Tamil remake
-
భాషా తమిళ రీమేక్.. అయితే హీరోగా రజినీకాంత్ కాదట..!
చిత్రసీమలో హిట్ చిత్రాలను రీమేక్ చేయడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన కొన్ని చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు విష్ణువర్ధన్ చేశారు. రజనీకాంత్ పాత్రలో అజిత్ నటించి హిట్ కొట్టారు. తాజాగా మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాషా. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా అండర్ వరల్డ్ డాన్‌గా మారాడో..? తిరిగి మళ్లీ ఎలా మంచిగా మారి జన స్రవంతిలోకి కలిసిపోయాడు? అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ రజనీకాంత్‌కు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణువర్ధన్ కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులోనూ అజిత్‌ను కథానాయకుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కాగా తునివు చిత్రం తర్వాత అజిత్ తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ వైదొలిగారు. అందుకు కారణం కథలో అజిత్ చెప్పిన మార్పులకు ఈయన అంగీకరించ పోవడమేనని సమాచారం. ఇప్పుడు తాజాగా అజిత్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తదుపరి విష్ణువర్ధన్ దర్శకత్వంలో భాషా చిత్రానికి రీమేక్‌లో నటించడానికి అజిత్ మరోసారి సాహసం చేస్తారా? అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
‘అర్జున్ రెడ్డి’ ముద్దుగుమ్మ రైజా విల్సన్ (ఫోటోలు)
-
ఫహద్ ఫాజిల్, నజ్రియాల ట్రాన్స్ తమిళ్ ట్రైలర్ రిలీజ్
సబ్బుల యాడ్ తరహాలో కొందరు మతాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత హెచ్.రాజా అన్నారు. ఫహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా జంటగా నటించిన మళయాళ చిత్రం ట్రాన్స్. దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ తెరకెక్కించారు. అక్కడ మంచి విజయాన్ని సాధించిన దీన్ని ధర్మ విజువల్ క్రియేషన్స్ సంస్థ అధినేత తమిళంలో నిలై మరందవన్ అనే పేరుతో అనువదిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఇందులో బీజేపీ నాయకుడు హెచ్.రాజా, కల్యాణరామన్, అశ్వథ్థామన్, హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ తదితరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్.రాజా మాట్లాడుతూ తమిళ ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడానికే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు భావించవచ్చునన్నారు. వివేకానంద చెప్పినట్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
మానాడు రీమేక్‌లో రానా సోదరుడు అభిరామ్
శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు రీమేకర్లో రానా నటిస్తున్నట్లు రీసెంట్గా వార్తలు వినిపించాయి. చదవండి: బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట.. తాజాగా మానాడు రీమేక్ అతడి సోదరుడు అభిరామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట ఈ రీమేక్‌లో రానా నటించనున్నాడని టాక్ వినిపించగా.. తాజాగా అభిరామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే 'మానాడు' రీమేక్ మొదలవుతుందని అంటున్నారు. -
తమిళ హిట్ మూవీని రీమేక్ చేయనున్న రానా?
Rana Daggubati To Starer In Simbus Maanadu Movie: శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక రానా నటించిన '1945' సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలీవుడ్లో రీమేక్ కానున్న '96' మూవీ
తమిళ సూపర్ హిట్ 96 చిత్రం క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రిష, విజయ్ సేతుపతి ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. 2018లో విడుదలైన 96మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని జానుగా రీమేక్ చేయగా, సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇక ఈ రీమేక్ చిత్రానికి సంబంధించి దర్శకుడు, నటీనటులు ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
అమ్మను కావడానికి ఇంకా టైమ్ ఉంది.. ప్రియమణి క్లారిటీ
పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ► ‘నారప్ప’ అంటే కెరీర్ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్ కూడా ఉంది... ‘పరుత్తువీరన్’లో విలేజ్ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్‌తో వర్క్ చేయడం అంటే నాకు ఒక బోనస్. తెలుగు సినిమా కాబట్టి డబుల్ బోనస్. ► ఉన్నదానికంటే బ్రైట్‌గా కనబడటానికి మేకప్ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్ అయిన స్కిన్‌తో కనబడాల్సి రావడం గురించి.. ‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్‌గానే కనబడాలి. ట్యాన్ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్‌లైట్ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్ టోన్‌ని డార్క్ చేయించాం. మామూలుగా బ్రైట్‌గా కనిపించడానికి మేకప్ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్‌గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ). ► తమిళ ‘అసురన్’కి రీమేక్‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది... రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ. ► రొటీన్‌కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి? అన్నీ కాటన్ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్ స్టాఫ్ ‘ఏంటి మేడమ్.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్వాళ్లు. ఈ క్యారెక్టర్‌కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్ స్టయిల్ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్ ఫ్రెష్‌గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్ చేసేసేవారు (నవ్వుతూ). ► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్ ప్లాన్స్’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు? నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్‌గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను. ► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా? ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే. ► సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు..? (నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుంది. ► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు? ఆయన యూఎస్‌లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్‌లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్‌ని పట్టగలిగారా? రెగ్యులర్ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్కి నాకు కొంచెం టైమ్ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్‌ని పికప్ చేయగలిగాను. ► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్? ఉంది. ఆ సీన్ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ఉంది. అది నాకు పెద్ద సవాల్‌లా అనిపించింది. ఫిజికల్‌గా ఛాలెంజ్ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. -
స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్లో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్ రైట్స్‌ను విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్ హీరో కొడుకుతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్..ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్‌తో కొడుకు జాన్సన్ సంజయ్‌ను హీరోగా పరిచయం చేయాలని విజయ్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : (21 ఏళ్ల ఆల్‌టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ ) (అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్) -
కొత్త అవతారం
సిమ్రాన్ ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లు అందుకున్న సిమ్రాన్ ఇప్పుడు ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధా ధున్’ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్ క్యారెక్టర్ని సిమ్రాన్ చేయనున్నారు. ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ – ‘‘తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నాను. ఈ బోల్డ్ క్యారెక్టర్‌ను ఎంత ఛాలెంజింగ్‌గా చేస్తానో చూడాలి. ఓ కొత్త అవతారంలో కనిపించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘అంధా ధున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే. -
రీమేక్ సినిమా కోసం మెగాస్టార్‌కు రూ.60 కోట్లు!
టాలీవుడ్లో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పండగ పూట బాస్ సినిమా రిలీజైతే వార్ వన్‌సైడ్ అయిపోతుంది. అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. ఖైదీ నం.150 విడుదలైన రెండేళ్లకు సైరా వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు రూ. 40 కోట్లు అందుకున్నారట. తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారట. ఇందులో కాజల్ హీరోయిన్గా నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: రౌడీ బేబి @ వందకోట్లు) తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ అజిత్ చిత్రం 'వేదాళం' రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా మార్పుచేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్నట్లు వినికిడి. ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రూ.60 కోట్లకు ఫిక్స్ చేశారు. బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న దీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) -
ఫ్లాష్‌బ్యాక్ నారప్ప
వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. చిత్రనిర్మాతలు డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ– ‘నారప్ప’ సినిమా లాక్‌డౌన్‌కు ముందే 60 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ మధ్యే షూటింగ్‌ను హైదరాబాద్‌లో పునః ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలతో పాటు కై్లమాక్స్ను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం సినిమా పూర్తవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్. -
ఉదయ్‌తో ఆర్టికల్ 15
అజిత్‌తో హిందీ ‘పింక్’ని తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్ 15’ని తమిళంలో రీమేక్ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేయనున్నారు. అరుణ్రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్ హౌస్‌పై తమిళ రీమేక్‌ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’ తర్వాత అజిత్‌తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్ 15’ రీమేక్ షూటింగ్‌ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట. -
ఉప్పెన రీమేక్‌లో స్టార్ హీరో తనయుడు
హిట్ సాంగ్స్‌తో రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం "ఉప్పెన". ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.. కృతీశెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ వార్త ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. దీని ప్రకారం విజయ్ సేతుపతి ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులు కొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంచి ప్రేమ కథతో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న స్టార్ హీరో విజయ్‌కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. (మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్) ఈ సినిమాపై విజయ్ కూడా ఆసక్తి కనబర్చగా, తన కొడుకు జాసన్ సంజయ్ విదేశాల నుంచి తిరిగి రాగానే మరోసారి చర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజయ్ అది పూర్తవగానే ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి. అయితే పరిస్థితులు ఎక్కడికక్కడ సద్దుమణిగితే ఈ ఏడాది చివర్లో రీమేక్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తమిళ రీమేక్‌కు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కరోనా విలయం ముగిసిన తర్వాతే ఈ రీమేక్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. (కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్ ఆందోళన!) -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్‌లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
అల రీమేక్‌లో...
అల్లు అర్జున్ హీరోగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్. రాధాకష్ణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా తమిళంలోనూ రీమేక్ కానుందనే వార్త వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందట. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
కన్నడంలో నిన్ను కోరి
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్‌తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్ నటుడు ధృవ్ సార్జా ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. -
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్‌తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్లో ఇది తొలి రీమేక్. తమిళంలో రిలీజ్ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి లవర్ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్ చేయలేకపోయేవాడినేమో. లవ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘రీమేక్ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్కి వచ్చే క్రెడిట్ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత. -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు. -
ఏజెంట్ సంతానం?
ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నెల్లూరు బ్రాంచ్‌లో కేసులు సాల్వ్ చేశారు ఏజెంట్ ఆత్రేయ. ఇప్పుడు ఈ బ్యూరో చెన్నైలో కూడా ఓపెన్ కానుందని తెలిసింది. మరి అక్కడి కేసులను ఎవరు సాల్వ్ చేస్తారంటే... ఏజెంట్ సంతానం అని తెలిసింది. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిటెక్టివ్ చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. కామెడీ ఏజెంట్‌గా కితకితలు పెట్టారు నవీన్. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. నవీన్ పాత్రలో తమిళ హాస్య నటుడు సంతానం కనిపించనున్నారట. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
సౌండ్ ఇంజనీర్ కాబోతున్నారు
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్‌గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో రామ్‌చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. -
మరో రీమేక్?
తమిళంలో అజిత్ మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. అలాంటి హీరో మాస్ ఎలిమెంట్స్ లేని ‘పింక్’ చిత్రం రీమేక్‌లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్ నిర్మించారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో అజిత్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్ 15’ తమిళ రైట్స్ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్‌తో మూడు సినిమాల డీల్‌ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు. -
సౌత్ క్వీన్‌కు కత్తెర్లు
‘‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్ అగర్వాల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’కు ఇది తమిళ రీమేక్. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఇటీవల ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్ వారు ఇన్ని కట్స్ చెప్పారన్నప్పుడు షాకయ్యాను. వారు చెప్పిన కట్స్‌లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ విషయమే నిర్మాతలకూ చెప్పి సరైన యాక్షన్ తీసుకోమని కోరాను. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకుప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. హిందీ ‘క్వీన్’ చిత్రం తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్ జామ్’గా, కన్నడలో ‘బటర్‌ఫ్లై’గా రీమేక్ అయ్యాయి. ‘జామ్ జామ్’, ‘బటర్ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
జెర్సీ రీమేక్‌లో అమలాపాల్!
‘‘కథాబలం ఉన్న కథలు, బలమైన పాత్రలు రావడంలేదు. అందుకే సినిమాలు వదిలేద్దామనుకున్నా’’ అని ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పారు. అయితే కథాబలం ఉన్న స్క్రిప్ట్ కావడంతో ‘ఆమె’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమలా పాల్కి మరో బలమైన పాత్ర చిక్కింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో అమలా పాల్‌ను కథానాయికగా అడిగారట. తెలుగు సినిమా చూసినవారికి కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అమలా పాల్ ఒప్పుకున్నారట. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ రీమేక్‌ని హీరో రానా నిర్మించనున్నారు. నాని పాత్రలో విష్ణు విశాల్ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రీమేక్‌ని ‘దిల్’ రాజు, నాగవంశీ నిర్మించనున్నారు. ఇంకా తారాగణం ఎంపిక కాలేదు. -
ట్రాఫిక్ సిగ్నల్ కథేంటి
‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారు తమిళ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని రూపొందించిన శశి కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా నటించారు. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు. రమేశ్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, బైక్ రేసర్‌కి మధ్య సాగే ఎమోషనల్ కథ ఇది. మంచి ఫ్యామిలీ డ్రామా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’ని బాగా ఆదరించారు. నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఆలోచించి ఈ కథ తయారు చేశాను. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు శశి.