సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత భావాలను స్వేచ్ఛగా పంచుకోవడంతో పాటుగా ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలను అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను కించపరిచేలా కామెంట్లు చేస్తున్న ఆకతాయిల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో దర్శకురాలు, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ లుక్‌ను విమర్శిస్తూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగారు.
ఇంతకీ విషయమేమిటంటే... భర్త ఆయుష్మాన్‌తో కలిసి దిగిన ఫొటోలను తహీరా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొంతమంది.. ‘అతడు మీకు భర్తలా కాదు.. తమ్ముడిలా ఉన్నాడు. అసలు మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారా. మీరు ఆడో.. మగా అనే విషయం అర్థంకావడం లేదు’ అంటూ విపరీతపు కామెంట్లు చేశారు. ఇందుకు హుందాగా స్పందించిన తహీరా..‘ ఇలాంటి భాయీ భాయీ జోకులు వినీ వినీ.. ఆయుష్మాన్ కలిసిన ప్రతీసారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాట వినిపిస్తోంది. అదేంటో తెలుసా.. తూ మేరా.. తూ మేరా భాయీ నహీ హై! ‘కొంతమంది’ ఏదో అన్నారని వారిని ప్రశ్నించడం లేదు.. ఇదొక స్టేట్‌మెంట్ మాత్రమే. ఆర్టికల్ 15 సినిమా చూడటానికి నేను మార్స్ నుంచి వచ్చా ను. ఈ సినిమా నాకెంతో నచ్చింది’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కేవలం లుక్ కారణంగా.. మా మధ్య ఉన్న బంధం మీరనుకున్నట్లుగా మారిపోదు కదా అని ఘాటుగా స్పందించారు.
కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన ఆయుష్మాన్ సినిమా ‘ఆర్టికల్ 15’ విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment