దర్శక, నిర్మాతలతో ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ హిందీ చిత్ర రీమేక్‌లో నటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో చాలా మంది నటులు మాదిరిగానే ఉదయనిధి స్టాలిన్ కూడా కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. హిందీలో సంచలన విజయం సాధించిన ఆర్టికల్ 15 చిత్ర రీమేక్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
హిందీలో ఆయుష్మాన్ ఖురానా, నాజర్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 15 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ పొందారు. ఇప్పుడు తమిళంలో బోని కపూర్, జి స్టూడియోస్ సంస్థలు సమర్పణలో రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment