మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
రఘునాథపల్లి వరంగల్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే చదువుల సావిత్రి పథకం ద్వారా అన్ని వర్గాల పిల్లలకు, విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో బీఎల్‌ఎఫ్ మండల చైర్మన్ ముక్క ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం వ్యాపారమయమవడంతో పేద, మద్య తరగతి వర్గాలకు ఉన్నత, నాణ్యమైన విద్య దూరమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఉపయుక్తంగా ఉండాలే తప్పా వారి ముసుగులో ఆర్థిక స్థితిమంతులకు ప్రయోజనం చేకూర్చడం భావ్యం కాదన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదల బతుకులు మారలేదన్నారు. రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతుబందుతో రైతులకు ఒరిగిందేమి లేదని మార్కెట్‌లో దళారీ దోపిడితో వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ప్రదానిమోదీ దేశ ప్రజలను మోసం చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే పది ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు, రూ.5లకే భోజనం, ప్రతి పంటకు గిట్టుబాటు ధర, దళారీ వ్యవస్థ నిర్మూలన, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు.
ప్రజలందరికి సమన్యాయం చేసే బహుజన తెలంగాణ సాదించేందుకు రానున్న ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ నాగయ్య, నాయకులు కనకారెడ్డి, ఉడుత రవి, గోపి, కావటి యాదగిరి, పొదల నాగరాజు, బీమగోని చంద్రయ్య, ఎడ్ల బాలమ్మ, కాసాని పుల్లయ్య, పోరెడ్డి రాఘవరెడ్డి, దావీదు, మంచాల మల్లేష్, గంగపురం మహేందర్, నర్సింహం, మారపాక నవ్య, రాజు, రమేష్, సుదాకర్, శాగ యాదగిరి, వెంకటేశ్వర్లు, వారాల రాజు, గోన య్య, యాదగిరి, పరుశరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment