భాగ్యనగర వీధుల్లో... | Comedian Srinivas Reddy Turns Into A Producer Cum Director For Bhagya Nagara Veedhullo | Sakshi
Sakshi News home page

భాగ్యనగర వీధుల్లో...

Published Mon, Sep 30 2019 12:16 AM | Last Updated on Mon, Sep 30 2019 12:16 AM

Comedian Srinivas Reddy Turns Into A Producer Cum Director For Bhagya Nagara Veedhullo - Sakshi

హాస్యనటుడు వై. శ్రీనివాసరెడ్డి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. సత్య, ‘షకలక’ శంకర్‌ ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అక్టోబరులో సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాకు రచయితగా చేసిన పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. ఈ సినిమాకు సంగీతం: సాకేత్‌ కొమండూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ధనుంజయ కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: చిత్రం శ్రీను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement