Udhayanidhi Stalin
-
వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆదివారం స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు విమర్శంచినట్లు.. డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీనే. నేను కూడా అంగీకరిస్తాను. అయితే తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబం’ అని మంత్రి ఉదయనిధి అన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై ర్యాలీలో పాల్గొని ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ వారసత్వం కుటంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. కానీ, నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోదీ తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మొదట ప్రాధాన్యం కుటుంబం.. తర్వాతే దేశం అని అన్నారు. అదే విధంగా ఇండియా కూటమి మొత్తం ఇదే విధానాన్ని పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు. ఇక.. తమిళనాడు మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 38 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే సొంతంగా 23 స్థానాల్లో గెలుపొంది.. 33.2 శాతం ఓట్ షేర్‌ను సంపాధించుకుంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 19న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించిన ఆయన వేసిన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది కోర్టు. ఆ సమయంలో ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలా మాట్లాడడం ఏంటని? ప్రశ్నించింది. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలపై నమోదైన కేసులన్నింటిని(ఎఫ్ఐఆర్)లను ఒకే చోట విచారించేందుకు అనుమతించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. స్టాలిన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్.. ఉదయనిధి స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19(1)(a)ను(వాక్ స్వాతంత్ర్యం-భావ వ్యక్తీకరణ) మీరే అగౌరవపర్చుకున్నారు. అలాగే.. ఆర్టికల్ 25(మత స్వేచ్ఛా హక్కు)ను కూడా మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు.. మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32( తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం) ప్రకారం కోర్టును ఆశ్రయిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియందా?.. మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మందలించింది ధర్మాసనం. ఎఫ్ఐఆర్లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి బెంచ్ సూచించింది. అయితే.. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పటికే ఆయా హైకోర్టులను ఆశ్రయించామని.. గతంలో ‘‘అమిష్ దేవగన్, అర్నాబ్ గోస్వామి, నుపూర్ శర్మ, మొహమ్మద్ జుబెర్’’ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరట ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను పరిశీలిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఏమన్నారంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీలతో పోల్చిన జూనియర్ స్టాలిన్, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు రాజకీయంగా బీజేపీ.. ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. తనపై విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని.. సమాజంలో దుష్టశక్తులెన్నో పెరిగిపోవడానికి సనాతన ధర్మం ఒక కారణం అవుతోందనే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు.. న్యాయపరమైన పోరాటానికి తాను సిద్ధం అంటూ ప్రకటించారాయన. -
హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించారు. అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం నిధుల కొరత ఉందని గతంలో విశాల్ తెలిపాడు. నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్ కూడా పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్ కోరాడు. భవన నిర్మాణ కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఆయన అన్నారు. తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి ఆర్థిక సాయం చేశారు. కోశాధికారి కార్తీకి ఉదయనిధి స్టాలిన్ ఆ చెక్‌ను అందజేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ప్రియమైన ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించడమే కాకుండా ఇలా వీలైనంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన తెలిపాడు. Dear Udhaya, I sincerely thank u as a friend, producer, actor and now sports minister of Tamil Nadu govt for your contribution to our South Indian artistes association building efforts and your willingness to finish it as early as possible and also coming forward to help in any… pic.twitter.com/H40q6HAzvo — Vishal (@VishalKOfficial) February 15, 2024 -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
భారీ వర్షాలతో తమిళనాడు విలవిల (ఫొటోలు)
-
నా వ్యాఖ్యలను బీజేపీ తప్పుదారి పట్టించింది: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి దేశమంతా విస్తరించేలా చేశారని ఆరోపించారు. మారణహోమానికి పిలుపునిచ్చానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. “నేను మారణహోమానికి పిలుపునిచ్చానని మోదీ అన్నారు. కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో వివక్షను రూపుమాపాలి అని మాత్రమే నేను మాట్లాడాను. కానీ దాన్ని వక్రీకరించి పెద్దది చేసి యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు." అని ఉదయనిధి అన్నారు. “ఓ సాధువు నా తలపై 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులపై నమ్మకం ఉంది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకుని, కలైంజ్ఞర్ మనవడిని, నేను వారి భావజాలాన్ని కొనసాగిస్తాను." అని ఉదయనిధి తెలిపారు. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’.. ‘సనాతన నిర్మూలన’ పేరుతో సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇదీ చదవండి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత -
అనుమానస్పదంగా 'మామన్నన్' అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ డైరెక్టర్ మృతి చెందాడు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి తమిళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మరి సెల్వరాజ్. ఈ సినిమాల అన్నింటికి ఆయన వద్ద మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ సినిమాల విజయాల వెనుక మారిముత్తు పాత్ర చాలా ఎక్కువగానే ఉందని బహిరంగంగానే మరి సెల్వరాజ్ అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం. (ఇదీ చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!) ఊపిరాడకనే మరిముత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మారిముత్తుకు శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామన్నన్ విజయంతో స్టాలిన్ చేతుల మీదుగా మరిముత్తు అవార్డును ఉదయనిధి అందుకోవడం గమనార్హం. -
సీఎం కొడుకు చేతికి సాలార్..ఇక బాక్సాఫీస్ బద్దలే
-
ఉదయనిధి స్టాలిన్ చేతికి ‘సలార్
తమిళసినిమా: ఇప్పుడు ప్రపంచ సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఇందుకు కారణాలు చాలానే ఉన్నా యి. ఫస్ట్ హైలైట్ నటుడు ప్రభాస్. సెకండ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. థర్డ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలింస్. ఇంకా మలయాళ స్టార్ పృధ్వీరాజ్, సంచలన నటి శృతిహాసన్ ఇంకా అదనవు హంగులు చాలానే ఉన్నాయి. కేజీఎఫ్ పార్ట్ 1, 2 వంటి సంచలన విజయాలను సాధించిన సంస్థ హోంబలె నిర్మాత, దర్శకుడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది. చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలైన సలార్‌పై అంచనాలను పెంచింది. చిత్ర విడుదలను నిర్మాత అధికారికంగా ప్రకటించేశారు. డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెర పైకి రానుంది. ఈ చిత్రాన్ని కర్ణాటకలో హోంబలె సంస్థ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక తమిళనాడు విడుదల హక్కులను రాష్ట్ర క్రీడా శాఖామంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. దీని గురించి ఆ సంస్థ ఒక పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాడులోనూ సలార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘అంబేద్కర్ చెప్పినదానికంటే నేనేం ఎక్కువ మాట్లాడలేదు’
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు. ‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్‌లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవాళ్టి కోర్టులో.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు. -
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధితోపాటు ఏ రాజా, మరో 14 మందికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ వ్యాఖ్యలకు పాల్పడినవారికి నోటీసులు పంపింది. ఈ కేసును విద్వేష ప్రసంగంతో అనుసంధానం చేయడానికి నిరాకరించింది. ఉదయనిధి వ్యాఖ్యలు.. సనాతన నిర్మూళన కాన్ఫరెన్స్‌లో ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతనా ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చారు. ఇలాంటి విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని, మొత్తానికి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన్ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఉదయనిధిని అరెస్టు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
సనాతన ధర్మం శాశ్వతం: సీఎం యోగి
లక్నో: సనాతన ధర్మంపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. సనాతన ధర్మం శాశ్వతమైందని.. దానిని నిర్మూలించే దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. లక్నో పోలీస్ లైన్స్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావనను తీసుకురాకుండా పదునైన విమర్శలు గుప్పించారాయన. ‘‘మన సనాతన సంస్కృతిని చూపిస్తూ మన వారసత్వాన్ని అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావణుడి దురహంకారం.. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టలేకపోయింది. కంసుడి సవాల్‌తో సనాతన ధర్మం ఇంచు కూడా కదల్లేదు. బాబర్, ఔరంగజేబుల్లాంటి వాళ్ల దురాగతాలకు సనాతన ధర్మం చెక్కుచెదరలేదు. అలాంటిది.. రాజకీయ పరాన్నజీవులు పిలుపు ఇచ్చినంత మాత్రాన సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోతుందా? అంటూ సీఎం యోగి పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ పరాన్నజీవులు.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నందుకు సిగ్గుపడాలి. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. సూర్యుడికేం కాదు. ఆ ఉమ్ము ఉమ్మినవాళ్ల ముఖం మీదే పడుతుంది అంటూ ఉదయనిధికి పరోక్ష చురకలంటించారు. ‘‘దేశం సరైన పురోగతిలో వెళ్తుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మక స్థానంలో నిలవడాన్ని తట్టకోలేకపోతున్నారు. అమృత్ కాల్లో.. భారతదేశం వేగంగా ప్రగతి సాధిస్తోంది. ప్రతిరోజూ కొత్త విజయాలు సాధిస్తోంది. దేశ పురోగతికి అడ్డుపడే క్రమంలోనే.. కొంతమంది మన సనాతన ధర్మంపై వేళ్లు చూపుతున్నారు’’ అంటూ సనాతన ధర్మంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నవాళ్లపై యోగి మండిపడ్డారు. -
ఉదయనిధి, ప్రియాంక ఖర్గేలపై కేసు
లక్నో:మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు సెక్షన్ 295ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధిలు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియా కథనాలను ఆధారాలుగా చూపుతూ మతపరమైన భావాలను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. The FIR came at the complaint of lawyers who highlighted media reports on Stalin's statement alleging that the politician's comments had hurt their feelings.https://t.co/7jPY2h9UvS — IndiaToday (@IndiaToday) September 6, 2023 సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: అక్కడ సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3 -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన
సాక్షి, తిరుపతి: గోవిందా అని కోటిమార్లు వ్రాస్తే వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి, కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్న కరుణాకర్‌రెడ్డి.. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని హెచ్చరించారు. కాగా, టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని, చిన్నపిల్లల నుండి 25 సంవత్సరాల లోపు పిల్లలు గోవిందా కోటిని రాస్తారో వారి కుటుంబానికి విఐపీ దర్శనం కల్పిస్తామన్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు.. ►ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాల పంపిణీ ►సెప్టెంబరు 18 నుండి 26 సాలకట్ల బ్రహ్మోత్సవాలు ►అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ►సెప్టెంబరు18 ధ్వజరోహణం సందర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు ►టీటీడీ క్యాలండరలు, డైరీలు సీఎం ప్రారంభిస్తారు ►ముంబాయిలోని బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి నిర్ణయం ►29 స్పెషల్ డాక్టర్లు, 15 డాక్టర్లతో పాటు.. చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగుల నియామకాలకు అమోదం ►2 కోట్ల 16 లక్షలతో మెడికల్, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు ఆమోదం. ►1700 టీటీడీ క్యూట్రాస్ ఆధునీకరణకి రూ.15 కోట్లు మంజూరు. ►టీటీడీలో 413 పోస్టులు ప్రభుత్వ అనుమతికి పంపాము. ►47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలు ఆమోదం. ►కేశవాయన గంటా, బైరాగిపట్టడి ప్రాంతాలలో రోడ్లు ఆధునీకరణకి రూ.135కోట్లతో నిర్మాణం. ►తిరుపతిలో 1,2,3 సత్రాలు 1950లో నిర్మించారు. 2,3 సత్రాలను తొలగించి, అధునాతనమైన రెండు వసతి సముదాయాలు నిర్మాణం, అఛ్యతం, శ్రీ పధం అని పేరు ఒక్కో అతిధిగృహం 300 కోట్లతో నిర్మాణం. ►రెండు రూ.600 కోట్లతో నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. -
బెదిరింపులపై ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందన
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల నుంచే కాకుండా.. మిత్ర కూటమి ఇండియా(INDIA) కూటమిలో కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. తాజాగా.. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ఒకరు ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తన వద్దకు తీసుకువస్తే రూ.10కోట్ల నగదు బహుమతి ఇస్తానని ఉత్తరప్రదేశ్ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఒకవేళ ఎవరూ సాహసించక పోతే.. తానే అతన్ని కనిపెట్టి మరీ చంపేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఆచార్య తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు. బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని ఆయన పేర్కొన్నారు(సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కార్యకర్తలు ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.). రూ.10 కోట్లు ఎందుకని.. తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలికగా చెప్పారు. మళ్లీ అదే చెబుతున్నా.. సనాతన ధర్మ మలేరియా, డెంగ్యూలాంటిదని.. దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, హిందూ సంఘాలు ఉదయ్‌నిధికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడంతో పాటు పలుచోట్ల ఫిర్యాదులు చేశాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ రవిని కలిసి.. మంత్రి ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అయితే.. ఉదయ్‌నిధి స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మళ్లీ అదే చెబుతున్నా.. మళ్లీ అదే చెబుతా కూడా అంటూ వ్యాఖ్యానించారు. ‘‘సనాతన ధర్మం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాను. నేను ఏదైతే మాట్లాడానో.. అదే పదే పదే చెబుతాను నేను హిందూమతాన్నే కాదు అన్ని మతాలను కలుపుకుని.. కులవిభేదాల్ని ఖండిస్తూ మాట్లాడాను, అంతే’’ అని చెన్నై కార్యక్రమంలో పేర్కొన్నారాయన. ప్రతిపక్షాల ఐక్యతపై భయపడి.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోంది. వాళ్లు నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఉదయ్‌నిధి స్టాలిన్ మండిపడ్డారు. ఉదయ్‌నిధి హిట్లర్ అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ, మరోవైపు మిత్రపక్ష ఇండియా కూటమిలోనూ ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. ఉదయ్‌నిధి స్టాలిన్ ఇలా తన వ్యాఖ్యలపై దిద్దుబాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సనాతన ధర్మంపై ఇంకా మాట్లాడుతా..
సాక్షి, చైన్నె: సనాతన ధర్మం వ్యవహారంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.., ఇంకా చెప్పాలంటే, నిర్మూలనే లక్ష్యంగా ఎక్కడ కావాలంటే, అక్కడ మరింతగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంత్రి ఉదయ నిధిస్టాలిన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయనపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నాయి. బిహార్‌లో ఉదయనిధిపై సోమవారం కేసు కూడా నమోదైంది. ఓబీజేపీతో పాటు హిందూ సంఘాల డీఎంకేను టార్గెట్ చేసి విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అ న్నామలై ఒక అడుగు ముందుకు వేసి, సనాతన ధర్మం గురించి ఉదయ నిధి అనుచిత వ్యాఖ్యలపై దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఈనెల 10వ తేదీలోపు శేఖర్‌బాబు పదవి నుంచి వైదొలగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా తరహాలో నిర్మూలించలేమని, అది విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందన్నారు. సనతాన ధర్మానికి వ్యతిరేకం అంటే, హిందూ, దేవదాయ శాఖ ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కా గా తనకు వ్యతిరేకంగా కేసుల నమోదు, ఫిర్యాదులు హోరెత్తడంతో ఉదయ నిధి స్టాలిన్ తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. తాను స నాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే గానీ, హిందువుల గురించి కాదని స్పష్టంచేశారు. సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి మరో మార్గంలో తీసుకెళ్తున్నారని వివరించారు. మంత్రి శేఖర్‌బాబు రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. క్షమాపణకు పట్టు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయ నిధి స్టాలిన్ తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీలోని బీజేపీ నేతలు తమిళనాడు భవన్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని తమిళనాడు భవన్, డీఎంకే కార్యాలయానికి భద్రతను మరింతగా పెంచారు. -
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
ఈ సినిమానే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది, జీవితంలో మర్చిపోలేను: వడివేలు
నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి, తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్. వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమా గత జూన్ 29వ తేదీన విడుదలవగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మామన్నన్ 50 రోజులు పూర్తి చేసుకుంది. మంచి అనుభవాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్లో మామన్నన్ చిత్ర అర్ధ శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మాట్లాడుతూ మామన్నన్ తనకు మంచి అనుభవంగా మిగిలిపోయిందని పేర్కొంది. ఏఆర్ రెహమాన్ సంగీతం చిత్ర విజయానికి ముఖ్య కారణమని తెలిపింది. వడివేలు మాట్లాడుతూ.. ప్రతి సన్నివేశంలోనూ జీవం ఉట్టిపడేలా దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. తాను ఇంత వరకూ చేసిన హాస్య పాత్రలన్నింటికంటే ఈ చిత్రమే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని, దీన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని అన్నారు. ఈ విజయం దర్శకుడిదే: ఉదయనిధి స్టాలిన్ సినిమా అనేది నాలుగు రోజుల్లో ముగిసి పోయేది కాదని, ఏళ్ల తరబడి మాట్లాడుకునేదనీ దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. అందుకే తాను నిజాలను వినే చెవుల కోసం అన్వేషిస్తూనే ఉంటానన్నారు. ఈ విజయం దర్శకుడు మారి సెల్వరాజ్దని నటుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కథ విన్నప్పుడే మామన్నన్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగించిందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ అంతా శ్రమించారన్నారు. నాలోని అంతర్మధనమే మామన్నన్: ఏఆర్ రెహమాన్ తన తొలి చిత్రం ఆరుకల్ ఒరు కన్నాడీ మంచి విజయాన్ని సాధించిందనీ, చివరి చిత్రమైన మామన్నన్ కూడా విజయం సాధించడం సంతోషంగా ఉందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. గత 20, 30 ఏళ్లుగా తనలోని మదనమే మామన్నన్ చిత్రమని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో వడివేలు బైక్‌లో వెళ్లే సన్నివేశాన్ని చూసిన తరువాత మంచి సంగీతాన్ని అందించాలనే నిర్ణయానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. చదవండి: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం షారుక్ కోసం ఆ పని చేసేందుకు సిద్ధమైన నయనతార.. రూల్ పక్కన పెట్టేసి మరీ.. -
జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు. కాగా అమిత్ షా శుక్రవారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలై పాదయాత్రను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్షలతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. అదే విధంగా డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు. చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే యువజన విభాగం నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్ని అమిత్ షా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జే ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదనినిధి స్టాలిన్ అమిత్ షాను ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు: కిషన్ రెడ్డి) -
చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా సక్సెస్ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!) చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్‌ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ తన ట్వీట్లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్‌కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్ సార్‌కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సెల్వరాజ్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! ) ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமாக விவாதிக்கிறார்கள். தங்களுடைய எண்ணங்களை கதையுடனும் களத்துடனும் தொடர்புபடுத்தி கருத்துகளை பகிர்கிறார்கள். உலகத் தமிழர்களிடையே விவாதத்துக்குரிய கருப்பொருளாக மாறியிருக்கிறது. அம்பேத்கர், பெரியார், அண்ணா, கலைஞர் போன்ற நம் தலைவர்கள் ஊட்டிய சுயமரியாதை உணர்வை,… pic.twitter.com/ro4j7epjAI — Udhay (@Udhaystalin) July 2, 2023 -
మామన్నన్కు ముఖ్యమంత్రి ప్రశంసలు
కోలీవుడ్‌లో 'మామన్నన్' సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ఉదయనిది స్టాలిన్ కథానాయకుడిగా నటించి రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. నటి కీర్తిసురేష్ నాయకిగా నటించిన ఇందులో వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ చిత్రాల ఫేమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు) కాగా చిత్రంపై నటుడు కమలహాసన్, ధనుష్ వంటి ప్రముఖులు చిత్రాన్ని చూసి ఎంతగానో ప్రశంసిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. మామన్నన్ చిత్రాన్ని గురువారం ఉదయం చైన్నెలోని ఒక ప్రివ్యూ థియేటర్లో ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీని గురించి చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్ ట్విటర్లో పేర్కొంటూ మామన్నన్ చిత్రాన్ని చూసిన ముఖ్యమంత్రి చాలా బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మామన్నన్ చిత్రాన్ని ప్రశంసించిన కమలహాసన్, ధనుష్‌లను ఉదయనిధి స్టాలిన్ ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. (ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?) -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ
దక్షిణాదిన స్టార్ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు కీర్తిసురేష్. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఆమె మదిలో చాలా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిగా దూసుకుపోతున్నా, మరోపక్క వదంతులు వలయంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ, ప్రేమికుడు వంటి ప్రచారం ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు చదువుతుంటే బాధేస్తుందని కీర్తిసురేషే ఇటీవల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య తెలుగులో బిజీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె అక్కడ నటిస్తున్న చిత్రాలలో 'మామన్నన్' ఒకటి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న తెరపైకి రానుంది. దీంతో కీర్తిసురేష్ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మామన్నన్ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్ పాత్ర అని తెలిపారు. సమీకాలంలో తనకు ఈ తరహా పాత్రలే వస్తున్నాయన్నారు. (ఇదీ చదవండి: 'నేనో ఇంజనీర్ని.. హీరోయిన్ అవుతాననుకోలేదు') ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, ఆ విషయం గురించి ఆలోచించాలని అన్నారు. దీంతో రాబోయేరోజుల్లో రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాల్లో నిజమే కావచ్చని పలువురు తెలుపుతున్నారు. ప్రస్థుతం ఆమె తాజా చిత్రంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది. కానీ గతంలోనూ కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయగా ఆమె తల్లి మేనక వాటిలో నిజం లేదని, తమ కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదని స్పష్టం చేసింది. కానీ ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో రాజమౌళి, శంకర్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. -
ఇదే చివరి చిత్రమని ప్రకటించిన టాప్ హీరో.. నోటీసులు పంపిన నిర్మాత
కోలీవుడ్‌లో 'మామన్నన్' చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి, రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంజల్ చిత్ర నిర్మాత రామశరవణన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లో తాను ఉదయనిధి స్టాలిన్, ఆనంది, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా ఏంజెల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని, మరో 20 శాతం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉదయనిధి స్టాలిన్ తన చిత్రాన్ని పక్కనపెట్టి మామన్నన్ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారన్నారు. అంతేకాకుండా మామన్నన్ తన చివరి చిత్రం అని ప్రకటించారన్నారు. తాను ఏంజెల్ చిత్రం కోసం ఇప్పటి వరకు రూ.13 కోట్లు ఖర్చుపెట్టానని తెలిపారు. తాను చిత్రం పూర్తి కాకపోతే చాలా నష్టపోతానన్నారు. (ఇదీ చదవండి: రోజుకు వెయ్యిమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్: చిరంజీవి) కాబట్టి మామన్నన్ చిత్రం విడుదలపై నిషేధం విధించి తన చిత్రాన్ని పూర్తిచేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కుమరవేల్ బాబు సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్‌కు, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసి తర్వాత విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. -
ఆ డైరెక్టర్ అంతే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాడు: ఉదయనిధి స్టాలిన్
కోలీవుడ్‌లో దర్శకుడు మారి సెల్వరాజ్ టెన్షన్ పార్టీ అని అన్నది ఎవరో కాదు. నటుడ, నిర్మాత, మంత్రి ఉదయనిధి స్టాలిన్నే. తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్. కీర్తిసురేష్ కథానాయక నటించిన ఇందులో వడివేలు కీలకపాత్ర పోషించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. పరియేరుమ్ పెరుమాళ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తరువాత ధనుష్ హీరోగా కర్ణన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం దర్శకుడికి మూడో చిత్రం. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మామన్నన్ చిత్రం ఈనెల 29న తెరపై రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్ కార్యక్రమాలను ముంబరం చేశారు. ఇటీవల ఒక చానన్‌లో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ షూటింగ్ స్పాట్లో దర్శకుడు మారి సెల్వరాజ్ చాలా టెన్షన్‌గా ఉంటారని చెప్పారు. తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను ఎడాపెడా కొట్టేస్తారని, ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తారని చెప్పారు. సెట్ అంతా యుద్ధవాతావరణం నెలకొంటుందని అన్నారు. దీంతో నెటిజన్లు దర్శకుడు మారి సెల్వరాజ్ ఓ రేంజ్లో అడేసుకుంటున్నారు. శతాధిక చిత్రాలు చేసిన దర్శకులు కూడా మర్యాదగా ప్రవర్తించేవారిని, రెండు చిత్రాలతో మారిసెల్వరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌పై తన ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి:మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) -
Video: తమిళనాడు మంత్రి అరెస్ట్.. కుప్పకూలిన బాలాజీ
చెన్నై: తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున మంత్రిని అదుపులోకి తీసుకుంది. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసంలో 18 గంటలపాటు విచారించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. విచారణ అనంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్ చేస్తుండగా.. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. మంత్రి కన్నీరు ఈడీ అధికారులు మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వెలుపల సైతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే అభిమానులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా.. వాహనంలో మంత్రి కన్నీరు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. #WATCH | Tamil Nadu Electricity Minister V Senthil Balaji breaks down as ED officials took him into custody in connection with a money laundering case and brought him to Omandurar Government in Chennai for medical examination pic.twitter.com/aATSM9DQpu — ANI (@ANI) June 13, 2023 అనంతరం మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఎం సుబ్రమణియన్, ఈవీ వేలు ఆసుపత్రిని సందర్శించారు. సెంథిల్ బాలాజీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఐసీయూలో పరిశీలనలో ఉన్నారని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. మరోవైపు సెంథిల్ బాలాజీ అరెస్టు గురించి తమ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఎలాంగో విమర్శించారు. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఒమందూరర్ ప్రభుత్వ ఎస్టేట్ వద్ద అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మంత్రిని పరామర్శించిన సీఎం అరెస్ట్ అయిన తర్వాత బాలాజీని కలిసేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థకు సహకరించినప్పటికీ, సెంథిల్ బాలాజీపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని, అందువల్లే ఛాతీ నొప్పి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి బయట ఉన్న డీఎంకే కార్యకర్తలు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా సెంథిల్‌బాలాజీకి చెందిన పలుప్రాంతాల్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, సచివాలయంలోని చాంబర్, కరూర్, కోయంబత్తూరు, ఈరోడ్‌లోని ఆయన సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు 18 గంటలపాటు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తు కల్పించారు. సీఎం స్టాలిన్ సీరియస్ అయితే, సచివాలయంలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఈడీ సోదాలు నిర్వహించడంపై డీఎంకే ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడవటంగా సీఎం స్టాలిన్ అభివర్ణించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పలేక దొడ్డి దారిన వచ్చి మరీ దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ‘రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. వీటికి మేం భయపడం. ఈ విషయం వారే గ్రహించే సమయం దగ్గరపడింది’అని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఐటీ.. తరువాత ఈడీ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్చేస్తూ గత నెలలోనూ ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎక్సైజ్, విద్యుత్ శాఖల కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు వారం రోజుల పాటు సాగాయి .చైన్నె, కోయంబత్తూరు,కరూర్, ఈరోడ్లలోని 40 చోట్ల నాలుగైదు రోజులుగా సోదాలు జరిగాయి. ఈ సోదాల సమయంలో డీఎంకే వర్గాలు, సెంథిల్‌బాలాజీ మద్దతుదారులు తిరగబడడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తిపోయారు. అయితే, అన్ని చోట్ల సోదాలు జరిగినా, మంత్రి నివాసాన్ని మాత్రం ఐటీ వర్గాలు వదలిపెట్టాయి. ఈ సోదాలు ముగిసిన పది రోజుల తర్వాత మరోసారి సెంథిల్‌బాలాజీని ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. -
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
సాక్షి,చైన్నె : సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కు ప్రభుత్వం అధికారిక బంగ్లాను కేటాయించింది. గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న ఈ బంగ్లాను అధికారులు సుందరీకరిస్తున్నారు. వివరాలు.. చైన్నె ఆళ్వార్ పేట చిత్తరంజన్ రోడ్డులో తల్లిదండ్రులతో కలిసి ఉదయ నిధి స్టాలిన్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడే సీఎం క్యాంప్ కార్యాలయం సైతం ఉంది. నిత్యం సీఎంను కలిసేందుకు పలువురు ప్రముఖులు, అధికారులు వస్తుంటారు. అలాగే, ప్రస్తుతం సీఎం స్టాలిన్ వారసుడు ఉదయ నిధి మంత్రి కావడంతో ఆయన్ని కలిసేందుకు సైతం ప్రముఖుల రాక పెరిగింది. దీంతో ఈ నివాసంలో రద్దీ పెరిగింది. ఈ దృష్ట్యా, ఉదయ నిధి కోసం మంత్రులకు కేటాయించే బంగ్లాను ప్రస్తుతం అధికారులు అప్పగించారు. గ్రీన్ వేస్ రోడ్డులో ఉదయ నిధికి ప్రత్యేకంగా బంగ్లా కేటాయించారు. దీంతో ఆయన తన మకాంను ఇక్కడ మార్చబోతున్నారు. మంత్రిగా ఇక్కడి నుంచి తన కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ బంగ్లాకు కురింజి అని గతంలోనే నామకరణం చేశారు. దీనిని గత నెలాఖరు వరకు స్పీకర్ అప్పావు ఉపయోగించారు. ఆయన మరో బంగ్లాకు మారడంతో ఉదయ నిధికి అప్పగించారు. అయితే. గతంలో స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఈ కురింజి బంగ్లా నుంచే తన వ్యవహారాలను పర్యవేక్షించే వారు. ప్రస్తుతం అదే బంగ్లా ఉదయ నిధికి అప్పగించడం గమనార్హం. ఈ బంగ్లా నుంచి రాజకీయ చక్రం తిప్పిన స్టాలిన్ ప్రస్తుతం సీఎం అయ్యారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కన్నై నంబాదే’
తమిళసినిమా: ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కన్నై నంబాదే. నటి ఆద్మిక నాయకి. భూమిక, ప్రసన్న, సతీష్, సుభిక్ష కృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లిపి సినీ క్రాఫ్టస్ పతాకంపై వీఎన్.రంజిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఇరవుక్కు ఆయిరం కంగళ్ చిత్రం ఫేమ్ ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సిద్ధు కుమార్ సంగీతాన్ని, జలందర్ వాసన్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీన్ని విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. కాగా చిత్ర యూనిట్ బుధవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం.మారన్ మాట్లాడుతూ.. ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక అమాయకుడు హత్యానేరంలో చిక్కుకుని, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే చిత్ర వన్ లైన్ కథ అని చెప్పారు. ఉత్కంఠ భరితంగా సాగే కథా, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ప్రేక్షకులను రెండు గంటల పాటు చిత్రం ఎంటర్టెయిన్ చేస్తుందని తెలిపారు. చిత్రంలో ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని, అయితే రెండు పాటలు ఉంటాయని చెప్పారు. తొలి చిత్రం జానర్లోనే ఈ చిత్రానికి క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను ముందుగా ప్రేమ కథనే ఉదయనిధిస్టాలిన్‌కు చెప్పానని, అయితే అందులో ప్రేమతో పాటు రాజకీయ అంశాలు ఉండడంతో అది వద్దని, మీ తొలి చిత్రం ఇరవుక్కు ఆయిరం కంగళ్ చిత్రం చూశానని, చాలా నచ్చిందని, అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం చేద్దామని ఆయన చెప్పడంతో ఈ కథను రెడీ చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం పరంగా కొత్త కలర్‌ను ట్రై చేసినట్లు కెమెరామెన్ జలందర్‌వాసన్ చెప్పారు. చిత్ర షూటింగ్‌ను 80 శాతం రాత్రి వేళ్లల్లోనే నిర్వహించినట్లు తెలిపారు. -
పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన..
సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరితో సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ భేటీ అయ్యారు. మదురైలో తన పెద్దనాన్న అళగిరి ఆశీస్సులను అందుకున్నారు. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి అన్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు డీఎంకే కింగ్ మేకర్‌గా ఒకప్పుడు ఎదిగిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌తో ఏర్పడ్డ వైరమే కారణం అనేది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో అళగిరి మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మదురై పర్యటనకు వెళ్లిన మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తన పెద్దనాన్నను కలిశారు. అళగిరి, ఆయన సతీమణి కాంతి అళగిరి ఆనందంతో ఉదయనిధిని ఆహ్వానించిచారు. ఈసందర్భంగా పెద్ద నాన్న అళగిరి శాలువతో సత్కరించి ఉదయ నిధికి ఆశీస్సులు అందించారు. అళగిరి మాట్లాడుతూ తాను డీఎంకేలో లేనని, తమ్ముడి కొడుకు తమ ఇంటికి రావడం ఆనందం కలిగించిందన్నారు. తమ్ముడు సీఎంగా ఉండడం, కుమారుడు మంత్రి కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. డీఎంకే లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం అక్కడే అడగండి అని దాట వేశారు. చదవండి: (విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు) -
వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్(45) బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణంచేశారు. చపాక్–తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డీఎంకే వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈయన చేత మంత్రిగా ప్రమాణంచేయించారు. పార్టీలో యువజన విభాగం కార్యదర్శి అయిన ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డీఎంకే సర్కార్ కేటాయించింది. కుటుంబ రాజకీయాలను విమర్శించే వారికి తన అద్భుత పనితీరు ద్వారా సమాధానం చెప్తానని ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రాన్ని దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా... -
ఇకపై ఏ సినిమాలోనూ నటించను, ఇదే నా ఆఖరి చిత్రం: హీరో
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు. రాజకీయాలతో బిజీ అవడం వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇక మీదట సినిమాల్లో నటించను. కమల్ హాసన్ సర్ బ్యానర్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్నుంచి తప్పుకుంటున్నాను. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న మామన్నాన్(Maamannan) నా చివరి చిత్రం' అని చెప్పారు. కాగా ఉదయనిధి స్టాలిన్.. 2012లో ఒరు కాల్ ఒరు కన్నడి(ఓకే ఓకే) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారాయన. కానీ ఈ చిత్రం మరే సినిమాలోనూ నటించకూడదనుకున్నారు. అయితే తన దగ్గరకు వచ్చిన కథలు నచ్చడంతో నో చెప్పలేక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు. అలాగే రెడ్ జియాంట్ మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా ఈ బ్యానర్లో నిర్మితమవుతున్నదే! చదవండి: బుల్లితెర నటి సీక్రెట్ మ్యారేజ్, ఫొటోలు, వీడియోలు వైరల్ డబ్బులెక్కువయ్యాయి, కసి తగ్గింది.. అందుకే అక్కడ సినిమాలు ఫ్లాప్: రాజమౌళి -
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
Udhayanidhi Stalin: స్టాలిన్ వారసుడు ఇక మంత్రిగా..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, అధికార డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి(45)కి త్వరలో∙మంత్రి యోగం దక్కనుంది. 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని సోమవారం రాజ్‌భవన్ తెలిపింది. మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసును గవర్నర్ రవి ఆమోదించారని పేర్కొంది. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో చెపాక్–తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పార్టీ వర్గాలతోపాటు మంత్రుల నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని డీఎంకే నేతలు అంటున్నారు. -
Udhayanidhi Stalin: వారసుడికి మరోసారి కీలక బాధ్యతలు
సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడు, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ అప్పగించారు. ఆ విభాగంలో 8 మంది కొత్త వారికి చోటు కల్పించారు. అలాగే, డీఎంకే ఎంపీ కనిమొళి చేతిలో ఉన్న మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలను కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన హెలెన్ డేవిడ్సన్కు అప్పగించారు. వివరాలు.. సినీ నటుడు, నిర్మాత, స్టాలిన్ వారసుడు ఉదయ నిధి స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాలోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చి రాగానే డీఎంకేకు వెన్నెముకగా ఉన్న ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఆ ఎన్నికల్లో ఆయన సుడిగాలి పర్యటనతో ప్రజల్ని ఆకర్షించారు. అలాగే, చేపాక్కం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కారు. పార్టీ యువజన విభాగం బలోపేతంలో దూసుకెళ్తున్న ఉదయ నిధికి మళ్లీ అదే బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ బుధవారం ఓ ప్రకటన చేశారు. చదవండి: (రాష్ట్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు) కొత్త వారికి చోటు.. డీఎంకే యువజన విభాగంలో ప్రధాన కార్యదర్శి, నలుగురు సంయుక్త కార్యదర్శులు ఉంటారు. ఇది వరకు ప్రధాన కార్యదర్శిగా ఉదయనిధి స్టాలిన్, సంయుక్త కార్యదర్శులుగా తాయగం కవి, ఆర్డీ శేఖర్, జోయల్, పారివేందర్ ఉండేవారు. అయితే సంయుక్త కార్యదర్శుల సంఖ్యను ఈసారి తొమ్మిదికి పెంచారు. అలాగే, పాతవారిలో జోయల్‌కు మాత్రం మళ్లీ అవకాశం కల్పించారు. మిగిలిన వారిని పక్కన పెట్టారు. యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా జోయల్, రఘుపతి, ప్రకాష్, ప్రభు, శ్రీనివాసన్, రాజ, ఏఎన్ రఘు, ఇలయరాజ, అబ్దుల్ మాలిక్‌ను నియమించారు. తన మీద నమ్మకంతో మళ్లీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానికి ఉదయ నిధి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా ప్రధాన కార్యదర్శిగా హెలెన్ డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ఎంపీ కనిమొళి ఆది నుంచి వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల ఆమెకు ప్రమోషన్ దక్కింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో మహిళా విభాగం బాధ్యతలను మరొకరికి అప్పగించాలని నిర్ణయించారు. తాజాగా ఈవిభాగంలో సమూ ల మార్పులు చేశారు. ఆ విభాగం అధ్యక్షురాలిగా విజయ దయాల్ అన్భును నియమించారు. ప్రధాన కార్యదర్శి పదవిని కన్యాకుమారి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హెలెన్ డేవిడ్సన్కు అప్పగించారు. సంయుక్త కార్యదర్శిగా కుమారి విజయకుమార్, ఉపాధ్యక్షులుగా భవానీ, మంత్రి కయల్వెలి సెల్వరాజ్ నియమితులయ్యారు. -
Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం
మలయాళీల పండుగ పర్వదినాలలో ఓనం ముఖ్యమైనది. అందరూ సంప్రదాయ వస్త్రధారణతో విశేషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఈ పండుగ జరుపుకోవడం కోసమే స్వగ్రామాలకు చేరుకుంటారు. ఇందుకు సినిమా నటీమణులు అతీతం కాదు. నయనతార వంటి అగ్రతారలు కూడా చెన్నై నుంచి కేరళలోని తమ స్వగ్రామానికి చేరుకుంటారు. అదే విధంగా గత ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్‌తో కలిసి తన ఇంటిలో ఓనం పండుగ జరుపుకున్నారు. నటి కీర్తి సురేష్ కూడా అదే విధంగా ఈ వేడుకలను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో నటిస్తూ బిజీగా వున్నా ఈ బ్యూటీ ఈ ఏడాది కూడా ఓనం పండుగను తన కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని ఆశించిందట. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో కీర్తి సురేష్ ఓనం పండుగకు సొంత ఊరు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ పండుగను చెన్నైలోనే జరుపుకుంది. ఆ పండుగ కళను ఇక్కడికే తీసుకొచ్చింది. చక్కని సంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల ముగ్గులతో స్వయంగా రంగవల్లితో ఓనం పండుగను జరుపుకుంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ ఆమెతో పాటు చిత్ర యూనిట్‌కు విందును ఏర్పాటు చేశారు. మామన్నన్ చిత్ర యూనిట్ ఈమెకు ఓనం పండుగ శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ అమ్మడు త్వరలో విజయ్ కథానాయకుడు నటించనున్న తన 67వ చిత్రంలో ఆయనకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన నిధి అగర్వాల్
నెంజుక్కు నీది సినిమా తరువాత ఉదయనిధి స్టాలిన్ మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో మామన్నన్ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తీ సురేష్, వడివేలు, భగత్ బాసిల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ స్థితిలో మజిద్ తిరుమేని దర్శకత్వంలో ఉదయనిధి కొత్త చిత్రంలో నటిస్తారని రెండేళ్ల క్రితమే ప్రకటించింది. కాగా ఈ చిత్ర బృందం ఇప్పుడు సినిమా టైటిల్‌ను వెల్లడించింది. కలగ తలైవన్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా, అరోల్ కొరెల్లి సంగీతం అందిస్తున్నారు. -
విశాల్ ‘లాఠీ’ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెట్టుబడికి ముప్పు లేకపోవడంతో దర్శక, నిర్మాతలు కూడా వెబ్‌సిరీస్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తాజాగా రూపొందిన వెబ్ సిరీస్ ‘పేపర్ రాకెట్’. ఇది జీ చానల్ ఒరిజినల్ వెబ్‌సిరీస్. శ్రీనిధి సాగర్ నిర్మించిన దీనికి కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఇందులో గౌరీ జి.కిషన్, నాగివీడు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి జీ చానల్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్, శింబు, విజయ్ ఆంటోని, దర్శకుడు మిష్కిన్, మారి సెల్వరాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకురాలు కృతిక మాట్లాడుతూ.. తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు శింబుతో చిత్రం చేయాలన్నది తన కోరిక అని, అది ఈ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. శింబు తొలిసారి హీరోగా నటిస్తున్నప్పుడు తనకి ఇంకా పెళ్లి కాలేదని ఒక యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా రకరకాల విమర్శలు చేస్తుంటారని అదే విధంగా తొలి చిత్రం సమయంలో శింబుపై కూడా ఇతను హీరోనా అని విమర్శలు వచ్చాయని అన్నారు. చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్ అయితే ఆయన నటిస్తున్న తొలి చిత్రం స్టిల్స్ బయటకు వచ్చినప్పుడు ఆ చిత్ర యూనిట్లో ఉన్నత స్థాయికి ఎదిగేది శింబునే అని తాను భావించానన్నారు. ఇక ఉదయనిధి గురించి చెప్పాలంటే తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళుతానని చెప్పగానే ఆయన చాలా ఆలోచించారన్నారు. ఆ తరువాత తాను ఇంటిలో చేసే గోల పడటం కంటే సినిమా రంగంలోకి వెళ్లడమే మంచిదని, తనకు ప్రశాంతంగా ఉంటుందని భావించారేమో గాని సమ్మతించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మహిళలకు సపోర్టు అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కృతిక ఉదయనిధి అన్నారు. -
‘కళగ తలైవన్’గా ఉదయనిధి స్టాలిన్?
తమిళసినిమా: ప్రస్తుతం చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు హీరో ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. ఇటీవల ఈయన నటించిన ‘నెంజిక్కు నీతి’చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో పాటు, మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి కళగ తలైవన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరువేణి దర్శకుడు. ఈయన ఇంతకు ముందు తడైయార తాక్క, మిగామన్, తడం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఇందులో నటి నిధి అగర్వాల్ నాయకిగా నటించారు. ఆర్థిక నేరాల ఇతివృత్తంగా, రాజకీయ నేపథ్యంలో చిత్రంగా సాగుతుందని సమాచారం. చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. -
అణగారిన స్త్రీల ఆర్తనాదం..‘నెంజుక్కు నీది’ మూవీ రివ్యూ
‘ముప్పై రూపాయలు మనకు ఎంత ముఖ్యం’ అని ఆలోచిస్తాడు హీరో ‘నెంజుక్కు నీది’ సినిమాలో. ముప్పైరూపాయలతో ఇవాళ సరైన టిఫిన్ కూడా రాదు. అసలు ముప్పై రూపాయలను లెక్క కూడాచేయం. కాని కూలీలో ముప్పై రూపాయలు పెంచమని ముగ్గురు అమ్మాయిలు అడిగితే ఏమవుతుంది? అదీ దళిత అమ్మాయిలు అయితే? వాళ్లను ‘అణిచేయ బుద్ధవుతుంది’. అందుకు ‘అత్యాచారం చేయొచ్చులే’ అనిపిస్తుంది. కాని చట్టం ఉంది. దానిని సరైనవాడు ఉపయోగిస్తే ఇలాంటి ఆలోచనకు కూడా భయం వస్తుందని చెప్తున్న సినిమా ‘నెంజుక్కు నీది’. ‘పుట్టుకతో సమానం’ ట్యాగ్‌లైన్. సోని లివ్‌లో విడుదల. సినిమా దాదాపు క్లయిమాక్స్‌కు వస్తుంది. హీరో ఉదయనిధి స్టాలిన్ సిబిఐ ఆఫీసర్‌తో అంటాడు– ‘ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసి చంపేశారు. వారిని కాల్చేయొచ్చు. పూడ్చి పెట్టొచ్చు. కాని వాళ్ల వాడకే తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేశారు. ఎందుకో తెలుసా? వారిని హెచ్చరించడం కోసం. మీరు ఇంతలోనే ఉండాలని హెచ్చరించడం కోసం’. ఈ దేశంలో ‘వాడ’ ఉంది. ఊరికి దూరంగా ఆ ‘వాడ’ ఉంటుంది. ఈ దేశంలో ‘కులం’ ఉంది. అది ఎవరు ఎక్కువో ఎవరో తక్కువో, ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఎవరిని ఈసడించాలో ఎవరిని గౌరవించాలో, ఎవరితో అహంకారంగా వ్యవహరించాలో ఎవరితో అణిగిమణిగి ఉండాలో చెబుతుంది. సంఘనీతి, సంస్కృతి, కట్టుబాట్లు తరతరాలుగా అలా చెప్పేలా చేశాయి. అందుకే ఒక వ్యక్తి కులాన్ని బట్టి అతడితో ‘ఎలా వ్యవహరించాలో’ ఈ దేశ జనులకు ఒక అవగాహన ఉంది. అనుమతి కూడా ఉంది. ‘నెంజుక్కు నీది’ (తెలుగు డబ్బింగ్ ఉంది)లో పెద్ద కులం వాళ్ల కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేసే ముగ్గురు ఆడపిల్లలు తమ రోజు కూలి రేటు పెంచమంటారు. ముప్పై రూపాయలు. ఆ ఫ్యాక్టరీ బాగా బలిసిన వ్యక్తిది. పైగా మంత్రి మేనల్లుడిది. అతనికి 30 రూపాయలు పెంచమని అడగడం– అసలు ఏదైనా డిమాండ్ పెట్టడం నచ్చదు. పైగా కడజాతి వాళ్లు వచ్చి అలా అడగడం నచ్చదు. అతనికి స్కూల్ బస్ ఉంటుంది. దాంట్లో ఆ ముగ్గురు అమ్మాయిలు ఇంటికి వెళుతుంటే కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడు. ఇద్దర్ని చంపేస్తాడు. మరో అమ్మాయి తప్పించుకుంటుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత ఏ.ఎస్.పి. ఉదయనిధిపై పడుతుంది. అయితే ఈ దేశంలో ‘నేరము–శిక్ష’ నేరుగా ఉండదు అని విచారణ చేసే కొద్దీ ఉదయనిధికి అర్థం అవుతుంది. ‘ఎవరు’ నేరం చేశారు, ‘ఎవరు’ బాధితులు, ఏ (కులం) పార్టీ అధికారంలో ఉంది, ఏ (కులం) అధికారి విచారణ చేస్తున్నాడు, ఏ ‘కులం’ వాళ్లు దీనికి ఎలా రియాక్ట్ అవుతారు, డిఫెన్స్ లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ వర్గాల వారు ఇవన్నీ ఒక ‘శిక్ష’ను ప్రభావితం చేయగలవని అతడు తెలుసుకుంటాడు. మన దేశంలో కొందరికి వెంటనే శిక్షలు పడటం, కొన్ని కేసులు ఎప్పటికీ తేలకపోవడం ఇందుకే అని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా చనిపోయింది దళిత అమ్మాయిలు కాబట్టి చట్టంలో ఉండే కొందరు అధికారులు ‘ఇది మామూలే’ అనుకుంటారు. కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదయనిధిపై ఒత్తిడి తెస్తారు. చివరకు సస్పెండే చేస్తారు. కాని ఉదయనిధి తగ్గడు. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 15’ని గుర్తు చేస్తాడు. ‘జన్మ వల్లగాని, పుట్టిన ప్రాంతం వల్ల గాని, కులం వల్ల గాని, మతం వల్ల గాని వివక్ష చూపరాదు’ అని చెప్పేదే ఆర్టికల్ 15. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన అధికారిగా ముందుకు సాగి కేసును ఛేదిస్తాడు. హిందీలో వచ్చిన ‘ఆర్టికల్ 15’కు రీమేక్‌గా తీసిన ఈ సినిమా మొదలైన వెంటనే ప్రేక్షకులను కూడా నిందితులను చేయడంలోనే విశేషం అంతా ఉంది. ప్రేక్షకులకు కూడా ఒక కులం, మతం, భావధార ఉంటాయి కనుక వారు ఆ పాత్రల్లో తాము ఎక్కడ ఉన్నారో తరచి చూసుకుంటారు. జరిగిన నేరంపై తమ వైఖరి ఏమిటో గమనించుకుంటారు. ‘ప్రతి కులంలో బాధ ఉంది’ అని ఒక మంచి అధికారి ఇందులో దళితుడితో అంటాడు. అందుకు జవాబుగా ఆ దళితుడు ‘నిజమే. ప్రతి కులంలో బాధ ఉంది. కాని కులం వల్ల మాత్రమే కలిగే బాధ మాకు ఉంది’ అని జవాబు చెప్తాడు. ఇక ఆ కులంలో పుట్టే స్త్రీల బాధ ఎలాంటిదో ఈ సినిమా చెబుతుంది. ‘విద్యలో, ఉద్యోగాలలో చూపే అంటరానితనం అత్యాచార సమయంలో మాత్రం ఉండదు’ అనే డైలాగ్ కూడా ఉంది. హిందీలో అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో సినీ కవి అరుణ్ రాజా కామరాజ్ తీశాడు. తమిళానికి తగినట్టుగా మంచి మార్పులు చేసుకున్నాడు. కథనం ఆసక్తికరంగా మలిచాడు. సినిమా ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. వ్యవస్థ మారలేదని కాదు. చాలా మారింది. కాని అది సరిపోదని, సరి చేసుకోవాల్సిందేనని చెప్పే సినిమా ‘నెంజుక్కు నీది’. -
'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే..
Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటివరకు సుమారు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ జోష్‌తో చిత్రబృందం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తియనైన వేడుకకు బదులు మంచి మాంసాహారంతో విందు జరుపుకుంది. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. విజయ్‌తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. విక్రమ్ సక్సెస్ తనపై బాధ్యతను పెంచిందని, ఇకపై మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని డైరెక్టర్ లోకేష్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్న వారి కోసం స్పెషల్ మెనూను ఏర్పాటు చేసింది. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్తోపాటు మటన్ కీమా బాల్స్, వంజరం తవా ఫిష్ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్ మసాల దోశ, పన్నీర్ టిక్కా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయట. How it Started? How it is Going!!!@ikamalhaasan @Dir_Lokesh @DirLokeshFC @DiehardKamalian @RKFI @RedGiantMovies_ @turmericmediaTM #VikramSuccessMeet #VikramMovie #VikramInAction #Vikram pic.twitter.com/97v0NJyWqB — உத்தமன் | Villain (@mr_king_mr) June 17, 2022 ఈ విందులో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ విందుని చూసి 'విక్రమ్ అలా మొదలై.. ఇలా కొనసాగుతోంది' అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి, లోకేష్, అనిరుధ్‌ను కమల్ హాసన్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #VikramSuccessMeet - Menu of #Sappad served! pic.twitter.com/pUfrp32WnD — Sreedhar Pillai (@sri50) June 17, 2022 #Vikram team @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @Udhaystalin sat with distributors, exhibitors and media for an excellent non-vegetarian #ChettinadSappad #Vikramsuccessmeet pic.twitter.com/eff50gMUQZ — Sreedhar Pillai (@sri50) June 17, 2022 Dinner 🥘 is on 😍#VikramSuccessMeet ✨@Udhaystalin @ikamalhaasan @Dir_Lokesh @RKFI pic.twitter.com/TclFkI7Ri5 — Vinodth Vj... (@Vinodth_Vj) June 18, 2022 #Aandavar entry with @Udhaystalin sir & @Dir_Lokesh bro !!!#VikramSuccessMeet pic.twitter.com/Vj7y62hluF — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 #Loki style balamana virundhu for theatre owners / distributors / press media for #VikramRoaringSuccess !!! Whattah feast was that 😍😋 Thank You @RKFI & @RedGiantMovies_ #VikramSuccessMeet pic.twitter.com/EQT9HqW0OM — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 Vikram... Vikram... Vikram..... ! Organic & Perfect Industry hit in recent times for Kollywood. That's #KamalHaasan𓃵 for you💥❤️ Thanks @Dir_Lokesh 🙏 @anirudhofficial ❤️#IndustryHitForKH #Vikram #VikramSuccessMeet pic.twitter.com/bs4JMdG0Eq — Movie Meter (@MovieMeterOff) June 18, 2022 -
నిజానికి నేను డాన్ కావాల్సింది: యంగ్ హీరో
'డాన్' తానే అవ్వాల్సిందని నటుడు, నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అన్నారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తన ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం డాన్. ప్రియాంక మోహన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్.జే. సూర్య, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం (25 రోజుల క్రితం) విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనే డాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని చెప్పానన్నారు. ఇది డాక్టర్ చిత్ర వసూళ్లను మూడు వారాల్లోనే అధిగమించి రూ.125 కోట్లను వసూలు చేసిందన్నారు. చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్‌లు నిజానికి 'డాన్' చిత్రంలో తాను నటించాల్సిందని, అది జరగకపోవడంతో దర్శకుడు గ్రేట్ ఎస్కేప్ అయ్యారన్నారు. ఇందులోని కళాశాల క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించడం కచ్చితంగా తన వల్ల అయ్యేది కాదన్నారు. ఈ చిత్రం కరెక్ట్ నటుడి చేతిలో పడిందని అభిప్రాయపడ్డారు. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. -
కమల్ హాసన్‌కు హీరో శుభాకాంక్షలు
నటుడు కమల్‌హాసన్ విక్రమ చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించగా విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాడులో విక్రమ్ మూవీని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించడం విశేషం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఉదయనిధి స్టాలిన్ కమల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: 'భారతీయుడు 2' సినిమాపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత ! -
సినిమా టికెట్లు అమ్మాలంటూ వేధింపులు? నిజమేంటంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నటించిన సినిమా టికెట్ల విక్రయాల కోసం టార్గెట్ పెట్టి నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని మంత్రి నాజర్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కరుణాకరచ్చేరి– అముదూర్మేడు–రామాపురం మధ్య 5.71 కోట్లు వ్యయంతో కూవం నదిపై నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణపు పనులకు ఆయన కలెక్టర్ ఆల్బీజాన్వర్గీన్, ఎమ్మెల్యే కృష్ణస్వామితో కలిసి ఆదివారం భూమిపూజ చేశారు. కూవం నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి సుమారు 7.5 మీటర్ల వెడల్సు. 83 మీటర్లు పొడవు ఉంటుందన్నారు. చదవండి 👉🏾 బెడ్ సీన్ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్ రిప్లై మే నాలుగో వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసేందుకు వస్తున్న సినిమాలివే! -
Nenjuku Needhi: ఈ చిత్రానికి టైటిల్ మా తాత ఇచ్చారు:ఉదయనిధి స్టాలిన్
తమిళసినిమా: నెంజుక్కు నీతి చిత్ర టైటిల్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశామని నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి శివాని రాజశేఖర్, తాన్య రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రొజెక్ట్స్ సంస్థలతో కలిసి రెమో పిక్చర్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌రాజ్ కామ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీపునీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సోమవారం సాయంత్రం నిర్వహించిన చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన తాత కరుణానిధికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రం టైటిల్ ఆయన ఇచ్చిందేనని పేర్కొన్నారు. నిర్మాత బోనీ కపూర్ ఫోన్ చేసి ఆర్టికల్ 15 హిందీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేద్దామని చెప్పగా దర్శకత్వం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాంటి సమయంలో ‘కణా’ చిత్రాన్ని చూసి అరుణ్‌రాజ్ కామరాజును పిలిపించగా ఆయన వెంటనే చేద్దామని చెప్పారన్నారు. నెంజుక్కు నీతి టైటిల్ గురించి తన తండ్రి స్టాలిన్‌కు చెప్పగా జాగ్రత్తగా చేయండని అన్నారన్నారు. -
‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాటను ఆవిష్కరించిన ఉదయనిధి స్టాలిన్ (ఫోటోలు)
-
తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది
Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్ సెగ తమిళనాడుకు పాకింది. కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్ ఏజెంట్ వీరంగం సృష్టించాడు. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందించాడు. #TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH — ANI (@ANI) February 19, 2022 బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె. தமிழகத்தில் இன்று நடைபெறும் நகர்ப்புற உள்ளாட்சித் தேர்தலை முன்னிட்டு சென்னை,சாலிகிராமத்தில் உள்ள வாக்குச்சாவடியில் எனது வாக்கினை செலுத்தி ஜனநாயக கடமையாற்றினேன். #LocalBodyElection pic.twitter.com/v4ItGVnkdn — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 19, 2022 ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ పోల్స్ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ తెయ్‌నామ్‌పేట్‌లో, తెలంగాణ గవర్నర్ తమిళసై, తమిళ స్టార్ హీరో విజయ్ నీలాన్‌గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్ ఫేజ్‌లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సంబంధిత వార్త: హిజాబ్ వివాదం.. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు -
షూటింగ్లో పొల్గొన్న ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కలైయరసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. -
విశాల్ నా టైటిల్ దొంగిలించాడు!: దర్శకుడి ఆవేదన
నటుడు విశాల్‌పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ నటుడు, శాసనసభ్యులు ఉదయనిధి స్టాలిన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో ఆయన తాను గత 15 ఏళ్లుగా సహాయ దర్శకుడిగా సినీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న "చక్రం" సినిమాకి పని చేసే సమయంలో తాను రాసుకున్న 'కామన్‌మ్యాన్' కథ గురించి చెప్పానన్నారు. అయితే విశాల్ తాను నటిస్తున్న తాజా చిత్రానికి తన "కామన్‌మ్యాన్" టైటిల్‌ను అక్రమంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తన చిత్ర టైటిల్ వాడుకోమని ఆయనకు చెప్తే అప్పుడు ఆయన మౌనంగా ఉండి ఇప్పుడు తన అనుమతి లేకుండా టైటిల్ వాడుకోవాలని చూస్తున్నారన్నారు. తన చిత్ర టైటిల్ కింద "నాట్ ఏ కామన్ మ్యాన్" అనే ట్యాగ్‌లైన్ జోడించారు. దీని గురించి తాను విశాల్‌ను అడగ్గా ఆయన వర్గం తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ ఆరోపించారు. చదవండి: విశాల్ ఫిర్యాదు బాధించింది: నిర్మాత ఆర్బీ చౌదరి -
దర్శకుడు స్వర్ణం మృతి, సీఎం స్టాలిన్, ఉదయనిధి నివాళులు
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరంభకాలంలో కథానాయకుడిగా నటించిన చిత్ర దర్శకుడు స్వర్ణం మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయన వయస్సు 88 ఏళ్లు. స్వర్ణం ప్రారంభదశలో మురసు పత్రికా సంస్థలో రచయితగా తన సేవలను అందించారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అప్పట్లో కథానాయకుడిగా నటించిన ‘ఒరేరత్తం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కథ అందించడం గమనార్హం. కాగా స్థానిక కొట్టివాక్కంలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆయన.. వృద్ధాప్యం కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ నివాళులు అర్పించారు. -
సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్
సీనియర్ హీరో జీవిత రాజశేఖర్ల ముద్దుల తనయ శివానీ రాజశేఖర్ తాజాగా తమిళంలో క్రేజీ ఛాన్స్‌ను కొట్టేసింది. ఇప్పటికే గుహన్ దర్శకత్వంలో ఆమె ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదిత్ అరుణ్ సరసన చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ గ్యాప్‌లోనే ‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జతో మరో మూవీకి సైన్ చేసింది శివానీ. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫాంటసీ లవ్ స్టోరీ మూవీని మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్ 15’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో శివానీ సరసన తమిళనాడు సీఎంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించనున్నారు. అరుణ్‌రాజ కామరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను బోనీకపూర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. చదవండి : ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ? గజిని తమిళ నిర్మాత కన్నుమూత -
తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి?
దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందా? అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. పలు వివాదాల మధ్య 2019 జూన్‌లో దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నటుడు విశాల్ జట్టుకు నిర్మాత ఐసరి గణేష్ జట్టుకు మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు వెలువడలేదు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే అధిక స్థానాలు గెలుపొందాయి. దీంతో ఆ పార్టీ నేత స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్న నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు విశాల్ మంచి మిత్రుడు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ దక్షిణ భారత నటీనటుల సంఘం సమస్యకు పరిష్కారం చూపుతారనే ఆశ చిత్ర పరిశ్రమలో చిగురిస్తోంది. చదవండి: వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ -
ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. -
ఆర్టికల్ 15 రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ హిందీ చిత్ర రీమేక్‌లో నటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో చాలా మంది నటులు మాదిరిగానే ఉదయనిధి స్టాలిన్ కూడా కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. హిందీలో సంచలన విజయం సాధించిన ఆర్టికల్ 15 చిత్ర రీమేక్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, నాజర్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 15 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ పొందారు. ఇప్పుడు తమిళంలో బోని కపూర్, జి స్టూడియోస్ సంస్థలు సమర్పణలో రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: దర్శకుడు సుందర్‌కి కరోనా .. వెల్లడించిన ఖుష్బూ ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో -
నిధితో నిధి
‘ఇస్మార్ట్ శంకర్’తో పెద్ద మాస్ హిట్ అందుకున్న నిధీ అగర్వాల్ మంచి జోష్‌లో ఉన్నారు. తమిళంలో వరుస సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ‘జయం’ రవి నటించిన ‘భూమి’తో తొలిసారి తమిళంలో కనిపించబోతున్నారు నిధి. ఈ సినిమా దీపావళికి ఓటీటీలో విడుదల కానుంది. ఆ తర్వాత శింబు చేసిన ‘ఈశ్వరన్’ సినిమాలో హీరోయిన్గా నటించారామె. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా మూడో సినిమా కూడా కమిట్ అయ్యారీ బ్యూటీ. ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యారామె. తమిళంలో వరుస సినిమాల మీద ఫోకస్ పెట్టడమే కాదు తమిళం నేర్చుకోవడం మీద కూడా శ్రద్ధపెట్టారట నిధీ అగర్వాల్. -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్‌లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్‌తో మిష్కిన్ కానీ టాక్‌కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో సైకో చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
ఎందుకు అరెస్టు చేయలేదు?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఎంకే ఉదయనిధి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నాన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం ఉదయం ఆయన చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులను కలిశారు. ఈ నెల 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులపై గుర్తు తెలియని దుండగుల దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖానికి ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగిన వారిని ఢిల్లీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని అన్నారు. నిందితులెవరో సీసీటీవీ ఫుటేజీల్లో తేలినప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సంబంధిత వార్తలు ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం! జేఎన్‌యూలో మెరిసింది.. ఎవరీ ఆయిషీ ఘోష్? 10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు... హీరోయిన్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు -
కంటిని నమ్మొద్దు
రెండేళ్ల క్రితం నాని ‘ఎమ్సీఏ’ (మిడిల్‌క్లాస్ అబ్బాయి) చిత్రంతో ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు భూమిక. గత ఏడాది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘యు–టర్న్’, ‘సవ్యసాచి’ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఇప్పుడు మళ్లీ తమిళంలో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నై నంబాదే’. (కంటిని నమ్మొదు అని అర్థం) మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆత్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ మూవీలోనే ఓ కీలక పాత్ర చేయనున్నారు భూమిక. ‘‘సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమాకు భూమిక పాత్ర హైలైట్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా కాకుండా మరికొన్ని సినిమాలకు భూమిక కథలు వింటున్నారట. -
పెళ్లికళ వచ్చేసిందే పాయల్
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారు హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడామె పెళ్లిపీటలు ఎక్కేశారు. ఇక్కడి వరకూ చదివిన పాయల్ ఫ్యాన్స్ పరేషాన్ అవ్వక తప్పుదు. ముందుకెళ్లండి అసలు విషయం తెలుస్తుంది. తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న పాయల్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో నటించేందుకు అంగీరించిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ హీరోగా కే.ఎస్. అధియామన్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు పాయల్. ముందుగా ఉదయ్, పాయల్లపై పెళ్లినాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని ఓ సీన్ కోసం పాయల్ పెళ్లి కూతురయ్యారు. ఈ చిత్రానికి ‘ఏంజిల్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ‘‘నా తొలి తమిళం సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఆశిస్తున్నాను. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు పాయల్ రాజ్‌పుత్. -
అదితీ సైకో!
ఈ రోజు ఓ ముగ్గరి కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. అందులో ఒకరు ‘సైకో’. మరి ఆ సైకో పర్సన్ నుంచి మిగతా వారు ఎలా తప్పించుకున్నారు అనేది తెలియాలంటే బోలెడంత టైమ్ ఉంది. ‘డిటñ క్టివ్’ ఫేమ్ మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైకో’. ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ‘‘తమిళంలో ‘సైకో’ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పడానికి ఆనందంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది’’ అని పేర్కొన్నారు అదితి. ‘‘సైకో’ టైటిల్ లోగో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శుక్రవారం నుంచి షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు ఉదయ్. ఇందులో సైకో ఎవరంటే అదితీరావ్ అని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో అదితీ రావ్ చేస్తోన్న ‘అంతరిక్షం 9000 కీమీ’ డిసెంబర్ 21 రిలీజ్ కానుంది. -
ఇద్దరు అందాల భామలతో ‘సైకో’
సాక్షి, తమిళ సినిమా : ఇద్దరు అందాలభామలతో కలిసి ఆడిపాడేందుకు ‘సైకో’ సిద్ధమవుతున్నడు. ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు మిష్కిన్ ‘సైకో’ తెరకెక్కిస్తుండగా.. దీనికి మేస్ట్రా ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధికి జోడీగా ఇద్దరు నటించబోతున్నారు. మణిరత్నం కంపెనీ హీరోయిన్గా ముద్రపడిన అదితిరావ్ హైదరి, సంచలన నటి నిత్యామీనన్‌లే ఉదయనిధితో రొమాన్స్ చేయనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. ఇటీవల తుప్పరివాలన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ మధ్య పిశాచి అనే థ్రిల్లర్ కథను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించారు. సవరకత్తి అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతివృత్తంతో సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సైకో అంటూ భయ పెట్టడానికి మిష్కిన్ రెడీ అవుతున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ జంటగా అదితిరావ్ హైదరి, నిత్యామీనన్‌ను ఎంచుకున్నారు. మరో దర్శకుడు రామ్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్, ఇళయరాజా పనితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌మొళి మాణిక్యం నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ సాధారణ చిత్రాలకు భిన్నంగా మంచి క్లాసికల్ చిత్రాలు చేయడంలో దర్శకుడు మిష్కిన్ దిట్ట అన్నారు. అదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలన్నది తెలిసిన దర్శకుడాయన అని పేర్కొన్నారు. సైకో చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత అరుణ్మొళి మాణిక్యం తెలిపారు. చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని చెప్పారు. -
బాలీవుడ్ బ్యూటీకి మరో ఛాన్స్
విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘తుప్పరివాళన్’ (తెలుగులో డిటెక్టివ్) ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత డైరెక్షన్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చి, నటుడిగా బిజీ అయ్యారు మిస్కిన్. ఇప్పుడు మళ్లీ ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర కథానాయిక కోసం పలువుర్ని సంప్రదించిన చిత్రబృందం ఫైనల్‌గా తెలుగు మూలాలున్న బాలీవుడ్ బ్యూటీ అదితీరావ్ హైదరీని ఓకే చేశారట. ఈ మధ్య విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచారు అదితి. మిస్కిన్ చెప్పిన కథ బాగుండటం, పాత్ర నచ్చడంతో నటించేందుకు వెంటనే పచ్చజెండా ఊపేశారట ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తి చేశారట అదితి. కాట్రు వెలియిడై, చెక్క చివంద వానమ్ తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన మరో ఆఫర్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్. -
దివ్యాంగుడికి హీరో ఆర్థిక సాయం
పెరంబూరు: నటుడు ఉదయనిధి స్టాలిన్ ఓ దివ్యాంగుడికి ఆర్ధిక సాయం అందించారు. తంజై టౌన్, కరంబై ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు అరుళ్ సహాయరాజ్. అదే ప్రాంతంలో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో నటుడు ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరుతూ ఆయన అభిమాన సంఘం ద్వారా లేక రాశారు. సోమవారం తంజైలో జరిగిన ఒక వివాహవేడుకలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని అరుణ్ సహాయరాజ్ ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అరుళ్ సహాయరాజ్ ఆనందంతో కంట తడిపెట్టాడు. ‘తాను ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరాను గానీ, ఆయన ఇలా స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేస్తారని ఊహించలేదు’అన్నాడు. -
ఇద్దరు భామలతో ఉదయ్ రొమాన్స్
తమిళసినిమా: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. గ్లామర్ అంటే హీరోయిన్లే ముందుగా గుర్తుకొస్తారు. అలాంటి హీరోయిన్లు చిత్రంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే కచ్చితంగా ఆ సినిమా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ సాధ్యమైనంత వరకూ ఒకరికి మించిన హీరోయిన్లు తమ చిత్రాల్లో ఉండేలా చూసుకుంటున్నారనిపిస్తోంది. అలాంటి కథలపైనే అభిమానులూ ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. తాజాగా యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ కూడా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారనిపిస్తోంది. ఈయన నటించిన నిమిర్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తాజాగా శీనురామస్వామి దర్శకత్వంలో కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకి. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయిన్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దర్శకుడు అట్లీ శిష్యుడు ఈనక్ చెప్పిన కథ నచ్చేయడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిపోతున్నారని సమాచారం. ఇందులో ఆయనకు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నారని తెలిసింది. అందులో ఒకరు మేయాదమాన్ చిత్రం ఫేమ్ ప్రియా భవానీశంకర్ కాగా మరొకరు నటి ఇందుజా అని సమాచారం. ఈ చిత్రం తమిళ ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.