
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన జేఎన్‌యూలో ముసుగు దుండగుల దాడి వెనుక ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి చెలరేగిన హింసాకాండకు ఏబీవీపీ, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన దౌర్జన్యకాండలో ఇరు వర్గాల తరపున బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాలుపంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఢిల్లీ పోలీసులు సోమవారం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించగా హింస వెనుక వామపక్ష, ఏబీవీపీ వాలంటీర్లు ఇద్దరూ ఉన్నారని క్రైమ్ బ్రాంచ్ నిగ్గుతేల్చింది. యూనివర్సిటీలోకి చొచ్చుకువచ్చిన బయటవ్యక్తులును సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు విద్యార్ధులు షేర్ చేసిన సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాలు, హాకీస్టిక్‌లతో ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వైరవిహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment