Sathya
-
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?
రియా ఎక్కడ? ఆమె ఎవరు? దామిని డాటర్? దామిని ఎవరు? రియా మదర్.. అసలు వీళ్లిద్దరూ ఎవరు? మదర్ అండ్ డాటర్.. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. 'మత్తు వదలరా 2' సినిమాలోని సత్య-అజయ్ మధ్య జరిగే సీన్ ఇది. ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రియా అసలు పేరు ఏంటి? ఆమె ఎవరో తెలుసా?(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?)సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఏది.. ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు అర్ధం కాదు. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'మత్తు వదలరా 2' సినిమా సీన్లని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో సత్య తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. అలా రియా అనే అమ్మాయి గురించి అడిగే సీన్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ రియా పాత్రధారి అసలు పేరు ఐషూ యాదవ్. ఈమె స్వతహాగా నార్త్ అమ్మాయి.తెలుగులో 'సిద్ధు బీకాం' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఐషూ యాదవ్‌కి ఇన్ స్టాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ క్రియేటర్‌గా వీడియోలతో ఎంటర్టైన్ చేసే ఈమె.. అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల 'మత్తు వదలరా 2'లో ఛాన్స్ దక్కించుకుంది. ఈమెకు ఇదే తొలి మూవీ. అయితేనేం రియా అనే పేరు దెబ్బకు తెగ పాపులర్ అయిపోయింది.మరి ఈ ట్రెండింగ్ వల్ల రియా అలియాస్ ఐషూ యాదవ్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)one of the best scenes from #MathuVadalara2 @RiteshRana 🤣🤣🤣 #Satya pic.twitter.com/cAlPSjQsA6— KSNSK (@SmoothingWoods) October 15, 2024 View this post on Instagram A post shared by Isha Yadav (@ishayadav__) -
ధర్మవరంలో బీజేపీ దౌర్జన్యకాండ
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీ‹Ùకుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీల నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వారి దాడిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమే‹Ùతో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లెలో ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై.. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం మ«ధ్యాహ్నం ధర్మవరం సబ్‌జైలుకు వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా, ఆయన డ్రైవర్ రామాంజి మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్‌కుమార్ నేతృత్వంలోని గూండాలు వారి వాహనాలను అడ్డుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ రామాంజిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో రామాంజి అక్కడి నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అంతటితో ఆగని బీజేపీ, కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్‌జైలులో ఉండగా లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, కార్యకర్త శీలా విజయ్‌కుమార్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమే‹Ùపైనా పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. చోద్యం చూసిన పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్నా అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మరికొందరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారు. ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి బీజం వేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌జైలు ఘటనల అనంతరం ఆయన ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల్లో మంత్రి సత్యకుమార్ అనుచరులు, కూటమి పార్టీల నాయకుల దందాలు, దౌర్జన్యాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలసి సబ్‌జైల్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తన డ్రైవర్ రామాంజిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బీజేపీతోపాటు కూటమి పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారన్నారు. దివ్యాంగుడు, ఆరోగ్యం సరిగా లేని అమర్నాథ్రెడ్డిని, విజయ్‌ని దారుణంగా కొట్టారన్నారు. దాడిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌పైనా పోలీస్ లాఠీలతో కొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రాలేదని, పోలీసు స్టేసన్ కూడా సబ్ జైలు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మూడు గంటల పాటు పోలీసులు వారి దౌర్జన్యాలకు పూర్తిగా సహకరించారన్నారు. ధర్మవరంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యకుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. ధర్మవరంలో శాంతి నెలకొల్పేందుకు తమ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులో ఉంచామని, ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సైతం వేలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్మవరం వస్తామంటూ ఫోన్లు చేసినా శాంతింపజేశామన్నారు. కూటమి నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
సత్య టాలెంట్‌ను మొదట గుర్తించిన హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్‌ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.తెలిసేది కాదుఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని. ఆ హీరో సలహా ఇవ్వడమేగాకనా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.కమెడియన్‌గా, హీరోగాఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్‌గా పాపులర్‌గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్‌తో ఆడియన్స్‌కు నవ్వుల విందు వడ్డించాడు. Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP— surya k (@naistam2k) September 15, 2024 చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్ -
ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు
‘‘నటుడిగా సక్సెస్ సాధించిన తర్వాత కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలనుకుని ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాను నిర్మించాను. ఈ సినిమా కోసం తీసుకున్న నటీనటులందరి బలాలు నాకు తెలుసు. అందుకే వేరే దర్శకుడు ఎందుకు? అని నేనే డైరెక్షన్ చేశాను’’ అన్నారు నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై వై. శ్రీనివాస్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథ ఇది. భాగ్యనగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిని ఓ పోలీసాఫీసర్ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందులో ఓ షార్ట్‌ఫిల్మ్ గ్యాంగ్ ఎలా ఇరుక్కుకుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వినోదం మాత్రమే కాదు.. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలనే చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో మా మేనల్లుడుని ఆర్టిస్టుగా పరిచయం చేస్తున్నాను. సెంటిమెంట్ కోసం ఈ సినిమా తొలి షాట్‌ను మా నాన్నగారిపై డైరెక్షన్ చేశాను. ల్యాప్‌టాప్‌లో సినిమా చూసుకున్నారాయన. ఇటీవలే నాన్నగారు చనిపోయారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్‌పై ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నా. దర్శకత్వం, నిర్మాణం, హీరో, నటుడు.. ఈ నాలుగింట్లో నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు’’ అన్నారు. -
రిస్క్ ఎందుకన్నా అన్నాను
‘‘నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అందుకనే నా సినిమాల్లో తనుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మాత్రం మిస్సయ్యాడు. మా సినిమాల షూటింగ్స్‌లో తను ఆర్టిస్ట్‌గాకంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడుతుంటాడు’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి దర్శక నిర్మాతగా ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బ్యానర్ లోగోను అనిల్ రావిపూడి, టైటిల్ యానిమేషన్‌ను సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ విడుదల చేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నానని శ్రీనివాస్‌రెడ్డి చెప్పగానే ‘ఎందుకన్నా.. రిస్క్ ఏమో!’ అన్నాను. తను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు.. సినిమా చాలా బాగుంది’’ అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక నేను నిలబడాల్సి వచ్చేది. అందుకే నేనే డైరెక్ట్ చేశాను. దర్శకుడు కావాలనే కోరిక అలా తీరింది. సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు.. ఇంకొంతమంది చిన్న కరెక్షన్స్ చెప్పారు. అవెంతో ఉపయోగపడ్డాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు తమన్. నిర్మాత పద్మనాభ రెడ్డి, నటులు ‘సత్యం’ రాజేష్, ‘షకలక’ శంకర్, సంగీత దర్శకుడు సాకేత్ తదితరులు మాట్లాడారు. -
భాగ్యనగర వీధుల్లో...
హాస్యనటుడు వై. శ్రీనివాసరెడ్డి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు రచయితగా చేసిన పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు సంగీతం: సాకేత్ కొమండూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధనుంజయ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: చిత్రం శ్రీను. -
మాది అమలాపురమండి.. ఆయ్!
శ్రీనగర్‌కాలనీ: ఎర్రబస్సెక్కి కృష్ణానగర్ వచ్చిన పతోడు హీరో అయిపోదామనే అనుకుంటాడు. అదే ఆశతో వస్తారు.. శ్వాసగా జీవిస్తారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడతారు. కొందరు ఇంట్లో చెప్పి వస్తే.. ఇంకొందరు ఇంటి నుంచి పారిపోయి వస్తారు. ‘సత్య అక్కల’ది కూడా అలాంటి బాపతే. ఎవరీ సత్య అనుకుంటున్నారా..! ‘స్వామిరారా’ గుర్తింది కదా.. అందులో ‘ఐదు లక్షలు తీసుకునేటప్పడు ఐదు నిమిషాలు ఆగలేవా..!’ అంటూ తన అమాయకత్వంతో ఐదుకోట్ల రూపాయిలు చేజార్చుకునేలా చేస్తాడే అతడే ఇతడు. సినిమాల్లో అవకాశాల కోసం ఇంట్లో నుంచి పారిపోయి తూ.గో.జి లోని అమలాపురం నుంచి వచ్చాడు. గోదారి ఎటకారానికి తన హావభావాలు జోడించి ఇప్పుడు వెండితెరపై నవ్వులు పూయిస్తున్న సత్య తన కెరీర్ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు సత్య మాటల్లోనే.. మాది తూగో జిల్లా అమలాపురమండి. నాన్న వెంకట్రావు టీచర్. చిన్నప్పట్నుండి సినిమాలంటే మా పిచ్చిగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్ బొమ్మ పడిదంటే తొలాట చూడాల్సిందే. అలా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి 2005లో రైలెక్కి హైదరాబాద్‌లో దిగిపోయానండి. కానీ మా అమ్మా, నాన్న అస్సలు ఒప్పుకోలేదు. చేసేది లేక తిరిగి అమలాపురం వెళ్లిపోయా. కానీ నరనరాల్లో ఉన్న సినిమా అక్కడ ఉండనీయలేదు. దీంతో ఇంట్లో చెప్పి మరుసటి ఏడు మళ్లీ సిటీకి వచ్చేశా. నా స్నేహితుల పరిచయాలతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ‘రౌడీ ఫెలో’ చిత్రంలో నారా రోహిత్‌తో పిల్ల జమిందార్లో బొమ్మ పడిందండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ద్రోణ, పిల్లజమిందార్ చిత్రాలకు పనిచేశా. పిల్లజమిందార్ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందండి. అందులో నా పాత్ర పండడంతో సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ‘స్వామిరారా’ చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా హిట్టవడంతో ఇక వరుసగా అవకాశాలొచ్చాయి. రౌడీ ఫెల్లో, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడిపోతావు చిన్నవాడా.. చిత్రాల్లో చేసిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది.లిక దర్శకుడు సుధీర్ వర్మ ప్రోత్సాహమైన మర్చిపోలెనండి బాబు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ తోడుగా.. తెలుగు కమెడియన్స్‌లో శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్యం రాజేష్ లాంటి సీనియర్లు, యువ కమెడియన్లు 14 మందితో ‘ఫ్లైయింగ్ కలర్స్’ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నామండి. ప్రతీ నెలా రెండో శనివారం గ్రూప్‌లోని ఓ కమెడియన్ పార్టీ ఇస్తారు. అన్ని వంటకాలతో పాటు వెరైటీ ప్రోగ్రామ్స్‌తో సంతోషాన్ని పంచుకుంటామండి. ఆరోజు మా కామెడీతో కడుపు చెక్కలవ్వాల్సిందేనండి. అంతేకాదండి.. గోదారోణ్ని కదా అండి ఆయ్.. తినడం కూడా ఇష్టమేనండి. నచ్చిన తిండి ఎక్కడున్నా తిని తీరాల్సిందేనండి.. ఆయ్. ఇది దేవుడిచ్చిన వరమండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన నేను అనుకోకుండా ప్రేక్షకులను నవ్వించే అవకాశం వచ్చిందండి. ఇది దేవుడిచ్చిన వరమనుకుంటానండి. ఇంక బ్రహ్మానందం, సునీల్ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. తెలుగులో హీరో రామ్‌చరణ్ నటిస్తున్న రంగస్థలం, నాగచైతన్య హీరోగా సవ్యశాచి చిత్రాల్లో నటిస్తున్నానండి. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి.. ఆయ్. -
హగ్ చేసుకోవడం ఎలా?
తమిళసినిమా: హగ్ చేసుకోవడం ఎలా అన్నది నటి రమ్యానంబీశన్ నేర్పించారని వర్ధమాన నటుడు సిద్ధార్థశంకర్ చెప్పారు. ఈయన ఇటీవల విడుదలైన సత్య చిత్రంలో సిబిరాజ్‌కు విలన్‌గా నటించి దుమ్మురేపారు. ఇందులో ఆయన పాత్రకు నటనకు ఇటు చిత్ర పరిశ్రమ నుంచి, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయట. దీంతో తన సంతోషాన్ని పత్రికల వారితో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. నేను పుట్టిపెరిగింది మలేషియాలో నాన్నది వేలూరు అమ్మది మలేషియా. నాకు నటన అంటే చాలా ఇష్టం. అమ్మ మాత్రం చదువు చాలా ముఖ్యం అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడంతో ఎంబీబీఎస్ చదివాను. అయితే నటనపై ఆసక్తి అమ్మ మాటను కూడా విననీయలేదు. డాక్టరు చదువును మధ్యలో ఆపేసి చెన్నైకి వచ్చేశాను. నటుడు నాజర్ వద్ద నటన నేర్చుకున్నాను. నేను వెళ్లే జిమ్‌కే నటుడు విజయ్‌ఆంథోని వచ్చే వారు. ఆయన్ను అవకాశం అడిగాను. నటనపై ఆసక్తిని చూసి సైతాన్ చిత్రంలో విలన్ పాత్రల్లో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రంలో నాదే ప్రధాన విలన్ పాత్ర. ఆ చిత్రంలో నా నటన ఐన్గరన్ చిత్రంలో నటించే అవకాశం కల్పించింది. అందులో నటిస్తుండగానే సత్య చిత్రం కోసం జరిగిన ఆడిషన్లో పాల్గొన్నాను. అక్కడ నా నటన నటుడు సిబిరాజుకు నచ్చడంతో విలన్‌గా నటించే అవకాశాన్ని ఇచ్చారు.ఇందులోని నటను చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో నాకు భార్యగా నటి రమ్యనంబీశన్ నటించారు. ఆమెతో సిన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి బిడియం కలగడంతో తనను నొప్పి లేకుండా ఎలా కౌగిలించుకోవాలన్నది రమ్యనే నేర్పించారు. సత్య చిత్రం చూసిన దర్శకుడు రవిఅరసు, విడియుమ్ మున్ చిత్రం ఫేమ్ బాలకుమార్ తమ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఎలాంటి పాత్రనైనా చేయడానికి నేను రెడీ.అయితే విలన్ పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. అలాంటి పాత్రలు గుర్తింపు తెచ్చిపెడతాయి. నటుడు రఘువరన్‌లా మెజిస్టిక్ పాత్రల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను. -
కట్టప్పకు బాహుబలి సలహా
బాహుబలిని పర్సనల్‌గా ఓ సలహా అడిగారు కట్టప్ప. ఎవరి కోసం అనుకుంటున్నారు? సొంత కొడుకు కోసం. అది కూడా రాజమాత శివగామికి తెలియకుండా! ఏంటిది? బ్రహ్మచారి అయిన కట్టప్పకు వారసుడా? రాజమౌళి ఏమన్నా ‘బాహుబలి 3’ ప్లాన్ చేయడం లేదు కదా! అని ఆలోచించొద్దు. ఎందుకంటే కట్టప్ప సలహా అడిగింది రీల్ లైఫ్‌లో కాదు. రియల్ లైఫ్‌లోనే. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘క్షణం’ చిత్రాన్ని తమిళంలో ‘సత్య’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. సత్యరాజ్ (కట్టప్ప) తనయుడు శిబి హీరోగా ప్రదీప్ డైరెక్షన్లో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు చెన్నైలో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమంలో సత్యరాజ్ తాను ఈ సినిమా కోసం ప్రభాస్ సలహా తీసుకున్నానని చెప్పారు. ‘‘క్షణం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్న విషయాన్ని శిబి నాకు చెప్పాడు. అప్పుడు నేను ‘బాహుబలి’ షూటింగ్లో ఉన్నా. ఈ విషయం గురించి ప్రభాస్‌ను అడగ్గా..‘క్షణం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ డిఫరెంట్. చేయొచ్చు’ అన్నారు. ఆ మాటలు నాలో కాన్ఫిడెన్స్ నింపాయి. ఆ నమ్మకంతోనే సినిమా రైట్స్ కొన్నాను. కానీ, నేను ‘క్షణం’ చూడలేదు’’ అని సత్యరాజ్ అసలు విషయం చెప్పారు. సో.. కట్టప్పకు బాహుబలి (ప్రభాస్) ఇచ్చిన సలహా ఇదన్నమాట. -
పాడడమే నాకిష్టం
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్ది మంచి ఫిజిక్. చూడ సక్కని అందం. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ మలయాళీ బ్యూటీకి తమిళంలో పిజ్జా, సేతుపతి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయినా ఎందుకో తనకు పాడడం అంటేనే చాలా ఇష్టం అంటోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో తొలిసారిగా పాడిన ఫైఫైఫై అనే పాట యువతను ఉర్రూతలూగించింది.అక్కడి నుంచి గాయనిగా రాణించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే మాతృభాషలో 20 వరకూ పాటలు పాడేసిన రమ్యానంబీశన్‌కు కోలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్నాయట. సిబిరాజ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను హీరోయిన్లుగా నటిస్తున్న సత్య చిత్రం కోసం ఇటీవల ఒక పాట పాడిందట. ఈ పాట వినగానే తానే పాడాలనిపించిందట. అదే విషయాన్ని చిత్ర హీరో సిబిరాజ్‌కు, సంగీత దర్శకుడు సీమోన్ కే.కింగ్‌కు చెప్పగా వారిద్దరూ ఒకే అనడంతో స్టూడియోకు వెళ్లి పాడానని, ఆ పాట తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ తెగ నచ్చేసిందంటున్న రమ్యానంబీశన్ ఇలాంటివి బోలెడన్ని పాడాలని ఆశపడుతోందట. సింగర్‌గా తానింకా ప్రారంభ దశలోనే ఉన్నానని, సినిమా పాటలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ పాటలను పాడాలని కోరుకుంటున్నానని అంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం సత్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా మెర్కురీ అనే మరో చిత్రంలోనూ నాయకిగా నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో కురుక్షేత్రం అనే పురాణ ఇతిహాసం మహాభారతం కథా చిత్రంలో నటిస్తోంది. -
'తెలంగాణలో మహిళా యూనివర్సిటి ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: ఉన్నత విద్యలో మహిళల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని స్థాపించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో లేకుండా తిరుపతిలో మహిళ వర్సిటీని స్థాపించి సీమాంధ్రపాలకులు ఈ ప్రాంత మహిళలను ఉన్నత విద్యకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాలన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఈ విద్య సంవత్సరం మహిళా వర్సిటీని కూడా స్థాపించాలని కోరారు. -
అజిత్ తాజా చిత్రం సత్య?
నటుడు అజిత్ తాజా చిత్రానికి సత్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఆరంభం, వీరం వంటి వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న అజిత్ హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు. ఈ అల్టిమేట్ స్టార్ తాజాగా నటిస్తున్న చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆరంభం చిత్ర నిర్మాతే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ సరసన అనుష్క హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్గా త్రిష పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి పలు పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి సత్య అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పేరుతో ఇంతకుముందు కమలహాసన్ నటించారన్నది గమనార్హం. ఇప్పుడు అజిత్ సత్యగా రాబోతున్నారన్నమాట. సెలైంట్‌గా శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్టైనర్ అని తెలిసింది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు దుమ్ము రేపుతాయంటున్నారు. అలాగే యువతను గిలిగింతలు పెట్టించే డీప్ లవ్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని సమాచారం. సత్య చిత్రం కోసం హరీష్ జయరాజ్ సంగీతబాణీలు కడుతున్నారు. చాలా గ్యాప్ తరువాత గౌతమ్‌మీనన్, హరీష్ జయరాజ్ కలసి పని చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.