న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఎంకే ఉదయనిధి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నాన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం ఉదయం ఆయన చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులను కలిశారు.
ఈ నెల 5వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులపై గుర్తు తెలియని దుండగుల దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖానికి ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగిన వారిని ఢిల్లీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని అన్నారు. నిందితులెవరో సీసీటీవీ ఫుటేజీల్లో తేలినప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
సంబంధిత వార్తలు
ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం!
జేఎన్‌యూలో మెరిసింది.. ఎవరీ ఆయిషీ ఘోష్?
10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు...
హీరోయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment