Left Front parties
-
జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన జేఎన్‌యూలో ముసుగు దుండగుల దాడి వెనుక ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి చెలరేగిన హింసాకాండకు ఏబీవీపీ, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన దౌర్జన్యకాండలో ఇరు వర్గాల తరపున బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాలుపంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు సోమవారం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించగా హింస వెనుక వామపక్ష, ఏబీవీపీ వాలంటీర్లు ఇద్దరూ ఉన్నారని క్రైమ్ బ్రాంచ్ నిగ్గుతేల్చింది. యూనివర్సిటీలోకి చొచ్చుకువచ్చిన బయటవ్యక్తులును సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు విద్యార్ధులు షేర్ చేసిన సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాలు, హాకీస్టిక్‌లతో ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వైరవిహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన సంగతి తెలిసిందే. చదవండి : జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
ట్విట్టర్ రెక్కలు కత్తిరిస్తారా?
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ రెక్కలు కత్తిరించాలని కేంద్రం భావిస్తోందా? ట్విట్టర్ గ్లోబల్ బృందం సీనియర్ సభ్యులు లేదా సీఈవో తమ ముందు హాజరైతే తప్ప ఇతర అధికారులెవరినీ కలవబోమని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించడంతో ఈ అనుమానం తలెత్తుతోంది. తమ ఆదేశాలు పాటించి తమ ముందు హాజరుకావడానికి ట్విట్టర్‌కు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల మొదట్లో ‘యూత్ ఫర్ సోషల్ మీడియా డెమోక్రసీ’పేరుతో బీజేపీ సానుభూతిపరులైన వారి బృందం ట్విట్టర్ ఇండియా కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిపింది. తర్వాత వామపక్షేతర సిద్ధాంతాలు అనుసరించే వ్యక్తుల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడానికి ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు వినతిపత్రం సమర్పించింది. వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపే అకౌంట్ల నుంచి చేసే నిందాపూర్వక ట్వీట్ల విషయంలో ట్విట్టర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. తగ్గిన మోదీ ఫాలోవర్లు.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కు 32 కోట్లకు పైగా ఖాతాలుండగా, ఇండియాలో 3 కోట్ల మంది వినియోగదారులున్నారు. కానీ నకిలీ ఖాతాలను నవంబర్‌లో ట్విట్టర్ రద్దు చేయడంతో దేశంలో వినియోగదారుల సంఖ్య 2.4 కోట్లకు తగ్గింది. ఫేక్ అకౌంట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫాలోవర్లు గణనీయంగా తగ్గారు. వాడుకుంది వారే.. ట్విట్టర్‌ను మొదట్నుంచీ బీజేపీ మద్దతుదారులే బాగా వాడుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ 2009లో ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం ప్రారంభించారు. మిగిలిన పార్టీల నేతలూ ఆయనను అనుసరించారు. 2014 ఎన్నికల తర్వాత ట్విట్టర్ వినియోగంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీని అందుకునే స్థాయికి చేరుకున్నారు. అయినా బీజేపీ మద్దతుదారులదే ట్విట్టర్లో ఆధిపత్యం కొనసాగింది. ఆలస్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఆటలో మోదీ, బీజేపీ శిబిరానికి గట్టి పోటీదారుగా అవతరించారు. ఇటీవల రఫేల్ కుంభకోణంలో ట్విట్టర్‌ను ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’అక్రమ పద్ధతిలో తన ప్రచారానికి వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది. గతంలో ఆయుధంగా ఉపయోగపడిన ట్విట్టర్ నేడు పాలకపక్షానికి కంటగింపుగా మారింది. ‘రాజకీయ అభిప్రాయాల ఆధారంగా చర్యలుండవు’ ‘నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే నమ్మకం ఉన్నవారే ట్విట్టర్‌ను నడుపుతున్నారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోం’అని ఇటీవల ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ కాలిన్ క్రోవెల్ తన బ్లాగ్‌లో స్పష్టం చేశారు. వాస్తవానికి దేశాన్ని బట్టి లేదా రాజకీయ పార్టీని బట్టి ట్విట్టర్ ఎలాంటి విధానం రూపొందించలేదు. ట్విట్టర్ మీడియా సంస్థా? లేదా సామాజిక వేదికా.. అనే విషయం పరిశీలించాలని కేంద్ర సమాచార శాఖను ఠాకూర్ నేతృత్వంలోని ఐటీ కమిటీ కోరింది. మీడియా సంస్థగా నమోదైతే ఇండియాలో విదేశీ మీడియా సంస్థలకు వర్తించే కఠిన నిబంధనలు ట్విట్టర్‌ను ఇబ్బంది పెడతాయి. సామాజిక వేదికగా తేలితే వినియోగదారులు వెలిబుచ్చే అభిప్రాయాలను ఎడిట్ చేయడం చట్ట వ్యతిరేకమవుతోంది. ఏ రకంగా చూసినా ట్విట్టర్‌కు కష్టాలు తప్పవు. -
అధికారంలోకి వస్తే ‘చదువుల సావిత్రి’
రఘునాథపల్లి వరంగల్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే చదువుల సావిత్రి పథకం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు, విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో బీఎల్ఎఫ్ మండల చైర్మన్ ముక్క ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం వ్యాపారమయమవడంతో పేద, మద్య తరగతి వర్గాలకు ఉన్నత, నాణ్యమైన విద్య దూరమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఉపయుక్తంగా ఉండాలే తప్పా వారి ముసుగులో ఆర్థిక స్థితిమంతులకు ప్రయోజనం చేకూర్చడం భావ్యం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదల బతుకులు మారలేదన్నారు. రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతుబందుతో రైతులకు ఒరిగిందేమి లేదని మార్కెట్లో దళారీ దోపిడితో వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ప్రదానిమోదీ దేశ ప్రజలను మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే పది ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు, రూ.5లకే భోజనం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర, దళారీ వ్యవస్థ నిర్మూలన, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. ప్రజలందరికి సమన్యాయం చేసే బహుజన తెలంగాణ సాదించేందుకు రానున్న ఎన్నికల్లో బీఎల్ఎఫ్ను గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ నాగయ్య, నాయకులు కనకారెడ్డి, ఉడుత రవి, గోపి, కావటి యాదగిరి, పొదల నాగరాజు, బీమగోని చంద్రయ్య, ఎడ్ల బాలమ్మ, కాసాని పుల్లయ్య, పోరెడ్డి రాఘవరెడ్డి, దావీదు, మంచాల మల్లేష్, గంగపురం మహేందర్, నర్సింహం, మారపాక నవ్య, రాజు, రమేష్, సుదాకర్, శాగ యాదగిరి, వెంకటేశ్వర్లు, వారాల రాజు, గోన య్య, యాదగిరి, పరుశరాములు పాల్గొన్నారు. -
బంద్...
- 300 మందికి పైగా అరెస్ట్.. విడుదల - బస్సు సర్వీసులకు ఆటంకం - పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ నగరంలో స్వల్ప ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా ముగిసింది. బంద్ వ ల్ల ఆర్టీసీ ముందస్తుగా 250 బస్సులను రద్దు చేసింది. 500 సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రైలే సర్వీసులు యధావిధిగా నడిచాయి. ఆందోళనకారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డు పైకి వచ్చి విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోలు బంక్‌లను బలవంతంగా బంద్ చేయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూ క్యాంపస్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, చందా నగర్, ఫలక్‌నుమా స్టేషన్, ముసారంబాగ్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, సరూర్‌నగర్, మల్కజ్గిరి, బాలాపూర్ చౌరస్తాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలనూ దహనం చేశారు. హస్తినాపురం చౌరస్తాలో ఏపీ సీఏం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్ వల్ల మెజంజాహీ మార్కెట్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు బోసిపోయాయి. జంట నగర కమిషనరేట్ల పరిధిలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనం, బైఠాయింపులు, అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్టుడికింది. కొంత మంది ఆందోళనకారులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను ఆపి, టైర్లలో గాలి తీశారు. అవి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పలువును తెలంగాణ వాదులు చిక్కడపల్లి వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించగా, స్వరాజ్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయగా, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా సీపీఎం నాయకుడు వీరయ్య, డీజీ న రసింహారావు, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజిజ్ పాషా, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పద్మ, సత్య తదితర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు ముందస్తుగా తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. బువ్వ తెలంగాణ కావాలి... తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నిరసన తెలిపారు. ప్రజా కళాకారులు ధూం ధాం ఆటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికలు, రాజకీయ పార్టీల ద్వారా తెలంగాణ రాలేదని, కేవలం ఉద్యమాలతోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అలా వచ్చిందని ఎవరైనా భ్రమపడితే భవిష్యత్తే వారికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ కంటే ముందు బువ్వ తెలంగాణ కావాలని కోరారు. గిరిజనులపై దాడి లాంటిదే:? - ప్రొఫెసర్ కోదండరామ్ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అమాయక గిరిజనులపై దాడి చేయడం లాంటిదేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే తాము అనుసరిస్తున్నామని బీజేపీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలు కొనసాగించేందుకే మీరు అధికారంలోకి వచ్చారా? అని ఘటుగా ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఏకపక్షంగా బిల్లును ఆమోదించే వారు కాదని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించి ఖమ్మంలోని రెండు లక్షల మంది గిరిజనులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బిల్లు ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ (రాయల వర్గం) కేంద్ర కమిటీ సభ్యుడు పి.సూర్యం మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామికంగా ఆమోదించారని ధ్వజమెత్తారు.సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవర్థన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికే పోలవరం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 300 గ్రామాలను ముంచేసి 2 లక్షలకు పైగా గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.