ గదులు ధ్వంసమయ్యాయి. అవన్నీ కూడా వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం. సబర్మతి హాస్టల్లోనే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్‌పై దాడి జరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రీసర్చ్ స్కాలర్ తెలిపారు. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్ గదిపై కూడా దాడి చేశారు. ఆ గది తలుపుపై బీఆర్ అంబేడ్కర్ పోస్టర్ ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) ‘బాబర్ కీ ఔలాద్’ అంటూ తనను చితక బాదినట్లు ఓ కశ్మీర్ విద్యార్థి ఆరోపించారు. ఏబీవీపీ పోస్టర్లు, గుర్తులున్న ఏ హాస్టల్ గదిపై దుండగులు దాడి చేయక పోవడం గమనార్హం. దుండగులు దాడి చేసినప్పుడు పలువురు విద్యార్థులు తమ సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు రాలేదని వారు చెబుతున్నారు. ఆ రోజు హాస్టళ్ల వద్ద సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు విధులు నిర్వహించాల్సిన షిప్టులో ఒక్క గార్డు కూడా హాజరుకాక పోవడం ముందస్తు ప్రణాళికను సూచిస్తోంది. ఈ విషయమై మీడియా ముందు స్పందించేందుకు గార్డులు నిరాకరించారు. (చదవండి : భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు...) -
జేఎన్‌యూ దాడి : ఏబీవీపీకి మంత్రి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం ముసుగు దుండగులు విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీకి క్లీన్చిట్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్ధలకు హింసకు పాల్పడేంతటి శక్తిసామర్థ్యాలు లేవని చెప్పుకొచ్చారు. విద్యార్ధుల భవితవ్యంతో చెలగాటం వద్దని కాంగ్రెస్, ఆప్‌లకు హితవు పలికారు. పరీక్షలకు హాజరయ్యే వారిని అడ్డుకోవద్దని జేఎన్‌యూ విద్యార్ధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జేఎన్‌యూ ఘటనపై విచారణ సాగుతోందని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.మరోవైపు జేఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జేఎన్‌యూ కమ్యూనిస్టులకు అడ్డాగా మారిందని, జాతి వ్యతిరేక..హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నందునే తమ కార్యకర్తలు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి దాడులు జరిపారని ఆ సంస్ధ నేత తోమర్ ఓ వీడియోలో వెల్లడించారు. చదవండి : జేఎన్‌యూ దాడి మా పనే -
‘గుర్తు తెలియని వ్యక్తులపై’ కేసు!
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి ఆదివారం రాత్రి ఇనుప రాడ్లు, కర్రలతో జొరబడి హాస్టల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లను చితక బాదడానికి కుట్ర పన్నింది, పిలుపునిచ్చిందీ ఏబీవీపీ నాయకులని ‘వాట్సాప్ గ్రూపు’ల్లో వచ్చిన సందేశాల ద్వారా గుర్తించినప్పటికీ, వారి మెసేజ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా సోమవారం సాయంత్రం ‘గుర్తు తెలియని వ్యక్తుల’ పేరిట ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని జేఎన్‌యూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘కర్రలు, రాళ్లు, చేతికి ఏవి దొరికితే వాటిని తీసుకెళ్లి కొట్టండంటూ వామపక్ష విద్యార్థులపై దాడికి పిలుపునిచ్చిందీ ఏబీవీపీయే’ అంటూ ఏబీవీపీ ఢిల్లీ జాయింట్ సెక్రటరీ అనిమా సోంకర్ ‘టైమ్స్ నౌ’ సాక్షిగా అంగీకరించినా, ‘అవును దాడికి మేమే బాధ్యులం, నోరు మూసుకొని ఉండకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరుపుతాం’ అని హిందూ రక్షా దళ్ నాయకుడు భూపేంద్ర తోమర్ కూడా టీవీ సాక్షిగా హెచ్చరించినా వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఏమిటని అతివాద, మితవాద విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గాయపడిన విద్యార్థినిపైనే కేసా? ఏబీవీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్, మరో 19 మంది విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జనవరి నాలుగవ తేదీన ఐశే ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఈ రెండు కేసుల్లోనూ ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిధిలో పనిచేస్తారు కనుక వారు ఏబీవీపీ నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నారని ఐశే ఘోష్ ఆరోపించారు. సంబంధిత వార్తలు.. జేఎన్‌యూ దాడి మా పనే భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు.. జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..! ‘ముసుగు దుండగులను గుర్తిస్తా’ -
ప్రొఫైల్ పిక్ మార్చిన డైరెక్టర్.. ట్రోలింగ్!
ముంబై : తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు తన ట్విటర్ ప్రొఫైల్ ఫోటోనే కారణమైంది. అనురాగ్ తన ట్విటర్ ప్రొఫైల్ ఫోటోను ఆదివారం మార్చారు. ఇందులో ఏముంది అనుకోకండి.. తన పాత పిక్చర్‌ను మార్చి మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రిఅమిషాల ఫోటోను పెట్టారు. ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన దుండగుల దాడిని వ్యతిరేకిస్తూ.. మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ అనురాగ్ ఈ ఫోటోను పెట్టారు.(అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి) కాగా ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై, ఉపాద్యాయులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే అధికార బీజేపీ ఇలా ముసుగులు ధరించి ఎవరికీ తెలియకుండాప్రజలపై దాడికి పాల్పడుతోందన్న ఉద్దేశంతో అనురాగ్ ఇలా చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ దాడిని నిరసిస్తూ ప్రతిపక్షాలు, బాలీవుడ్ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న(జనవరి 6)రాత్రి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో అనురాగ్ కశ్యప్ కూడా పాల్గొన్నారు. ఇక అనురాగ్ పెట్టిన ఈ ఫోటోకు వేల మంది లైకులు కొట్టడంతోపాటు, అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫైల్ ఫోటోను మార్చడంతో కొంతమంది అనురాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. #NewProfilePic pic.twitter.com/sQdfTFAY8B — Anurag Kashyap (@anuragkashyap72) January 6, 2020 అయితే అత్యధిక మంది ‘స్టాండ్ విత్ అనురాగ్ కశ్యప్’ హ్యష్‌ట్యాగ్‌తో...అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ‘‘ మీ ప్రతి ట్వీట్ మమ్మల్నీ ప్రేరేపిస్తోంది. గర్వంగా ఉంది సార్, దాడి తప్పు అని ప్రజలకు తెలిసినా..వారు మౌనంగా ఉన్నారు. వారికి చెడుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు’’ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతూ.. అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. -
‘జేఎన్‌యూ దాడి మా పనే’: హిందూ రక్షా దళ్
-
జేఎన్‌యూ దాడి ఘటనలో కీలక పరిణామం
-
‘జేఎన్‌యూ దాడి మా పనే’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన ముసుగు దుండగుల భీకర దాడి తమ పనేనని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జాతి విద్రోహ, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందునే ఆదివారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారని ఆ సంస్థ నేత భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి చెబుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో ఇనుప రాడ్లతో వీడియోలో కనిపించిన సాయుధ దుండగులు ఇద్దరు ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి సంఘ నేతలేనని ఏబీవీపీ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి అనిమా సోంకర్ అంగీకరించిన నేపథ్యంలో ఈ ట్విటర్ వీడియో వెలుగుచూడటం గమనార్హం. ‘జేఎన్‌యూ కమ్యూనిస్ట్‌లకు హబ్‌లా మారింది..ఇలాంటి హబ్‌లను మేం సహంచం..వారు మా దేశాన్ని మతాన్ని దూషిస్తూన్నా’రని తోమర్ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు తలపెడితే ఇతర యూనివర్సిటీల్లోనూ ఇవే చర్యలు పునరావృతమవుతాయని ఆయన హెచ్చరించారు. జేఎన్‌యూ విద్యార్ధులు ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ వర్సిటీలో చదువుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జేఎన్‌యూ దాడి ఘటనలో పాల్గొన్నది తమ కార్యకర్తలేనని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.మరోవైపు తోమర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముసుగు దుండగులను గుర్తించేందుకు వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ఆదివారం సాయంత్రం చొచ్చుకువచ్చిన ముసుగు దుండగులు విచక్షణారహితంగా విద్యార్ధులు,ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి : ఆ రోజుల్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ను చూడలేదు: కేంద్ర మంత్రి -
అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి
న్యూ ఢిల్లీ : తను జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్‌యూ) చదువుకునే రోజుల్లో తుక్డే- తుక్డే గ్యాంగ్‌ను చూడలేదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం వ్యాఖ్యానించారు. తుక్డే-తుక్డే అనే పదం సాధారణంగా ప్రతిపక్షాలపై దాడి చేయడానికి బీజేపీ, రైట్ వింగ్ సభ్యులు తరచూ ఉపయోగించే పదం. ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ వారిని, వారికి మద్దతు ఇచ్చే వారిని ఈ పేరుతో విమర్శిస్తారు. ఆదివారం జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక దాడిని ఉద్ధేశించి కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా జై శంకర్ జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి. (జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..) సోమవారం ఢిల్లీలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం, వివాదాస్పద ఆయోద్య తీర్పు వంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితిని గురించి అడిగినప్పుడు.. తాను జేఎన్‌యూలో చదువుకున్నప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్‌ను చూడలేదని సమాధానమిచ్చారు. అంటే లెఫ్ట్ వింగ్ వారిని ఉద్ధేశించి మంత్రి ఇలా బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీనే కుట్రపూరింతంగా జేఎన్‌యూలో దాడికి పాల్పడిందని వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూండగా.. జేఎన్ఎస్యూ విద్యార్థి సభ్యులే తమపై దాడికి దిగారని ఏబీవీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా జేఎన్‌యూలో దాడికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. చదవండి: జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! -
గేట్‌వే ముట్టడి భగ్నం..
ముంబై : జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసాకాండను వ్యతిరేకిస్తూ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నిరసనలకు దిగిన ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమానికి అనుమతించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, ఈ ప్రాంతంలో ధర్నాకు దిగితే టూరిస్టుల రాకకు అవాంతరాలు ఏర్పాడతాయని ముంబై పోలీసులు ఆందోళనకారులను కోరారు. పోలీసుల సూచనతో ఆజాద్ మైదాన్‌లో నిరసనలు చేపట్టేందుకు ఆందోళనకారులు అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా ఆజాద్ మైదాన్‌కు తరలించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతాన్ని నిరసనకారులు ఖాళీ చేశారని పోలీసులు తెలిపారు. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనలతో ఆ ప్రాంతానికి దారితీసే రోడ్లు బ్లాక్ కావడంతో సగటు ముంబై వాసి సహా టూరిస్టులు ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో ఆజాద్ మైదాన్‌కు నిరసనకారులను తరలించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు -
జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థి సంఘం నేత ఐషే ఘోష్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల దాడికి ఒక రోజు ముందు ఈనెల 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వసం చేశారనే ఆరోపణలపై ఐషే ఘోష్ సహా ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు సెమిస్టర్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకు వారు సాంకేతిక సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డుపైనా ఆమె దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కాగా యూనివర్సిటీ అధికారులు ముసుగులు తొడిగిన సెక్యూరిటీ గార్డులచే సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేయించి విద్యార్ధులపై దాడులకు ఉసిగొల్పారని, విద్యార్థి సంఘం నేత ఐషూ ఘోష్‌పై దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. చదవండి : జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం.. -
జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన జేఎన్‌యూలో ముసుగు దుండగుల దాడి వెనుక ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి చెలరేగిన హింసాకాండకు ఏబీవీపీ, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన దౌర్జన్యకాండలో ఇరు వర్గాల తరపున బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాలుపంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు సోమవారం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించగా హింస వెనుక వామపక్ష, ఏబీవీపీ వాలంటీర్లు ఇద్దరూ ఉన్నారని క్రైమ్ బ్రాంచ్ నిగ్గుతేల్చింది. యూనివర్సిటీలోకి చొచ్చుకువచ్చిన బయటవ్యక్తులును సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు విద్యార్ధులు షేర్ చేసిన సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాలు, హాకీస్టిక్‌లతో ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వైరవిహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన సంగతి తెలిసిందే. చదవండి : జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
జేయూలోనూ జేఎన్‌యూ రగడ..
కోల్‌కతా : జేఎన్‌యూ ఘటనపై జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం బాహాబాహీకి దిగడంతో జేయూ రణరంగమైంది. నగరంలోని జనసమ్మర్థ సులేఖ మోర్ ప్రాంతం వద్ద ఇరు వర్గాలు ఎదురుపడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు తలపడటంతో కోల్‌కతా పోలీసులు లాఠీచార్జి జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు తమపై లాఠీచార్జి జరిపి భాష్పవాయుగోళాలను ప్రయోగించారని జేయూ విద్యార్ధులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల పాటు రహదారిని నిర్భందించిన అనంతరం స్ధానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, విద్యార్ధినులను తోసివేశారని జేయూ విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. పోలీసుల వ్యవహారశైలిపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ బహిరంగ క్షమాపణలు కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. అంతకుముందు జేయూ విద్యార్ధులు జేఎన్‌యూ ఘటనను నిరసిస్తూ క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు వర్సిటీ మీదుగా జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న జేయూ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో క్యాంపస్ వెలుపలకు వచ్చి బీజేపీ ప్రదర్శనను అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. విద్యార్ధులు బీజేపీ జెండాను దగ్ధం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు బారికేడ్లను దాటి విద్యార్ధులపైకి రావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై ఆదివారం ముసుగు దుండగులు చేసిన విచక్షణారహిత దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విదేశీ యూనివర్సిటీల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధికార, విపక్ష నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుకునే విషయంలో అసమర్ధంగా వ్యవహరించారని యూనివర్సిటీ వైస్ చాన్సెలర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ముసుగులు వేసుకుని జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వచ్చిన దుండగులు ఆదివారం రాత్రి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలోయూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం వారిని సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ హింసకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీదే బాధ్యత అని విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో జేఎన్‌యూలో పరిస్థితిని సమీక్షించారు. మోదీ ప్రభుత్వ సహకారంతో గూండాలు దేశ యువతపై జరిపిన ఈ దాడి అత్యంత గర్హనీయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ అంధుడిపైనా వీరంగం కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ముసుగులు ధరించిన గూండాలు విచ్చలవిడిగా దాడి చేశారని బాధితులు తెలిపారు. ‘మేం హాస్టల్లో ఉండగా, ఏబీవీపీ వారు కర్రలతో వస్తున్నారని ఎవరో అరిచారు. దాంతో మేం రూంలోకి వెళ్లి లోపలి నుంచి తలుపేసుకున్నాం. అయినా, వారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేయసాగారు. దాంతో బాల్కనీ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాం’ అని కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. అంధుడినని కూడా చూడకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని సూర్యప్రకాశ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. గూండాల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళల వసతి గృహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. ‘క్యాంపస్‌లో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొంటుండగా.. 20–25 మంది దుండగులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నాపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు’ అని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ వివరించారు. తనపై దాడి చేసినవారిని గుర్తుపడతానన్నారు. తమకు వ్యతిరేకులైన వారిని గుర్తించి మరీ దాడికి పాల్పడ్డారని, ఇది ఏబీవీపీ దౌర్జన్యమేనని ఘోష్ ఆరోపించారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు గత 4, 5 రోజులుగా ఆరెస్సెస్‌తో సంబంధాలున్న పలువురు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, వారి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది’ అని ఘోష్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ‘జేఎన్‌యూ సెక్యూరిటీ సహకారంతోనే ఆ గూండాలు రెచ్చిపోయారు. ఫోన్ చేసిన 2 గంటల తరువాత పోలీసులు వచ్చారు’ అని ఆయిషీ ఘోష్ ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. దేశవ్యాప్తంగా నిరసనలు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడిని విద్యార్థిలోకం తీవ్రంగా పరిగణించింది. పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్వర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలె యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ వర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐటీ– బాంబే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(పుణె) తదితర విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముంబైలో ఆదివారం అర్ధరాత్రి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం టార్చ్‌లైట్స్ మార్చ్ నిర్వహించారు. విదేశాల్లో.. నేపాల్‌లోని కఠ్మాండూలో జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, ససెక్స్ యూనివర్సిటీల్లో, అమెరికాలోని కొలంబియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వీసీపై ఆరోపణలు దాడి విషయంలో సకాలంలో స్పందించకపోవడంపై యూనివర్సటీ వైస్‌చాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జేఎన్‌యూ అధికారులతో సోమవారం మానవ వనరుల శాఖ జరిపిన సమీక్ష సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. వీసీ గూండాల నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, యూనివర్సిటీలో హింసకు ఆయనదే ప్రణాళిక అని ఆరోపించాయి. దుండగులు ప్రొఫెసర్ల నివాస సముదాయాలపైనా దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారని పలువురు టీచర్లు తెలిపారు. దాడిలో ఏబీవీపీ హస్తం? జేఎన్‌యూలో దాడికి, బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి సంబంధం ఉన్నదని సూచించే పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్నవారిలో జేఎన్‌యూ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వికాస్ పాటిల్ ఉన్నట్లు భావిస్తున్నారు. లాఠీలు, ఇనుపరాడ్లు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులతో వికాస్ ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసులకు దొరికిన ఫైబర్ గ్లాస్ లాఠీ లాంటి దానినే పాటిల్ పట్టుకుని ఉన్నారు. ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తిని ఏబీవీపీకి చెందిన శివపూజన్ మండల్‌గా గుర్తించారు. ఇతను జేఎన్‌యూలో బీఏ తొలిఏడాది చదువుతున్నాడు. కర్రలతో వికాస్ పాటిల్. శివపూజన్ మండల్. యోగేంద్ర (ఇన్సెట్లో) పాటిల్, మండల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయడం గమనార్హం. జేఎన్‌యూ క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులపై దాడి చేయాలంటూ వాట్సాప్‌లో జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ‘వామపక్ష విద్యార్థులపై భౌతిక దాడికి దిగాలి. అదొక్కటే పరిష్కారం’ అని, ‘మేం ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఉన్నాం’ అని అందులో ఉన్నాయి. ఈ చాట్‌లో పాల్గొన్న వారిలో జేఎన్‌యూలో సంస్కృతంలో పీహెచ్డీ చేస్తోన్న విద్యార్థి యోగేంద్ర భరద్వాజ్, మరో పీహెచ్డీ విద్యార్థి సందీప్ సింగ్ ఉన్నారు. భరద్వాజ్ ఇప్పటికే తన ఇతర సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసినప్పటికీ, ఆయన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ద్వారా అతడు ఏబీవీపీ సభ్యుడని గుర్తించారు. బయటివారా? లోపలి వారా? జేఎన్‌యూలో ఆదివారం హింసకు పాల్పడింది వర్సిటీ విద్యార్థులా? లేక బయటినుంచి వచ్చిన వ్యక్తులా? అనే విషయంపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ దృష్టి సారించింది. ‘ఆదివారం మధ్యాహ్నం నుంచే వర్సిటీ గోడలు, గేట్ల వద్ద భారీగా పోలీసు వాహనాలు కనిపించాయి. ఆ స్థాయిలో పోలీసులున్నా దుండగులు క్యాంపస్‌లోకి ఎలా రాగలిగారు? క్యాంపస్‌లో దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఇంటలిజెన్స్ సమాచారం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే.. వారెందుకు వెంటనే స్పందించలేదు?’ అనే ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు స్పందించారు. ‘గత నెల రోజులుగా పోలీసులు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ఆదివారం కూడా అక్కడ ఉన్నారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులు వెళ్లలేరు’ అని వివరించారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారమివ్వడంలో ఆలస్యం కావడంపై వర్సిటీ అధికారులు స్పందించారు. ‘సరైన కారణం లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులను పిలిస్తే విద్యార్థులకు కోపమొస్తుంది. అందుకే పరిస్థితి దిగజారిందని భావించాకే పిలిచాం’ అని తెలిపారు. విద్యార్థులపై మోదీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన అమానుష దాడి ఇది. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. – సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఈ దాడులు 26/11 ముంబై దాడులను గుర్తు చేస్తున్నాయి. దేశంలో తమకు రక్షణ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనల వంటి వాటిని మహారాష్ట్రలో జరగనివ్వను. నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతే.. వారూ అందులో పాలుపంచుకున్నట్లే.. – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం జేఎన్‌యూ దాడిపై బాలీవుడ్ నటి, అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా స్పందించారు. వార్తా పత్రికలోని ఓ భాగాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్.. ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది భయానికి వెరవడం లేదు. నిరసనలను హింసతో అణచలేరు. అదే జరిగితే మరింత మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతారు’ అని చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మాటలను ఏబీవీపీకి మద్దతుదారుడైన అక్షయ్ కుమార్‌కు (ట్వింకిల్ భర్త) చెప్పాలంటూ ట్రోల్ చేస్తున్నారు. -
జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
-
జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడి
-
జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..!
-
జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..!
కోల్కత్తా : దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసను బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్‌గా ఆమె అభివర్ణించారు. దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మమత మద్దతు తెలిపారు. విద్యార్థులంతా ఐక్యంగా ఉండాలని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు. ‘విద్యార్థులతో పాటు అధ్యాపకులపై సైతం దాడికి పాల్పడ్డారు. ఇది నాకు మాత్రమే కాదు అందరికీ బాధాకరం. వర్సిటీలోకి బీజేపీ కుట్రపూరితంగా గుండాలను పంపుతోంది. దీనిలో పోలీసులు ప్రమేయం కూడా ఉంది.’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (జేఎన్‌యూలో దుండగుల వీరంగం) కాగా ప్రతిష్టాత్మక వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై దాడిని పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని, ఇలాంటి చర్యలను ఏమాత్రం క్షమించేదిలేదని అభిప్రాయపడుతున్నారు. ముసుగు దుండుగులు పాల్పడిన దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి పాల్పడిన వారిని గుర్తుపడతానని ఘోష్ చెబుతున్నారు. (జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!) -
‘ముసుగు దుండగులను గుర్తిస్తా’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం చీఫ్ ఐషే ఘోష్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లోకి ప్రవేశించి హాకీస్టిక్‌లు, ఇనుపరాడ్లతో తమపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దుండగుల దాడిలో తలపై గాయాలైన ఘోష్ తాను కోలుకున్న అనంతరం ఏబీవీపీ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏబీవీపీ సభ్యులపై తాము సమిష్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. విద్యార్ధులపై ఇనుప రాడ్లతో దాడి చేసిన వారిలో కొందరి ముఖాలను తాను గుర్తుపట్టగలనని, ఘర్షణలు చెలరేగిన క్రమంలో పెనుగులాటలో కొందరి ముసుగులు చెదిరిపోయాయని చెప్పారు. దుండగుల దాడిలో దాదాపు 30 మంది జేఎన్‌యూ విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఐషూ ఘోష్ తలపై తీవ్ర గాయమై రక్తమోడుతూ ఆదివారం రాత్రి టీవీల్లో కనిపించారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల హింసాకాండపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. చదవండి : జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ -
జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్ధులపై ఆదివారం రాత్రి సాగిన ముసుగు దుండగుల దాడిని ముంబై పేలుళ్ల దాడితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పోల్చారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లతో విద్యార్ధులు, టీచర్లపై విరుచుకుపడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. విద్యార్ధులపై దాడులను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని ఈ ఘటనకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన విద్యార్దులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సత్వరమే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. జామియా మిలియా విద్యార్ధుల నిరసనలను పోలీసులు ఎదుర్కొన్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఢిల్లీ పోలీసులు జాప్యానికి తావివ్వకుండా తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విద్యార్ధులు అభద్రతకు లోనయ్యే పరిస్థితి నెలకొందని, జేఏన్‌యూలో జరిగిన ఘటనలు మహారాష్ట్రలో తాను జరగనివ్వనని స్పష్టం చేశారు. యువతను రెచ్చగొట్టి వారితో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. జేఎన్‌యూలో దాడికి పాల్పడిన ముసుగుల వెనుక ఎవరున్నారో మనం తెలుసుకోవాలని..ముసుగు ధరించేవారు పిరికిపందలని, ధైర్యం ఉన్న వారు బహిరంగంగానే ముందుకువస్తారని అన్నారు. ఇలాంటి పిరికిపందల చర్యలను సహించే ప్రసక్తి లేదని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి దుండగుల దాడిలో 34 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడిండి ఏబీవీపీ కార్యకర్తలని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దాడి చేశారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. చదవండి : జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! -
భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు...
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన దుండగులు సృష్టించిన బీభత్సానికి విద్యార్థులు భయంతో వణికిపోయారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం కొందరు...ముఖం కనిపించకుండా ముసుగు కట్టుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను హాకీ స్టిక్స్‌తో చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దుండగలు క్యాంపస్‌లోని సబర్మతి హాస్టల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి భయపడి హాస్టళ్లలోని తమ గదుల్లో దాక్కున్నారు. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురి విద్యార్థుల కాళ్లకు గాయాలు అయ్యాయి. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థులకు భద్రత కల్పించలేకపోయామంటూ హాస్టల్ వార్డెన్ ఆర్. మీనా సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు యూనివర్శిటీ స్టూడెంట్ డీన్‌కు లేఖ రాశారు. తాము దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, హాస్టళ్లకు భద్రత కల్పించలేకపోయామని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా సుమారు 400మంది విద్యార్థులు ఉన్న సబర్మతి హాస్టల్‌తో పాటు మరికొన్ని హాస్టల్స్‌లోకి ప్రవేశించి దుండగులు దాడి చేశారు. దాడి అనంతరం హాస్టల్ భవనంలోని ప్రతి అంతస్తు బీభత్స వాతావరణాన్ని తలపించింది. కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగులు సమారు మూడు గంటల పాటు జేఎన్‌యూలో విధ్వంస కాండను కొనసాగించారు. ఈ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఆయిసీ ఘోష్ సహా సుమారు 35మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గాయడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు... ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఇక దాడికి పాల్పడిన వారి వివరాలు బయటపెట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. చదవండి: జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా! జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..! జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి జేఎన్‌యూ దాడి: దుండగుల గుర్తింపు ఆ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది: కేజ్రీవాల్ నన్ను తీవ్రంగా కొట్టారు ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా.. సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి సిగ్గుతో తలదించుకుంటున్నా! జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సాలో కో హాస్టల్ మే గుస్కే తోడే (హాస్టల్లోకి గుసాయించి కొట్టాం వారిని)’ అనే హిందీలో సందేశం ఆదివారం రాత్రి 7.03 నిమిషాలకు ఓ వాట్సప్ గ్రూప్‌లో కనిపించింది. దానికి సమాధానంగా అదే గ్రూప్ నుంచి మరొకరు ‘అవును. వారితో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తేల్చుకుంటాం. కోమియో (కమ్యూనిస్టులు) చెత్త, చెత్త ప్రచారం చేస్తున్నారు’ అంటూ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముసుగులు, కర్రలు దరించిన కొందరు యువకులు జేఎన్‌యూ హాస్టళ్ళలోకి ప్రవేశించి కొంతమంది విద్యార్థినీ విద్యార్థులను, కొందరు ఉపాధ్యాయులను చితక బాదిన విషయం తెల్సిందే. ఆ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్ సహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ వారు పాల్పడ్డారని విద్యార్థి కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించగా, తాము పాల్పడలేదని, వామపక్ష విద్యార్థులే పాల్పడ్డారని ఏబీవీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. (జేఎన్‌యూలో దుండగుల వీరంగం) ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వచ్చిన వాట్సాప్ సందేశాలను ‘స్క్రోల్ డాట్ ఇన్’ మీడియా ‘ట్రూకాలర్ ఆప్’ను ఉపయోగించి ఫోన్ నెంబర్లను కనుగొన్నది. వాటిని ఫేస్బుక్లో శోధించాక వారి ప్రొఫైల్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ‘సోలోంకు హాస్టల్ మే గుస్కే తోడే’ అనే సందేశం పంపిందీ సౌరవ్ దూబే అని తెల్సింది. ఆయన ఢిల్లీలోని షహీద్ భగత్‌సింగ్ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ‘జేఎన్‌యూటీస్ ఫర్ మోదీ’ అనే గ్రూపును నడుపుతున్నారు. ఆ రోజు దాడికి ముందు సాయంత్రం 5.39 గంటలకు ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్’ అనే వాట్సాప్ గ్రూపులో లెఫ్ట్ టెర్రర్‌కు వ్యతిరేకంగా దయచేసి ఈ గ్రూపులో చేరండి. వారిని చితక బాదాల్సిందే. అదే వారికి సరైన చికిత్స’ అని ఒకరు వ్యాఖ్యానించగా, అందుకు స్పందనగా మరొకరు ‘గెట్ ది పీపుల్ ఫ్రమ్ డీయూ టూ ఎంటర్ ఫ్రమ్ ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ సైడ్. వియ్ ఆర్ 25,30 ఆఫ్ అజ్ ఇయర్’ అని స్పందించారు.(ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..) ఇక ఇక్కడ డీయూ అంటే ఢిల్లీ యూనివర్శిటీ అని. ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ సైడ్ అంటే జేఎన్‌యూలో ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ అకాడమీ ఉంది. దానికి వేరే గేటు ఉంది. అక్కడ పెద్దగా భద్రత ఉండదు. జేఎన్‌యూ ప్రధాన గేట్ నుంచి వచ్చే ప్రతి విజిటర్‌ను తనిఖీ చేసే లోపలికి పంపిస్తారు. అందుకని దుండగులు ఆ స్విమ్మింగ్ అకాడమీ గేట్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ సందేశం పంపిందీ ‘ట్రూకాలర్ యాప్’ ద్వారా వికాస్ పటేల్‌దని తేలింది. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రకారం వికాస్ పటేల్ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో ఏబీవీపీ మాజీ ఉపాధ్యక్షుడు. ‘యునిటీ అగెనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో అదే రోజు రాత్రి 8.41 గంటలకు ‘హాజ్ ది పోలీస్ కమ్, బ్రదర్. లెఫ్టిస్ట్ హాజ్ జాయిన్డ్ దిస్ గ్రూప్ టూ. వై వాజ్ ది లింక్ షేర్డ్ (బ్రదర్ పోలీసులు వచ్చారా? ఈ గ్రూపులో కూడా లెఫ్టిస్టులు చేరారు. ఎందుకు లింక్ షేర్ చేశారు?)’ అన్న సందేశం వచ్చింది. కాగా ‘ట్రూకాలర్’ ద్వారా ఓంకార్ శ్రీవాత్సవ అనే వ్యక్తి ఆ సందేశాన్ని పంపించారని తెల్సింది. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఢిల్లీ రాష్ట్ర ఏబీవీపీ ఎగ్టిక్యూటివ్ కమిటీ సభ్యుడు. జేఎన్‌యూలో 2015-16లో ఏబీవీపీ ఉపాధ్యక్షుడు. రాత్రికి రాత్రి ఈ వాట్సాప్ గ్రూపుల నుంచి ఈ సందేశాలన్నింటిని డిలీట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులను కూడా చేర్చుకున్నారు. పేర్లు బయటకు వచ్చిన వీరిని మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లన్నీ స్విచాఫ్‌లో ఉన్నాయి. ఢిల్లీ పోలీసు అధికారులను సంప్రదించగా, వారు స్పందించేందుకు నిరాకరించారు. -
కిషన్ రెడ్డికి నిరసన సెగ
-
అనంతపురం: కిషన్ రెడ్డికి నిరసన సెగ
సాక్షి, అనంతపురం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డికి సోమవారం అనంతపురంలో నిరసన సెగలు ఎదురయ్యాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను అడ్డుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థి సంఘం నాయకులపై దాడిని నిరసిస్తూ కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. దాడులను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మతోన్మాద గుండాలు కిరాతకంగా విద్యార్థి నాయకులపై దాడులు చేయడాన్ని ఆందోళనకారులు ఖండించారు. కాగా, జేఎన్‌యూలో విద్యార్థి నేతలపై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు నిరసనల గళాలు విన్పిస్తున్నారు. దుండగులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత వార్తలు జేఎన్‌యూలో దుండగుల వీరంగం ‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ సిగ్గుతో తలదించుకుంటున్నా! ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా.. జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..! -
జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..!
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చోటుచేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాత్మక దాడులను ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు. ‘విద్యార్థులపై జరిగిన భీకరమైన దాడి.. అసహనానికి నిదర్శనం. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, టీచర్లపై ‘నాజీ స్టైల్’లో దాడి జరిగింది. దేశంలో హింస, అశాంతి సృష్టించాలనుకునేవాళ్లే ఇలాంటి దాడులు చేస్తారు’ అని పినరయి ట్విటర్లో పేర్కొన్నారు. ‘క్యాంపస్‌లో రక్తపాతాలు సృష్టించే ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడటాన్ని సంఘ్ పరివార్ శక్తులు ఇప్పటికైనా ఆపాలి. విద్యార్థుల గొంతు.. ఈ దేశ గొంతుగా వారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’ అని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడుల నేపథ్యంలో క్యాంపస్ విద్యార్థులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందుకే వారిని ‘శిక్షించేందుకు’ ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఎన్‌యూలో దాడులను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపితే మంచిదని ఆమె సూచించారు. -
‘విద్యార్థులకంటే ఆవులకే రక్షణ ఉంది’
ముంబై : బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియలో చురుగ్గా ఉంటూ.. సమకాలిన విషయాలపై స్పందిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నెలకొంటున్న ఆందోళనలపై ఆమె స్పందించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్‌యూ) ఆదివారం దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై దాడిచేయగా.. తీవ్ర గాయాలపాలైన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ట్వింకిల్ ఖన్నా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉన్నట్లు ఉందని ట్వింకిల్ ఖన్నా వ్యాఖ్యానించారు. భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదని, హింసతో ప్రజలను అణచి వేయలేరని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల నిరసనలు, ఆందోళనలు మరింత పెరుగుతాయని.. ఎక్కువ మంది రోడ్లపైకి వస్తారని ట్వింకిల్ ఖన్నా తెలిపారు. (ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..) జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్ తారలు India,where cows seem to receive more protection than students, is also a country that now refuses to be cowed down. You can’t oppress people with violence-there will be more protests,more strikes,more people on the street. This headline says it all. pic.twitter.com/yIiTYUjxKR — Twinkle Khanna (@mrsfunnybones) January 6, 2020 -
జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస నేపథ్యంలో వర్సిటీ అధికారిక విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) వీసీని టార్గెట్ చేసింది. క్యాంపస్‌లో జరిగిన దాడులకు జేఎన్‌యూ వీసీ జగదేశ్‌కుమార్ కారణమని నిందించింది. వీసీ ఒక మాబ్‌స్టెర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో హింసను ప్రేరేపిస్తున్నాడని, తన బాసులను సంతృప్తి పరిచేందుకే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఏబీవీపీ విద్యార్థులే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాలతో కూడిన జేఎన్‌యూఎస్‌యూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో హింసకు వీసీ జగదేశ్ కారణమని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు తమపై దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
జేఎన్‌యూ దాడి: దుండగుల గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు కర్రలతో స్వైర విహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్‌యూ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ముసుగు ధరించిన కొందరు దుండగులను గుర్తించారు. క్యాంపస్‌లో కొన్ని గంటల పాటు చెలరేగిన దుండగుల దాడిలో 34 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తణమే నివేదిక సిద్ధం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో మాట్లాడిన అమిత్ షా వర్సిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఏబీవీపీ కార్యకర్తలే ముసుగు దాడులకు పాల్పడి క్యాంపస్‌లో అరాచకం సృష్టించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చదవండి: జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
ఆ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం జరిగిన ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ స్పందిస్తూ..ఢిల్లీలో జరిగిన హింస నన్ను షాక్‌కు గురిచేసిందని అన్నారు. విద్యార్థులను దారుణంగా కొట్టారని..పోలీసులు హింసను వదిలి శాంతిని నెలకొల్పాలని సూచించారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్ధులకు భద్రత లేనప్పుడు..దేశం ముందుకు ఎలా వెళ్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆదివారం జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం, ఏబీవీపీ మద్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించగా, లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థులే హింసకు కారణమని ఆర్ఎస్ఎస్ తెలిపింది. -
దేశ వ్యాప్తంగా వర్సిటీల్లో నిరసన ప్రదర్శనలు
-
జేఎన్‌యూలో హింస
-
నన్ను తీవ్రంగా కొట్టారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తల పగిలింది. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల దాడి సందర్భంగా తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా.. ఆయిషీ ఘోష్ విలపిస్తూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు తనను కిరాతకంగా కొట్టారని ఈ వీడియోలో ఆమె విలపిస్తూ పేర్కొన్నారు. ‘తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నేను మాట్లాడే స్థితిలో కూడా లేను. దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న నన్ను తీవ్రంగా కొట్టారు’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముసుగు మూక వీరంగం జేఎన్‌యూలో మసుగు మూకల వీరంగానికి సంబంధించి తాజా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం ముసుగులు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లో సంచరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖానికి ముసుగులు తొడిగి.. జీన్స్‌ప్యాంట్లు, జాకెట్లు ధరించి.. చేతిలో కర్రలతో గుంపుగా దుండగులు క్యాంపస్‌లో సంచరిస్తూ.. కర్రలతో బెదిరిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. చదవండి: సిగ్గుతో తలదించుకుంటున్నా! -
ముసుగులతో విద్యార్థులపై దాడి
-
ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..
కోల్‌కతా: ‘ఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉంది’ అంటూ ఆయిషీ ఘోష్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేసేవాళ్లపై ఈవిధంగా దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం ముసుగులు ధరించిన దుండగులు తీవ్ర స్థాయిలో హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తల పగిలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. (‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ ) కాగా తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా, హృదయ విదారకంగా విలపిస్తున్న ఘోష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయిషీ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘ నా కూతురితో ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు. వేరే ఎవరో ఈ దాడి గురించి చెబితే నాకు తెలిసింది. అక్కడ హింస చెలరేగుతుందని భయం వేసింది. మాకు చాలా బాధగా ఉంది. చాలా కాలంగా శాంతియుతంగానే అక్కడ ఉద్యమం నడుస్తోంది. నా కూతురు తలకు ఐదు కుట్లు పడ్డాయి. తను వామపక్ష ఉద్యమంలో ఉంది. అయితే ప్రతీచోటా.. ప్రతీ ఒక్కరూ వామపక్షాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు’ఆయిషీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం) ఇక ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జేఎన్‌యూ వైస్ ఛాన్స్లర్ రాజీనామా చేయాలని ఆయిషీ తల్లి డిమాండ్ చేశారు. ‘ఫీజు పెంపుదల గురించి విద్యార్థులు నిరసన చేపడుతున్నా.. వీసీ తనకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు. విద్యార్థులతో ఆయన అసలు చర్చలు జరపడం లేదు. అందుకే యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’ అని వీసీ తీరును తప్పుబట్టారు. అదే విధంగా నిరసనలో పాల్గొనకుండా తన కూతురిని వెనక్కి రమ్మని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ‘ తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉద్యమం చేస్తున్నారు. వారంతా గాయపడ్డారు. అయితే కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువగా గాయాలు తగిలాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్ధులు గతకొన్ని రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంటును ముట్టడించేందుకు విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్ధులు గాయాలపాలయ్యారు. -
సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి
లక్నో : జేఎన్‌యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని ఖండించిన మాయావతి సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జేఎన్‌యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి సిగ్గుచేటు. తీవ్రంగా ఖండించదగినది. ఈ పాశవిక చర్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి.. దాడిపై న్యాయ విచారణ జరిపితే మంచిది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.(జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్ తారలు) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి ఆదివారం రాత్రి చొరబడిన దుండగులు విద్యార్థులపై కర్రలతో, రాడ్లతో దాడిగి తెగబడిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ముసుగు దాడిలో గాయపడ్డ విద్యార్థులు, జేఎన్యూఎస్ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనను ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ తక్షణమే యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా ఏబీవీపీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. చదవండి. ‘తలపై పదే పదే కాలితో తన్నాడు’ JNU में छात्रों व शिक्षकों के साथ हुई हिंसा अति-निन्दनीय व शर्मनाक। केन्द्र सरकार को इस घटना को अति-गम्भीरता से लेना चाहिये। साथ ही इस घटना की न्यायिक जाँच हो जाये तो यह बेहतर होगा। — Mayawati (@Mayawati) January 6, 2020 -
సిగ్గుతో తలదించుకుంటున్నా!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ రాహుల్ మెహ్రా ట్విటర్లో స్పందించారు. గూండాలు జేఎన్‌యూలోకి ప్రవేశించి.. అమాయకులైన విద్యార్థులపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులకు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. ‘జేఎన్‌యూలో హింసకు సంబంధించిన వీడియో క్లిప్స్ చూశాక ఢిల్లీ పోలీసు స్టాండింగ్ కౌన్సెల్ అయిన నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. గూండాలు యథేచ్ఛగా జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి.. మారణహోమం సృష్టించారు. విద్యార్థులను తీవ్రంగా గాయపర్చారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బలగాలు ఏం చేస్తున్నాయి?’అంటూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు దాడి చేశారో, ఎవరు బాధితులో అన్నది సందేహముంటే.. ఎబీవీపీ లేదా వామపక్షాల విద్యార్థుల్లో ఎవరికి తీవ్రమైన గాయాలయ్యాయన్న దానినిబట్టి దానిని తేల్చవచ్చునని పేర్కొన్నారు. చదవండి: జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ
జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్ తారలు స్పందించారు. హీరోయిన్ స్వరా భాస్కర్, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్ దేశ్‌ముఖ్ ట్విటర్ వేదికగా ఈ హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలోకి చోరబడి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విచక్షణా రహితంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులతోపాటు జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, నటి స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్వరా భాస్కర్ తల్లి జేఎన్‌యూలో ఉంటూ.. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు సహాయం అందిచాలని తన తల్లిని కోరారు. ‘‘ఢిల్లీ వాసులకు అర్జెంట్ అప్పీల్. బాబా మంగ్నాథ్ మార్గంలోని ప్రధాన గేట్ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి’’ అని కోరారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం) Urgent appeal!!!! To all Delhiites PLS gather in large numbers outside the Main Gate of JNU campus on Baba Gangnath Marg.. to pressure the govt. & #DelhiPolice to stop the rampage by alleged ABVP masked goons on JNU campus. PLS PLS share to everyone in Delhi!🙏🏿🙏🏿 9pm on 5th. Jan pic.twitter.com/IXgvvazoSn — Swara Bhasker (@ReallySwara) January 5, 2020 స్వరా పోస్టు చేసిన దానిపై స్పందించిన షబానా అజ్మీ..దాడిని కేవలం ఖండిస్తే సరిపోదు. ఈ చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాంపస్‌లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు. ‘ఇదంతా నిజంగా జరుగుతుందా... ఓ పీడకలలా అనిపిస్తోంది. నేను ఇండియాలో లేను. దాడి కారణంగా 20 మంది విద్యార్థులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు’ అని షబానా పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన చోట ఇలా జరగడం దారుణమని, ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందని హీరోయిన్ తాప్సీ అన్నారు.. వీరితో పాటు రితేష్ దేశ్‌ముఖ్, దియా మిర్జా, విశాల్ దాద్లానీ సైతం ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. This is beyond shocking ! Condemnation is not enough. Immediate action needs to be taken against the perpetrators . https://t.co/P5Arv9aNhj — Azmi Shabana (@AzmiShabana) January 5, 2020 such is the condition inside what we consider to be a place where our future is shaped. It’s getting scarred for ever. Irreversible damage. What kind of shaping up is happening here, it’s there for us to see.... saddening https://t.co/Qt2q7HRhLG — taapsee pannu (@taapsee) January 5, 2020 Why do you need to cover your face? Because you know you are doing something wrong, illegal & punishable. There is no honour in this-Its horrific to see the visuals of students & teachers brutally attacked by masked goons inside JNU-Such violence cannot & should not be tolerated — Riteish Deshmukh (@Riteishd) January 5, 2020 -
‘తలపై పదే పదే కాలితో తన్నాడు’
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన ఇండియా ప్రతిష్టను మోదీ- షా గూండాలు నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. యూనివర్సిటీల్లో చొరబడి.. మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న పిల్లలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం తీవ్ర స్థాయిలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు యూనివర్సిటీలో చొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడికి తెగబడ్డారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ... ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ట్విటర్ వేదికగా నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలీసులు సైతం విద్యార్థులను చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. ‘ ఇది చాలా దారుణ ఘటన. ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు నాతో మాట్లాడారు. గూండాలు క్యాంపస్‌లోకి ప్రవేశించి.. కర్రలు, ఇతర ఆయుధాలతో తమపై దాడి చేశారని చెప్పారు. ఎంతో మందికి తలపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు తన తలపై పదే పదే కాలితో తన్నాడని ఓ విద్యార్థి నాతో చెప్పాడు. అయినప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం మీడియా ముందు తమ గూండాలు ఈ హింసకు పాల్పడలేదని నటిస్తున్నారు. ఈ గాయాన్ని మరింతగా అవమానిస్తూ.. అందరినీ ఏమారుస్తున్నారు’ అని ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అమానుష ఘటనకు మీరే కారణమంటూ వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం) India has an established global reputation as a liberal democracy. Now Modi-Shah’s goons are rampaging through our universities, spreading fear among our children, who should be preparing for a better future..1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 5, 2020 -
జేఎన్‌యూలో దుండగుల వీరంగం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం హింస చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా, విలపిస్తున్న ఘోష్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దుండగులు వర్సిటీలో భయోత్పాతం సృష్టించారు. ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది. ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. ఏబీవీపీ వారు చేసిన రాళ్లదాడిలోనే తమ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించింది. హాస్టళ్లలోకి చొరబడి ప్రత్యర్థి వర్గాల విద్యార్థులు లక్ష్యంగా దాడి చేశారని, పలువురు టీచర్లను కూడా గాయపర్చారని పేర్కొంది. జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఒక సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారని విద్యార్థులు ఆరోపించారు. దాడికి భయపడి హాస్టళ్లలోని తమ రూముల్లో దాక్కున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని అందులో కోరారు. వర్సిటీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రుల ఖండన జేఎన్‌యూలో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు. ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామని ట్వీట్ చేశారు. విద్యార్థులకు భయపడ్తున్నారు వర్సిటీ విద్యార్థులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందువల్లనే, వారిని భయభ్రాంతులు చేసేందుకే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించాయి. ప్రభుత్వం పంపిన గూండాలే వీరని కాంగ్రెస్ మండిపడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ‘సమరశీల విద్యార్థుల నినాదాలు వింటున్న ఫాసిస్ట్‌లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భయం ప్రతిస్పందనే జేఎన్‌యూలో నేడు చోటు చేసుకున్న హింస’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కోరానన్నారు. ‘జేఎన్‌యూ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. విద్యార్థులను దారుణంగా కొట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే.. దేశం ముందుకు ఎలా వెళ్తుంది?’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. యూనివర్సిటీ వెలుపల స్వరాజ్ అభియాన్‌పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌పై కొందరు దాడికి యత్నించారు. బయట వైపు ఉన్న పోలీసులు, ఇతరులు -
జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించగా, వామపక్ష విద్యార్ధులు తమ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. కనిపించిన ప్రొఫెసర్లపై సైతం వారు విరుచుకుపడ్డారు. -
క్యాంపస్‌లో కలకలం : వివేకానంద విగ్రహం ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్‌లో జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహాన్నిదుండగులు ధ్వంసం చేశారు. జేఎన్‌యూ అడ్మిన్ బ్లాక్‌లోకి బుధవారం కొందరు విద్యార్ధులు ప్రవేశించి వర్సిటీ వీసీ మామిడాల జగదీష్ కుమార్‌పై అభ్యంతరకర మెసేజ్‌లు రాసిన మరుసటి రోజు వివేకానంద విగ్రహం ధ్వంసం చేయడం గమనార్హం. విద్యార్ధుల ఆందోళనతో పెంచిన ఫీజులను జేఎన్‌యూ అధికారులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. హాస్టల్ ఫీజు పెంపు, డ్రెస్ కోడ్ వంటి పలు సమస్యలపై జేఎన్‌యూ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వర్సిటీ అధికారులు దిగివచ్చి పెంచిన ఫీజులను ఉపసంహరించినట్టు ప్రకటించారు. -
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
కోరిక తీర్చలేదని...
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లైంగిక దాడులు, వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా జేఎన్‌యూ విద్యార్థి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. నిందితుడిని మహ్మద్ కశ్మీరీగా గుర్తించామని..వీరిద్దరూ స్నేహితులేనని పోలీసులు చెప్పారు. గత కొంతకాలంగా కశ్మీరీని బాధిత యువతి పట్టించుకోవడం లేదని సమాచారం. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తెస్తుండగా అందుకామె నిరాకరించడంతో కశ్మీరీ కక్ష గట్టాడని పోలీసులు వెల్లడించారు. ఇదే విషయమై ఆమెతో వాదనకు దిగిన కశ్మీరీ ఆవేశంతో ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడికి దిగాడు. బాధితురాలు వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
జేఎన్‌యూలో తుపాకి కలకలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) క్యాంపస్ లో మారణాయుధంతో దొరికిన బ్యాగు కలకలం రేపింది. ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం మిస్టరీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఈ బ్యాగును గుర్తించిన యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నలుపు రంగులో ఉన్న ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.65 పిస్టల్, ఏడు తూటాలు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ బ్యాగు క్యాంపస్ లోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అక్టోబర్ 15 నుంచి కనిపించకుండాపోయిన నజీబ్ అహ్మద్ కోసం జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. నజీబ్ అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు. -
జెఎన్యూలో కన్హయ్యపై దాడి!
న్యూఢిల్లీ: జెఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్పై ఓ వ్యక్తి గురువారం సాయంత్రం దాడి చేయడానికి ప్రయత్నించాడు. దేశాన్ని తిడుతూ.. భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న కన్హయ్యకు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే తాను అతనిపై దాడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి క్యాంపస్ ఔట్ సైడర్ అని తేలింది. భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే క్యాంపస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన కన్హయ్యకుమార్ ఇటీవల బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. జెఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. తీవ్రస్థాయిలో కొనసాగిన ఈ వివాదం కేంద్రప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. -
అనుమతిపై తేల్చని జేఎన్‌యూ
విద్యార్థుల అరెస్టుకు పోలీసుల ఎదురుచూపులు వర్సిటీలో ఉమర్ ప్రత్యక్షం న్యూఢిల్లీ: జేఎన్‌యూ క్యాంపస్‌లోకి పోలీసుల్ని అనుతించాలా లేక విద్యార్థుల్ని లొంగిపోమనాలా అనేదానిపై తేల్చకుండానే జేఎన్‌యూ పాలకమండలి భేటీ ముగిసింది. రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్‌లు ఆదివారం వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. వార్త తెలియగానే పోలీసు బృందం వర్సిటీకి చేరుకుని వీసి అనుమతి కోసం ఆదివారం రాత్రి నుంచి ఎదురుచూసింది. దీంతో వర్సిటీ వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. పోలీసుల్ని అనుమతించవద్దంటూ 300 మంది అధ్యాపకుల బృందం వీసీని కోరింది. రాజద్రోహం కేసులు ఉపసంహరించుకునేలా పోలీసుల్ని కోరాలంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ...లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్‌ను కలిసి వివాదంపై వివరించారు. ► వివాదంపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ కమిటీకి.. సాక్ష్యాల పరిశీలన కోసం వర్సిటీ మరో 7 రోజుల గడువునిచ్చింది. ► ఫిబ్రవరి 15న పటియాలా కోర్టు దాడి కేసులో ఇతర అంశాల పరిశీలనకు అంగీకరింబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దాడిపై సుప్రీంకోర్టుకు పోలీసులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నివేదిక సమర్పించారు. సుప్రీం నియమిత కమిటీ నివేదికకు విరుద్ధంగా ఈ రెండు ఉన్నట్లు సమాచారం. ► తిహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూఎస్‌యూ నేత కన్హయ్యను ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. కన్హయ్య తన నిర్దోషిత్వ నిరూపణకు సంజాయిషీ ఇవ్వనవసరం లేదని తల్లి ఇచ్చిన సందేశాన్ని సోదరుడు అందించారు. నాకే తెలియనివి తెలిశాయి: ఉమర్ ‘నేనేమిటో నాకే తెలియని విషయాలు గత వారంలో నాకు బాగా తెలిసొచ్చాయి. నా పేరు ఉమర్ ఖాలిదే కానీ, నేను ఉగ్రవాదిని కాను’ అనిస్కాలర్ ఉమర్ ఖాలిద్ చెప్పారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉంటుందన్న హామీమేరకు ఆయన ఆదివారం వర్సిటీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఖాలిద్ 500 మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘నాకు పోస్‌పోర్టు లేకున్నా రెండుసార్లు పాక్‌లో ఉన్నాను’ అని వ్యంగ్యంగా అన్నారు. -
'జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు'
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదని శుక్రవారం స్పష్టం చేశారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు, దేశ సమగ్రతను ప్రశ్నించడంలాంటివి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. జేఎన్‌యూలో ఘటనలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా, కశ్మీరీ ప్రజల పోరాటానికి మద్దతుగా.. జేఎన్‌యూలో మంగళవారం సాయంత్రం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించటంపై వర్సిటీ పాలకవర్గం క్రమశిక్షణా విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం దేశ వ్యతిరేకమైన కార్యక్రమమని..అనుమతి రద్దు చేసినా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకు బాధ్యులైన విద్యార్థులను బహిష్కరించాలని డిమాండ్ రావడంతో వర్సిటీ పాలకవర్గం విచారణకు ఆదేశించింది.