తమిళసినిమా: హగ్ చేసుకోవడం ఎలా అన్నది నటి రమ్యానంబీశన్ నేర్పించారని వర్ధమాన నటుడు సిద్ధార్థశంకర్ చెప్పారు. ఈయన ఇటీవల విడుదలైన సత్య చిత్రంలో సిబిరాజ్‌కు విలన్‌గా నటించి దుమ్మురేపారు. ఇందులో ఆయన పాత్రకు నటనకు ఇటు చిత్ర పరిశ్రమ నుంచి, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయట. దీంతో తన సంతోషాన్ని పత్రికల వారితో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. నేను పుట్టిపెరిగింది మలేషియాలో నాన్నది వేలూరు అమ్మది మలేషియా. నాకు నటన అంటే చాలా ఇష్టం. అమ్మ మాత్రం చదువు చాలా ముఖ్యం అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడంతో ఎంబీబీఎస్ చదివాను.
అయితే నటనపై ఆసక్తి అమ్మ మాటను కూడా విననీయలేదు. డాక్టరు చదువును మధ్యలో ఆపేసి చెన్నైకి వచ్చేశాను. నటుడు నాజర్ వద్ద నటన నేర్చుకున్నాను. నేను వెళ్లే జిమ్‌కే నటుడు విజయ్‌ఆంథోని వచ్చే వారు. ఆయన్ను అవకాశం అడిగాను. నటనపై ఆసక్తిని చూసి సైతాన్ చిత్రంలో విలన్ పాత్రల్లో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రంలో నాదే ప్రధాన విలన్ పాత్ర. ఆ చిత్రంలో నా నటన ఐన్‌గరన్ చిత్రంలో నటించే అవకాశం కల్పించింది. అందులో నటిస్తుండగానే సత్య చిత్రం కోసం జరిగిన ఆడిషన్‌లో పాల్గొన్నాను. అక్కడ నా నటన నటుడు సిబిరాజుకు నచ్చడంతో విలన్‌గా నటించే అవకాశాన్ని ఇచ్చారు.ఇందులోని నటను చాలా మంచి పేరు వచ్చింది.
ఇందులో నాకు భార్యగా నటి రమ్యనంబీశన్ నటించారు. ఆమెతో సిన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి బిడియం కలగడంతో తనను నొప్పి లేకుండా ఎలా కౌగిలించుకోవాలన్నది రమ్యనే నేర్పించారు. సత్య చిత్రం చూసిన దర్శకుడు రవిఅరసు, విడియుమ్ మున్ చిత్రం ఫేమ్ బాలకుమార్ తమ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఎలాంటి పాత్రనైనా చేయడానికి నేను రెడీ.అయితే విలన్ పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. అలాంటి పాత్రలు గుర్తింపు తెచ్చిపెడతాయి. నటుడు రఘువరన్‌లా మెజిస్టిక్ పాత్రల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను.
హగ్ చేసుకోవడం ఎలా?
Published Mon, Dec 11 2017 8:29 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment