Article 15
-
ఆర్టికల్ 15 రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ హిందీ చిత్ర రీమేక్‌లో నటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో చాలా మంది నటులు మాదిరిగానే ఉదయనిధి స్టాలిన్ కూడా కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. హిందీలో సంచలన విజయం సాధించిన ఆర్టికల్ 15 చిత్ర రీమేక్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, నాజర్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 15 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ పొందారు. ఇప్పుడు తమిళంలో బోని కపూర్, జి స్టూడియోస్ సంస్థలు సమర్పణలో రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: దర్శకుడు సుందర్‌కి కరోనా .. వెల్లడించిన ఖుష్బూ ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో -
ఉదయ్‌తో ఆర్టికల్ 15
అజిత్‌తో హిందీ ‘పింక్’ని తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్ 15’ని తమిళంలో రీమేక్ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేయనున్నారు. అరుణ్రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్ హౌస్‌పై తమిళ రీమేక్‌ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’ తర్వాత అజిత్‌తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్ 15’ రీమేక్ షూటింగ్‌ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట. -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్‌లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
తోబుట్టువుల తీర్పు
అన్న ఉంటే కొండంత అండ ఉన్నట్లేనని భావిస్తుంది ఏ ఆడబిడ్డ అయినా! కాని అదే అన్న.. పరాయి ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిస్తే.. తోడపుట్టిన వాడు లేడని చెప్పుకోవడానికీ వెనకాడదు! గౌరవ మర్యాదలు ఏ అమ్మాయికైనా ఒకటే కాబట్టి వాటిని లెక్కచేయనివాడు తోబుట్టువైనా సరే క్షమించదు. తనకసలు తోడే పుట్టలేదనుకుంటుంది. ‘దిశ’ నిందితుల అక్కాచెల్లెళ్లూ అదే చేస్తున్నారు.. తోటి వాళ్లముందు తమను తలెత్తుకోనివ్వకుండా శిక్ష వేసిన అన్నదమ్ములు తమకు లేరనే నిర్ణయానికి వచ్చారు! ఈ యేడాది (2019) జూన్‌లో ‘ఆర్టికల్ 15’ అనే హిందీ సినిమా వచ్చింది. అస్పృశ్యతా నేరాన్ని చర్చించిందీ సినిమా ఇద్దరు అమ్మాయిల మీద చేసిన లైంగిక దాడి, హత్య నేపథ్యంలో. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమాలో దిశ ఘటనను పోలి ఉన్న అంశం ఒకటి ఉంది. ‘‘ఆర్టికల్ 15’’లో ఇద్దరు అమ్మాయిల హత్యకేసును ఛేదించే ప్రయత్నంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్‌కు ఒక నిజం తెలుస్తుంది. ఆ రేప్, హత్యానేరంలో తన ఇంట్లో పనిచేసే టీన్స్ అమ్మాయి అన్న కూడా భాగస్తుడని. చెల్లెలి పట్ల ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండే ఆ అన్న ఇలాంటి పని ఎలా చేశాడో మింగుడుపడదు ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కి. తల్లీతండ్రిని ఆ అన్నలోనే చూసుకుంటున్న ఆ సోదరి ఈ వాస్తవం విని ఎలా తట్టుకుంటుందో? అని మథన పడ్తాడు. చెప్పేస్తాడు కూడా... ‘‘అంతటి దారుణానికి బలైన ఆ ఇద్దరు నీ ఈడు పిల్లలే. నీలాంటి వాళ్లే. జీవితం పట్ల ఎన్నో ఆశలు, కలలు కన్నవాళ్లే. నీ కోసం అంత కష్టపడే నీ అన్ననే ఆ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించాడు’’ అంటూ. అంతా విన్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది. తేరుకున్నాక ఏడుస్తుంది. అన్న మీద ఉన్న నమ్మకం పోయి. ఇంచుమించు ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ‘దిశ’ నిందితుల తోబుట్టువులు. ఆరిఫ్, నవీన్‌కు చెల్లెళ్లు, జోళ్లు శివ, చెన్నకేశవులుకు అక్కలు ఉన్నారు. తమ అన్న, తమ్ముళ్లు చేసిన పనికి సిగ్గుపడ్తున్నారు. తలెత్తుకొని నలుగురిలోకి రాలేకపోతున్నారు. ఆరిఫ్ చెల్లెలు అయితే ఆ ఊర్లోంచే వెళ్లిపోయి బంధువుల ఇంట్లో ఉంటోంది. మిగిలిన వాళ్లూ అంతే.. అవమానభారంతో అజ్ఞాతాన్నే కోరుకుంటున్నారు. నేనొక్కదాన్నే పుట్టాననుకో.. ఈ మాట అంటున్నది ఆరిఫ్ చెల్లెలు. ‘‘నేనూ ఒక ఆడపిల్లనే. నాలాంటిదాని మీదే అఘాయిత్యం చేశాడు అన్న. ఆ పనికి అన్నకు ఏ శిక్షపడినా బాధపడకు అమ్మా..! అన్న పుట్టనేలేదనుకో. నేనొక్కదాన్నే పుట్టాననుకో. నేను మిమ్మల్ని పోషిస్తా. అన్న జైలుకి వెళ్లినా తిరిగిరాడు. తప్పు చేసిన అన్న గురించే నువ్వు ఇంత బాధ పడ్తుంటే అవతల ఏ తప్పూ లేకుండా కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్తూండాలమ్మా..! అందుకే అన్న గురించి ఆలోచించడం మానెయ్’’ అని వాళ్లమ్మకు చెప్తోంది ఆరిఫ్ సోదరి. పదవ తరగతి చదివిన ఆ అమ్మాయి తొందరగా పై చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటోంది. మొహమెట్లా చూపించాలి? నవీన్ చెల్లెలు ఎనిమిదవ తరగతి చదువుతోంది. అన్న చేసిన దారుణమైన పనికి భయంతో వణికిపోతోంది. ఆ దుర్ఘటన వెలుగు చూసినప్పటి నుంచి బడికి వెళ్లాలన్నా భయపడుతోంది. స్కూల్లో తోటి విద్యార్థులతో ఇమడలేక.. వాళ్లతో కలవలేక.. బడికి వెళ్లడమే మానుకుంది. ‘‘స్కూల్లో నా ఫ్రెండ్స్‌కి ఎట్లా మొహం చూపించాలి? నాతోకాదు’’ అంటూ ఏడుస్తోందట. ఏ శిక్ష విధించినా సరే.. చెన్నకేశవుల అక్క కూడా ఇంచుమించు ఇంతే. తమ్ముడు చేసిన పనికి అటు అత్తగారి ఊర్లో, ఇటు పుట్టిన ఊర్లో ఎదురయ్యే అవమానాలను తలుచుకొని ఇంటి గడపదాటడమే మానేసింది.చెన్నకేశవులుకి పెళ్లయింది. భార్య ప్రస్తుతం గర్భవతి. ‘‘తన భార్యా ఒక ఆడదే అని మరిచి ఆ ముగ్గురితోపాటు నా మొగుడు ఇంకో ఆడపిల్లను చంపాడు. ఇందుకు అతనికి ఏ శిక్ష విధించినా సరే! ఇంకో రెండు నెలల్లో బిడ్డ పుడతాడు. వాళ్ల నాన్న గురించి వాడికి ఏమని చెప్పాలి? వాడు అట్లా కాకుండా అయితే చూసుకోవాలి కదా! నా తల రాత ఇట్లా రాసి ఉంది మరి.. ఏం చేయాలి?’’ అని వాపోతోంది చెన్నకేశవులు భార్య. ఆ నలుగురూ కనీసం ఈ అయిదుగురు ఆడవాళ్ల గురించి ఆలోచించినా.. వాళ్ల ప్రవర్తన తాలూకు పర్యవసానాలను వీళ్లు భరించాల్సి ఉంటుందని గ్రహించగలిగినా ఈరోజు వీళ్లు ఇలా సిగ్గుతో తలవంచుకునేవాళ్లు కాదు. ఇది అందరు అన్నలు, తమ్ముళ్లు, కొడుకులు, తండ్రులు, భర్తలు ఆ మాటకొస్తే మొత్తం పురుషులకే పాఠం. ఈ నలుగురి తల్లిదండ్రులకు తమ పిల్లలు చేసిన నేరం తీవ్రత తెలియదు. అందరివీ పేద కుటుంబాలే. కూలీనాలీ చేస్తూ పిల్లలను పెంచారు. ఆ నలుగురిలో ఆరిఫ్ ఒక్కడే పదవ తరగతి వరకు చదివాడు. మిగిలిన ముగ్గురు ఏడుతో ఆపేశారు. జల్సాలు, బైక్ మీద తిరగడాలు, మద్యం తాగడమే వాళ్లకు తెలిసినవి. గమనించదగ్గ విషయమేంటంటే.. ఈ ముగ్గురూ ఊళ్లో ఏడవ తరగతి వరకే ఉండడంతో అంతదాకే చదివి మానేశారు. కాని ఈ ఇంటి ఆడపిల్లలు పక్క ఊరికి వెళ్లి మరీ చదువుకుంటున్నారు. అందుకే ఆడపిల్లల పట్ల కాదు మనం శ్రద్ధ పెట్టాల్సింది మగపిల్లల పెంపకం మీద. పేదింట్లో అయినా.. పెద్దింట్లో అయినా! – ఆనంద్‌కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట, -
మరో రీమేక్?
తమిళంలో అజిత్ మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. అలాంటి హీరో మాస్ ఎలిమెంట్స్ లేని ‘పింక్’ చిత్రం రీమేక్‌లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్ నిర్మించారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో అజిత్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్ 15’ తమిళ రైట్స్ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్‌తో మూడు సినిమాల డీల్‌ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు. -
వైరల్ : పాప్‌కార్న్ తింటూ సినిమా చూసిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాన్య మానవుడిలా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు. ఈ నెల 3న పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. అదే రోజు సాయంత్రం సామాన్య పౌరుడిలా థియేటర్‌కి వెళ్లి ‘ఆర్టికల్ 15’ సినిమా చూశారు. పీవీఆర్ చాణక్య మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ రాహుల్‌ను ఇలా చూడడం హ్యాపీగా ఉంది’, ‘ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇలా సాధారణ వ్యక్తిలా వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడం గొప్ప పని, ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు’ , రాహుల్ గొప్ప వ్యక్తి, రాహుల్ గాధీ నిజాయతీ గల నాయకుడు’ ‘ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ.. ఇలాంటి గొప్ప వ్యక్తి అధికారంలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ నెటిజన్లు రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. View this post on Instagram The video I captured got VIRAL RAHUL GANDHI watching movie #Article15 at Delhi ECX PVR soon after he resigns #deccanchronicle #republicpost #viralbhayani #viralcontent #rahulgandhi #instavideo A post shared by Pooja Singh (@mountaingirl_04) on Jul 4, 2019 at 9:35pm PDT -
తమ్ముడిలా ఉన్నాడు; హీరో భార్య కౌంటర్!
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత భావాలను స్వేచ్ఛగా పంచుకోవడంతో పాటుగా ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలను అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను కించపరిచేలా కామెంట్లు చేస్తున్న ఆకతాయిల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో దర్శకురాలు, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ లుక్‌ను విమర్శిస్తూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగారు. ఇంతకీ విషయమేమిటంటే... భర్త ఆయుష్మాన్‌తో కలిసి దిగిన ఫొటోలను తహీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొంతమంది.. ‘అతడు మీకు భర్తలా కాదు.. తమ్ముడిలా ఉన్నాడు. అసలు మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారా. మీరు ఆడో.. మగా అనే విషయం అర్థంకావడం లేదు’ అంటూ విపరీతపు కామెంట్లు చేశారు. ఇందుకు హుందాగా స్పందించిన తహీరా..‘ ఇలాంటి భాయీ భాయీ జోకులు వినీ వినీ.. ఆయుష్మాన్ కలిసిన ప్రతీసారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాట వినిపిస్తోంది. అదేంటో తెలుసా.. తూ మేరా.. తూ మేరా భాయీ నహీ హై! ‘కొంతమంది’ ఏదో అన్నారని వారిని ప్రశ్నించడం లేదు.. ఇదొక స్టేట్మెంట్ మాత్రమే. ఆర్టికల్ 15 సినిమా చూడటానికి నేను మార్స్ నుంచి వచ్చా ను. ఈ సినిమా నాకెంతో నచ్చింది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కేవలం లుక్ కారణంగా.. మా మధ్య ఉన్న బంధం మీరనుకున్నట్లుగా మారిపోదు కదా అని ఘాటుగా స్పందించారు. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన ఆయుష్మాన్ సినిమా ‘ఆర్టికల్ 15’ విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Jeez 🙄 itne bhai bhai jokes sun liye ke Ab jab bhi main @ayushmannk ko milti Hun background main ek hi gaana Chal raha hota hai “tu mera, tu mera , tu mera bhai nai hai!” And unlike the fukre boys song I am not questioning! It’s a goddamn statement! P.s ( case in point , look at our hair partition , haina opposite? Phirrrr!) Just incase you get over the bhai bhai thing and see how much effort I took to land from mars for the #article15 screening and I so love it!! 👚 @sabinahalder in @pausefashion.in @alexanderwangny 💄 @hinaldattani 💇♀️ @artistpoonamsolanki #notabhaibhai #trollsrehnedo #girlswithshorthair #adidas A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 26, 2019 at 11:04pm PDT -
‘ఆర్టికల్ 15’పై నిరసన ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : నిజజీవితంలో జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకొని నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘ఆర్టికల్ 15’ విడుదలకు ముందే కాకుండా తర్వాత కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఏమి ఉంది? ఆ సినిమాకు స్ఫూర్తినిచ్చిన నిజ జీవిత పాత్రలెవరు? దేశంలో కుల వ్యవస్థ ఎంత భయానక రూపం దాల్చిందో, దళితులపై అగ్రవర్ణాల దాడులు ఎంత పాశవికంగా కొనసాగుతున్నాయో ఎవరిని, ఏ వర్గాన్ని అంతగా నొప్పించకుండా సున్నితంగా తెరకెక్కించారు అనుభవ్ సిన్హా. నిజాయితీగల పోలీసు పాత్రలో ఓ బ్రాహ్మణుడిని చూపించడం ద్వారా సినిమాకు సమతౌల్యత తీసుకొచ్చి కుల వ్యవస్థ కుళ్లును తెరమీద కక్కించాలనుకున్నారు సిన్హా. ఈ విషయంలో ఆయన ఎంత మేరకు విజయం సాధించింది ప్రేక్షకులే తేల్చుకోవాలి. 2014లో ఉత్తరప్రదేశ్‌లోని బదాన్లో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లను రేప్ చేసి హత్యచేసి వారిని చెట్టుకు వేలాడదీసిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని సినిమా కథను రూపొందించారు. ఇందులో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపే ఐపీఎస్ అధికారి అయాన్ రంజన్ పాత్రలో ఆయూష్మాన్ ఖురానా నటించారు. దళిత నాయకుడు నిషాద్ పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ నటించారు. ‘భీమ్ ఆర్మీ’ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాత్రను రూపొందించారు. తనకు సైన్స్ రైటర్ కావాలని ఉందని ఇందులో దళిత నాయకుడు నిషాద్ చెప్పడం, అదే మాట చెప్పిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత పీహెచ్డీ స్కాలర్ ‘రోహిత్ వేముల’ను గుర్తు చేస్తోంది. 2014లో జరిగిన దళిత అక్కా చెల్లెళ్ల ‘రేప్ అండ్ మర్డర్’ కేసునే కాకుండా గుజరాత్‌లోని ఉనాలో ఏడుగురు దళితులు మూక దాడిలో మరణించిన సంఘటనను కూడా స్ఫూర్తిగా తీసుకొని అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి ఈ కథను తయారు చేశారనడంలో సందేహం లేదు. ఆనంద్ తెల్తుంబ్డే రాసిన ‘రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్’, ఓం ప్రకాష్ వాల్మీకీ రాసిన ‘జూఠన్’ పుస్తకాలను కూడా వీరిద్దరు చదివారు. హెచ్బీవోలో ప్రసారమైన ‘ట్రూ డిటెక్టివ్’ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమాకు మరింత సహజత్వం తీసుకురావడానికి భోజ్‌పురి పాట ‘కహా తో లగ్ జాయ్ దగ్ సే’ పాటను వీధి కళాకారులతోనే పాడించారు. ఇది వరకు ‘ముల్క్’ తీసి ప్రేక్షకులను మెప్పించిన సిన్హా ఈసారి అదే ప్రయత్నించారు. మరింత వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఆయన ఈ సినిమాలో ప్రయత్నించడం కొందరికి నచ్చకపోవచ్చు. వాస్తవికంగా దళితులపై జరిగిన అగ్రవర్ణాల దాడిని ఇతి వృత్తంగా తీసుకోవడం కూడా వారికి నచ్చి ఉండక పోవచ్చు. అగ్రవర్ణాల్లో అందరు చెడ్డవాళ్లు కాదని, మంచి వాళ్లు కూడా ఉంటారని చెప్పడం ద్వారా సినిమాకు సమతౌల్యతను తీసుకరావడానికి దర్శకుడు నిజాయితీగానే ప్రయత్నించారు. అనుభవ సిన్హా కూడా అగ్రవర్ణుడే అన్న విషయాన్ని ఇక్కడ మరవద్దు. (చదవండి: నాడు ‘ఆక్రోష్–నేడు ‘ఆర్టికల్–15’) -
అది బ్రాహ్మణ వ్యతిరేక సినిమా.. ఆపేయండి!
ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుభవ్ సిన్హా.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నిర్మించిన ‘ఆర్టికల్–15’ మూవీపై వివాదం రేగుతోంది. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించవద్దని, ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని బ్రాహ్మణ సంఘలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంఘాలు ఆదివారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు థియేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సినిమా ప్రదర్శనను వెంటనే ఆపాలంటూ చిత్రయూనిట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని కిరాతకంగా చూపించారని, దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపినట్లు ఈ సినిమాను తెరకెక్కించారని, ఇది సరికాదని అఖిల భారత బ్రాహ్మణ ఏక్తా పరిషత్ జనరల్ సెక్రటరీ హరి త్రిపాఠీ ఆరోపించారు. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనకు ఇబ్బంది కలుగకుండా ప్రతి థియేటర్‌కు భద్రత కల్పిస్తామని, థియేటర్‌కు ఒక పోలీసు చొప్పున కేటాయిస్తామని స్థానిక పోలీసు అధికారి మనోజ్ గుప్తా తెలిపారు. ఈ సినిమా ప్రదర్శనను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి అనంత్ డియో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకొని మరణించిన యథార్థ సంఘటన ఆధారంగా.. దళితులపై సమాజంలో నెలకొన్న వివక్ష నేపథ్యంతో ‘ఆర్టికల్–15’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని చనిపోగా మరో సోదరి అదృశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించారు. -
నాడు ‘ఆక్రోష్–నేడు ‘ఆర్టికల్–15’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్–15’ సూచిస్తోంది. అయినప్పటికీ ఇప్పటికీ దేశంలో ఈ పలు రకాల వివక్షలు, వాటి పేరిట దారుణాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి వివక్ష కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్లుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ప్రేరణగా తీసుకొని అనుభవ్ సిన్హా బాలీవుడ్లో ‘ఆర్టికల్–15’ టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతోంది. ‘ఇస్లామోఫోబియా (ఇస్లాం మతస్థులంటే భయం)’ను ఇతివృత్తంగా తీసుకుని అనుభవ్ సిన్హా ఇంతకుముందు తీసిన ‘ముల్క్’ (2018) చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. వివక్షతో దళితులపై సమాజంలో జరుగుతున్న దారుణాల గురించి పలువురు దర్శకులు తమదైన శైలిలో చిత్రాలను తీసారు. వాటిలో మరీ వాస్తవానికి దగ్గరగా కనిపించే చిత్రం 1980లో గోవింద్ నిహ్లాని దర్శకత్వం వహించిన ‘ఆక్రోష్’. ఈ చిత్రం కూడా యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్నదే. పత్రికల్లో వచ్చిన ఓ సంఘటన ఆధారంగా విజయ్ టెండూల్కర్ ఓ నాటకం రాయగా, దాన్ని గోవింద్ నిహ్లాని తెరకెక్కించారు. శ్యామ్ బెనగళ్ దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన గోవింద్ నిహ్లానికి దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం ఇదే. అమ్రేషిపురి, ఓంపురి, నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ నటించిన ఆక్రోష్ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ముఖకవళికతో ప్రేక్షకులను మెప్పించిన ‘ఉత్తమ’ నటుడు ఓంపురి. గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే వాటి మంటలు ముఖం మీద ప్రతిఫలించినట్లుగా కోపోద్రిక్తుడుగా అందులో ఓంపురి కనిపిస్తాడు. తాడిత పీడిత జనం మీద తీసిన గతకాలపు సినిమాలు.. పీడితులు తిరుగుబాటు చేసినట్టో, దారుణాలకు తెగబడ్డట్లో చూపుతూ ముగింపు ఇచ్చారు. కానీ ఆక్రోష్లో ఊహించని షాకింగ్ ముగింపు ఉంటుంది. భార్య ఆత్మహత్యకు కారకుడన్న కేసులో నిందితుడైన దళితుడు లాహన్య బీకు (ఓంపురి) తన తండ్రి అంత్యక్రియలకు పోలీసుల కాపలా మధ్య హాజరవుతాడు. అక్కడ తన భార్య ఆత్మహత్యకు కారణమైన అగ్రవర్ణ కామాంధుడు తన చెల్లిలిని కూడా కామం కళ్లతో చూస్తున్నాడని గ్రహించిన ఓంపురి.. అక్కడ ఉన్న గొడ్డలిని తీసుకొని చెల్లిని నరికేస్తాడు. అణచివేతకు గురవుతున్న ఓ దళితుడి కోపం శత్రువుపై కాకుండా తన అశక్త బతుకులపైనే ఉంటుందన్న కోణంలో గోవింద్ నిహ్లాని క్లైమాక్స్‌ను తీశారు. ఆక్రోష్ అంటే ఇక్కడ 1980లో వచ్చిన ‘ఆక్రోష్’నే పరిగణించాలి. 2010లో ప్రియదర్శన్ తీసిన మరో ఆక్రోష్ వచ్చింది. అజయ్ దేవగన్, అక్షయ్ఖన్నా నటించిన ఆ చిత్రాన్ని 1998లో విడుదలైన ‘మిసిసిపీ బర్నింగ్’ స్ఫూర్తితో తీశారు. నిజాయితీకి దగ్గరగా తీసిన ‘ఆర్టికల్–15’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉన్నట్లు ‘ట్రేలర్’ను చూస్తే అర్థం అవుతుంది.