ఉదయ్ నిధి స్టాలిన్
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్‌లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు.
Comments
Please login to add a commentAdd a comment