Remya Nambeesan
-
నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్..
సినిమా: నటి రమ్యానంబీశన్ పెళ్లి చేసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో రామన్ తేడియ సీత, ఆట్టనాయగన్, ఇళైంజన్ కుళ్లనరి కూట్టం, పిజ్జా, సేతుపతి చిత్రాల్లో నటించిన నటి రమ్యానంబీశన్. ప్రస్తుతం విజయ్‌ఆంటోనీకి జంటగా తమిళరసన్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అదేవిధంగా ఈ కేరళా కుట్టి ఇటీవల మలయాళంలోనూ నటిస్తోంది. కాగా ఇటీవల ఈ అమ్మడు పట్టు చీర ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలిప్పుడు వైరల్ అవ్వడంతో పాటు నటి రమ్యానంబీశన్ రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో కొందరు ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. దీంతో షాక్అయిన రమ్యానంబీశన్ తనకు పెళ్లి అయ్యిందా అని ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తూ తన ఫేస్బుక్లో పేర్కొంది. అందులో మీరు ప్రేమలో పడ్డారా? పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎలాంటి భర్తను కోరుకుంటున్నారు? అంటూ చాలా మంది అడుగుతున్నారన్నారు. అలాంటి సమయంలో తాను పట్టుచీర కట్టిన ఫొటోలను పోస్ట్ చేయడంతో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారంది. నిజానికి ఆ ఫొటోలను బద్రి వెంకటేశ్ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం తీసినవి అని చెప్పింది. నిజానికి తనకు పెళ్లి జరగలేదని, పెళ్లి చేసుకున్నట్టు తానెవరికీ చెప్పలేదని, ఇదంతా పుకార్లు మాత్రమేనని వివరణ ఇచ్చి తన పెళ్లి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టింది. అంతేకాదు ప్రస్తుతం సినమాలపైనే దృష్టి సారిస్తున్నాననీ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన తనకులేదనీ చెప్పుకొచ్చింది. -
హగ్ చేసుకోవడం ఎలా?
తమిళసినిమా: హగ్ చేసుకోవడం ఎలా అన్నది నటి రమ్యానంబీశన్ నేర్పించారని వర్ధమాన నటుడు సిద్ధార్థశంకర్ చెప్పారు. ఈయన ఇటీవల విడుదలైన సత్య చిత్రంలో సిబిరాజ్‌కు విలన్‌గా నటించి దుమ్మురేపారు. ఇందులో ఆయన పాత్రకు నటనకు ఇటు చిత్ర పరిశ్రమ నుంచి, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయట. దీంతో తన సంతోషాన్ని పత్రికల వారితో పంచుకున్నారు. అవేమిటో చూద్దాం. నేను పుట్టిపెరిగింది మలేషియాలో నాన్నది వేలూరు అమ్మది మలేషియా. నాకు నటన అంటే చాలా ఇష్టం. అమ్మ మాత్రం చదువు చాలా ముఖ్యం అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడంతో ఎంబీబీఎస్ చదివాను. అయితే నటనపై ఆసక్తి అమ్మ మాటను కూడా విననీయలేదు. డాక్టరు చదువును మధ్యలో ఆపేసి చెన్నైకి వచ్చేశాను. నటుడు నాజర్ వద్ద నటన నేర్చుకున్నాను. నేను వెళ్లే జిమ్‌కే నటుడు విజయ్‌ఆంథోని వచ్చే వారు. ఆయన్ను అవకాశం అడిగాను. నటనపై ఆసక్తిని చూసి సైతాన్ చిత్రంలో విలన్ పాత్రల్లో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రంలో నాదే ప్రధాన విలన్ పాత్ర. ఆ చిత్రంలో నా నటన ఐన్గరన్ చిత్రంలో నటించే అవకాశం కల్పించింది. అందులో నటిస్తుండగానే సత్య చిత్రం కోసం జరిగిన ఆడిషన్లో పాల్గొన్నాను. అక్కడ నా నటన నటుడు సిబిరాజుకు నచ్చడంతో విలన్‌గా నటించే అవకాశాన్ని ఇచ్చారు.ఇందులోని నటను చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో నాకు భార్యగా నటి రమ్యనంబీశన్ నటించారు. ఆమెతో సిన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి బిడియం కలగడంతో తనను నొప్పి లేకుండా ఎలా కౌగిలించుకోవాలన్నది రమ్యనే నేర్పించారు. సత్య చిత్రం చూసిన దర్శకుడు రవిఅరసు, విడియుమ్ మున్ చిత్రం ఫేమ్ బాలకుమార్ తమ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఎలాంటి పాత్రనైనా చేయడానికి నేను రెడీ.అయితే విలన్ పాత్రలు చేయడానికే ఇష్టపడతాను. అలాంటి పాత్రలు గుర్తింపు తెచ్చిపెడతాయి. నటుడు రఘువరన్‌లా మెజిస్టిక్ పాత్రల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను. -
పాడడమే నాకిష్టం
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్ది మంచి ఫిజిక్. చూడ సక్కని అందం. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ మలయాళీ బ్యూటీకి తమిళంలో పిజ్జా, సేతుపతి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయినా ఎందుకో తనకు పాడడం అంటేనే చాలా ఇష్టం అంటోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో తొలిసారిగా పాడిన ఫైఫైఫై అనే పాట యువతను ఉర్రూతలూగించింది.అక్కడి నుంచి గాయనిగా రాణించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే మాతృభాషలో 20 వరకూ పాటలు పాడేసిన రమ్యానంబీశన్‌కు కోలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్నాయట. సిబిరాజ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను హీరోయిన్లుగా నటిస్తున్న సత్య చిత్రం కోసం ఇటీవల ఒక పాట పాడిందట. ఈ పాట వినగానే తానే పాడాలనిపించిందట. అదే విషయాన్ని చిత్ర హీరో సిబిరాజ్‌కు, సంగీత దర్శకుడు సీమోన్ కే.కింగ్‌కు చెప్పగా వారిద్దరూ ఒకే అనడంతో స్టూడియోకు వెళ్లి పాడానని, ఆ పాట తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ తెగ నచ్చేసిందంటున్న రమ్యానంబీశన్ ఇలాంటివి బోలెడన్ని పాడాలని ఆశపడుతోందట. సింగర్‌గా తానింకా ప్రారంభ దశలోనే ఉన్నానని, సినిమా పాటలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ పాటలను పాడాలని కోరుకుంటున్నానని అంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం సత్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా మెర్కురీ అనే మరో చిత్రంలోనూ నాయకిగా నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో కురుక్షేత్రం అనే పురాణ ఇతిహాసం మహాభారతం కథా చిత్రంలో నటిస్తోంది. -
జీవితానికి దగ్గరగా...
వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని నిర్మిస్తున్న చిత్రం ‘ధనాధన్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర సహాయ దర్శకునిగా చేసిన శ్రీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్. ఇందులో సాఫ్ట్వేర్ కుర్రాడిగా వైభవ్ నటించారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథతో ఈ చిత్రం సాగుతుంది. వైభవ్ నటన, రమ్యా నంబీసన్ అందచందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోట శ్రీనివాసరావు పాత్ర హైలైట్. ఇందులో ఉన్న ఐదు పాటలకు తమన్ అద్భుతమైన స్వరాలందించారు. అతి త్వరలో పాటలు విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శివపార్వతి, కెమెరా: ఎ.ఎమ్. ఎడ్విన్ సాకె. -
అమలాపాల్‌తో పాడిస్తా
అమలాపాల్ స్వరం చాలా మధురంగా ఉంటుంది. ఆమెలో మంచి గాయని ఉన్నట్లు కనుగొన్నాను. త్వరలోనే అమలాపాల్‌తో పాడిస్తాను’’ అంటున్నారు సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్. హీరోయిన్లు గాయనీమణులుగా మారడం అన్నది ఈ మధ్య పరిపాటి అయిపోయింది. శతిహాసన్, రమ్యానంబీశన్ వంటి హీరోయిన్లు తాము మంచి గాయనీమణులమేనని నిరూపించుకున్నారు. తాజాగా నటి అమలాపాల్ ఈ కోవకు చేరనున్నారు. ఈ మాటను సంగీత దర్శకుడు అనిరుధ్ చెప్పడం విశేషం. దీనిపై ఆయన మాట్లాడుతూ, అమలాపాల్ స్వరంలో చక్కని లయ ఉందన్నారు. ఆమె చక్కగా పాడగలదని చెప్పారు. త్వరలో ఆమెకు గాయని అవకాశం ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న వేలై ఇల్లాద పట్టాదారి చిత్రంలో ఒక్క గాయని వాయిస్ ఉండడంతో ఆమెకు పాడే అవకాశం లేదని త్వరలోనే మరో చిత్రంలో అమలపాల్తో తప్పకుండా పాడిస్తానని అనిరుధ్ అంటున్నారు. -
నా జోలికొస్తే ఊరుకోను
నేనెవరి జోలికి వెళ్లను. ఎవరైనా నా జోలికొస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుందని చెబుతున్నారు నటి రమ్యా నంబీశన్. ఈ మల యాళ బ్యూటీ మాతృభాషలోనే కాదు తమిళంలోనూ నటిగా, గాయనిగా పేరు తెచ్చుకుంటున్నారు. తమిళంలో పిజ్జా, కుళ్లనరి కూట్టం, అట్టహాసం తదితర చిత్రాల్లో నటించిన రమ్యా నంబీశన్ ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ భామ నటించిన ఢమాల్ ఢిమీల్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రమ్యా నంబీశన్ మాట్లాడుతూ అభిమానులు తనను ఎక్కడ చూసినా పై పై పై కలాచ్చి పై అంటూ పాట పాడుతున్నారన్నారు. పాండియనాడు చిత్రంలో తాను పాడిన ఆ పాట అంతగా ప్రాచుర్యం పొంద టం ఆనందంగా ఉందన్నారు. అయితే తానెవరినీ పరిహాసం చేయట్లేదని, అదే విధంగా ఇతరులు తనతో ప్రవర్తించాలని ఆశిస్తానన్నా రు. లేకుంటే వారిని దరిదాపులకు కూడా రానివ్వనని స్పష్టం చేశారు. సమీప కాలంలో ఢమాల్ ఢిమీ ల్ చిత్ర ప్రచారంలో పాల్గొన్నానన్నారు. అక్కడ ఒక వ్యక్తి ‘‘మీకు, హీరో వైభవ్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యిం దటగా’’ అనడం తనకు కోపం తెప్పిం చిందన్నారు. అయితే అక్కడ తన కోపాన్ని అణచుకున్నానన్నారు. సెలబ్రిటీలకు ఇలాంటివి మామూలే అన్న విషయం ఈ భామకు తెలియదా అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు. -
రహస్య వివాహమా?
తాను రహస్య వివాహం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని రమ్యా నంబీశన్ పేర్కొంది. కుళ్లనది కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ కేరళ కుట్టి తాజాగా గాయని అవతారమెత్తింది. దీపావళికి విడుదలకు సిద్ధమవుతున్న పాండియనాడు చిత్రంలో ఈ బ్యూటీ ఒక పాట పాడింది. రమ్యా నంబీశన్ ప్రేమ వివాహం గురించి కొంతకాలంగా వదంతులు జోరుగా ప్రచారమవుతున్నాయి. మలయాళ చిత్రంలో తనతో నటించిన ఉన్ని ముకుందన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రమ్యా నంబీవన్ తీవ్రంగా ఖండించింది. తాను రహస్య వివాహం చేసుకున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్ చేసింది లేదని, అసలు సినిమా నటిని పెళ్లి చేసుకోనని ఉన్నిముకుందన్ తేల్చి చెప్పారు.