కట్టప్పకు బాహుబలి సలహా | baahubali' prabhas gave me more confidence to remake kshanam | Sakshi

కట్టప్పకు బాహుబలి సలహా

Published Tue, Dec 5 2017 1:17 AM | Last Updated on Tue, Dec 5 2017 9:18 AM

baahubali' prabhas gave me more confidence to remake kshanam - Sakshi

బాహుబలిని పర్సనల్‌గా ఓ సలహా అడిగారు కట్టప్ప. ఎవరి కోసం అనుకుంటున్నారు? సొంత కొడుకు కోసం. అది కూడా రాజమాత శివగామికి తెలియకుండా! ఏంటిది? బ్రహ్మచారి అయిన కట్టప్పకు వారసుడా? రాజమౌళి ఏమన్నా ‘బాహుబలి 3’ ప్లాన్‌ చేయడం లేదు కదా! అని ఆలోచించొద్దు. ఎందుకంటే కట్టప్ప సలహా అడిగింది రీల్‌ లైఫ్‌లో కాదు. రియల్‌ లైఫ్‌లోనే. రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘క్షణం’ చిత్రాన్ని తమిళంలో ‘సత్య’ అనే టైటిల్‌తో రీమేక్‌ చేశారు.

సత్యరాజ్‌ (కట్టప్ప) తనయుడు శిబి హీరోగా ప్రదీప్‌ డైరెక్షన్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 8న రిలీజ్‌ చేయనున్నట్లు చెన్నైలో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో సత్యరాజ్‌  తాను ఈ సినిమా కోసం ప్రభాస్‌ సలహా తీసుకున్నానని చెప్పారు. ‘‘క్షణం సినిమాను తమిళంలో రీమేక్‌ చేయాలనుకుంటున్న విషయాన్ని శిబి నాకు చెప్పాడు. అప్పుడు నేను ‘బాహుబలి’ షూటింగ్‌లో ఉన్నా. ఈ విషయం గురించి ప్రభాస్‌ను అడగ్గా..‘క్షణం సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. స్క్రిప్ట్‌ డిఫరెంట్‌. చేయొచ్చు’ అన్నారు. ఆ మాటలు నాలో కాన్ఫిడెన్స్‌ నింపాయి. ఆ నమ్మకంతోనే సినిమా రైట్స్‌ కొన్నాను. కానీ, నేను ‘క్షణం’ చూడలేదు’’ అని సత్యరాజ్‌ అసలు విషయం చెప్పారు. సో.. కట్టప్పకు బాహుబలి (ప్రభాస్‌) ఇచ్చిన సలహా ఇదన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement