సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాన్య మానవుడిలా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు. ఈ నెల 3న పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. అదే రోజు సాయంత్రం సామాన్య పౌరుడిలా థియేటర్‌కి వెళ్లి ‘ఆర్టికల్ 15’ సినిమా చూశారు. పీవీఆర్ చాణక్య మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ రాహుల్‌ను ఇలా చూడడం హ్యాపీగా ఉంది’, ‘ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇలా సాధారణ వ్యక్తిలా వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడం గొప్ప పని, ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు’ , రాహుల్ గొప్ప వ్యక్తి, రాహుల్ గాధీ నిజాయతీ గల నాయకుడు’ ‘ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ.. ఇలాంటి గొప్ప వ్యక్తి అధికారంలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ నెటిజన్లు రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment