రీమేక్లోనూ తనే చేస్తోంది | Adah Sharma in Kshanam Tamil Remake | Sakshi
Sakshi News home page

రీమేక్లోనూ తనే చేస్తోంది

Published Thu, Sep 15 2016 9:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

రీమేక్లోనూ తనే చేస్తోంది

రీమేక్లోనూ తనే చేస్తోంది

ఈ ఏడాది ఘనవిజయం సాధించిన చిత్రాల్లో క్షణం సినిమా ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన క్షణం భారీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈసినిమాలో ఆదా శర్మ హీరోయిన్గా నటించింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా  రీమేక్పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ క్షణం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవటంతో సినిమా మీద క్రేజ్ మరింత ఎక్కువైంది.

తాజాగా ఈ సినిమా కోలీవుడ్ రీమేక్కు రంగం సిద్ధమైంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సత్యరాజ్, తన కొడుకు శిబిరాజ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగులో ఆదాశర్మ చేసిన పాత్రను తమిళంలోనే ఆమెతోనే చేయించాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్.

బిడ్డను కోల్పోయిన తల్లిగా ఆదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే తమిళ వర్షన్కు ఆమెనే ఎంపిక చేశారు. ఇప్పటికే శింబు హీరోగా తెరకెక్కిన ఇదు నమ్మ ఆలు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆదా, క్షణం రీమేక్తో తమిళనాట హీరోయిన్గా అడుగుపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement