తమిళంలో అజిత్ మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. అలాంటి హీరో మాస్ ఎలిమెంట్స్ లేని ‘పింక్’ చిత్రం రీమేక్‌లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్ నిర్మించారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో అజిత్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్ 15’ తమిళ రైట్స్ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్‌తో మూడు సినిమాల డీల్‌ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment